bhoomipooja
-
భూమిపూజ : రాష్ట్రపతి కోవింద్‌ను ఆహ్వానించాల్సింది
లక్నో : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి జరిగిన భూమిపూజ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు దళిత వర్గానికి చెందిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌నూ పిలిచి ఉండాల్సిందని బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి అన్నారు. ఆగస్ట్ 5న జరిగిన మందిర శంకుస్ధాపనకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌నూ ఆహ్వానించాల్సిందని, ఆయన హాజరు మంచి సందేశం పంపిఉండేదని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు దళిత సాధువులు ఆసక్తి కనబరిచినా వారిని పూర్తిగా విస్మరించారని మాయావతి ఆరోపించారు. మరోవైపు లక్నోలో 108 అడుగుల ఎత్తైన పరుశురాముని విగ్రహ ఏర్పాటుకు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ప్రతిపాదనను ఆమె దుయ్యబట్టారు. బ్రాహ్మణ ఓటర్లను ఆకట్టుకునేందుకే ఎస్పీ ఈ ఎత్తుగడ వేస్తోందని ఆరోపించారు. బీఎస్పీ హయాంలో వివిధ కులాలకు చెందిన ప్రముఖ సాధుసంతుల పేర్లతో పలు పథకాలు చేపట్టామని, ఎస్పీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుల దృక్పథంతో వాటి పేర్లను మార్చారని విమర్శించారు. పరుశురాముడి విగ్రహం గురించి ఎస్పీ ఇప్పుడు మాట్లాడటం కంటే అధికారంలో ఉన్నప్పుడే ఆ విగ్రహాన్ని నిర్మించాల్సిందని చురకలు వేశారు. ఎస్పీ ప్రతిపాదిత విగ్రహం కంటే అధికంగా పరుశురాముడి భారీ విగ్రహాన్ని అయోధ్యలో నిర్మిస్తామని మాయావతి పేర్కొన్నారు. 2022లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 11 శాతం ఉన్న బ్రాహ్మణుల ఓట్లు కీలకం కావడంతో వారిని ఆకట్టుకునేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. చదవండి : అమెరికాలో 'అయోధ్య' సంబరాలు -
మందిర నిర్మాణం : పాక్ విమర్శలకు కౌంటర్
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనుల ప్రారంభంపై పాకిస్తాన్ విమర్శలను భారత్ గురువారం తోసిపుచ్చింది. మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం పొరుగుదేశం మానుకోవాలని హితవు పలికింది. భారత అంతర్గత విషయాల్లో తలదూర్చడం సరికాదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ పాక్‌కు చురకలు అంటించారు. భారత వ్యవహారాల్లో పాకిస్తాన్ ప్రకటనలను పరిశీలించామని, తమ అంతర్గత వ్యవహారాల్లో పొరుగుదేశం జోక్యం చేసుకోరాదని, మతపరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని ఆయన పేర్కొన్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, తమ దేశంలో మైనారిటీల మతపరమైన హక్కులను నిరాకరిస్తున్న పొరుగుదేశం వైఖరి ఆశ్చర్యం కలిగించకపోయినా ఇలాంటి వ్యాఖ్యలు విచారకరమని ఆయన వ్యాఖ్యానించారు. చదవండి : భూమి పూజపై పాక్ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతులమీదుగా బుధవారం భూమిపూజ అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. కాగా, రామమందిర నిర్మాణానికి శంకుస్ధాపన కార్యక్రమం నిర్వహించడంపై పాకిస్తాన్ విమర్శలు కురిపించింది. భారత సుప్రీంకోర్టు వెల్లడించిన లోపభూయిష్ట తీర్పుతో మందిర నిర్మాణానికి మార్గం సుగమమైందని పాక్ వ్యాఖ్యానించింది. ఇది న్యాయం పట్ల విశ్వాసం సన్నగిల్లడమే కాకుండా భారత్‌లో ముస్లింలు, వారి ప్రార్ధనా స్ధలాలపై దాడులు పెరుగుతున్న తీరుకు అద్దం పడుతోందని పేర్కొంది. భారత్‌లో మైనారిటీలను అణిచివేసేలా మెజారిటీవాదం ప్రబలుతోందని పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. -
అయోధ్య భూమిపూజ: రావణుని గుడిలో వేడుకలు
గ్రేటర్ నోయిడా(ఉత్తరప్రదేశ్): బిస్రఖ్ గ్రామంలో రావణుడి ఆలయం వద్ద కొంతమంది భక్తులు అయోధ్య రామ మందిరానికి చెందిన భూమి పూజను జరుపుకున్నారు. పురాణాల ప్రకారం రావణుడు బిస్రఖ్ గ్రామంలో జన్మించాడని చెబుతారు. అందుకే ఈ గ్రామంలో రాక్షస రాజైన రావణుడికి ఒక ఆలయాన్ని నిర్మించారు. రామాలయ భూమి పూజ కోసం దాదాపు 200లకు పైగా ప్రదేశాల నుంచి ఆలయ నిర్మాణం కోసం మట్టిని పంపిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమం కోసం ఈ రావణుడి ఆలయం నుంచి కూడా మట్టిని పంపారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి అశోకానంద్ మహారాజ్ మాట్లాడుతూ.. ‘500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత రాములవారు తన ఇంటికి వెళ్ళబోతున్నాడు. రావణ గ్రామమైన బిస్రఖ్ నివాసులమైన మాకు ఈ విషయంలో చాలా ఆనందంగా ఉంది. మా దేవుడైన రాముడు స్వదేశానికి తిరిగి రావడానికి మేము రావణుడి ఆలయంలో మతపరమైన వేడుకలు నిర్వహించాము. రాముడు లేకుండా రావణుడు అసంపూర్ణం. ఎందుకంటే రాముడే రావణుడికి మోక్షం ప్రసాదించాడు’ అని తెలిపారు. (జగమంతా రామమయం) గ్రామవాసులు రావణుడిని ఎందుకు ఆరాధిస్తున్నారు, ఎందుకు వేడుకలు జరుపుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకు అశోకానంద్ సమాధానమిస్తూ.. ‘హిందూ మతం వైవిధ్యమైనది. దేవుని పట్ల భయం హిందూ మతంలో ఒక భావన కాదు, ఇదంతా కర్మ సిద్ధాంతం. భగవంతుడు ప్రతిచోటా, అన్ని జీవులలో, ప్రాణములేని వాటిలో, మంచిలో, చెడులో, మనందరిలో ఉన్నాడు. రావణుడు శివుని భక్తుడు. ఆయన తన అధికారాలను దుర్వినియోగం చేయడం ప్రారంభించే వరకు చెడ్డ వ్యక్తి కాదు. రావణుడు చాలా శక్తిమంతుడు. తనకు మోక్షాన్ని ప్రసాదించగలిగే ఒకే ఒక వ్యక్తి రాముడని ఆయనకు తెలుసు. అందుకే రాముడితో వైరం పెట్టుకున్నాడు’ అని తెలిపారు. చదవండి: నూతన శకానికి నాందీ క్షణం -
ఆకట్టుకునేలా అయోధ్య రామాలయ నమూనా
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్ధాపన జరగనుండగా ఆలయ నమూనాను అయోధ్య ట్రస్ట్ మంగళవారం అధికారికంగా వెల్లడించింది. 161 అడుగుల ఎత్తైన మూడంతస్తుల రామ మందిరంగా నమూనాకు రూపకల్పన చేశారు. భారత వాస్తు శిల్పాకళా నైపుణ్యాన్ని చాటేలా ఆలయ డిజైన్ ఆకట్టుకుంటోంది. తొలుత అనుకున్న పరిమాణం కంటే దాదాపు రెట్టింపుగా నూతన నమూనాను అభివృద్ధి చేశారని ఆర్కిటెక్ట్ వెల్లడించారు. భారీ డోమ్‌తో పాటు ఇంటీరియర్స్‌ను ఆకర్షణీయంగా మలిచారు. ఆలయ ఆర్కిటెక్టుల కుటుంబానికి చెందని ఆర్కిటెక్ట్ చంద్రకాత్ సొంపురను 30 ఏళ్ల కిందట రామాలయం డిజైన్ కోసం సంప్రదించారు. ఆయన తండ్రి ప్రభాశంకర్ సొంపుర సోమ్‌నాథ్ ఆలయ డిజైన్‌ను రూపొందించడంతో పాటు ఆలయ పునర్మిర్మాణ పనులను పర్యవేక్షించారు. నగారా పద్ధతిలో రామాలయ ఆర్కిటెక్చర్‌కు తుదిరూపు ఇచ్చినట్టు సొంపుర (77) తెలిపారు. ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యేందుకు మూడేళ్ల సమయం పడుతుందని ఆయన వెల్లడించారు. ఇక బుధవారం జరిగే మందిర నిర్మాణ భూమిపూజలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సహా 200 మంది వరకూ ప్రముఖులు, రామమందిర ఉద్యమ నేతలు పాల్గొంటారు. చదవండి : 'శ్రీరామ్' టాటూ వేయించుకున్న ముస్లిం యువతి -
ఆకట్టుకునేలా అయోధ్య రామాలయ నమూనా
-
భూమి పూజ : ఉద్ధవ్ ఠాక్రేకు అందని ఆహ్వానం
సాక్షి, న్యూఢిల్లీ : అధికారం కోసం హిందుత్వను విడిచిపెట్టారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై బీజేపీ విమర్శల దాడి చేయగా, అయోధ్యలో ఆగస్ట్ 5న జరిగే రామమందిర భూమిపూజకు శివసేన అధిపతిని ఆహ్వానించలేదని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) మంగళవారం స్పష్టం చేసింది. భూమిపూజకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినీ ఆహ్వానించలేదని, ప్రోటోకాల్‌ను అనుసరించి యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఈ కార్యక్రమానికి హాజరవుతారని వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ పేర్కొన్నారు. రామమందిర ఉద్యమంతో శివసేన ఎన్నడూ మమేకం కాలేదని ఆయన అన్నారు. ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర సీఎంగా వ్యవహరిస్తున్నందున శివసేన చీఫ్ హోదాలోనూ ఆయనను ఆహ్వానించలేదని చెప్పారు. చదవండి : వీహెచ్‌పీ మోడల్లోనే మందిర్.. ఏ రాష్ట్ర సీఎంనూ ఈ కార్యక్రమానికి పిలవడంలేదని వెల్లడించారు. దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో ఈ-భూమిపూజ చేపట్టాలని ఠాక్రే గతంలో సూచించారు. శంకుస్ధాపన కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించాలని అన్నారు. ఉద్ధవ్ ఠాక్రే ప్రకటనపై అలోక్ కుమార్ స్పందిస్తూ గతంలో హిందుత్వ పార్టీ అయిన శివసేన దిగజారుడుతనం బాధాకరమని అన్నారు. హోంమంత్రిత్వ శాఖ పొందుపరిచిన కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. భౌతికదూరం పాటిస్తూ కొద్దిమందితోనే కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఆగస్ట్ 5న అయోధ్యలో జరిగే రామమందిర శంకుస్ధాపనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. కొద్దిమందినే ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నామని, ప్రజలంతా ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీల్లో వీక్షించాలని రామ జన్మభూమి తీర్ధ్ క్షేత్ర పేర్కొంది. -
పనులను త్వరగా పూర్తిచేయాలి
జగిత్యాల: అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. పట్టణంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మితో కలిసి ఆయన మంగళవారం భూమిపూజ చేశారు. ఏసీడీపీ నిధుల నుంచి గంగపుత్ర భవనానికి రూ.3 లక్షలు, యాదవ సంఘ భవనానికి రూ.3 లక్షలు, మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి తులసీనగర్ నుంచి ఎలుకవాడ వరకు మురికికాలువ నిర్మాణానికి రూ.10 లక్షలు కేటాయించగా.. పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. 27వ వార్డుకు కేటాయించిన తడి, పొడిచెత్త తరలించే రిక్షాను తొక్కి ప్రారంభించారు. 26వ వార్డులో వ్యవసాయ మార్కెట్ ముందు రూ.2 లక్షల మున్సిపల్ నిధులతో చేపడుతున్న మురికికాలువ నిర్మాణాన్ని ప్రారంభించారు. గంగపుత్ర సంఘం సభ్యులు ఎమ్మెల్యేతోపాటు విజయలక్ష్మికి చేపలను బహూకరించారు. యాదవ సంఘ సభ్యులు గొర్రె పొట్టేలును అందజేశారు. కార్యక్రమంలో కండ్లపల్లి శంకర్, గంగనర్సయ్య, నారాయణ, గంగరాజం, గంగపుత్ర కుల సభ్యులు యాదవుల పర్వతాలు, లింగయ్య, గంగాధర్, మల్లేశం, గంగమల్లు, యాదవ కుల సభ్యులు, మహిళ సంఘాల సభ్యులు, గంగపుత్ర పట్టణ సొసైటీ సంఘం అధ్యక్షుడు జుంబర్తి శంకర్, యువజన సంఘం అధ్యక్షుడు రజినికాంత్ పాల్గొన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలి గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని జీవన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే వేతనాలు చెల్లించాలని కోరుతూ కార్మికులు స్థానిక ఎంపీడీవో కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించి.. కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. వారికి ఎమ్మెల్యే సంఘీభావం తెలిపారు. కార్మికులకు నేరుగా ప్రభుత్వం ద్వారా వేతనాలు చెల్లించాలన్నారు. -
చరిత్రలో 'మందడం' ప్రాశస్త్యం
అప్పట్లో ఓ వెలుగువెలిగిన ప్రాంతం రాణి రుద్రమదేవి జన్మదిన వేడుకలకు వేదిక తాజా పరిశోధనలో వెల్లడి తెనాలి: ఆంధ్రుల కీర్తి పతాకగా, రాజరాజులు ఏలిన రాచరికపు ప్రాంతంగా విరాజిల్లిన తుళ్లూరు మండలం మందడం గ్రామం నేడు రాజధాని నిర్మాణంలో కీలక ఘట్టానికి తెరలేచింది. రాజధాని ఆవిర్భావానికి మొదటి అడుగు అయిన భూమిపూజ శనివారం ఇక్కడే జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రాశస్త్యాన్ని ఒకసారి పరికిస్తే.. కాకతీయుల ఆనవాళ్లు అడుగడుగునా సాక్షాత్కరిస్తాయి. కాకతీయ రాజుల వంశావళి, గణపతిదేవుడి గుణగణాలు, రాణీ రుద్రమదేవి నడయాడిన ప్రాంతంగా కీర్తికెక్కింది. తాజాగా జరిపిన పరిశోధనల్లో రుద్రమదేవి జన్మదిన వేడుకలకు మందడమే వేదిక నిలిచిందని నిర్ధారణ కావడం విశేషం. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి శనివారం తుళ్లూరు మండలం మందడంలో భూమిపూజ జరిగింది. రాజధానికి ఈశాన్యంగా ఉన్న ఈ గ్రామానికి ఉత్తరంగా కృష్ణానది ప్రవహిస్తున్నందున వాస్తురీత్యా ఎంతో ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇక్కడే భూమిపూజ చేయాలని నిర్ణయించుకున్నారు. ఉత్తరవాహినిగా ఉన్న కృష్ణమ్మ తీరంలోని మందడం కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి పాలనలోనూ వెలిగింది. గ్రామ శివారులోని మల్కాపురం, సుగాలీ కాలనీలోని పెద్ద శిలాశాసనం ఇందుకు సాక్షీభూతం. 14 అడుగుల ఎత్తు, 3.0 అడుగుల చదరంగా ఉన్న నల్లరాతిపై 200 పంక్తుల శాసనముంది. క్రీస్తుశకం 1261లో కాకతీయ గణపతిదేవుడు, ఆయన కుమార్తె రుద్రమదేవి కలిసి వేయించిన శాసనమిది. శతాబ్దం కిందటే ఈ శాసన విశేషాలు ప్రచురితమైనా, అవి కేవలం చక్రవర్తుల దానాలనే ప్రస్తావిస్తున్నట్టు పరిశోధకులు వెల్లడించారు. ఆ గ్రామానికి నేటి ప్రాధాన్యత దృష్ట్యా రాష్ర్ట పురావస్తుశాఖలో రిటైరై, ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ సీఈవోగా ఉన్న డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి మరోసారి శాసనాన్ని అధ్యయనం చేసి పలు అంశాలను కనుగొన్నారు. రుద్రదేవీపురంగా ప్రసిద్ధి ఉత్తరదేశంలోని గోళకి మఠ సంప్రదాయాన్ని మందడంలో ప్రవేశపెట్టి గోళకి మఠం, విశ్వేశ్వరుని ఆలయాన్ని ఇక్కడ నిర్మించింది గణపతిదేవుడే. ఆయన హామీ ఇచ్చినట్టుగా మందడం, వెలగపూడిని రుద్రమదేవి, విశ్వేశ్వర శివాచార్యుడికి దానమిచ్చారు. ఈ రెండింటినీ ఒక అగ్రహారంగా ప్రకటించి రుద్రదేవీపురంగా నామకరణం చేశారు. సంస్కృత కళాశాల, శైవులకు మఠం, వైద్యశాల, ప్రసూతి ఆస్పత్రి నిర్మించారు. వెలగపూడితో సహా మందరంలంక, కృష్ణానది మధ్యలోని లంకలు, పెనుంబాక (పెనుమాక), తాండి (తాడికొండ), రావిపూండి (రావిపూడి) మొదలైన ఎనిమిది గ్రామాలకు, గోళకీ మఠంలోని విద్యార్థుల కోసం 60మంది బ్రాహ్మణులను రప్పించారు. ఆలయంలో సేవలకు నర్తకులు, వాద్యగాండ్రు, మద్దెలగాండ్రు, కాశ్మీర్ నుంచి గాయకులను పిలిపించారు. పది రకాల వృత్తిపనివారలను సమకూర్చారు. వీరభద్రులు అనే రక్షభటులు, వారి సేవకులైన వీరముష్టులు, నిమ్నవర్గాలతో సహా అన్నసత్రం, అందుకిచ్చిన దానాలు ఈ శాసనంలో ఉన్నాయి. కాకతీయ సామ్రాజ్ఞి జన్మదిన వేడుకల వేదిక కాకతీయ రాజుల వంశావళి, గణపతిదేవుడి గుణగణాలు, రుద్రమదేవి పరాక్రమాన్ని ఈ శాసనం తెలియజేస్తోంది. క్రీస్తుశకం 1199-1261 వరకూ తెలుగు నేలను పాలించిన గణపతిదేవుడు 1261లో తన కుమార్తె రుద్రమదేవిని సింహాసనం ఎక్కించారు. రుద్రమదేవి జన్మదిన వేడుకలు తండ్రి గణపతిదేవుడు, రాజగురువు విశ్వేశ్వర శివాచార్యుల సమక్షంలో మందడంలోనే వైభవంగా జరిగినట్టు ఉందని డాక్టర్ శివనాగిరెడ్డి వెల్లడించారు. (శ్రీరుద్రమదేవి భువం! యస్యా జన్మమహోత్సవమూ గణపతేః విక్రమ స్త్రి క్షోణిత జగద్దళం ప్రతిబళ ప్రధ్వంసి జన్మోత్సవః) రుద్రమదేవి ఏ సంవత్సరంలో జన్మించినదీ కచ్చితంగా తెలియకున్నా, ఆమె పుట్టిన తేదీ మాత్రం మార్చి 25వ తేదీ (చైత్రే సితేతరా ష్టమ్యాం వారే శుక్రాభిధానకే) శుక్రవారానికి సరిపోతుందని తమ పరిశోధనలో తేలిందన్నారు. శాసనాల్లోని కీలక విషయాలు అప్పట్లో భూములను కొలిచే పెనుంబాక గడె, పెనుమాకరెడ్డి ఆధ్వర్యంలో పంటకాలువలు తవ్వించటం, విశ్వేశ్వర శివాచార్యుడి కాళేశ్వరంలో మఠాన్ని నిర్మించి పొన్న గ్రామాన్ని దానంగా ఇచ్చిన విషయం ఈ శాసనంలో పేర్కొన్నారు. మంత్రకూటం (మంధని) చంద్రవల్లిలో శివలింగ ప్రతిష్ఠ, కంచంపల్లిలో చెరువుకట్ట ఎత్తు పెంచటం, మునికూటపురం (మున్నంగి)ను బ్రాహ్మణులకు దానం ఇవ్వటం, దుగ్గిరాల దగ్గర లింగ ప్రతిష్ఠ వంటి అనేక ధార్మిక కార్యక్రమాలతో పాటు మందడంలో ఆలయం నిర్మించి, శాసనం చెక్కిన శిల్పులకు చేసిన దానాలన్నింటినీ పేర్కొన్నారు. ఇంతటి విశిష్టత సంతరించుకున్న మందడం కేంద్రంగా ఇప్పుడు నూతన రాజధాని నిర్మాణానికి భూమిపూజ జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని పర్యాటకరంగ విస్తృతికి, ఇక్కడి విశ్వేశ్వర ఆలయం, శాసన పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉంది. -
అందరూ అంటారు నేనొక విజనరీ అని...
-
అందరూ అంటారు నేనొక విజనరీ అని...
హైదరాబాద్ : సంక్షోభాన్ని అవకాశంగా తీసుకుని ముందుకు వెళితే ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని నిర్మాణం ఒక అవకాశం అని...వాస్తవంగా చెప్పాలంటే ఒక సంక్షోభం అని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి చంద్రబాబు దంపతులు శనివారం భూమిపూజ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 'రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగలేదని మొదటి నుంచి చెబుతున్నా. రాజకీయ ప్రయోజనాల కోసమే విభజన చేశారు. ఆస్తులు, అప్పుల పంపకంలో హేతుబద్ధత లేదు. రాజధానికి భూములిచ్చిన వారికి కృతజ్ఞతలు. భూసేకరణను ఆమోదించటం నా జీవితంలో మరిచిపోలేని రోజు. హైదరాబాద్‌ను అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దా. ఒకప్పుడు నేనే కష్టపడి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశా. ఎయిర్పోర్ట్, హైటెక్ సిటీ, సైబరాబాద్ నగరం నిర్మాణం, ఔటర్ రింగ్ రోడ్డు ...ఇవన్ని చూస్తుంటే తృప్తి... వాటన్నింటినీ నేనే కట్టాను. దానికి కారకుడిని నేనే అని అనుకున్నప్పుడు చాలా తృప్తిగా ఉంది. అందరూ అంటారు నేనొక విజనరీ అని...రాజధానిని నిర్మించే అవకాశం అందరికీ రాదు. ఆ అవకాశం మనకు వచ్చింది. అది అదృష్టంగా భావిస్తున్నా. ప్రపంచంలోనే నెంబర్ వన్ రాజధానిగా నిర్మించే బాధ్యత మా ప్రభుత్వానిది. 21వ శతాబ్దపు రాజధానిగా తీర్చిదిద్దుతాం. అవసరం అయితే ప్రపంచం అంతా తిరిగి అధ్యయనం చేయమని ప్రధాని మోదీ చెప్పారు. మంచి రాజధాని నిర్మాణానికి వారు హామీ ఇచ్చారు. 20 ఏళ్ల తర్వాత ఈ ప్రాంతంలో మంచి రాజధాని చూస్తారు. తెలుగు జాతి ఉనికికే కాంగ్రెస్ ప్రమాదం తెచ్చింది. రాష్ట్రాన్ని విడగొట్టి కనీసం రాజధాని ఎక్కడో కూడా చెప్పలేదు. స్వలాభం కోసం కాంగ్రెస్ ఎన్నో తప్పులు చేసింది. ఎవరు అడ్డంకులు పెట్టినా రాజధాని నిర్మాణం ఆగదు. భూమిపూజ చేసిన రోజు వర్షం పడటం శుభసూచకం. అయితే ప్రస్తుతం ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు. రాజధాని కట్టాలంటే అప్పు అయినా తేవాలి. కేంద్రం అయినా ఇవ్వాలి' అన్నారు.