mla jeevanreddy
-
అధికారంలోకి రాగానే తుమ్మిడిహెట్టి
ధర్మారం(ధర్మపురి): అధికారంలోకి రాగానే తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణం పూర్తిచేసి తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. ధర్మారంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్యాకేజీ 6,7,8 పనులు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలోనే 50 శాతం పనులు పూర్తయినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ గుర్తింపు వస్తుందోనని కేసీఆర్ వివిధరకాల వ్యక్తులతో ఈ ప్రాజెక్టు పనులు ఎక్కడా చూడలేదని ప్రకటనలు జారీచేయించుకుంటున్నారని ఆరోపించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం చారిత్రక ఒప్పందంగా చెప్పుకుంటూ ఏర్పోర్టు నుంచి ఒంటేలతో ఊరేగి ప్రచారం చేసుకున్న కేసీఆర్ ఈ బ్యారేజీని ఎందుకు నిర్మించటం లేదని ప్రశ్నించారు. ఊరేగి రెండేళ్లు గడిచినా.. బ్యారేజీ వద్ద తట్టెడు మట్టి ఎత్తిపోయలేదన్నారు. బ్యారేజీ నిర్మాణంతో పాటు సుందిళ్ల వద్ద పనులు చేపడితే ఏడాదిలోగా రైతులకు సాగునీరందేదని అన్నారు. కేసీఆర్ అనాలోచిత విధానంతో ప్రజలపై ఆర్థిక భారంతో పాటు సకాలంలో రైతులకు సాగునీరందకుండా పోయిందన్నారు. తుమ్మిడిహెట్టిని విస్మరించి వర్దా వద్ద నిర్మాణాలు చేస్తామని ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్దా, పెనుగంగల సంగమం ప్రాణహితని తుమ్మిడిహట్టి వద్ద నిర్మాణం చేయకపోతే ఈ నీరంత వృథాగాపోతుందన్నారు. అంతే కాకుండ ఇక్కడ బ్యారేజీ నిర్మిస్తే గ్రావిటీ ద్వారా నీటిని తరలించి ఆర్థిక భారం పడకుండా ఉంటుందని సూచించారు. పునరాకృతిలో భాగంగా ప్యాకేజీ 6లో అదనంగా ఒక్క మోటారు, 8వ ప్యాకేజీలో అదనంగా మరో రెండు మోటార్లను ఏర్పాటు చేశారని గుర్తుచేస్తూ ‘ఈ బాహుబలి’ ఆలోచన కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తుమ్మిడిహెట్టి వద్ద నిర్మాణం చేసి తెలంగాణలోని లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామన్నారు. మేడారం రిజర్వాయర్ ద్వారా గంగాధర, నారాయణపూర్ రిజర్వాయర్, కొడిమ్యాల, పోతారం చెరువులలోకి నీటి తరలించే అవకాశం ఉన్నా.. ఎందుకు తరలించటం లేదని ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు ఆవుల శ్రీనివాస్, జెడ్పీ మాజీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, పీసీసీ సభ్యుడు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శంకర్రావు, జెడ్పీటీసీ నార బ్రహ్మయ్య, మార్కెట్ కమిటీ మాజీ వైస్‌చైర్మన్ పాలకుర్తి రాజేశంగౌడ్, మాజీ ఎంపీటీసీ రేణుకాదేవి, నాయకులు రేండ్ల నరేష్, పెర్క భానేష్, ఆవుల వేణు, వెంకటేష్, మహిపాల్ పాల్గొన్నారు. -
కొనుగోలు కేంద్రాన్ని అడ్డుకోవడం సరికాదు..
