'సీఎం చేతగాని తనానికి ఇది నిదర్శనం' | mla jeevanreddy criticises kcr on cheap liquor issue | Sakshi
Sakshi News home page

'సీఎం చేతగాని తనానికి ఇది నిదర్శనం'

Published Fri, Aug 21 2015 4:26 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

'సీఎం చేతగాని తనానికి ఇది నిదర్శనం' - Sakshi

'సీఎం చేతగాని తనానికి ఇది నిదర్శనం'

కరీంనగర్: తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్రావుపై సీనియర్ నేత, కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం నాడు ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. గుడుంబాను అరికట్టకుండా.. చీప్ లిక్కర్ను అందుబాటులోకి తీసుకురావడం కేసీఆర్ చేతగాని తనానికి ఇది నిదర్శనమని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. చీప్ లిక్కర్పై జిల్లాలోని జగిత్యాల నుంచే ఉద్యమం ప్రారంభిస్తామని ఆయన అన్నారు. గుడుంబాను అరికట్టలేక పోతున్నామని ఇటీవల కేసీఆర్ వ్యాఖ్యానించడం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ పోలీసులను అవమాన పరచడమేనని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement