హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ దిగ్గజం ఆడి తాజాగా భారత్‌లో కొత్త క్యూ8 విడుదల చేసింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.1.17 కోట్లు. 8 స్పీడ్ టిప్‌ట్రానిక్ ట్రాన్స్‌మిషన్, 48వీ మైల్డ్ హైబ్రిడ్ టెక్నాలజీతో 3.0 లీటర్ టీఎఫ్‌ఎస్‌ఐ ఇంజిన్ పొందుపరిచారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 5.6 సెకన్లలో అందుకుంటుంది.
గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. ఎనిమిది ఎయిర్‌బ్యాగ్స్, డ్యూయల్ స్క్రీన్ సెటప్, లేజర్ టెక్నాలజీతో డైనమిక్ ఇండికేటర్స్‌తో హెచ్‌డీ మ్యాట్రిక్స్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్స్, 17 స్పీకర్స్‌తో బీఅండ్‌వో ప్రీమియం 3డీ సౌండ్ సిస్టమ్, 360 డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా, 4 జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్, ఆడి వర్చువల్ కాక్‌పిట్, రెడ్ బ్రేక్ కాలిపర్స్‌తో ఆర్21 గ్రాఫైట్ గ్రే అలాయ్ వీల్స్ వంటి హంగులు ఉన్నాయి. కాగా, ఆడి 15 ఏళ్లలో భారత్‌లో 1,00,000 యూనిట్ల అమ్మకాల మైలురాయిని అధిగమించింది.
Comments
Please login to add a commentAdd a comment