సారంగాపూర్(జగిత్యాల) : ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అటవీశాఖ అడ్డుకోవడం సరికాదని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. గురువారం బీర్పూర్ మండలం చెర్లపల్లిలో స్థానిక విండో ఆధ్వర్యంలోని కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు గురువారం బీర్పూర్ వెళ్లారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన భూమి తమదని..కేంద్రాన్ని ఎత్తివేయాలని అటవీశాఖ తొలగించాలని రేంజర్ ఉత్తంరావు సూచించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అధికారులతో చర్చించారు. భూమిపై అటవీ, రెవన్యూ శాఖలు సంయుక్తంగా సర్వే నిర్వహించి.. తేల్చాలని సూచించారు. ఉమ్మడి సర్వే కోసం కలెక్టర్‌ను కోరుతానని.. ప్రస్తుతం అభ్యంతరం చెప్పడం సరికాదని ఎమ్మెల్యే అనడంతో అటవీశాఖ అధికారులు వెనక్కు తగ్గారు. సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లో ఐకేపీ, సింగిల్‌విండోల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. లచ్చక్కపేట, రంగపేట, సారంగాపూర్, రేచపల్లి, బీర్పూర్, కొల్వాయి, మంగేళ, చెర్లపల్లి గ్రామాల్లోనూ ప్రారంభించారు. ఎంపీపీ కొల్ముల శారద, జెడ్పీటీసీ భూక్య సరళ, సింగిల్‌విండో చైర్మన్ ముప్పాల రాంచందర్‌రావు, తహసీల్దార్ వసంత, రాజేందర్, ఎంపీడీవో పుల్లయ్య, వైస్‌ఎంపీపీ కోండ్ర రాంచంద్రారెడ్డి, విండో చైర్మన్లు ముప్పాల రాంచందర్‌రావు, సాగి సత్యంరావు, మండల కోఆప్షన్ సభ్యుడు ఎండీ ఇబ్రహీం, ఐకేపీ ఏపీఎం గంగాధర్, సర్పంచులు పాల్గొన్నారు. Congress MLA Jeevan Reddy -
పనులను త్వరగా పూర్తిచేయాలి
జగిత్యాల: అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. పట్టణంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మితో కలిసి ఆయన మంగళవారం భూమిపూజ చేశారు. ఏసీడీపీ నిధుల నుంచి గంగపుత్ర భవనానికి రూ.3 లక్షలు, యాదవ సంఘ భవనానికి రూ.3 లక్షలు, మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి తులసీనగర్ నుంచి ఎలుకవాడ వరకు మురికికాలువ నిర్మాణానికి రూ.10 లక్షలు కేటాయించగా.. పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. 27వ వార్డుకు కేటాయించిన తడి, పొడిచెత్త తరలించే రిక్షాను తొక్కి ప్రారంభించారు. 26వ వార్డులో వ్యవసాయ మార్కెట్ ముందు రూ.2 లక్షల మున్సిపల్ నిధులతో చేపడుతున్న మురికికాలువ నిర్మాణాన్ని ప్రారంభించారు. గంగపుత్ర సంఘం సభ్యులు ఎమ్మెల్యేతోపాటు విజయలక్ష్మికి చేపలను బహూకరించారు. యాదవ సంఘ సభ్యులు గొర్రె పొట్టేలును అందజేశారు. కార్యక్రమంలో కండ్లపల్లి శంకర్, గంగనర్సయ్య, నారాయణ, గంగరాజం, గంగపుత్ర కుల సభ్యులు యాదవుల పర్వతాలు, లింగయ్య, గంగాధర్, మల్లేశం, గంగమల్లు, యాదవ కుల సభ్యులు, మహిళ సంఘాల సభ్యులు, గంగపుత్ర పట్టణ సొసైటీ సంఘం అధ్యక్షుడు జుంబర్తి శంకర్, యువజన సంఘం అధ్యక్షుడు రజినికాంత్ పాల్గొన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలి గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని జీవన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే వేతనాలు చెల్లించాలని కోరుతూ కార్మికులు స్థానిక ఎంపీడీవో కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించి.. కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. వారికి ఎమ్మెల్యే సంఘీభావం తెలిపారు. కార్మికులకు నేరుగా ప్రభుత్వం ద్వారా వేతనాలు చెల్లించాలన్నారు. -
మొక్కలను కాపాడడమే ప్రతిఒక్కరి ధ్యేయం
ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి రాయికల్ : మొక్కలు నాటడమే కాదు పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. మండలం బోర్నపల్లి, చింతలూరు, రామాజీపేట, ఇటిక్యాల గ్రామాల్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం రామాజీపేటలో జెడ్పీ నిధులతో మంజూరైన బోర్ను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ పడాల పూర్ణిమ, జెడ్పీటీసీ గోపీ మాధవి, సర్పంచులు కోల లక్ష్మి, కదుర్ల లక్ష్మి, రామాజీపేటలో వాసరి రవి, ఇటిక్యాలలో నీరటి శ్రీనివాస్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్రావు, ప్రధాన కార్యదర్శి మహేందర్, ఎంపీటీసీలు బెజ్జంకి మోహన్, అనుపురం లక్ష్మి, తహసీల్దార్ చంద్రప్రకాశ్, యూత్ కాంగ్రెస్ నాయకులు మహిపాల్‌రెడ్డి, దివాకర్, హరీశ్‌రావు తదితరులు పాల్గొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతి భాగ్యలక్ష్మి రాయికల్, ద్వితీయ సుమలత రాయికల్, తృతీయ జ్యోతి ధర్మాజీపేటలు గెలుచుకున్నారు. వీరికి ఎంపీపీ పడాల పూర్ణిమ బహుమతులు అందజేశారు. -
'సీఎం చేతగాని తనానికి ఇది నిదర్శనం'
కరీంనగర్: తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావుపై సీనియర్ నేత, కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం నాడు ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. గుడుంబాను అరికట్టకుండా.. చీప్ లిక్కర్‌ను అందుబాటులోకి తీసుకురావడం కేసీఆర్ చేతగాని తనానికి ఇది నిదర్శనమని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. చీప్ లిక్కర్‌పై జిల్లాలోని జగిత్యాల నుంచే ఉద్యమం ప్రారంభిస్తామని ఆయన అన్నారు. గుడుంబాను అరికట్టలేక పోతున్నామని ఇటీవల కేసీఆర్ వ్యాఖ్యానించడం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ పోలీసులను అవమాన పరచడమేనని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.