ఆకట్టుకునేలా అయోధ్య రామాలయ నమూనా | Proposed Look Of The Ram Temple In Ayodhya | Sakshi
Sakshi News home page

మూడేళ్లలో నిర్మాణ పనులు పూర్తి

Published Tue, Aug 4 2020 5:26 PM | Last Updated on Tue, Aug 4 2020 7:00 PM

Proposed Look Of The Ram Temple In Ayodhya - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్ధాపన జరగనుండగా ఆలయ నమూనాను అయోధ్య ట్రస్ట్‌ మంగళవారం అధికారికంగా వెల్లడించింది. 161 అడుగుల ఎత్తైన మూడంతస్తుల రామ మందిరంగా నమూనాకు రూపకల్పన చేశారు. భారత వాస్తు శిల్పాకళా నైపుణ్యాన్ని చాటేలా ఆలయ డిజైన్ ఆకట్టుకుంటోంది. తొలుత అనుకున్న పరిమాణం కంటే దాదాపు రెట్టింపుగా నూతన నమూనాను అభివృద్ధి చేశారని ఆర్కిటెక్ట్‌ వెల్లడించారు.

భారీ డోమ్‌తో పాటు ఇంటీరియర్స్‌ను ఆకర్షణీయంగా మలిచారు. ఆలయ ఆర్కిటెక్టుల కుటుంబానికి చెందని ఆర్కిటెక్ట్‌ చంద్రకాత్‌ సొంపురను 30 ఏళ్ల కిందట రామాలయం డిజైన్‌ కోసం సంప్రదించారు. ఆయన తండ్రి ప్రభాశంకర్‌ సొంపుర సోమ్‌నాథ్‌ ఆలయ డిజైన్‌ను రూపొందించడంతో పాటు ఆలయ పునర్మిర్మాణ పనులను పర్యవేక్షించారు. నగారా పద్ధతిలో రామాలయ ఆర్కిటెక్చర్‌కు తుదిరూపు ఇచ్చినట్టు సొంపుర (77) తెలిపారు. ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యేందుకు మూడేళ్ల సమయం పడుతుందని ఆయన వెల్లడించారు. ఇక బుధవారం జరిగే మందిర నిర్మాణ భూమిపూజలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ సహా 200 మంది వరకూ ప్రముఖులు, రామమందిర ఉద్యమ నేతలు పాల్గొంటారు.

చదవండి : 'శ్రీరామ్' టాటూ వేయించుకున్న ముస్లిం యువ‌తి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement