Luxury car maker
-
కొత్త వేరియంట్లలో బీఎండబ్ల్యూ ఎక్స్5
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ కంపెనీ బీఎండబ్లు్య కొత్త వేరియంట్లలో ఎస్యూవీ ఎక్స్5 ప్రవేశపెట్టింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.77.9 లక్షల నుంచి ప్రారంభం. పనోరమిక్ గ్లాస్ రూఫ్, ఫోర్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎలక్ట్రోప్లేటెడ్ కంట్రోల్స్, ఎలక్ట్రికల్లీ అడ్జెస్టేబుల్ రోలర్ సన్‌బ్లైండ్స్ వంటివి పొందుపరిచారు. ఎక్స్‌డ్రైవ్30డీ స్పోర్ట్ఎక్స్ ప్లస్ 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ డీజిల్ ఇంజన్, 265 హెచ్‌పీ, 620 ఎన్ఎం టార్క్, గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 6.5 సెకన్లలో అందుకుంటుంది. ఎక్స్‌డ్రైవ్40ఐ స్పోర్ట్ఎక్స్ ప్లస్ 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్, 340 హెచ్‌పీ, 450 ఎన్ఎం టార్క్, 100 కిలోమీటర్ల వేగాన్ని 5.5 సెకన్లలో చేరుకుంటుంది. -
మెర్సిడెస్ బెంజ్ నుంచి కొత్త మోడల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ సరికొత్త ‘ఏఎంజీ జీఎల్ఈ 63 ఎస్ 4మేటిక్ ప్లస్ కూపే’ కారును ప్రవేశపెట్టింది. ఏఎంజీ శ్రేణిలో ఇది 12వ మోడల్. ధర ఎక్స్‌షోరూంలో రూ.2.07 కోట్లు. 4 లీటర్ ఇంజన్, 612 హెచ్‌పీ పవర్, అదనంగా 22 హెచ్‌పీ అందించే 48 వోల్ట్ హైబ్రిడ్ సిస్టమ్ పొందుపరిచారు. 3.8 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 280 కిలోమీటర్లు. అన్ని వైపులా ఎయిర్‌బ్యాగ్స్, బ్లైండ్ స్పాట్ అసిస్ట్, యాక్టివ్ బ్రేక్ అసిస్ట్, 3 స్టేజ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం వంటి హంగులు ఉన్నాయి. -
ఆడి ఆర్ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ దిగ్గజం ఆడి తాజాగా భారత్‌లో ఆర్ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఎక్స్‌షోరూంలో ధర రూ.1.04 కోట్లు. 450 హెచ్‌పీ పవర్‌తో 2.9 లీటర్ వీ6 ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో తయారైంది. 6 ఎయిర్‌బ్యాగ్స్, 3 జోన్ ఎయిర్కండీషనింగ్, పనోరమిక్ గ్లాస్ సన్‌రూఫ్ వంటివి పొందుపరిచారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 3.9 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. కంపెనీ పూర్తిగా తయారైన కారును భారత్‌కు దిగుమతి చేస్తోంది. -
మెర్సిడెస్ నుంచి మరో మూడు మోడళ్లు
ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల వాటా 60 శాతం సాక్షితో మెర్సిడెస్ బెంజ్ వైస్ ప్రెసిడెంట్ బోరిస్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఈ ఏడాది మరో మూడు మోడళ్లను ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఏడు మోడళ్లను అందుబాటులోకి తెచ్చామని కంపెనీ సేల్స్, నెట్వర్క్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ బోరిస్ ఫిజ్ తెలిపారు. ఏ-క్లాస్, బి-క్లాస్ కార్ల లిమిటెడ్ ఎడిషన్ కార్లను హైదరాబాద్ మార్కెట్లో బుధవారం ప్రవేశపెట్టిన సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. రాబోయే మోడళ్ల వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని, మార్కెట్ తీరుకు అనుగుణంగా ఇవి ఉంటాయని చెప్పారు. 2013లో 8 మోడళ్లు విడుదల చేశామన్నారు. గతేడాది 9 వేలకుపైగా కార్లను విక్రయించామని, ఈ ఏడాది రెండింతల వృద్ధి రేటు నమోదు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. 60 శాతం వాటా.. మెర్సిడెస్ బెంజ్ అమ్మకాల్లో గతంలో ఢిల్లీ, ముంబై నగరాల వాటా 60 శాతముండేది. ఇప్పుడు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల వాటా 60%గా ఉందని బోరిస్ తెలిపారు. కొత్త ప్రభుత్వం రాకతో మౌలిక వసతులు, రోడ్లు మరింత విస్తరిస్తాయన్న అంచనాలున్నాయని, దీంతో రానున్న రోజుల్లో లగ్జరీ కార్లకు గిరాకీ పెరుగుతుందని వివరించారు. ప్రీ-ఓన్డ్ విభాగంలో కార్ల అమ్మకాలు గణనీయంగా ఉన్నాయని చెప్పారు. బ్రాండ్ వృద్ధికి దోహదం చేస్తోందని తెలిపారు. ఈ విభాగాన్ని మరింత విస్తృతం చేస్తామని పేర్కొన్నారు. డాలరు ప్రభావముంది.. గతేడాది సెప్టెంబర్ నుంచి కంపెనీ పలుమార్లు కార్ల ధరల సవరణ చేసింది. రూపాయి ఒడిదుడుకులకు లోనై దిగుమతి వ్యయం పెరగడంతో కార్ల ధరపై ఒత్తిడి ఉందని కంపెనీ తెలిపింది. బడ్జెట్లో ప్రకటించే ఉద్దీపనలనుబట్టి కార్ల ధర నిర్ణయిస్తామని వెల్లడించింది. 40 శాతం విడిభాగాలను కంపెనీ దేశీయంగా సేకరిస్తోంది. మెర్సిడెస్ బెంజ్ హైదరాబాద్ డీలర్ అయిన మహవీర్ మోటార్స్ చైర్మన్ యశ్వంత్ జబఖ్ మాట్లాడుతూ రూ.2 కోట్లు ఖరీదున్న ఏఎంజీ మోడళ్లకు సైతం ఇక్కడ కస్టమర్లున్నారని చెప్పారు. 2013లో మొత్తం 460 కార్లు విక్రయించామని, ఈ ఏడాది 20 శాతం వృద్ధి ఆశిస్తున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు.