యాదవులు బహూకరించిన గొర్రెపొట్టేలుతో జీవన్‌రెడ్డి
జగిత్యాల: అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. పట్టణంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మితో కలిసి ఆయన మంగళవారం భూమిపూజ చేశారు. ఏసీడీపీ నిధుల నుంచి గంగపుత్ర భవనానికి రూ.3 లక్షలు, యాదవ సంఘ భవనానికి రూ.3 లక్షలు, మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి తులసీనగర్ నుంచి ఎలుకవాడ వరకు మురికికాలువ నిర్మాణానికి రూ.10 లక్షలు కేటాయించగా.. పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. 27వ వార్డుకు కేటాయించిన తడి, పొడిచెత్త తరలించే రిక్షాను తొక్కి ప్రారంభించారు. 26వ వార్డులో వ్యవసాయ మార్కెట్ ముందు రూ.2 లక్షల మున్సిపల్ నిధులతో చేపడుతున్న మురికికాలువ నిర్మాణాన్ని ప్రారంభించారు. గంగపుత్ర సంఘం సభ్యులు ఎమ్మెల్యేతోపాటు విజయలక్ష్మికి చేపలను బహూకరించారు. యాదవ సంఘ సభ్యులు గొర్రె పొట్టేలును అందజేశారు. కార్యక్రమంలో కండ్లపల్లి శంకర్, గంగనర్సయ్య, నారాయణ, గంగరాజం, గంగపుత్ర కుల సభ్యులు యాదవుల పర్వతాలు, లింగయ్య, గంగాధర్, మల్లేశం, గంగమల్లు, యాదవ కుల సభ్యులు, మహిళ సంఘాల సభ్యులు, గంగపుత్ర పట్టణ సొసైటీ సంఘం అధ్యక్షుడు జుంబర్తి శంకర్, యువజన సంఘం అధ్యక్షుడు రజినికాంత్ పాల్గొన్నారు.
కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని జీవన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే వేతనాలు చెల్లించాలని కోరుతూ కార్మికులు స్థానిక ఎంపీడీవో కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించి.. కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. వారికి ఎమ్మెల్యే సంఘీభావం తెలిపారు. కార్మికులకు నేరుగా ప్రభుత్వం ద్వారా వేతనాలు చెల్లించాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment