Cheap liquor
-
చంద్రన్న కానుకలే ఈ చీప్ లిక్కర్ బ్రాండ్లు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: చంద్రబాబు ఇంటి పేరు నారా బదులు సారా అని పెడితే బాగుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం మద్యం పాలసీపై అసెంబ్లీ సమావేశాల్లో స్వల్పకాలిక చర్చ సందర్భంగా.. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రస్తుత ప్రభుత్వానికి రుద్దే ప్రయత్నం జరుగుతోందని సీఎం జగన్ వివరించారు. రాష్ట్రంలో 20 డిస్టిలరీలకుగానూ 14 డిస్టీలరీలకు అనుమతి ఇచ్చిన పాపం చంద్రబాబుదేనని, 2019 తర్వాత ఒక్క డిస్టిలరీకి గానీ, ఒక్క బ్రూవరీకిగాని తమ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని సీఎం జగన్ గుర్తు చేశారు. ‘‘నవరత్నాలు, అమ్మ ఒడి.. ఇవీ మా ప్రభుత్వ బ్రాండ్లు. ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ ఛాయిస్ భూంభూం బీర్, పవర్ స్టార్ 999, 999 లెజెండ్.. బ్రాండ్లన్నీ చంద్రన్న కానుకలే. ఇవన్నీ చంద్రబాబు ఆశీస్సులతో వచ్చిన బ్రాండ్లే. ప్రెసిడెంట్ మెడల్ బ్రాండ్.. చంద్రబాబు మెడల్ బ్రాండ్. గవర్నర్ ఛాయిస్ 2018, నవంబర్ 5న అనుమతి ఇచ్చింది చంద్రబాబే. ఆయన దిగిపోయే చివరి క్షణం వరకు లిక్కర్ బ్రాండ్లకు అనుమతులు ఇస్తూనే ఉన్నారు. చంద్రబాబు హయాంలోనే 254 బ్రాండ్లు వచ్చాయి. ఇవన్నీ ఆయన ట్రేడ్ మార్క్ బ్రాండ్లు. కానీ, ఈ బ్రాండ్లను మేం క్రియేట్ చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారు. స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్ అంటూ తప్పుడు లేబుల్స్‌తో ప్రచారం చేసిన ఘనత కూడా టీడీపీ నేతలదేనని సీఎం జగన్ అన్నారు. ‘‘2019 తర్వాత మా ప్రభుత్వం ఒక్క బ్రాండ్‌కు కూడా అనుమతి ఇవ్వలేదు. మేం అమ్మే బ్రాండ్లన్నీ లైసెన్స్డ్ డిస్టిలరీస్ నుంచి వచ్చినవే. మనిషి పరంగా చంద్రబాబు, పార్టీపరంగా టీడీపీ , మరో వైపు ఎల్లో మీడియా ఇవే అసలు సిసలైన చీప్ బ్రాండ్స్. ఏ షాపు నుంచి తీసుకొచ్చారో ఆధారాలు లేకుండా శాంపిల్స్ టెస్టింగ్‌కు ఇచ్చారు. ఇక్కడ శాంపిల్స్‌లో ట్యాంపరింగ్ కూడా చేసి ఉండొచ్చు కదా. వారు ఇచ్చిన లైసెన్స్డ్ డిస్టిలరీస్ నుంచే మద్యం విక్రయిస్తున్నాం. అప్పుడు అది విషంగా ఎలా మారుతుంది?’’ అని ప్రశ్నించారు సీఎం జగన్. మా ప్రభుత్వం 16 మెడికల్ కాలేజీలకు అనుమతిస్తే.. డిస్టిలరీలకు అనుమతి ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని, జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, సహజ మరణాలను కల్తీ సారా మరణాలుగా చంద్రబాబు చిత్రీకరిస్తున్నారంటూ సీఎం జగన్ ఆక్షేపించారు. టీడీపీ నేతలవి క్రిమినల్ బ్రెయిన్స్ అని, వాళ్లందరినీ జూలో పెట్టడమే కరెక్ట్ అంటూ సీఎం జగన్ చమత్కరించారు. పీఎంకే డిస్టిలరీస్ యనమల వియ్యంకుడిది కాదా?, శ్రీకృష్ణ డిస్టిలరీస్ ఆదికేశవులనాయుడిది కాదా? విశాల డిస్టిలరీస్ ఎవరిది? అయ్యన పాత్రుడిది కాదా? అని సీఎం జగన్.. సభాముఖంగా నిలదీశారు. -
సారా బట్టీలపై ఎక్సైజ్ అధికారుల దాడులు
సాక్షి, మార్కాపురం(ఫ్రకాశం) : మార్కాపురం ఎక్సైజ్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో సోమవారం తమ సిబ్బంది దాడులు నిర్వహించి నాటుసారా బట్టీలు, బెల్లం ఊటను ధ్వంసం చేసి పలువురిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎ.ఆవులయ్య తెలిపారు. ‘సాక్షి’ దినపత్రికలో ‘పశ్చిమాన సారా’ శీర్షికతో సోమవారం ఓ కథనం ప్రచురితమైంది. ఎక్సైజ్ అధికారులు స్పందించి వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆవులయ్య తన కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మార్కాపురం ఎక్సైజ్ సీఐ రాధాకృష్ణమూర్తి తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి పెద్దదోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లె గ్రామంలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇదే మండలంలోని దోర్నాల శివార్లలో 200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు తెలిపారు. గిద్దలూరు సీఐ సోమయ్య ఆధ్వర్యంలో అధికారుల బృందం అర్ధవీడు మండలం యాచవరం చెంచుకాలనీలో దాడులు నిర్వహించి 100 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు సూపరింటెండెంట్ ఆవులయ్య తెలిపారు. ఇదే మండలం వెంకటాపురంలో కూడా 200 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు తెలిపారు. యర్రగొండపాలెం సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మండలంలోని బిళ్లగొంది చెంచుగూడెంలో 100లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు చెప్పారు. కనిగిరి సీఐ ఆధ్వర్యంలో హజీజ్పురంలో బెల్ట్‌షాపు నిర్వహిస్తున్న మహిళను అరెస్టు చేసి 10 క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆవులయ్య వివరించారు. మార్కాపురం ఎక్సైజ్ పరిధిలో తొమ్మిది పోలీసుస్టేషన్లు ఉన్నాయని, బెల్ట్‌షాపులు నిర్వహించినా, ఎమ్మార్పీ కంటే అధికంగా అమ్మినా, నాటుసారా తయారు చేసినా, విక్రయించినా అలాంటి వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి వ్యక్తుల సమాచారాన్ని తమకు తెలియజేయాలని, వారి పేర్లను రహస్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. మార్కాపురం ప్రాంత దాడుల్లో ఎక్సైజ్ సిబ్బంది జి.వెంకటేశ్వర్లు, నగేష్, రమేష్, కాశయ్య, పాల్గొన్నారు. -
చీప్‌లిక్కర్ జోష్
సాక్షి, ఆదిలాబాద్ : మద్యం అమ్మకాల్లో చీప్ లిక్కర్ విక్రయాలు ప్రతీ ఏడాది గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ లిక్కర్ ప్రభుత్వానికి గణనీయం గా ఆదాయం తెచ్చి పెడుతోంది. ఈ ఐదేళ్లలో పెరిగిన రెట్టింపు అమ్మకాలే దీనికి నిదర్శనం. మీడియం, ప్రీమియం లిక్కర్‌తోపాటు చీప్‌లిక్కర్ విక్రయాలు కూడా ఎక్కువగా సాగుతున్నాయి. మందు సేవించే వారిలో ప్రధానంగా పేదవారు చీప్‌లిక్కర్ అధికంగా తీసుకుంటుంటారు. కాగా ఇది ఎన్నికల కాలం కావడంతో ఈ మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఏ పార్టీలోనైనా ర్యాలీలు, సభలు నిర్వహించే సమయంలో మద్యం పొంగిపొర్లుతుంది. అందులో అధికంగా చీప్ లిక్కర్ జోషే కనిపిస్తోంది. దీంతో ఈ ఎన్నికలు ముగిసే వరకు ఈ లిక్కర్ అమ్మకాలు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఎౖ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కట్టడితోనే.. 2013–14కు ముందు ఎక్సైజ్ శాఖ మద్యం అమ్మకాలకు సంబంధించి కేవలం ఐఎంఎల్(ఇండియన్ మేడ్ లిక్కర్) కేసులు, బీర్ కేసులను పరిగణనలోకి తీసుకుని ఆదాయాన్ని గణించేవారు. ఆ తర్వాత ఈ రెండింటితోపాటు చీప్ లిక్కర్ అమ్మకాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతోంది. ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా ఆ ఎక్సైజ్ పరిధిలో ఎంత చీప్‌లిక్కర్ అమ్మకాలు పెరిగితే అంత దేశీదారు, నల్లబెల్లం, సారా, కల్తీకల్లును అరికట్టినట్లుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. ఇది ఆయా ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో ఎక్సైజ్ అధికారుల పనితీరును స్పష్టం చేసే పరిస్థితి కనిపిస్తోంది. 2013–14లో 2,28,533 కేసుల చీప్ లిక్కర్ విక్రయాలు ఉంటే గత ఏడాది ఇవి 4,66,665 కేసుల విక్రయాలు పెరిగింది. తద్వారా రెట్టింపు అయింది. ఇది అక్రమ మద్యాన్ని నిరోధించడంతోనే చీప్‌లిక్కర్ అమ్మకాలు పెరిగాయి. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మూడు వైపులా మహారాష్ట్ర సరిహద్దుగా ఉండడం, అక్కడి నుంచి దేశీదారు అక్రమంగా జిల్లాలోకి రవాణా చేస్తుండడంతో మన రాష్ట్రంలో దొరికే చీప్ లిక్కర్ అమ్మకాలపై ప్రభావం పడేది. ప్రధానంగా కూలీలు, పేద వర్గాలు దేశీదారు సేవనం చేయడంతో ఇది మన లిక్కర్ అమ్మకాల ఆదాయంపై ప్రభావం చూపేది. దీంతో ప్రభుత్వం ప్రధానంగా దేశీదారును కట్టడి చేయడం ద్వారా చీప్ లిక్కర్ అమ్మకాలను పెంచేందుకు ఎక్సైజ్, పోలీసు శాఖ ఆధ్వర్యంలో దాడులు చేయడం జరుగుతోంది. దీంతోపాటు మళ్లీ మళ్లీ అక్రమ విక్రయాలు చేస్తూ పట్టుబడిన వారిపై జరిమానా విధించడంతోపాటు బైండోవర్లు చేయడం, తదితర కారణంగా జిల్లాలో అక్రమ, కల్తీ మద్యం అమ్మకాలు తగ్గాయని అధికారులు చెబుతున్నారు. సరిహద్దు మండలాల నుంచే.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు పాత మండలాల పరంగా మహారాష్ట్రకు సరిహద్దుగా 21 మండలాలు ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో ముథోల్, తానూర్, కుభీర్, భైంసా, కుంటాల, ఆదిలాబాద్ జిల్లాలో బోథ్, బజార్హత్నూర్, తాంసి, తలమడుగు, తాంసి, బేల, జైనథ్, నార్నూర్, కుమురంభీం జిల్లాలో కెరమెరి, వాంకిడి, కాగజ్‌నగర్, సిర్పూర్(టి), కౌటాల, బెజ్జూర్, దహెగాం, మంచిర్యాల జిల్లాలో వేమనపల్లి, కౌటాల మండలాలు మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్నాయి. దేశీదారు మహారాష్ట్రంలో తక్కువ ధరకు దొరకుతుండడంతో కొంత మంది అక్కడి నుంచి పెద్ద ఎత్తున సరుకుని కొనుగోలు చేసి అక్రమంగా మన జిల్లాకు తీసుకుని వచ్చి కొంత ఎక్కువ ధరతో విక్రయించడం ద్వారా అక్రమ మద్యం వ్యాపారం చేసేవారు. ఇప్పటికీ ఈ అక్రమ వ్యాపారం ముందులాగా జోరుగా సాగకపోయినప్పటికీ అంతో ఇంతో కొనసాగుతోంది. ప్రధానంగా ఇది వరకు మద్యం వ్యాపారంలో ఉండి ఆ తర్వాత అక్రమ మార్గం పట్టిన పలువురు కల్తీ మద్యం తయారీకి పాల్పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇలాంటి సంఘటన నేరడిగొండలో బయటపడింది. దేశీదారుతో కొన్ని రసాయనాలు కలపడం ద్వారా చీప్ లిక్కర్‌గా తయారు చేసి విక్రయించిన ఉదాంతం జిల్లాలో బయటపడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం జిల్లాలో దేశీదారు విక్రయాలు, నల్లబెల్లం, గుడుంబా, కల్తీకల్లు విక్రయాలు గణనీయంగా తగ్గాయి. ఎన్నికల్లో పొంగిపొర్లడం ఖాయం.. ఎన్నికల వేళ చీప్ లిక్కర్ అమ్మకాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ప్రస్తుతం పార్టీల ర్యాలీలు, సభలు జోరందుకోవడంతో నేతలు లిక్కర్పరంగా మోయలేని భారం పడుతోంది. దీంతో చీప్ లిక్కర్‌తో ఈ వ్యయభారం నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఇప్పటికే ఆయా పార్టీలు పెద్ద మొత్తంలో ఈ లిక్కర్‌ను డంప్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కొంగర్కొలాన్ సభ తర్వాత ముందస్తు ఎన్నికలు ఖాయం అనే సంకేతాలు వెలువడడంతో పలు పార్టీలు వీటిని ఇప్పటికే డంప్ చేసుకోవడం జరిగింది. సాధారణంగా రూ.400 లోపు మద్యాన్ని చీప్ లిక్కర్‌గా పరిగణిస్తారు. ఆపై రూ.1000 వరకు మీడియం లిక్కర్‌గా, ఆపై ధర ఉన్న లిక్కర్‌ను ప్రీమియం లిక్కర్‌గా పరిగణనలోకి తీసుకుంటారు. రూ.400 లోపు విలువైన మద్యాన్ని ఆయా పార్టీలు ఇప్పటికే పెద్ద ఎత్తున కొనుగోలు చేశారనే ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా ఎన్నికల సమయంలో సాయంత్రం ప్రచారం పూర్తికాగానే కార్యకర్తలకు మందు, విందు తప్పనిసరి. ఈ దృష్ట్యా ఈ నాలుగు నెలల కాలంలో ఎక్సైజ్ శాఖకు గణనీయంగా ఆదాయం లభించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఏడాది ఇప్పటికే రూ.1078 కోట్ల ఆదాయం అన్ని రకాల మద్యం విక్రయాల ద్వారా వచ్చింది. మరో రెండు నెలల్లో వార్షిక సంవత్సరం ముగుస్తుంది. అప్పటికీ ఈ ఆదాయం ఉమ్మడి జిల్లాలో 12 వందల కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. చీప్ లిక్కర్ విక్రయాలు పెరిగాయి.. సారా, నల్లబెల్లం, దేశీదారు, కల్తీకల్లును కట్టడి చేయడంతోనే జిల్లాలో చీప్ లిక్కర్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. అక్రమ మద్యం విక్రయాలు మళ్లీ మళ్లీ చేస్తే వారిని పట్టుకుని తహసీల్దార్ వద్ద బైండోవర్లు చేయడం, రూ.లక్ష జరిమానా, కట్టని పక్షంలో ఆరు నెలల జైలు శిక్ష వంటి అమలు చేయడంతో ప్రభావం చూపుతోంది. దేశీదారు ప్రభావం తగ్గడంతో చీప్ లిక్కర్ అమ్మకాలు పెరిగి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈ దిశగా ఉమ్మడి జిల్లాలో ఎక్సైజ్ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. అక్రమ మద్యాన్ని నిరోధించాలి. – టి.డేవిడ్ రవికాంత్, ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్ డివిజన్, ఆదిలాబాద్ -
వెల్లువలా చీప్ లిక్కర్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో చీప్ లిక్కర్ ఏరులై పారుతోంది. నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో మద్యం మరణాలు సంభవిస్తుంటే.. ఎక్సైజ్ శాఖ మాత్రం మద్యం శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌లకు పంపడమే తప్ప ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సుంకం చెల్లించని మద్యం (నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్–ఎన్డీపీఎల్)ను మాత్రం అడ్డుకోవడంలేదు. దీంతో ట్రూ ట్రాన్సిట్ పర్మిట్ల ముసుగులో రాష్ట్రంలో ఎన్డీపీఎల్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మరికొన్నిచోట్ల కొందరు అబ్కారీ అధికారులకు మద్యం షాపుల్లో వాటాలుండటంతో సరిహద్దు చెక్‌పోస్టుల్లోని సిబ్బంది సహకారంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అమ్మకాలు జరిపిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇందుకు ఊతమిస్తూ ఇటీవల కాలంలో కర్నూలు, గుంటూరు, ఉభయగోదావరి, విశాఖ, కృష్ణా తదితర జిల్లాల్లో నకిలీ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా కర్ణాటక నుంచి కర్నూలుకు ఎన్డీపీఎల్ మద్యం పెద్దఎత్తున సరఫరా అవుతోంది. కర్ణాటకకు సరిహద్దు జిల్లా కావడంతో ఎమ్మిగనూరు, హాలహర్వి, ఆలూరు, మంత్రాలయం తదితర ప్రాంతాలకు ఎన్డీపీఎల్ మద్యాన్ని దిగుమతి చేసుకుంటున్నారు. కర్ణాటక లిక్కర్‌కు, రాష్ట్రంలో ఉత్పత్తి చేసే లిక్కర్‌కు ధరలో భారీ వ్యత్యాసం ఉండటంతో అక్కడ్నుంచి తెచ్చి అమ్మకాలు సాగిస్తున్నారు. చీప్ లిక్కర్ ప్యాకెట్లను రాష్ట్రంలో రూ.90 నుంచి రూ.వందకు విక్రయిస్తుండగా, కర్ణాటక ప్రభుత్వం రూ.50కే విక్రయిస్తోంది. దీంతో అక్కడి మద్యం బ్రాండ్లు ఏపీ మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. తెలంగాణ నుంచి నల్గొండ, మిర్యాలగూడ మీదుగా గుంటూరుకు ఎన్డీపీఎల్ చేరుతోంది. తమిళనాడు నుంచి ట్రాన్సిట్ పర్మిట్ల పేరిట చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు ఎన్డీపీఎల్ మద్యం సరఫరా అవుతోంది. పడకేసిన హెడోనిక్ పాత్ ఫైండ్ సిస్టం ఎక్సైజ్ శాఖలో ఆన్లైన్ విధానంలో అమ్మకాలు చేపట్టేలా సాంకేతిక పరిజ్ఞానం అమలుకు సర్కారు నాలుగేళ్లుగా ప్రైవేటు సేవలు వినియోగించుకుంటోంది. సీ–టెల్ అనే సంస్థకు ఐదేళ్ల పాటు కాంట్రాక్టు అప్పగించారు. హెడోనిక్ పాత్ ఫైండ్ సిస్టం కింద ట్రాక్ అండ్ ట్రేస్ విధానం ద్వారా మద్యం అమ్మకాలను షాపుల్లో పరిశీలించాలి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం రూ.59కోట్లు చెల్లించాలని సీ–టెల్ తన సాంకేతిక సేవలు నిలిపేసింది. మద్యం బాటిల్‌పై హాలోగ్రామ్‌ను స్కాన్‌చేస్తే ఎక్కడ్నుంచి సరఫరా అయ్యిందో అన్ని వివరాలు తెలుస్తాయి. కానీ, ఈ విధానాన్ని ఇటీవలి కాలంలో నిలిపేయడం, తరచూ ఆటంకాలు కల్పించడంతో ఎమ్మార్పీ ఉల్లంఘనలు మొదలు నకిలీ మద్యం అమ్మకాలతో మద్యం సిండికేట్లు చెలరేగిపోతున్నారు. ట్రాన్సిట్ పర్మిట్లు అంటే.. ఒక రాష్ట్రానికి అవసరమైన మద్యాన్ని వేరే రాష్ట్రం దిగుమతి చేసుకుంటుంది. ఉదాహరణకు.. తమిళనాడు నుంచి ఒరిస్సాకు మద్యం సరఫరా చేయాలంటే మన రాష్ట్రం మీదుగా ఆ లోడు వెళ్లాలి. ఇందుకు ఎక్సైజ్ కమిషనర్ నుంచి ట్రూ ట్రాన్సిట్ పర్మిట్లు పొందాలి. ఈ ట్రాన్సిట్ పర్మిట్లు పొందిన లారీలకు మన రాష్ట్రం సరిహద్దు వరకు ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ బందోబస్తు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, ఈ ట్రాన్సిట్ పర్మిట్లు పొందిన వేరే రాష్ట్రాల వ్యాపారుల నుంచి రాష్ట్రంలోని మద్యం మాఫియా రాష్ట్రంలోనే సరుకును దించుకుని షాపుల్లో అమ్మకాలు చేస్తున్నారు. ఎక్సైజ్‌లో సిబ్బంది కొరతతో ట్రాన్సిట్ పర్మిట్ల వాహనాలకు బందోబస్తును ఇవ్వడంలేదు. దీంతో మద్యం సిండికేట్లు ఆడింది ఆటగా మారింది. ఈ వాహనాలకు జియో ట్యాగింగ్ చేసి మద్యం మాఫియా దందాను అడ్డుకుంటామన్నా ఇంతవరకు అమలుచేయలేదు. -
ఇక ఎంఆర్పీతో పనిలేదు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : మంత్రిగారి జిల్లాలో ఎక్సైజ్ శాఖ అధికారులు రెచ్చిపోతున్నారు. తాము అడిగినంత ఇస్తే ఎంఆర్పీ ధరలకు అమ్మాల్సిన పనిలేదని పెంచి అమ్మకాలు చేసుకోవచ్చని అనధికారిక ఆదేశాలు జారీ చేశారు. మామూళ్లు ఇచ్చినందుకు నజరానాగా బుధవారం నుంచి చీప్‌లిక్కర్ క్వార్టర్ బాటిల్‌కు పది రూపాయలు, మిగిలిన బ్రాండ్లకు ఐదు రూపాయలు అదనంగా పెంచుకోవచ్చని అంగీకారం తెలిపారు. ఈ మేరకు ఈ పెంపుదల జిల్లా వ్యాప్తంగా అమలులోకి రానుంది. ఏలూరు, చింతలపూడి, జంగారెడ్డిగూడెంలో షాపుకు పది వేల రూపాయల చొప్పున ఆగస్టు నుంచి వసూలు చేస్తున్నారు. ఈ నెల నుంచి మొత్తాన్ని రూ. 15 వేలకు పెంచారు. జిల్లాలో 474 వైన్‌షాపులు, 17 బార్లు ఉన్నాయి. వీటి నుంచి ఇకపై ప్రతి నెలా ఈ మొత్తాన్ని వసూలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఏప్రిల్‌లో మద్యం షాపులు కేటాయించినప్పుడు రెన్యువల్ మామూలు పేరుతో గ్రామీణ ప్రాంతాల షాపుల నుంచి 50 వేల రూపాయలు వసూలు చేశారు. ఇప్పుడు పట్టణాలలో ఉన్న షాపుల వారు రెన్యువల్ మామూలు చెల్లించాలని ఎక్సైజ్ శాఖ నుంచి ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం. బార్ల నుంచి ఏకంగా లక్ష రూపాయల చొప్పున ఇండెంట్ వేసినట్లు తెలిసింది. బెల్ట్‌షాపులు ఉన్నా చూసీచూడనట్లు వ్యవహరించడానికి, ఎంఆర్పీ ధరలకు అమ్మకపోయినా పట్టించుకోకుండా ఉండటానికి ఈ మామూళ్లు నిర్ణయించారు. రెన్యువల్ పేరుతో వసూలు చేసే మొత్తం రెండున్నర కోట్ల రూపాయల వరకూ ఉండగా, ప్రతి నెలా మామూళ్ల పేరుతో రూ. 70 లక్షలకు పైగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాలలో వైన్‌షాపులు నడవాలంటే బెల్ట్‌షాపులు ఉండటం తప్పనిసరి. లేకపోతే వారికి గిట్టుబాటు కాదు. దీన్ని అడ్డం పెట్టుకుని ఎక్సైజ్ అధికారులు మామూళ్ల దందాకు శ్రీకారం చుట్టారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బెల్ట్‌షాపుల నియంత్రణ పేరుతో హడావుడి చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఎక్సైజ్ అధికారులు మొక్కుబడిగా కేసులు పెట్టారు. ప్రభుత్వ ఒత్తిడి కూడా ఆ శాఖ అధికారులకు కలిసి వచ్చింది. దీన్ని అడ్డం పెట్టుకుని షాపులపై ఇండెంట్లు పెంచేశారు. ఇకపై ప్రతిషాపు యజమాని రూ. 15 వేల రూపాయలు ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేసినట్లు సమాచారం. గతంలో ప్రతి షాపు నుంచి వసూలు చేసిన 10 వేల రూపాయలు సీఐ స్థాయి నుంచి డీసీ స్థాయి వరకే పంచుకుని, కింది సిబ్బందికి వాటా ఇవ్వకపోవడం ఆ శాఖలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో కిందిస్థాయి సిబ్బందికి కూడా ఇవ్వడం కోసం మరో ఐదు వేలు పెంచి రూ 15 వేలు చేసినట్లు సమాచారం. జిల్లాలో ఆ శాఖ ఉన్నతాధికారులు కూడా మూడేళ్ల నుంచి ఇక్కడే పనిచేస్తున్నారు. బదిలీ కావాల్సి ఉన్నప్పటికీ సామాజిక వర్గ బలంతో కొందరు ఎమ్మెల్యేల మద్దతుతో వారు ఇక్కడే కొనసాగుతున్నారు. ఒక ఉన్నతాధికారి విదేశీ యాత్రకు వెళ్తూ ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చి వెళ్లినట్లు సమాచారం. మంత్రిగారి సొంత జిల్లాలోనే ఈ దందా జరుగుతుంటే ఆయన ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే. -
వాటర్ ప్యాకెట్ల తరహాలో చీప్ లిక్కర్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో టెట్రా ప్యాక్‌లలో మద్యం అమ్మకాలు చేపట్టబోతోంది. వాటర్ ప్యాకెట్ల తరహాలో చీప్ లిక్కర్ ప్యాకెట్లు తయారుచేసి డిసెంబర్ నుంచి మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 180 ఎంఎల్, 90 ఎంఎల్ ప్యాక్‌ల తయారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పార్టీ ఫిరాయించిన నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి డిస్టిలరీస్‌లో ఈ టెట్రాప్యాకెట్లు ఉత్పత్తి కానున్నాయి. -
ఎక్సైజ్ దాడుల్లో 180 లీటర్ల నాటుసారా స్వాధీనం
పార్వతీపురం : పార్వతీపురం ఏజెన్సీ ప్రాంతంలో పార్వతీపురం ఎక్సైజ్ అధికారులు శనివారం జరిపిన దాడుల్లో తొమ్మిది రబ్బరు ట్యూబుల్లో 180 లీటర్ల నాటుసారాతో పాటు మూడు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని సీఐ ఎస్. విజయ్‌కుమార్ తెలిపారు. దీనికి సంబంధించి ఆయన అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. జియ్యమ్మవలస మండలంలోని రావాడ గ్రామ జంక్షన్ వద్ద కడ్రక మల్లేసు (కర్లగూడ), జీలకర్ర సందురు (చింతపాడు) కిల్లక వసంత్ (చింతలపాడు) నుంచి 180 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నామన్నారు. నాటుసారా గురించి పట్టుబడిన వారిని ప్రశ్నించగా నిమ్మక శిరయ్య, నిమ్మక సూరి, కిల్లక సంతోష్, బొమ్మాళి అనిల్, మీసాల చినబాబు, తదితరుల పాత్ర ఉన్నట్లు తెలిపారన్నారు. వీరిని కూడా తొందరలోనే పట్టుకొని అరెస్ట్ చేస్తామన్నారు. ఈ దాడుల్లో ఎస్సై జె. రాజశేఖర్ సిబ్బంది పాల్గొన్నారన్నారు. -
చిన్న పొట్లాల్లో చీప్ లిక్కర్
♦ 90 మిల్లీలీటర్ల టెట్రాప్యాక్‌లలో విక్రయాలకు సర్కారు కసరత్తు ♦ రూ.25 నుంచి రూ.30లోపే అందించాలని యోచన ♦ టెట్రా ప్యాక్‌ల తయారీకి ఇప్పటికే అనుమతి పొందిన మెక్‌డొవెల్ కంపెనీ సాక్షి, హైదరాబాద్: గుడుంబాకు ప్రత్యామ్నాయంగా చౌక మద్యాన్ని అందుబాటులోకి తెచ్చే యత్నం చేసి వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం... ఈసారి చిన్న పొట్లాల్లో చీప్‌లిక్కర్‌ను విక్రయించే ఆలోచనను తెరపైకి తెచ్చింది. సాధారణంగా సాఫ్ట్ డ్రింకులను విక్రయిస్తున్న మాదిరిగా టెట్రా ప్యాక్‌లలో 90 ఎంఎల్ (మిల్లీలీటర్ల) పరిమాణంలో చీప్‌లిక్కర్‌ను తక్కువ ధరకు అందించేందుకు కసరత్తు చేస్తోంది. గత సంవత్సరం ఎక్సైజ్ పాలసీలోనే 90 ఎంఎల్ చీప్‌లిక్కర్ ప్యాకెట్లను రూ.20 ధరకు అందించేలా ప్రణాళికలు సిద్ధమైనా.. వివిధ వర్గాల ప్రజలు, సామాజిక వేత్తల వ్యతిరేకతతో ప్రభుత్వం వెనకడుగు వే సింది. అతి ప్రచారం అప్పట్లో దెబ్బతీసిందని భావిస్తున్న సర్కారు ఈసారి చడీచప్పుడు కాకుండా టెట్రా ప్యాక్ మద్యాన్ని మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. తక్కువ ధరకు అందుబాటులోకి.. ప్రస్తుతమున్న చీప్‌లిక్కర్ 180 ఎంఎల్ ధర రూ.60 కాగా, 90 ఎంఎల్ ధర రూ.40. దీనిలో కొంచెం ఎక్కువ నాణ్యత ఉన్న చీప్ లిక్కర్ ధర 180 ఎంఎల్‌కు రూ.80గా ఉంది. అయితే గుడుంబాకు ప్రత్యామ్నాయంగా ఉండేలా... రూ.25 నుంచి రూ.30కే 90 ఎంఎల్ చీప్‌లిక్కర్ టెట్రాప్యాక్‌ను అందించే యోచనతో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. టెట్రాప్యాక్‌లపై వ్యాట్ తగ్గించడం ద్వారా రూ.25కే 90 ఎంఎల్ చీప్‌లిక్కర్‌ను అందించే అవకాశముంది. ప్రస్తుతం చీప్ లిక్కర్‌ను ప్లాస్టిక్ సీసాల్లో విక్రయిస్తున్నారు. ఈ ఖర్చు తగ్గించడంతో పాటు ఆకర్షణీయమైన ప్యాక్‌లో తక్కువ ధరకు చీప్ లిక్కర్ సరఫరా చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. టెట్రా ప్యాక్‌లలో మద్యం తయారీకి గతంలోనే మెక్‌డొవెల్స్ కంపెనీకి అనుమతిచ్చారు. ఈ కంపెనీకి చెందిన డిస్టిలరీలోని ఒక లైన్‌ను టెట్రాప్యాక్ల తయారీకి అనుగుణంగా రూపొందించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రయోగాత్మకంగా కొద్దిరోజులు టెట్రాప్యాక్‌ల్లో ఓ రకం మద్యాన్ని కూడా సరఫరా చేశారు. ప్రస్తుతం ఈ కంపెనీ ద్వారానే తొలుత ‘టెట్రాప్యాక్’ చీప్‌లిక్కర్‌ను అందించే అవకాశముంది. ప్రభుత్వం అనుమతిస్తే టెట్రాప్యాక్‌లలో చీప్‌లిక్కర్‌ను సరఫరా చేసేందుకు మరో ఐదు డిస్టిలరీలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఏపీ నుంచి అక్రమ రవాణా అడ్డుకునేందుకే ... తెలంగాణ కన్నా ఏపీలో తక్కువ ధరకు చీప్ లిక్కర్ లభిస్తోంది. అక్కడి ప్రభుత్వం చీప్‌లిక్కర్‌పై వ్యాట్‌ను గణనీయంగా తగ్గించడంతో తెలంగాణ కన్నా రూ.5 నుంచి రూ.10 తక్కువకు 180 ఎంఎల్ చీప్‌లిక్కర్ లభిస్తోంది. దీంతో నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల ద్వారా ఏపీ చీప్ లిక్కర్ తెలంగాణకు అక్రమంగా రవాణా అవుతోందని ఆబ్కారీ శాఖ భావిస్తోంది. టెట్రాప్యాక్‌లలో చీప్‌లిక్కర్‌ను తీసుకువస్తే అక్రమ రవాణాను నియంత్రించవచ్చని అభిప్రాయపడుతోంది. అక్టోబర్ నుంచే టెట్రాప్యాక్‌లలో చీప్‌లిక్కర్ సరఫరా చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. -
ఆదాయం కోసం ఓ ‘సారా’ ఐడియా
రూ. వెయ్యి కోట్ల ఆదాయం కోసం ఓ ‘సారా’ ఐడియా ♦ రాష్ట్రంలో చీప్ లిక్కర్ ప్రవాహానికి గేట్లు ఎత్తివేత.. ♦ టెట్రా ప్యాక్‌ల్లో సరఫరాకు నిర్ణయం ♦ సరిహద్దుల్లో అక్రమ మద్యం అరికట్టడానికేనంట.. ♦ 180 ఎం.ఎల్. ప్యాక్ రూ.45! ♦ టెట్రా అమ్మకాలను ప్రోత్సహించాలని ఎక్సైజ్ అధికారులకు టార్గెట్లు ♦ 20% చీప్ లిక్కర్ ఉత్పత్తి చేయాల్సిందేనంటూ డిస్టిలరీలకు ఆదేశాలు ♦ మద్య నిషేధం ఊసే మరిచిన ప్రభుత్వం.. ♦ అమలుకాని బెల్టుషాపుల రద్దు సంతకం సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వస్తే బెల్టుషాపుల్ని ఎత్తివేస్తామని, మద్యనిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీఇచ్చారు. మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చూడబోమన్నారు. అధికారంలోకి వచ్చాక చేస్తున్నది ఇందుకు పూర్తిగా భిన్నం. బెల్టుషాపుల్ని రద్దు చేస్తున్నట్టు సీఎంగా ప్రమాణస్వీకారం చేయగానే చంద్రబాబు సంతకం చేశారు. కానీ రాష్ట్రంలో ఎక్కడా బెల్టుషాపులు రద్దయిన దాఖలాల్లేవు. రాష్ట్రవ్యాప్తంగా 40 వేలకుపైగా బెల్టుషాపులు అనధికారికంగానే నడుస్తూనే ఉన్నాయి. మరో వైపు మద్యం ద్వారా భారీఎత్తున ఆదాయం పెంచుకోవడంపై దృష్టిపెట్టారు. అమ్మకాల్ని భారీఎత్తున పెంచారు. రాష్ట్రం విడిపోయే నాటికి 13 జిల్లాల్లో మద్యం అమ్మకాల ద్వారా రూ.10,250 కోట్ల ఆదాయం లభించగా.. ప్రస్తుతం రూ.12,647 కోట్లకు చేరింది. ఇప్పుడిదీ చాలదన్నట్టుగా రాష్ట్రంలోని ప్రతి పల్లెలోనూ చీప్ లిక్కర్‌ను పరవళ్లు తొక్కించేందుకు, తద్వారా అదనపు ఆదాయం రూపేణా రూ.వెయ్యికోట్లను జనం నుం చి లాగేందుకు ప్రభుత్వం ఐడి యా వేసింది. ఇందులో భాగంగా అందమైన టెట్రా ప్యాకెట్లలో చీప్ లిక్కర్‌ను అందించేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం చర్యలు చేపట్టాలంటూ ఎక్సైజ్ శాఖకు తాజాగా ఆదేశాలు సైతం జారీ చేసింది. ఎన్డీపీపై సాకులు..: ఖజానాకు అదనంగా రూ.వెయ్యికోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని రాష్ట్రప్రభుత్వం భావించింది. దీనికి చీప్ లిక్కర్ మార్గంగా కనిపించింది. అంతే.. అందమైన టెట్రా ప్యాక్‌లలో చీప్ లిక్కర్‌ను సరఫరా చేయాలని ఆదేశాలిచ్చింది. కానీ ఎక్కడ విమర్శలు వస్తాయోననే భావనతో.. రాష్ట్ర సరిహద్దుల్లో ఇతర రాష్ట్రాలనుంచి దిగుమతి చేసుకున్న ఎన్డీపీ(నాన్ డ్యూటీ పెయిడ్) మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయని, వీటిని అరికట్టేందుకుగాను చీప్ లిక్కర్ పొట్లాలను తీసుకొస్తున్నట్టు చెబుతోంది. తాజా నిర్ణయం ప్రకారం.. 180 ఎం.ఎల్., 90 ఎం.ఎల్. పరిమాణం గల టెట్రా ప్యాకెట్లల్లో చీప్‌లిక్కర్‌ను విక్రయించనున్నారు. 180 ఎం.ఎల్. టెట్రా ప్యాక్‌ను రూ.45కి, 90 ఎం.ఎల్. ప్యాక్‌ను రూ.22కు విక్రయించనున్నట్లు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం ప్రతి డిస్టిలరీ 20 శాతం, అంతకంటే ఎక్కువగానే చీప్ లిక్కర్‌ను ఉత్పత్తి చేయాల్సిందేనని ప్రభుత్వం ఉన్నతస్థాయి ఆదేశాలు జారీ చేసినట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. 20 శాతం ఉత్పత్తి చేయాల్సిందే.. రాష్ట్రంలో మొత్తం 14 లెసైన్సుడ్ డిస్టిలరీలున్నాయి. వీటి ఉత్పాదక సామర్ధ్యం 1,221.58 లక్షల ఫ్రూఫ్ లీటర్లు. మొత్తం ఉత్పత్తి చేసే మద్యంలో 20 శాతం చీప్ లిక్కర్‌ను అవి ఉత్పత్తి చేయాలి. లెసైన్సు మంజూరు చేసేటప్పుడు ఈ మేరకు డిస్టిలరీలు ఒప్పందం కుదుర్చుకుంటాయి. ప్రస్తుతం డిస్టిలరీలు చీప్ లిక్కర్‌ను తగినంత ఉత్పత్తి చేయట్లేదని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. దీన్ని చిన్న చిన్న బాటిల్స్‌లో నింపి పంపడం ఖర్చుతో కూడినదిగా డిస్టిలరీలు భావించడంతో నిబంధనల ప్రకారం అవి నడుచుకోవట్లేదు. చీప్ లిక్కర్ ఉత్పత్తిపై దృష్టి పెట్టట్లేదు. ఎక్సైజ్ అధికారులూ చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. అదేసమయంలో గోవా, తమిళనాడు, కర్ణాటకల నుంచి భారీగా రాష్ట్రానికి చౌక మద్యాన్ని దిగుమతి చేసుకుని డిస్టిలరీలు మద్యం దుకాణాలకు సరఫరా చేస్తున్నట్టు సమాచారం. ఈ బాటిల్‌ను రూ.10కి కొనుగోలు చేసి మద్యం దుకాణాలకు రూ.35 నుంచి రూ.45 వరకు విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల రాష్ట్ర ఖజానాకు గండి పడుతోందని, అనుకున్నమేరకు ఆదాయం ఉండట్లేదని భావించిన ప్రభుత్వం రాష్ట్రంలోనే చీప్ లిక్కర్ ఉత్పత్తిపై దృష్టి పెట్టింది. దాన్ని అందమైన ప్యాక్‌లలో పెట్టి విక్రయించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చని భావించింది. దీంతో నిబంధనల మేరకు 20 శాతం చీప్ లిక్కర్‌ను ఉత్పత్తి చేయాల్సిందేనంటూ డిస్టిలరీలకు స్పష్టం చేసింది. సాధ్యమైనంత త్వరగా లిక్కర్ పొట్లాల రూపంలో వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఎక్సైజ్ అధికారులకూ అమ్మకాలకు సంబంధించి టార్గెట్లు విధించాలని యోచిస్తోంది. డిస్టిలరీలు సరఫరా చేసే చీప్ లిక్కర్లో అధికంగా ఆల్కహాల్ మద్యం డిస్టిలరీలు ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న చీప్ లిక్కర్లో మద్యం ఫ్రూఫ్ స్ట్రెంత్ 25.5 శాతం లోపుండాలి. అయితే 26.4 శాతంగా నమోదవుతోంది. డిస్టిలరీల్లో ఉత్పత్తి చేసిన మద్యం ప్రభుత్వ ల్యాబ్‌ల్లో పరీక్షలు చేసిన అనంతరం మద్యం షాపులకు సరఫరా చేయాలి. కానీ డిస్టిలరీల్లో ఉత్పత్తి చేసిన మద్యం ప్రభుత్వ ల్యాబ్‌లకు పరీక్షలకు పంపకుండా నేరుగా మద్యం దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. డిస్టిలరీల నుంచి మద్యం దుకాణాలకు సరఫరా అయిన సరుకును ల్యాబ్‌ల్లో పరీక్షలు జరిపితే అధికశాతం ఆమ్లగుణంతో పాటు ఆల్కహాల్ అధికంగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ వేసవిలో అందుబాటులోకి తెచ్చే చీప్ లిక్కర్‌ను మందుబాబులు తాగి ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మద్యనిషేధంపై చర్యలేవీ? రాష్ట్రంలో మద్యనిషేధంపై దశలవారీగా చర్యలు చేపడతామని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పేర్కొంది. ఇందులో భాగంగా జిల్లాకో డీ అడిక్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పింది. అయితే రెండేళ్లవుతున్నా.. ఏ జిల్లాలోనూ డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం కానీ.. మద్యపాన నియంత్రణ కమిటీనిగానీ ఏర్పాటు చేయలేదు. మద్యనిషేధంపై టీడీపీ ప్రభుత్వానికున్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నకిలీ మద్యంతాగిన ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయినా ప్రభుత్వానికి పట్టలేదు. విజయవాడలో నకిలీ మద్యం ఘటన వెలుగుచూడడం తెలిసిందే. ఒకవైపు బిహార్ వంటి రాష్ట్రాలు మద్య నిషేధం విధిస్తుంటే.. రాష్ట్రంలో మాత్రం పల్లెల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తుండడం గమనార్హం. ఏపీలో మద్య నిషేధం అమలు చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని సాక్షాత్తూ మంత్రి కొల్లు రవీంద్ర ఇటీవలే విజయవాడలో మీడియాతో వ్యాఖ్యానించడం పరిశీలనాంశం. -
మద్యపాన నిషేధం విధించాలి
రాష్ర్టంలో మద్యపానం నిషేధం విధించాలి. ఒకవైపు బలహీనవర్గాల కోసం పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామంటూనే చీప్ లిక్కర్‌తో బడుగుల జీవితాలను కొల్లగొట్టి, వారి ఆరోగ్యాలను గుల్ల చేస్తున్నారు. ఇతర రూపాల్లో ఆదాయం కోసం ప్రయత్నించాలి. యాదగిరిగుట్ట, వేములవాడ గుళ్లకు బడ్జెట్ కేటాయించి, చదువుల తల్లి సరస్వతి దేవాలయం బాసర పట్ల చిన్నచూపు సరికాదు. సొంత వనరులు లేకుండా అభివృద్ధి ఎలా సాధ్యం..? - ఆకుల లలిత, కాంగ్రెస్ ఎమ్మెల్సీ -
కొత్త డిస్టిలరీలు వచ్చేస్తున్నాయ్!
♦ రాష్ట్రంలో చీప్ లిక్కర్‌కు పెరిగిన డిమాండ్ ♦ డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేయలేకపోతున్న ప్రస్తుత కంపెనీలు ♦ కొత్తగా దరఖాస్తు చేసుకున్న రెండు కంపెనీలు ♦ అందులో ఎంఎస్ డిస్టిలరీస్‌కు ఇప్పటికే అనుమతి మంజూరు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెరిగిన మద్యం డిమాండ్‌కు అనుగుణంగా కొత్త డిస్టిలరీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేస్తోంది. పల్లెలు, కార్మిక వాడల నుంచి గుడుంబాను తరిమికొట్టడంలో మెరుగైన ఫలితాలు సాధించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పేద వర్గాలు తాగే ఆర్డినరీ మద్యం (చీప్ లిక్కర్)కు డిమాండ్ పెరిగింది. అదే సమయంలో రాష్ట్రంలో ఇప్పుడున్న కొన్ని డిస్టిలరీలు డిమాండ్‌కు అనుగుణంగా మద్యం(చీప్ లిక్కర్) ఉత్పత్తి చేయడం లేదు. దీంతో అనేక జిల్లాల్లో గుడుంబాకు ప్రత్యామ్నాయంగా మారిన చీప్ లిక్కర్‌కు కొరత ఏర్పడుతోంది. అక్టోబర్, నవంబర్ నెలల్లో నాలుగైదు జిల్లాలకు డిమాండ్‌కు సరిపడా చీప్ లిక్కర్‌ను అందించడంలో ఆబ్కారీ శాఖ విఫలమైంది. ఈ పరిస్థితిని ముందే ఊహించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త డిస్టిలరీలకు నోటిఫికేషన్ జారీ చేయగా, భారీ ఉత్పత్తి సామర్థ్యంతో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు రెండు కంపెనీలు ముందుకొచ్చాయి. అలాగే ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు మరో రెండు కంపెనీలు దరఖాస్తు చేసుకొన్నాయి. వీటిలో సంవత్సరానికి 150 లక్షల ప్రూఫ్ లీటర్ల మద్యాన్ని అందించే లక్ష్యంతో మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఏర్పాటు చేయతలబెట్టిన ఎంఎస్ డిస్టిలరీస్‌కు ప్రభుత్వం ఈనెల మొదటి వారంలోనే అనుమతి మంజూరు చేసింది. అధునాతన యంత్రాలతో ఈ డిస్టిలరీ త్వరలోనే మద్యాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. అదనపు మద్యం ఉత్పత్తికి ముందుకొచ్చిన ఆర్.కె. డిస్టిలరీస్ (200లక్షల పీఎల్), రైజోమ్ డిస్టిలరీస్ (46 లక్షల పీఎల్)లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక 649 లక్షల ప్రూఫ్ లీటర్ల భారీ సామర్థ్యంతో సంగారెడ్డిలోనే అల్లయిడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్ (ఏబీడీ) సంస్థ ఏర్పాటు చేయతలపెట్టిన పరిశ్రమ దరఖాస్తు ప్రభుత్వ పరిశీలనలో ఉంది. చీప్ లిక్కర్‌ను ఉత్పత్తిచేసే అతిపెద్ద డిస్టిలరీల్లో ఒకటైన ఏబీడీ దేశంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే ‘ఆఫీసర్స్ ఛాయిస్’ బ్రాండ్ మద్యాన్ని ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 5 సొంత ఉత్పత్తి యూనిట్లు ఉన్న ఈ కంపెనీ రాష్ట్రంలో ఉత్పత్తి ప్రారంభిస్తే ఇతర మద్యం కంపెనీలకు దెబ్బ అనే అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో ఉన్నట్లు సమాచారం. ఏబీడీ కంపెనీ చీప్ లిక్కర్లో అనేక బ్రాండ్లను ఉత్పత్తి చేస్తోంది. ప్రస్తుతం ఏబీడీ సంస్థ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ కంపెనీకి కూడా అనుమతి మంజూరు అయ్యే అవకాశం ఉందని ఉన్నతస్థాయి అధికార వర్గాలు తెలిపాయి. 15 డిస్టిలరీలలో మద్యం ఉత్పత్తి .. రాష్ట్రంలో 17 డిస్టిలరీలు రిజిస్టర్ కాగా, అందులో 15 మాత్రమే మద్యం ఉత్పత్తి చేస్తున్నాయి. ఏటా 17.55 కోట్ల ప్రూఫ్ లీటర్ల సామర్థ్యంతో ఉన్న ఈ కంపెనీల్లో 550 లక్షల ప్రూఫ్ లీటర్ల సామర్థ్యం గల మల్కాజిగిరికి చెందిన ఓ కంపెనీ చీప్‌లిక్కర్ ఉత్పత్తిని తగ్గించింది. ఇలాగే మరో రెండు కంపెనీలు కూడా ‘చీప్’ తయారీని తగ్గించాయి. రాష్ట్రంలోని 15 డిస్టిలరీల్లో ఐదు కంపెనీల్లోనే చీప్ లిక్కర్ ఉత్పత్తి జరుగుతుండగా, వాటిలో కూడా ఉత్పత్తి తగ్గడంతో ఆ ప్రభావం జిల్లాలపై పడింది. గతంలో ప్రతి నెలా లక్షన్నర ప్రూఫ్ లీటర్ల చీప్ లిక్కర్ రాష్ట్రంలోని మందుబాబుల అవసరాలను తీర్చేది. కాగా, గుడుంబాపై పోరు, గుడుంబా రహిత జిల్లాల ప్రకటనల నేపథ్యంలో అక్టోబర్ నుంచి నెలకు 3 లక్షల ప్రూఫ్ లీటర్లకు పైగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలోనే కొత్త డిస్టిలరీలకు అనుమతి ఇవ్వడంతో పాటు ఇప్పుడున్న కంపెనీలు అదనపు ఉత్పత్తి చేసే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. మైక్రో బ్రూవరీలకు 50 దరఖాస్తులు గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు వరంగల్‌లో కూడా మైక్రో బ్రూవరీలు ఏర్పాటు చేసేందుకు మద్యం వ్యాపారులు అమితాసక్తి కనబరిచారు. డ్రాట్ బీరును ఉత్పత్తి చేసి, అక్కడే వినియోగదారులకు అందించే వీలు గల ఈ మైక్రో బ్రూవరీల కోసం నోటిఫికేషన్ జారీ చేయగా, 50 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 49 దరఖాస్తులు జీహెచ్ఎంసీ నుంచే రాగా, ఒక దరఖాస్తు మాత్రం వరంగల్ నుంచి వచ్చింది. వీటి పరిశీలన ఇంకా పూర్తి కావలసి ఉంది. -
కడపలో ఎక్సైజ్ దాడులు
-
కడపలో ఎక్సైజ్ దాడులు
కడప: వైఎస్సార్ జిల్లా కడప నగరంలో ఎక్సైజ్ అధికారులు మంగళవారం తనిఖీలు చేపట్టారు. ఎక్సైజ్ ఇన్చార్జి డిప్యూటీ కమిషనర్ విజయకుమారి ఆధ్వర్యంలో నగరంలోని బార్లలో సోదాలు జరుపుతున్నారు. విజయవాడలో కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతి చెందిన నేపధ్యంలో అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. బార్లలో మద్యం నిల్వలను , వాటి నాణ్యతను పరిశీలిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 40 బార్లు ఉండగా, కడప నగరంలో 5 బార్లు ఉన్నాయి. -
కల్తీ మద్యం కేసులో కృష్ణలంక ఎక్సైజ్ సీఐ సస్పెన్షన్
-
కల్తీ మద్యమే ఉసురు తీసింది!
♦ కల్తీకి పాల్పడుతున్న మద్యం మాఫియా ♦ పొరుగు రాష్ట్రాల నుంచి జోరుగా ఎన్డీపీ మద్యం ♦ ఎక్సైజ్ చెక్‌పోస్టుల్లో కేసులు నమోదు నామమాత్రమే ♦ ఎన్‘ఫార్సు’మెంట్‌గా తనిఖీలు సాక్షి, హైదరాబాద్: మద్యం వ్యాపారుల స్వార్థం అమాయకుల ఉసురు తీస్తోంది. మద్యం మాఫియా కల్తీకి పాల్పడుతున్నా.. కల్తీ మద్యం అమ్మకాలు చేపడుతున్నా ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంటు విభాగం చేష్టలుడిగి చూస్తోంది. బెల్టు షాపులు పుట్టగొడుగులు మాదిరి పుట్టుకొస్తున్నా.. ఈ షాపుల్లో సుంకం చెల్లించని మద్యం అమ్మకాలు చేపడుతున్నా సర్కారు పట్టించుకోవడం లేదు. ఫలితంగా మొన్న అనంతపురంలో కల్తీ మద్యం తాగి ఇరువురు మరణించగా, సోమవారం విజయవాడలో ఐదుగురు దినసరి కూలీలు మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో తెల్లవారు జామునే మద్యం అమ్మకాలు చేస్తున్నారనేందుకు విజయవాడలో ఉదయం 10.30 గంటలకే మద్యం తాగి మరణించిన సంఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. కల్తీ మద్యంతో పాటు సమయపాలన లేని అమ్మకాలు అరికట్టాల్సిన ఎక్సైజ్ ఎన్ఫోర్సుమెంటు విభాగం మామూళ్ల మత్తులో జోగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి సుంకం చెల్లించని మద్యం (నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్) భారీగా దిగుమతి అవుతున్నా స్టేట్ టాస్క్ఫోర్సు విభాగం (ఎస్టీఎఫ్) చేష్టలుడిగి చూస్తోందని తెలుస్తోంది. కల్తీ మద్యం సరిహద్దులు దాటి వస్తున్నా ఎక్సైజ్ చెక్‌పోస్టుల్లో పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోంది. అక్రమ మద్యం ఎలా చేరుతుందంటే... కర్ణాటక, తమిళనాడు, యానాంల నుంచి సరఫరా అవుతున్న ఎన్డీపీ మద్యం విక్రయాలు రాష్ట్రంలో జోరుగా సాగుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా తరలిరాకుండా ఉండేందుకు ఎకై ్సజ్ శాఖ మొత్తం 39 చెక్‌పోస్టుల్ని ఏర్పాటు చేసింది. వీటిలో రాష్ట్ర విభజన తర్వాత ఒక్క తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో కొత్తగా 14 చెక్‌పోస్టుల్ని ఏర్పాటు చేసింది. అయినా వీటి నిర్వహణ మాత్రం మొక్కుబడిగానే సాగుతోంది. రాష్ట్రంలోకి అక్రమ మద్యం ప్రవేశిస్తుందని ఎకై ్సజ్ శాఖకు పూర్తి సమాచారమున్నా, కేసులు నమోదు, వాహనాల సీజ్ మాత్రం అంతంత మాత్రంగానే నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు అక్రమ మద్యంపై నమోదైన కేసులు, ఎన్ని వాహనాలు సీజ్ చేశారనే సమాచారం ఎక్సైజ్ శాఖ వద్ద లేకపోవడమే ఇందుకు నిదర్శనం. యానాం నుంచి ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు, తమిళనాడు నుంచి చిత్తూరు, నెల్లూరు, కర్ణాటక నుంచి కర్నూలు, అనంతపురం జిల్లాలకు అక్రమ మద్యాన్ని సిండికేట్లు దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చీప్ లిక్కర్ కొరత ఉండటంతో దీన్ని అవకాశంగా తీసుకుని దిగుమతి చేసుకున్న చీప్ లిక్కర్లో కల్తీకి పాల్పడుతున్నారు. చెక్‌పోస్టుల్లో తనిఖీలేవీ? మద్యం డిమాండ్‌ను బట్టి ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మద్యం సరఫరా అవుతుంది. ఈ మద్యం సరఫరా చేసుకునేందుకు ట్రూ ట్రాన్స్‌పోర్టు పర్మిట్లు కేటాయిస్తారు. వీటిని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల్లో తనిఖీలు చేస్తారు. ఏపీలో ఐదు అంతరాష్ట్ర చెక్‌పోస్టులున్నాయి. వీటిని ట్రాన్స్‌పోర్టు, కమర్షియల్ ట్యాక్స్ తదితర శాఖలతో కలిసి ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులుగా నిర్వహిస్తున్నారు. ఈ ట్రూ ట్రాన్స్‌పోర్టు పర్మిట్లను అడ్డుపెట్టుకుని మద్యం మాఫియా ఎన్డీపీ మద్యం దిగుమతి చేసుకుంటోంది. ఇవన్నీ తెలిసినా ఎక్సైజ్ అధికారులు నెలవారీ మామూళ్లతో చెక్‌పోస్టుల్లో తనిఖీలు చేపట్టడం లేదని విమర్శలున్నాయి. -
ఏపీలో చీప్ లిక్కర్ కొరత
నాటుసారా, కల్తీ మద్యం, లూజు విక్రయాలను నియంత్రించేందుకు చవక ధరలకు (చీప్ లిక్కర్) మద్యాన్ని టెట్రా ప్యాక్‌ల్లో అందిస్తామని ప్రభుత్వం చేసిన విధాన ప్రకటన అమలుకు నోచుకోవడం లేదు. అల్పాదాయ వర్గాలు ఎక్కువగా తాగే చీప్ లిక్కర్‌ను అందుబాటులో ఉంచాల్సిన ప్రభుత్వం అది చేయకపోవడంతో నాటుసారా, కల్తీ కల్లు, గుడుంబా లాంటివి తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కల్తీ మద్యం సేవించి కృష్ణా జిల్లాలో సోమవారం ఏడుగుగురు మృతి చెందగా, మరో 35 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు అనేకం జరిగినా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో చీప్ లిక్కర్‌కు గేట్లు బార్లా తెరిచినా డిస్టిలరీలు మాత్రం ఉత్పత్తికి ముందుకు రాలేదు. చౌక మద్యంపై ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ తగ్గించినా తయారీకి ఉత్పత్తి కంపెనీలు ససేమిరా అంటున్నాయి. దీంతో రాష్ట్రంలో చీప్ లిక్కర్ కొరత ఏర్పడింది. మార్కెట్లో చౌకమద్యం దొరక్క నాటుసారా, కల్తీ కల్లు విక్రయాలు బాగా పెరిగాయి. గతంలో అన్ని జిల్లాల్లో కలుపుకొని రోజుకు 30 వేల లీటర్ల నాటుసారా అమ్ముడయ్యేది. ఇప్పుడు ఏపీలో సారా విక్రయాలు రోజుకు 50 వేల లీటర్ల వరకు జరుగుతున్నట్లు అంచనా. 20 శాతం చీప్ లిక్కర్ తయారు చేయాల్సిందే.. ఏపీలో మొత్తం 14 లైసెన్స్డ్ డిస్టిలరీలున్నాయి. వీటి ఉత్పాదక సామర్ధ్యం 1,221.58 లక్షల ప్రూఫ్ లీటర్లు. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు తమ డిస్టిలరీల్లో 20 శాతం చీప్ లిక్కర్ బ్రాండ్లను ఉత్పత్తి చేస్తామని కంపెనీల నిర్వాహకులు అంగీకార పత్రం ఇస్తారు. అయితే డిస్టిలరీలు కేవలం ప్రముఖ బ్రాండ్లను తయారు చేస్తూ చౌక మద్యాన్ని తయారు చేయకపోవడం వల్ల కొరత ఏర్పడింది. హాలోగ్రామ్ అసలు సమస్యా... లూజు విక్రయాలను నిరోధించేందుకు 60 మిల్లీ లీటర్ల చీప్ లిక్కర్ బాటిల్స్ అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావించింది. 60 మిల్లీ లీటర్ల బాటిల్ రూ.20కే అందించాలని నిర్ణయించింది. అయితే నిబ్ బాటిళ్ల తయారీకి హాలోగ్రామ్‌తో కూడిన లేబుల్ వేసేందుకు అదనంగా ఖర్చు కావడంతో వీటిని తయారు చేయలేమని, లీటరు బాటిల్ తయారు చేస్తామని తెగేసి చెబుతున్నాయి. డిస్టిలరీ కంపెనీలపై ఒత్తిడి తీసుకువచ్చి చీప్ లిక్కర్‌ను ఉత్పత్తి చేయించడంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. టెట్రా ప్యాక్‌లో చీప్ లిక్కర్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించినా టెట్రా ప్యాక్ తయారీకి చైనా నుంచి మిషన్లు కొనుగోలు చేయాల్సి ఉన్నందున ఉత్పత్తి కంపెనీలు వాటి జోలికెళ్లడం లేదు. రాష్ట్రంలో ప్రస్తుతం రెండు డిస్టిలరీ కంపెనీలు మాత్రమే చౌకమద్యం ఉత్పత్తి చేయడం గమనార్హం. -
వామ్మో ఏపీ చీప్‌లిక్కరా?
♦ చీప్‌లిక్కర్ ధరను 25 శాతం తగ్గించిన అక్కడి సర్కార్ ♦ 180 ఎంఎల్ సీసా ధర తెలంగాణలో రూ. 60, ఏపీలో రూ.45 ♦ 15 రోజుల్లో అక్కడి డిస్టిలరీల నుంచి మార్కెట్లోకి... సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో చీప్‌లిక్కర్‌కు ఉన్న డిమాండ్‌ను ఏపీ సీఎం చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారా? ఏపీలో డిమాండ్ లేని చీప్‌లిక్కర్ ధరను తగ్గించి, ఉత్పత్తి పెంచి తెలంగాణకు అక్రమ మార్గాల ద్వారా పంపేందుకు గేట్లు తెరిచారా? అవుననే అంటున్నారు రాష్ర్ట ఆబ్కారీ శాఖ అధికారులు. తెలంగాణలో గుడుంబా నియంత్రణకు తీసుకుంటున్న చర్యల వల్ల చీప్‌లిక్కర్ డిమాండ్ బాగా పెరిగింది. రాష్ట్రంలోని ఐదు డిస్టిలరీలు నెలకు మూడున్నర లక్షల పెట్టెల (ఒక పెట్టెకు 180 ఎంఎల్ సీసాలు 48) చీప్‌లిక్కర్‌ను ఉత్పత్తి చేస్తున్నా గత నెలలో నాలుగు జిల్లాల్లో తీవ్ర కొరత ఏర్పడింది. గుడుంబాపై యుద్ధం ఇలాగే కొనసాగితే తెలంగాణలో నెలకు 5 లక్షల పెట్టెలు అవసరమని ఆబ్కారీ శాఖ నిర్ధారించింది. ఈ పరిణామాలను ఏపీ సర్కార్ అనుకూలంగా మలుచుకుంటోంది. అక్టోబర్ 21న ఇచ్చిన ఉత్తర్వుల్లో ఏపీలో చీప్‌లిక్కర్‌పై వ్యాట్‌ను 50 శాతం (190 నుంచి 140 శాతానికి) మేర తగ్గించింది. ఈ ఉత్తర్వులు మరో 15 రోజుల్లో కార్యరూపం దాల్చనున్నాయి. తద్వారా ఏపీలో చీప్‌లిక్కర్ ధరలు ఏకంగా 25 శాతం తగ్గనున్నాయి. ఇప్పటివరకు ఏపీ, తెలంగాణల్లో 180 ఎంఎల్ చీప్‌లిక్కర్ ధర రూ.60 ఉండగా, ఇకపై ఏపీలో రూ. 45కే లభించనుంది. అలాగే 90 ఎంఎల్, 60 ఎంఎల్ పరిమాణంలో పెట్‌బాటిల్స్‌లో ఉత్పత్తికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తద్వారా 90 ఎంఎల్ సీసా రూ. 25కు, 60 ఎంఎల్ సీసా రూ.15కే మందుబాబులకు లభించనుంది. పొంచివున్న అక్రమ ర వాణా ముప్పు ఏపీలోని 13 జిల్లాల్లో చీప్‌లిక్కర్ వినియోగం అతి తక్కువ. మొత్తం విక్రయాల్లో 15-20 శాతమే ఉంటుంది. అక్కడ మీడియం, ప్రీమియం లిక్కర్లకే అధిక డిమాండ్ ఉండగా, చీప్‌లిక్కర్‌ను 30 శాతం మేర ఉత్పత్తి చేయాలని ఆదేశాలు జారీ చేయడంపై టీ సర్కార్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఏపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్కడున్న 8 డిస్టిలరీల్లో చీప్‌లిక్కర్ ఉత్పత్తికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడ రెండు డిస్టిలరీల నుంచే చౌకమద్యం తయారవుతుండగా, వాటి సామర్థ్యం పెంచడంతో పాటు మిగతా డిస్టిలరీల్లోనూ చీప్‌లిక్కర్ ఉత్పత్తికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. తెలంగాణలో ఉన్న డిమాండ్‌ను ఆసరాగా తీసుకొని ఏపీ చీప్‌లిక్కర్‌ను తరలించే కుట్ర జరుగుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సరిహద్దు జిల్లాలైన ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ ద్వారా రాష్ట్రంలోకి అక్రమ రవాణా చేస్తారని భావిస్తున్నారు. దీంతో ఈ మూడు జిల్లాల్లో నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని ఇటీవల ప్రభుత్వం ఆబ్కారీ శాఖను ఆదేశించింది. రెండ్రోజుల క్రితం కమిషనర్ చంద్రవదన్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో సమావేశమై కార్యాచరణ రూపొందించారు. అనుభవమున్న సిబ్బందిని ఆ మూడు జిల్లాలకు పంపి అక్రమంగా వచ్చే చీప్‌లిక్కర్‌ను అడ్డుకోవాలని నిర్ణయించారు. తెలంగాణలో చీప్‌లిక్కర్ ఉత్పత్తి అవుతున్న 5 డిస్టిలరీల్లో సామర్థ్యం పెంచాలని నిర్ణయించారు. -
నిండుకుంటున్న చీప్ లిక్కర్!
♦ గుడుంబాపై దాడులతో పెరిగిన చీప్ లిక్కర్ అమ్మకాలు ♦ ఐదు డిస్టిలరీల నుంచి నెలకు 3 లక్షల పెట్టెలు తయారీ ♦ ఈ నెలలో ఇప్పటికే 1.82 లక్షల పెట్టెల వినియోగం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నుంచి గుడుంబా మహమ్మారిని తరిమికొట్టాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయ ప్రభావం చీప్‌లిక్కర్‌పై పడింది. రాష్ట్రవ్యాప్తంగా గుడుంబా విక్రయాలు తగ్గడంతో చీప్‌లిక్కర్ విక్రయాలు భారీగా పెరిగి చివరికి ‘చీప్’కు కొరత వచ్చే పరిస్థితి. ప్రస్తుతం డిస్టిలరీల్లో ఉన్న చీప్ లిక్కర్.. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా చేసేందుకు సరిపోదని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. దసరా పండుగకు నిల్వ ఉన్న చీప్‌లిక్కర్‌తో ఎలాగోలా కానిచ్చినా... ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే నెల నుంచి డిమాండ్, సరఫరాల్లో తేడా రావచ్చని టీఎస్‌బీసీఎల్ అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో చీప్‌లిక్కర్ ఉత్పత్తిని పెంచేలా డిస్టిలరీలపై ఒత్తిడి తేవాలని భావించారు. ఉత్పత్తి సామర్థ్యం సరిపోకపోతే ఇతర రాష్ట్రాల నుంచి చీప్‌లిక్కర్‌ను దిగుమతి చేసుకునే ఆలోచనతో ఎక్సైజ్ శాఖ ఉంది. గుడుంబాకు ఆ నాలుగు జిల్లాలే కీలకం రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో గుడుంబా తయారీ, విక్రయాలు కుటీర పరిశ్రమను మించిపోయాయి. మహబూబ్‌నగర్, నల్లగొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని గ్రామాల్లో కోట్ల రూపాయల టర్నోవర్‌తో నెలనెలా లక్షలాది లీటర్ల గుడుంబా వినియోగం జరిగేది. దీంతో ఈ జిల్లాల్లో చీప్‌లిక్కర్‌కు డిమాండ్ తక్కువగా ఉండేది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ సెప్టెంబర్ 1 నుంచి గుడుంబాపై ఉక్కుపాదం మోపారు. దీంతో గుడుంబా తయారీ, విక్రయాలు తగ్గి ఈ నాలుగు జిల్లాల్లో చీప్ లిక్కర్ విక్రయాలు భారీగా పెరిగాయి. ఇక అక్టోబర్‌లో 15వ తేదీ వరకే చీప్‌లిక్కర్ నెలవారీ అమ్మకాలను మించిపోయాయి. ఈనెల 18 వరకు రాష్ట్రంలో 1.82 లక్షల పెట్టెలు (ఒక పెట్టెలో 180 ఎంఎల్ బాటిళ్లు 48 ఉంటాయి) చీప్‌లిక్కర్ అమ్ముడైనట్లు టీఎస్‌బీసీఎల్ రికార్డులు చెబుతున్నాయి. గత సంవత్సరం ఇదే సమయంలో కేవలం 68 వేల పెట్టెలు మాత్రమే విక్రయించడం గమనార్హం. ఈనెలాఖరుకల్లా చీప్‌లిక్కర్ అమ్మకాలు 4 లక్షల పెట్టెలకు చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. 3 లక్షల పెట్టెల వరకే ఉత్పత్తి రాష్ట్రంలో దేశీయ మద్యం తయారీ (ఐఎంఎల్) డిస్టిలరీలు 17 ఉండగా, వీటిలో బగ్గా, ఆర్కే, రిసోమ్, లిక్కర్ ఇండియా డిస్టిలరీస్, కమల్ వైనరీలల్లో మాత్రమే చీప్‌లిక్కర్ ఉత్పత్తి అవుతుంది. ఈ ఐదు డిస్టిలరీల్లో చీప్ లిక్కర్ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 3 లక్షల పెట్టెలు అంటే సుమారు 26 లక్షల లీటర్లు మాత్రమే. గుడుంబాను హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామాలు, తాండాలు తదితర ప్రాంతాల్లోని 10 వేల పాయింట్లలో విక్రయిస్తుండగా, దాడులతో ఈ సంఖ్య 3 వేలకు తగ్గిందని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగం చెబుతోంది. ఈ నేపథ్యంలోనే చీప్‌లిక్కర్ విక్రయాలు అనూహ్యంగా పెరిగాయి. గుడుంబా విక్రయాలు పూర్తిగా నిలిచిపోతే మీడియం, ప్రీమియం లిక్కర్ తయారు చేసే డిస్టిలరీలు కూడా చీప్‌లిక్కర్ వైపు వెళ్తాయేమో! -
మంచి చేస్తే మద్దతిస్తాం..లేకుంటే యుద్ధమే
చీప్ లిక్కర్‌పై ప్రభుత్వం వెనక్కు తగ్గటం హర్షణీయం వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి కూసుమంచి: మంచి చేస్తే మద్దతిస్తాం.. లేకుంటే యుద్ధం చేస్తామని వైఎస్ఆర్సీపీ తెలంగాణ అధ్యక్షుడు ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. చీప్‌లిక్కర్‌పై ప్రభుత్వం వెనక్కు తగ్గటం హర్షణీయమని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు పార్టీ తరఫున అభినందనలు తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చౌట్పల్లిలో శుక్రవారం రాత్రి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. సారాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని కోరారు. ఇందుకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. మంచి పనులు చేస్తే తమ పార్టీ మద్దతు ఉంటుందని..లేకుంటే యుద్ధం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాదిన్నర కాలంగా ఆవగింజంతయినా అభివృద్ధి చేయలేదన్నారు. ఇకనైనా మేల్కొని ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలన్నారు. పక్కాఇళ్ల పెండింగ్ బిల్లులను విడుదల చేయూలని కోరారు. జిల్లాలోని పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాల్టీల్లో తొలగించిన కాంట్రాక్టు కార్మికులను విధుల్లోకి తీసుకునే వరకు పోరాటం చేస్తామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టుల పేర్లు, డిజైన్లు, స్థలాలు మార్చడం సరికాదన్నారు. వైఎస్ హయూం స్వర్ణయుగమని, దాన్ని ఎవరు రూపుమాపాలని చూసినా ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు. -
ఛీప్ లిక్కర్‌పై వెనక్కి తగ్గిన కేసీఆర్
-
చీప్ లిక్కర్ పై వెనక్కి
పాత పద్ధతిలోనే మద్యం పాలసీ కొనసాగింపు కేబినెట్ భేటీ అనంతరం సీఎం కె. చంద్రశేఖర్‌రావు వెల్లడి ♦ గుడుంబాపై ఉక్కుపాదం మోపుతాం ♦ తయారీదారులపై పీడీ చట్టం ప్రయోగిస్తాం ♦ జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ ♦ కమిటీ నివేదిక ప్రకారం కొత్త జిల్లాల ఏర్పాటు ♦ త్వరలోనే తెలంగాణ జల వినియోగ విధానం ♦ మొత్తం రూ. 81 వేల కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణం ♦ కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు అథారిటీలు ♦ పెరిగిన డీఏకు మంత్రివర్గం ఆమోదం ♦ సిటీ ఆర్టీసీ నష్టాలను జీహెచ్ఎంసీ భరించేలా ♦ చట్ట సవరణ... సుదీర్ఘంగా సాగిన కేబినెట్ భేటీ సాక్షి, హైదరాబాద్: వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో చీప్ లిక్కర్‌పై రాష్ట్ర సర్కారు వెనక్కి తగ్గింది. గుడుంబాకు అడ్డుకట్ట వేసేందుకు తక్కువ ధరకు దొరికే చీప్ లిక్కర్‌ను ప్రవేశపెట్టాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. మద్యం పాలసీ విషయంలో పాత పద్ధతినే కొనసాగించాలని నిర్ణయించింది. ప్రజల నుంచి మిశ్రమ స్పందన రావడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు సీఎం కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. అదే సమయంలో గుడుంబాపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టంచేశారు. ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యే క బృందాలను ఏర్పాటు చేసి గుడుంబా తయా రీ, విక్రయాలకు అడ్డుకట్ట వేస్తామని, తయారీదారులపై పీడీ చట్టం ప్రయోగిస్తామని చెప్పా రు. బుధవారం మధ్యాహ్నం నుంచి 5గంటల పాటు సుదీర్ఘంగా కేబినెట్ భేటీ జరిగింది. మద్యం విధానం, జిల్లాల పునర్విభజన, గృహ నిర్మాణం, తెలంగాణ జల వినియోగ విధానం, మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లపై కేబినెట్లో చర్చ జరిగింది. సమావేశం తర్వాత సీఎం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ఓకే జిల్లాల పునర్వ్యవస్థీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎస్ రాజీవ్‌శర్మ ఆద్వర్యంలో నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు సీఎం వెల్లడించారు. ''ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం జిల్లాల పునర్వ్యవస్థీకరణకు నిర్ణ యం తీసుకున్నాం. దేశంలో సగటున 19 లక్షల జనాభాకు ఒక జిల్లా ఉంది. తెలంగాణలో మాత్రం 35 లక్షల జనాభాకు ఒక జిల్లా ఉంది. దీంతో పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నా యి. అందుకే కొత్త జిల్లాల ఏర్పాటుపై ఎన్నికల్లో హామీ ఇచ్చాం. మేనిఫెస్టోలోనూ ప్రకటిం చాం. దీన్ని అమలు చేసేందుకు చీఫ్ సెక్రెటరీ అధ్యక్షతన నలుగురు సీనియర్ సెక్రెటరీలతో కమిటీ ఏర్పాటు చేశాం. కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తాం''అని సీఎం వెల్లడించారు. మొత్తం 43 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం వెల్లడించిన కీలకాంశాలివీ.. 60 వేల డబుల్ బెడ్రూం ఇళ్లు ఈ ఏడాది రూ.3,900 కోట్ల ఖర్చుతో నిరుపేదలకు 60 వేల డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో 560 చదరపు గజాల విస్తీర్ణంతో నిర్మించే ఒక్కో ఇంటికి రూ.5.04 లక్షలు అవుతుంది. జీహెచ్ఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్లలో అంతే విస్తీర్ణంలో నిర్మించే ఇంటికి రూ.5.30 లక్షల అంచనా వ్యయమవుతుంది. హైదరాబాద్ ఐడీహెచ్ కాలనీలో నిర్మించిన నమూనాలో వీటిని నిర్మిస్తారు. గతంలో ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయి. కానీ అసంపూర్తిగా ఉన్న గృహాలు, బిల్లులు అందని అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేస్తాం. మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లు దేశంలోనే తొలిసారిగా మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నాం. తెలంగాణలో మొత్తం 183 వ్యవసాయ మార్కెట్ కమిటీలున్నాయి. వీటిలో గిరిజన ప్రాంతాల్లో ఉన్న 13 కమిటీలను పీసా చట్టం ప్రకారం ఎస్టీలకు కేటాయించాలి. మిగతా 170 మార్కెట్లలో 50 శాతం కమిటీలను రిజర్వు చేస్తార. అంటే 85 మార్కెట్లను బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తాం. ఉద్యోగాలకు ఉన్న రిజర్వేషన్ల శాతాన్నే అమలు చేయటంతో పాటు లాటరీ పద్ధతిన రిజర్వేషన్లు ఖరారు చేస్తాం. మిగతా 85 మార్కెట్లు జనరల్ కోటాలో ఉంటాయి. వచ్చే ఏడాది రొటేషన్ పద్ధతిలో ఇవి తారుమారవుతాయి. అంటే జనరల్ కోటాలో ఉన్న మార్కెట్లకు రిజర్వేషన్లను వర్తింపజేసి.. ఇప్పుడు రిజర్వ్ అయిన మార్కెట్లను జనరల్ కోటాకు మారుస్తాం. సిటీ బస్సుల నష్టం జీహెచ్ఎంసీకే.. రవాణా సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు వీలుగా ఆర్టీసీని పరిరక్షించుకోవాలి. నగరంలో రోజుకు 3,800 బస్సులు సేవలు అందిస్తున్నాయి. వీటి ద్వారా ఆర్టీసీకి ఏటా రూ.218 కోట్ల నష్టం వస్తోంది. అమెరికా, యూరప్‌తో పాటు అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజా రవాణా నష్టాల్లోనే ఉంది. వీటిని అక్కడి స్థానిక సంస్థలే నిర్వహిస్తున్నాయి. ముంబైలో కూడా ఇదే విధానముంది. అదే తరహాలో సిటీ లో ఆర్టీసీకి వచ్చే నష్టాలను జీహెచ్ఎంసీ భరిం చేలా చట్ట సవరణ చేశాం. ఇప్పట్నుంచీ జీహెచ్ఎంసీ కమిషనర్‌ను టీఎస్ఆర్టీసీ బోర్డులో డెరైక్టర్‌గా నియమించేందుకు నిర్ణయించాం. త్వరలోనే జల వినియోగ విధానం రాష్ట్రానికి లాభం జరిగేలా.. రైతుల సాగునీటి కోసం ఇరిగేషన్ ప్రాజెక్టుల రీడిజైనింగ్ పూర్తై ది. త్వరలోనే తెలంగాణ జల వినియోగ విధా నం ప్రకటిస్తాం. రాబోయే మూడేళ్లు వరుసగా సాగునీటి ప్రాజెక్టులకు ఏటా బడ్జెట్టులో రూ.25 వేల కోట్లు కేటాయిస్తాం. ఈ ఏడాది ప్రతి నెలా రూ.వెయ్యి కోట్ల చొప్పున ఖర్చు చేస్తాం. మొత్తం రూ.81 వేల కోట్లతో ప్రాజెక్టులను నిర్మించాలనేది లక్ష్యం. ప్రాణహిత, ఇం ద్రావతి నదులు కలిసిన తర్వా త గోదావరిపై నిర్మించే బ్యారేజీకి లైడార్ సర్వే మొదలైంది. ఇది పూర్తయ్యాక జల విధానం వెల్లడిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోరాం. కరువును ఎదుర్కొనేందుకు సిద్ధం కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సెప్టెంబరు వరకు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఆ తర్వాతే పరిస్థితులను అంచనా వేసి కరువు మండలాలపై నిర్ణయం తీసుకుంటాం. 3 జిల్లాలు సుభిక్షంగా ఉంటే 6 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులున్నాయి. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. మిగతా జిల్లాల్లో వర్షాభావ పరిస్థితి నెలకొంది. రైతుల ఆత్మహత్యలపై పరిహారాన్ని పెంచే ప్రతిపాదనను ఆలోచిస్తాం. ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారాన్ని అందించటం లేదనడం సరికాదు. కలెక్టర్ల ఆధ్వర్యంలోనే నిధులున్నాయి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్యాకేజీ అమలు చేస్తున్నారు. జీతాల పెంపు ఆలోచన లేదు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచే ఆలోచన లేదు. ఇచ్చిన మాట ప్రకారం కాం ట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు కట్టుబడి ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగుల విభజన పూర్తయితే ఈ ప్రక్రియ మొదలవుతుంది. సింగిల్ పోలీస్ విధానంపై సివిల్ పోలీసులు, బెటాలియన్లు, ప్రత్యేక పోలీస్ ఫోర్స్‌ను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలనే ఆలోచన ఉంది. పోలీసు బలగాలను ఒక్కసారిగా సివిల్ పోలీసులుగా మార్చితే వచ్చే ఇబ్బందులను అధ్యయనం చేస్తున్నాం. ఎస్కలేషన్‌కు పచ్చజెండా కాగా, రాష్ట్రంలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులకు పెరిగిన ధరలకు అనుగుణంగా ధరల పెంపు (ఎస్కలేషన్)కు కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఉమ్మడి ఏపీలో ఇచ్చిన జీవో 13ను కొద్దిపాటి మార్పులతో అమలు చేసేం దుకు సానుకూలత తెలిపింది. పనులు జరగని చోట టెండర్ రద్దుచేసి కొత్తగా టెండర్లు పిలిస్తే వ్యయ భారం దాదాపు వందరెట్లు పెరుగుతుండటం, న్యాయపరమైన చిక్కులు తప్పవని కేబినెట్ సబ్ కమిటీ నివేదించిన దృష్ట్యానే ఈ నిర్ణయానికి వచ్చిన ట్లు తెలుస్తుంది. కేసీఆర్ ఈజ్ ఏ ఫైటర్.. 'కేసీఆర్ ఈజ్ ఏ ఫైటర్... క్రూసేడర్.. తెలంగాణ వచ్చేదాకా పోరాడిన వ్యక్తిని. నా కంఠంలో ప్రాణమున్నంత వరకు తెలంగాణకు నష్టం జరిగే పని చేయను. తెలంగాణ భవిష్యత్తుకు మేం వేస్తున్నదే పునాది. వాస్తవాలు గుర్తించని వారెన్నో విమర్శలు చేస్తున్నారు'అని ముఖ్యమంత్రి కేసీఆర్ విపక్షాలపై ధ్వజమెత్తారు. తాను చేసే ప్రయత్నంతో నదీ జలాలు వస్తాయనే ధీమా వెలిబుచ్చారు. 'గతంలో మీడియం, మైనర్ ప్రాజెక్టులను మరిచిపోయారు. పెన్‌గంగ, గోదావరిపై మహారాష్ట్ర 218 బ్యారేజీలు నిర్మించింది. కృష్ణా నదిపై 78 బ్యారేజీలున్నాయి. ఎస్సారెస్పీ, జూరాలకు చుక్క నీరు రావటం లేదు. అందుకే ఇంద్రావతి, ప్రాణహిత కలిసిన తర్వాత గోదావరి నుంచి నీటిని తీసుకునేందుకు ప్రాజెక్టు రీ డిజైన్ చేశాం. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌తో వివాదాలు లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి నీటిని వాడుకుంటాం. గూగుల్ మ్యాప్‌ల ఆధారంగా ఎక్కడెక్కడ ఎన్ని బ్యారేజీలున్నాయో త్వరలోనే వెల్లడిస్తాం. ఎవరికైనా అపోహలుంటే మానుకోండి. అనవసర పనికి మాలిన విమర్శలు మానండి' అని హితవు పలికారు. కేబినెట్ తీసుకున్న మరిన్ని నిర్ణయాలు.. ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగిన డీఏ చెల్లింపునకు ఆమోదం. జనవరి నుంచి 3.144 % పెరిగిన డీఏ చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలో కొత్తగా నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మెద, మహబూబ్‌నగర్ జిల్లా పాలెం, కరీంనగర్ జిల్లాలో జమ్మికుంటలో కొత్తగా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీల ఏర్పాటు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీలో రూ.2,631 కోట్ల అంచనా వ్యయంతో స్ట్రాటెజిక్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అమలుకు నిర్ణయం. 20 చోట్ల మల్టీ లెవెల్ ప్లై ఓవర్ల నిర్మాణం. ఉద్యోగ నియామకాలకు సాధారణ గరిష్ట వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులకు కేబినెట్ ఆమోద ముద్ర. యూనిఫాం సర్వీసులకు వయో పరిమితి పెంచాలనే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. సంబంధిత విభాగాల అధికారులతో చర్చించిన తర్వాత నిర్ణయం. హైదరాబాద్‌లో మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుకు వీలుగా ప్రత్యేక రాయితీలు. ఏపీ ఎక్సైజ్ యాక్ట్, ఏపీ ప్రొఫెషన్ టాక్ట్ యాక్ట్, ఏపీ నర్సెస్, హెల్త్ విజిటర్స్ యాక్ట్‌ను తెలంగాణకు అన్వయించేలా వర్తింపజేసేందుకు ఆమోదం. తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ ఏర్పాటుకు నిర్ణయం. ఏపీ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు నుంచి తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు విభజన, నాబార్డు నుంచి తీసుకున్న రూ.2,500 కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారంటీ. -
'మంత్రి ఆ మాట చెప్పడం సిగ్గుచేటు'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చీప్ లిక్కర్ అమ్మకాల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. గాంధీ జయంతిలోగా చంద్రశేఖర్ రావు ప్రభుత్వం చీప్ లిక్కర్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, లేకుంటే బంద్ చేస్తామని ఎర్రబెల్లి హెచ్చరించారు. గుడుంబాను అరికట్టకపోతే దిగిపోవాలని, చీప్ లిక్కర్‌తో గీతకార్మికులకు అన్యాయం చేయవద్దని అన్నారు. సచివాలయంలో ఓ మంత్రి.. చీప్ లిక్కర్‌ను ఆయుష్షు పెంచే సంజీవనిగా పేర్కొనడం సిగ్గుచేటని ఎర్రబెల్లి విమర్శించారు. -
చీప్‌లిక్కర్‌ను వెనక్కి తీసుకోవాల్సిందే: డీకే అరుణ
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అమలు చేయాలనుకుంటున్న చీప్ లిక్కర్ విధానాన్ని వెనక్కి తీసుకునేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. బుధవారం హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడిన ఆమె..రాష్ట్రంలో పేద ప్రజల రక్తాన్ని పీల్చే విధంగా చీప్ లిక్కర్ పాలసీకి ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని మండిపడ్డారు. ఇప్పటికే రాష్ట్రంలో మద్యం మత్తులో అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయని, ప్రమాదాలలో ఎక్కువ భాగం మద్యం సేవించడం వల్ల జరుగుతున్నవేనని అనేక నివేదికలు వెల్లడిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం తన ఖజానా నింపుకోవడం కోసం పేదలను బలిచేయడం సమంజసంకాదన్నారు. దీనిపై ప్రభుత్వం లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. -
మంత్రులు తాగిన తర్వాతే.. ప్రజల వద్దకు తేవాలి
ప్రజల్ని మత్తులో ఉంచేందుకే చీప్ లిక్కర్ : ఎర్రబెల్లి తొర్రూరు : ప్రమాదకరమైన నాటుసారాకు బదులుగా చీప్ లిక్కర్‌ను తెస్తున్నామంటున్న మంత్రులు.. మొదట 6 నెలలపాటు వారు తాగాకే ప్రజల వద్దకు దాన్ని తేవాలని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం వరంగల్ జిల్లా తొర్రూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలు మరిచిపోయి ప్రజలంతా మత్తులో ఉండేందుకే కేసీఆర్ చీప్ లిక్కర్ తెస్తున్నారన్నారు. గ్రామ జ్యోతి సభల్లో చీప్‌లిక్కర్, మద్యం వద్దన్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. చీప్ లిక్కర్‌కు వ్యతిరేకంగా ఈనెల 3న అన్ని ఎక్సైజ్ పోలీస్స్టేషన్ల ఎదుట నిరసన దీక్షలు, ధర్నాలు చేపడుతున్నామని తెలిపారు. -
చీప్‌లిక్కర్‌పై సమరం
గోదావరిఖని/కరీంనగర్/పెద్దపల్లి : చీప్ లిక్కర్ ప్రవేశపెట్టాలనే నిర్ణయూన్ని ఉపసంహరించుకోవాలని, చీప్ లిక్కర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలు చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, వివేక్ తదితరులతో కలిసి ఆదివారం ఆయన కరీంనగర్, పెద్దపల్లి, గోదావరిఖనిలో విలేకరులతో మాట్లాడారు. గోదావరిఖనిలో ఐఎన్టీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మద్యం మరింతగా అందుబాటులోకి రావడంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని, లిక్కర్ మాఫియూ పెరుగుతుందని తెలిపారు. తోటపల్లి ప్రాజెక్టు రద్దు నిర్ణయూన్ని ఉపసంహరించుకోవాలన్నారు. తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయూలని అన్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌తో మళ్లీ అనుమతులు, జలసంఘం నిపుణుల అభిప్రాయూలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. మధ్యమానేరు నిర్వాసితులకు పరిహారం అందించాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికుల సకలజనుల సమ్మెతోనే కదలిక ఏర్పడగా, సమ్మెకాలపు వేతనాలు కార్మికులకు ఇవ్వడంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించాలని, కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయూలని, రూ.491 కోట్ల లాభాల్లో 30 శాతం వాటా కార్మికులకు చెల్లించాలని అన్నారు. సెప్టెంబర్‌లో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటనలో భాగంగా సింగరేణి కోల్‌బెల్ట్ ప్రాంతంలో కూడా పర్యటిస్తారని వివరించారు. సింగరేణి ప్రాంతంలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు కేసీఆర్ హామీ ఇచ్చారని, దీంతోపాటు వారసత్వ ఉద్యోగాలు, ఇతర సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తామన్నారు. ఆయూ చోట్ల డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం, ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు జి.సంజీవరెడ్డి, జనక్‌ప్రసాద్, నాయకులు గండ్ర వెంకటరమణారెడ్డి, జి.వినోద్, కోలేటి దామోదర్, హర్కర వేణుగోపాల్‌రావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కర్ర రాజశేఖర్, గుగ్గిళ్ల జయశ్రీ, గందె మాధవి, దిండిగాల మధు, మహేశ్, అంజనీకుమార్, గంట రమణారెడ్డి, సవితారెడ్డి, వేముల రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఖజానాకు కిక్కు..!
మద్యం ద్వారా భారీగా ఆదాయ సమీకరణకు సర్కారు పావులు * దుకాణాల లెసైన్సు ఫీజుల రూపంలోనే రూ. 2 వేల కోట్లు అంచనా * రూ. 12 వేల కోట్ల వార్షిక లక్ష్యాన్ని అధిగమించేందుకు ప్రయత్నాలు సాక్షి, హైదరాబాద్: మద్యం ద్వారా భారీగా ఆదాయాన్ని సమకూర్చుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు పావులు కదుపుతోంది. అక్టోబర్ నుంచి అమలులోకి రానున్న నూతన మద్యం విధానం ద్వారా అంచనాలకు మించి ఆదాయం పొందేందుకు పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తోంది. గుడుంబాకు విరుగుడుగా చీప్ లిక్కర్‌ను ప్రవేశపెట్టడం మొదలుకుని.. మండలాలను గంపగుత్తగా వ్యాపారులకు కట్టబెట్టడం, కొత్త బార్ లెసైన్సుల మంజూరు, కుటీర పరిశ్రమల్లా బీర్ల ఫ్యాక్టరీలకు అనుమతులు, జీహెచ్ఎంసీలో షాపింగ్‌మాల్స్, మల్టీప్లెక్స్‌ల్లో మద్యం విక్రయాలు, వైన్కేఫ్ల ఏర్పాటు వంటి ఆలోచనలన్నీ భారీ ఆదాయ సమీకరణలో భాగమేనని అధికార వర్గాలు సైతం ఒప్పుకుంటున్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖకు రూ. 10,300 కోట్లు రాబడి రాగా, 2015-16 ఆర్థిక సంవత్సరానికి ఆ లక్ష్యాన్ని రూ. 12 వేల కోట్లకు పెంచారు. కానీ, ఎక్సైజ్ శాఖ చేస్తున్న కసరత్తులు చూస్తుంటే రూ. 15 వేల కోట్ల రికార్డు ఆదాయం సమకూరినా ఆశ్చర్యపోనక్కర్లేదని అధికారులు చెపుతున్నారు. లెసైన్సుల ద్వారానే రూ. 2 వేల కోట్లు 2014-15 ఆబ్కారీ సంవత్సరం(జూలై1 నుంచి జూన్ 30)లో ఎక్సైజ్ శాఖకు లెసైన్సు ఫీజుల రూపంలో వచ్చిన ఆదాయం రూ. 900 కోట్లు. మద్యం వ్యాపారులు నిర్ధేశిత లెసైన్సు ఫీజుకు ఏడు రెట్లు మించి అమ్మకాలు జరిపితే సర్కారుకు చెల్లించే 13.6 శాతం ప్రివిలేజ్ ట్యాక్స్ రూపంలో అదనంగా రూ. 400 కోట్లు సమకూరాయి. కానీ, ఈసారి లెసైన్సు ఫీజు రూపంలోనే రూ. 2 వేల కోట్లు సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. తదనుగుణంగానే జీహెచ్ఎంసీ, మరో మూడు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలతో పాటు మండలాల్లో ఏర్పాటు చేసే మద్యం దుకాణాల లెసైన్సు ఫీజును నిర్ణయించినట్లు సమాచారం. మండలం లెసైన్సుదారుడు గ్రామాల్లో కూడా బి-లెసైన్సు దుకాణాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా కూడా భారీగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. ఇక ధరఖాస్తు ఫారాలతో పాటు కొత్తగా బార్లకు అనుమతులు మంజూరు చేయడం, బీరు ప్లాంట్లు(మైక్రో బ్రేవరీలు), జీహెచ్ఎంసీలో మెట్రో సిటీ వాతావరణం కనిపించేలా వైన్కేఫ్లు, మాల్స్, మల్టీప్లెక్స్‌ల్లో దుకాణాలు ఏర్పాటు చేయడం ద్వారా వచ్చే ఆదాయం అదనం. ఆదాయం కోల్పోవడం వట్టిమాటే! గుడుంబాను నిర్మూలించేందుకు ప్రవేశపెడుతున్న చీప్‌లిక్కర్ ద్వారా ప్రభుత్వం ఆదాయం కోల్పోతుందన్న మంత్రుల మాటలకు సర్కార్ చేస్తున్న కసరత్తుకు పొంతన లేదు. చౌక మ ద్యం ప్రవేశపెట్టడం ద్వారా ప్రస్తుతం మార్కెట్లో రూ. 60కి విక్రయిస్తున్న 180 ఎంఎల్ చీప్‌లిక్కర్ ధర సగానికి తగ్గుతుంది. అదే సమయంలో చీప్‌లిక్కర్‌పై 70 శాతం నుంచి 90 శాతం వరకు వసూలు చేస్తున్న వ్యాట్(విలువ ఆధారిత పన్ను) 49 శాతానికి తగ్గనుంది. దీనినే సుమారు వెయ్యి కోట్ల నష్టంగా ప్రభుత్వ పెద్దలు ప్రచారం చేస్తున్నారు. కానీ, గుడుంబాను సేవించే కస్టమర్లంతా చీప్‌లిక్కర్ వైపునకు మళ్లడం ద్వారా చౌక మద్యం అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. గ్రామాల్లో గుట్టుగా సాగే గుడుంబా విక్రయాలు, బెల్టుషాపులు ఇక అధికారిక దుకాణాలుగా మారనున్నాయి. తద్వారా అన్ని రకాల మద్యం గ్రామ పొలిమేరల్లోకి రావడంతో ‘చీప్’తో పాటు అన్ని రకాల మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతా యి. గుడుంబా అమ్మకాలే అనధికారికంగా రూ. 800 కోట్ల మేర ఉంటాయని సర్కార్ అంచనా వేసింది. ఈ మొత్తం ఇప్పుడు అధికారికంగా సర్కార్ ఖాతాలో చేరనుంది. వ్యాట్ తగ్గింపు ద్వారా కోల్పోయిన ఆదాయానికి రెండింతలు గ్రామాల్లో జరిగే వ్యాపారం ద్వారా సమకూరుతుందని అధికారులు లెక్కలు వేశారు. కోల్‌బెల్ట్, పరిశ్రమల ప్రాంతాలపై దృష్టి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి తెలంగాణలోని కోల్‌బెల్ట్ ప్రాంతంలో మద్యం వ్యాపారం అధికం. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విస్తరించి ఉన్న గోదావరి పరీవాహక ప్రాంత సింగరేణి కోల్‌బెల్ట్‌లో ఇప్పటి వరకు ఉన్న మద్యం విధానాన్ని మార్చాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. కరీంనగర్ జిల్లా గోదావరిఖని ఒక్కటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కావడంతో ఇక్కడ లెసైన్సు ఫీజు, మద్యం అమ్మకాలు వేరుగా ఉంటాయి. మిగతా మందమర్రి, బెల్లంపెల్లి, కొత్తగూడెం మున్సిపాలిటీలు కాగా శ్రీరాంపూర్, యైటింక్లైన్ కాలనీ, భూపాల్పల్లి వంటివి గ్రామీణ ప్రాంతాలుగా ఉన్నాయి. ఇక్కడ ప్రత్యేక పాలసీని తీసుకొచ్చేందుకు ఎక్సైజ్ శాఖ కసరత్తు చేసింది. అలాగే పరిశ్రమలు అధికంగా ఉన్న మెదక్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని ప్రాంతాల్లో మద్యం విక్రయాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తోంది. -
చీప్ లిక్కర్‌కు వ్యతిరేకంగా గౌడసంఘం ధర్నా
రామగుండం(కరీంనగర్ జిల్లా): తెలంగాణ ప్రభుత్వం తీసుకురానున్న చీప్ లిక్కర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గౌడ సంఘం నాయకులు ధర్నాకు దిగారు. ఈ సంఘటన ఆదివారం కరీంనగర్ జిల్లా రామగుండం మండలం బసంత్‌నగర్ పీఎస్ సమీపంలో జరిగింది. వివరాలు.. మండలంలోని కన్నాల, రామాపూర్ గ్రామాలకు చెందిన గౌడ సంఘం నాయకులు రాజీవ్ జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ మేరకు చీప్‌లిక్కర్ ప్రవేశపెట్టాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చీప్ లిక్కర్ ప్రవేశపెట్టి మా పొట్టలు కొట్టొద్దని వారు వాపోయారు. -
చౌక మద్యంపై ప్రజలతో కలసి పోరాడుతాం
పెద్దపల్లి : కేసీఆర్ సర్కార్ చౌక మద్యం తీసుకురావడం వల్ల రాష్ట్రంలో మరింత మంది తాగుబోతుల్ని తయారవుతారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ... చౌక మద్యంపై ప్రజలతో కలసి పోరాడతామని చెప్పారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నేతలు శ్రీధర్ బాబు, గండ్ర వెంకటరమణ, వివేక్, పొన్నం ప్రభాకర్, జిల్లా కంగ్రెస్ అధ్యక్షుడు మృత్యుంజయం తదితరులు ఉన్నారు. -
అమ్మకాలపైనే ఆశలు!
-
అమ్మకాలపైనే ఆశలు!
సాక్షి, హైదరాబాద్: నూతన మద్యం విధానంతో ప్రభుత్వానికి వచ్చే రాబడి తగ్గిపోతుందా, పెరుగుతుందా..? అన్నదానిపై రాష్ట్ర ఆర్థిక శాఖ మల్లగుల్లాలు పడుతోంది. కొత్త విధానం ప్రకారం చీపెస్ట్ లిక్కర్‌ను రూ.15కు 90 ఎంఎల్ సీసా చొప్పున విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ధరలో అమ్మాలంటే మద్యంపై ఇప్పుడున్న వ్యాట్‌ను 49 శాతానికి తగ్గించాలని భావిస్తున్నారు. దీనివల్ల సర్కారుకు వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోతుంది. కానీ అతి తక్కువ ధరకు మద్యం వస్తుందనే ఉద్దేశంతో వినియోగం భారీగా పెరుగుతుందని.. తద్వారా మొత్తంగా వచ్చే ఆదాయం దాదాపు ప్రస్తుత స్థాయిలోనే ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు చీపెస్ట్ లిక్కర్ అందుబాటులోకి వస్తే ఎక్కువ ధర ఉన్న మద్యం విక్రయాలు పడిపోతాయని, దానివల్ల ఎక్సైజ్‌పై వచ్చే వ్యాట్ ఆదాయం తగ్గుతుందనే భావన కూడా వ్యక్తమవుతోంది. మొత్తంగా కొత్త మద్యం విధానమంతా ‘అమ్మకాల’ చుట్టే తిరుగుతోంది. ప్రస్తుతం 90 ఎంఎల్ చీప్ లిక్కర్ రూ.30 ధరకు విక్రయిస్తున్నారు. వివిధ రకాల మద్యంపై కనిష్టంగా 70 శాతం నుంచి గరిష్టంగా 190 శాతం వరకు వ్యాట్ ఉంది. దీన్ని తగ్గించటంతో వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోతుందని ఆర్థిక శాఖ లెక్కలేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్‌పై వ్యాట్ ద్వారా రూ.8,291 కోట్లు రాబట్టాలని ప్రభుత్వం అంచనాలు వేసుకుంది. కానీ కొత్తగా వచ్చే చీపెస్ట్ లిక్కర్ కారణంగా వ్యాట్ ఆదాయం తగ్గిపోతుంది. కానీ ప్రస్తుతం రూ.60 చెల్లించి మద్యం కొనుగోలు చేస్తున్నవారు తక్కువ ధరకు వస్తుందని రెండు చీపెస్ట్ బాటిళ్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుం దని... వినియోగం పెరిగితే వ్యాట్ శాతం తగ్గినా ప్రమాదమేమీ లేదనే వాదన ఉంది. నష్టమని చెబుతున్న ఎక్సైజ్ శాఖ.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చీప్‌లిక్కర్ 48 బాటిళ్లు (180 ఎంఎల్) ఉన్న పెట్టెపై రూ.1,885 పన్ను రూపంలో రాష్ట్ర ఖజానాలో జమవుతుంది. వ్యాట్ తగ్గింపు కారణంగా ఇది రూ.734కు తగ్గిపోతుంది. అంటే ఒక్కో పెట్టెపై రూ.1,151 ఆదాయం తగ్గిపోతుందని ఎక్సైజ్ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. కానీ వ్యాట్ ద్వారా వచ్చే ఆదాయం అమ్మకాలతో ముడిపడి ఉన్నందున దీని ప్రభావం రూ.200 కోట్ల నుంచి రూ.500 కోట్ల మధ్యలో ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే వ్యాట్, అమ్మకపు పన్నుల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అంచనా వేసిన స్థాయిలో ఉండడం లేదు. ప్రతి నెలా రూ.3,000 కోట్లు రావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ గత నాలుగు నెలల ఆదాయ గణాంకాలను చూస్తే ఒక్క జూలైలో గరిష్టంగా రూ.2,500 కోట్లు మాత్రమే వచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త విధానంతో వచ్చే లాభనష్టాలను ఆర్థిక శాఖ ప్రభుత్వానికి నివేదించనుంది. లెసైన్సు ఫీజుతో లోటు భర్తీ.. వ్యాట్ ద్వారా తగ్గే ఆదాయాన్ని లెసైన్స్ ఫీజు, స్టేట్ ఎక్సైజ్ ద్వారా రాబట్టుకునే ప్రత్యామ్నాయాలను సైతం ప్రభుత్వం ఇప్పటికే పరిశీలించింది. దీనికి అనుగుణంగా కొత్త విధానానికి రూపకల్పన చేసింది. ప్రస్తుతమున్న మద్యం దుకాణాల లెసైన్సుల ద్వారా ప్రభుత్వానికి రూ.900 కోట్ల ఆదాయం వచ్చింది. నిర్దేశించిన కోటాకు మించి మద్యం అమ్మకాలు చేసినందుకు దుకాణాదారులు చెల్లించిన ఫీజు మరో రూ.420 కోట్లు ఖజానాలో జమ అయింది. మొత్తంగా ఆదాయం రూ.1,320 కోట్లకు మించింది. దీంతో ఈసారి లెసైన్సులకు నిర్దేశించే రుసుము అంతకంటే ఎక్కువగా ఉండాలని ప్రభుత్వం లెక్కలేసుకుంది. దీనిద్వారానే దాదాపు రూ.2,000 కోట్లు సంపాదించాలని భావిస్తోంది. వ్యాట్‌కు గండి పడినా... ఇలా ఆదాయం రాబట్టుకోవాలనేది సర్కారు వ్యూహంగా కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాల ద్వారా రూ.3,916 కోట్ల రాబడిని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో తొలి నాలుగు నెలల్లో రూ.1,150 కోట్లు ఆదాయం వచ్చింది. దీంతో కొత్త మద్యం విధానం లాభసాటిగా ఉంటుందా, నష్టం వస్తుందా.. అని తేల్చలేకపోతోంది. అమ్మకాలతో ముడిపడి ఉన్నందున విక్రయాలు పెరిగితే, వ్యాట్ తగ్గించినా ఇబ్బందేమీ లేదని.. విక్రయాలు ఇప్పుడున్న స్థాయిలో ఉంటే ఆదాయం తగ్గిపోతుందని భావిస్తోంది. ఈ ఏడాది మద్యం విక్రయాల ఆదాయం.. ఏప్రిల్ ⇒ రూ.185 కోట్లు మే ⇒ రూ.190 కోట్లు జూన్ ⇒ రూ.525 కోట్లు జూలై ⇒ రూ.250 కోట్లు -
తాగుబోతుల తెలంగాణ చేస్తారా? : డీకే అరుణ
హైదరాబాద్ : చీప్ లిక్కరును ప్రభుత్వమే అమ్ముతూ తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా మార్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి డి.కె.అరుణ విమర్శించారు. మాజీమంత్రి వి.సునీతా లక్ష్మారెడ్డితో కలిసి అసెంబ్లీ ఆవరణలో సోమవారం ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో గుడుంబా అమ్మకాలను అరికట్టలేకపోవడం ప్రభుత్వ చేతకానితనమేనని విమర్శించారు. చీప్ లిక్కరును అమ్ముతూ యువతను, ప్రజలను తాగుబోతులుగా చేస్తారా అని ఆమె ప్రశ్నించారు. -
చీప్ లిక్కర్ ప్రవేశపెట్టేది లేదు: మంత్రి పద్మరావు
-
చీప్ లిక్కర్ పై పునస్సమీక్ష
అంబర్‌పేట : రాష్ట్రంలో చీప్ లిక్కర్ ప్రవేశపెట్టే విషయాన్ని పునస్సమీక్షించాల్సిందిగా సీఎం కేసీఆర్‌ను కోరుతానని శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. చీప్ లిక్కర్‌తో గౌడ కులస్తుల వృత్తిపై ప్రభావం పడే అంశాన్ని సీఎంకు కూలంకుషంగా వివరిస్తామని తెలిపారు. అంబర్‌పేట అలీకేఫ్ చౌరస్తాలో ప్రేమ్‌నగర్ గౌడ సంఘ ముఖ్య సలహదారు జి.ఆనంద్‌గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డిలతో కలిసి సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ బలహీన వర్గాల సత్తా చాటిన మహనీయుడు సర్వాయి పాపన్న అని కీర్తించారు. అంబర్‌పేటలో సర్వాయి పాపన్న విగ్రహ ప్రతిష్టకు తన వంతు సహకారం అందిస్తానన్నారు. ఎంపీ హనుమంతరావు మాట్లాడుతూ చీప్ లిక్కర్ విషయాన్ని ముఖ్యమంత్రికి నిర్మొహమాటంగా తెలియజేయాలని స్వామిగౌడ్‌ను కోరారు. ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ సర్వాయి పాపన్న జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని ప్రభుత్వానికి సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పి.జ్ఞానేశ్వర్ గౌడ్, సాంబశివ గౌడ్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ఎడ్ల సుధాకర్‌రెడ్డి, గౌడ సంఘ నాయకులు జైహింద్ గౌడ్, రాజేందర్పటేల్ గౌడ్, లక్పతి యాదగిరి గౌడ్, నిమ్మల బాలయ్యగౌడ్, లింగం గౌడ్, శ్రీనివాస్ గౌడ్, తొలుపునూరి కృష్ణాగౌడ్, కాసాని రాములుగౌడ్, భాస్కర్‌గౌడ్, వెంకటేష్ గౌడ్, యాదగిరి గౌడ్, రాంచందర్‌గౌడ్, లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
సారాపై ఉన్న శ్రద్ధ చదువుపై లేదు
ప్రగతినగర్ : తెలంగాణ సర్కార్‌కు చీప్ లిక్కర్, సారాపై ఉన్న శ్రద్ధ విద్యార్థులు, వారి సమస్యలపై లేదని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం పేద విద్యార్థులతో చెలగాటమాడుతోందన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్, రీరుుంబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో కళాశాలల యూజ మాన్యాలు వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అన్నారు. తాము కట్టే పన్నులతో ప్రభుత్వం నడుస్తున్నా.. విద్యార్థుల చదువులకు మాత్రం ఫీజులు చెల్లించకపోవడం శోచనీయమన్నారు. జేబులు నింపుకునేందుకు ఏర్పాటు చేసిన పథకాలను పక్కనబెట్టి గతం నుంచి కొనసాగుతున్న పథకాలను అమలు చేయూలని హితవు పలికారు. జిల్లాలో 2014-15 విద్యా సంవత్సరం బకాయిలు 75 వేల మందికి 110 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. విద్యార్థుల సమస్యలు తీర్చడం చేతకాని పక్షంలో తప్పుకోవాలని, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడొద్దన్నారు. రోజుకో పథకం ప్రవేశపెట్టి ప్రజలను గందరగోళానికి గురిచేయడం కాదు... వారి పిల్లలకు ఆసరాగా నిలవాలని అన్నారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ యోగిత రాణాకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు జి.ప్రవీణ్‌గౌడ్, జిల్లా కార్యదర్శి గంగాధర్, నగర అధ్యక్షుడు లక్ష్మన్ యాదవ్, నాయకులు కిరణ్‌కుమార్, దత్తు, ప్రశాంత్, గజానంద్, నాందేవ్, రాజు, కైలాష్, ఇస్మాయిల్, సుధీర్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. -
మద్యం పాలసీని అమలు చేయగలమా?
ఎక్సైజ్‌శాఖ తర్జనభర్జన కీలకపోస్టుల్లో ఇన్చార్జీల పాలన 220 ఎస్ఐ, 340 కానిస్టేబుళ్లను నియమించాలని వినతి హైదరాబాద్: తెలంగాణ పల్లెల్లో గుడుంబాను అరికట్టి దానిస్థానంలో చీప్‌లిక్కర్‌ను తీసుకొచ్చేందుకు రూపొందిస్తున్న మద్యం పాలసీ విధివిధానాల కోసం ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. సిబ్బంది కొరత దృష్ట్యా మద్యం పాలసీని తక్షణం అమలు చేయగలమా? అనే సందేహం ఎక్సైజ్‌శాఖను పట్టి పీడిస్తోంది. మండలం యూనిట్‌గా లాటరీ పద్ధతిలో లెసైన్స్‌లను జారీ చేసి, సదరు లెసైన్స్దారునికే గ్రామాల్లో చీప్ లిక్కర్ అమ్ముకునేందుకు పర్మిట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లా యూనిట్‌గా ఉన్నప్పుడే నకిలీమద్యం, అధిక ధరలను నియంత్రించలేకపోయిందనే అపఖ్యాతి మూటగట్టుకున్న ఎక్సైజ్‌శాఖ, చీప్‌లిక్కర్ పాలసీని మండల, గ్రామస్థాయిలో ఎలా పర్యవేక్షిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. వేధిస్తున్న సిబ్బంది కొరత! ఖజానాకు భారీగా ఆదాయాన్ని సాధించిపెట్టే శాఖల్లో ప్రధానమైన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో ఏడాదిగా ఇన్చార్జీల పాలన కొనసాగుతోంది. ఉన్నతస్థాయి నుంచి కిందిస్థాయి వరకు దాదాపు 200 పోస్టుల్లో అధికారులు అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అడిషనల్ కమిషనర్, రెండు జాయింట్ కమిషనర్, మూడు డిప్యూటీ కమిషనర్ పోస్టులతోపాటు 12 అసిస్టెంట్ సూపరింటెండెంట్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 45మంది అసిస్టెంట్ సూపరింటెండెంట్లలో 15 ఖాళీగా ఉన్నాయి. ఉదాహరణకు కరీంనగర్ జిల్లాలో మూడు జిల్లా ఎస్పీ పోస్టులు ఉండగా.. ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. ఉన్నత స్థాయి పోస్టులు ప్రమోషన్లతోనే భర్తీ చేయాల్సి ఉంటుంది. ప్రమోషన్లకు సంబంధించిన ఫైల్ ఏడాదికాలంగా సీఎం వద్ద పెండింగ్‌లో ఉంది. క్షేత్రస్థాయి సిబ్బంది కొరతను అధిగమించేందుకు వెంటనే 220 ఎస్సై, 340 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయాలని ఎక్సైజ్ శాఖ ప్రభుత్వాన్ని కోరింది. -
'సీఎం చేతగాని తనానికి ఇది నిదర్శనం'
కరీంనగర్: తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావుపై సీనియర్ నేత, కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం నాడు ఆయన స్థానిక మీడియాతో మాట్లాడారు. గుడుంబాను అరికట్టకుండా.. చీప్ లిక్కర్‌ను అందుబాటులోకి తీసుకురావడం కేసీఆర్ చేతగాని తనానికి ఇది నిదర్శనమని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. చీప్ లిక్కర్‌పై జిల్లాలోని జగిత్యాల నుంచే ఉద్యమం ప్రారంభిస్తామని ఆయన అన్నారు. గుడుంబాను అరికట్టలేక పోతున్నామని ఇటీవల కేసీఆర్ వ్యాఖ్యానించడం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ పోలీసులను అవమాన పరచడమేనని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. -
చీప్ లిక్కర్‌కు వ్యతిరేకంగా పోరు
రౌండ్‌టేబుల్ సమావేశంలో అఖిలపక్షాల పిలుపు హైదరాబాద్: చీప్‌లిక్కర్ ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగుతులను దెబ్బతీసే విధంగా రూపొందిస్తున్న మద్యం పాలసీ(చీప్ లిక్కర్)ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. సీఎం, ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహించే గజ్వేల్ లేదా సిరిసిల్ల నుంచే ఉద్యమానికి శ్రీకారం చూట్టాలని నిర్ణయించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘తెలంగాణ మద్య వ్యతిరేక ఉద్యమం’ ఆధ్వర్యంలో రౌండ్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గుడుంబాపై ఉక్కుపాదం మోపాలంటూనే చీప్ లిక్కర్ అమ్మకాలను పెంచాలనుకోవడం తగదన్నారు. చీప్ లిక్కర్‌కు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు తీర్మానం చేయాలని సూచించారు. బీజేపీ శాసనసభాపక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ అసెంబ్లీ శీతాకాల సమావేశంలో సారాపై పోరాడతామన్నారు. కేంద్ర మాజీమంత్రి బలరాం నాయక్ మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్సార్ ఆదివాసీల పోడు భూములకు పట్టాలు ఇస్తే వాటినిప్పుడు రద్దు చేసి సారా ఇస్తారా అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ నేత ఆదం విజయ్ కుమార్ మాట్లాడుతూ బంగారు తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యమించకుంటే ప్రభుత్వం సారాగ్రిడ్ను కూడా తీసుకువస్తుందని తెలంగాణ ఉద్యమవేదిక అధ్యక్షుడు చెరకు సుధాకర్ అన్నారు. కార్యక్రమంలో సామాజిక ఉద్యమనేత వీజీఆర్ నారగోని, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, డా. శ్రవణ్, ఆప్ నేతలు నమ్రత, వెంకటరెడ్డి, పద్మశాలీ సంఘం నేత టి.నాగయ్య, మా జీ ఎమ్మెల్యే బి.బిక్షమయ్యగౌడ్, ప్రజాసంఘాల నేతలు బెల్లయ్య నాయక్, మంజీలాల్ నాయక్, షకీల, బి.శోభారాణి, బాలలక్ష్మి పాల్గొన్నారు. మద్యం పాలసీ ఉపసంహరించాలి: సీపీఐ హైదరాబాద్: పేదల సామాజిక, ఆర్థిక స్థితిగతులను దెబ్బతీసే విధంగా రూపొందిస్తున్న మద్యం పాలసీని వెం టనే ఉపసంహరించుకోవాలని సీపీఐ డిమాండ్ చేసింది. గుడుంబాను అరికట్టాలంటే చీప్‌లిక్కర్ అమ్మడం ప్రత్యామ్నాయం కాదని, బెల్ట్‌షాపుల ద్వారా ఏటా రూ.4 వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి గండిపడుతోందని, వాటి ని యంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించింది. మంగళవారం మఖ్దూంభవన్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర సమితి సమావేశాల్లో చర్చించిన తీర్మానాలను పార్టీ ఆమోదించింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చాలని సీఎం కేంద్రాన్ని కోరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చెప్పారు. -
కేసీఆర్‌కు ఎందుకా కక్కుర్తి: కిషన్ రెడ్డి
ఆధార్ లింకేజి పేరు చెప్పి.. ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ధనిక రాష్ట్రమైనా.. చీప్ లిక్కర్ ఆదాయం కోసం కేసీఆర్ ఎందుకు కక్కుర్తి పడుతున్నారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో మద్యం పాలసీని పునస్సమీక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. మెడికల్ కాలేజీలపై ప్రేమ, ఇంజనీరింగ్ కాలేజీలపై శత్రుత్వం చూపుతున్నారా అని నిలదీశారు. గత సంవత్సరం ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని మొత్తం 12 యూనివర్సిటీలలో ఒక్క వైస్ చాన్స్‌లర్‌ను కూడా నియమించని ఘనత ఒక్క కేసీఆర్‌కు మాత్రమే దక్కుతుందని ఎద్దేవా చేశారు. -
రాష్ట్రంలో పారనున్న చీప్ లిక్కర్
వారంలోగా కర్ణాటక నుంచి రాష్ట్రానికి చవక మద్యం సాక్షి, హైదరాబాద్: నూతన మద్యం విధానం నేపథ్యంలో కొత్తగా రాష్ట్రంలో చీప్ లిక్కర్ పారనుంది. అయితే చీప్ లిక్కర్ కల్తీకి ఆస్కారం లేకుండా టెట్రా ప్యాకెట్లలో విక్రయించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు టెట్రా ప్యాకెట్లు తయారుచేసే యంత్ర పరికరం లేదు. రాష్ట్రంలోనే టెట్రా ప్యాకెట్లు తయారుచేయాలంటే కనీసం మూడు నెలలు పడుతుంది. ఈలోగా కర్ణాటకలో తయారుచేస్తున్న కంపెనీ.. టెట్రా ప్యాకెట్లలో చౌకమద్యం సరఫరాకు అంగీకరించిందని అధికారవర్గాలు తెలిపాయి. రాష్ట్రప్రభుత్వం కర్ణాటక నుంచి దిగుమతి చేసుకోవడానికి అనుమతిస్తే సరిపోతుందన్నాయి. ఈ నేపథ్యంలో వారం రోజుల్లోగా టెట్రా ప్యాకెట్లలో చౌకమద్యం రాష్ట్రంలో అందుబాటులోకి రానుంది. ఒక్కో టెట్రా ప్యాకెట్ రూ.45 నుంచి రూ.50 వరకు ధర ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. తెలంగాణ ప్రభుత్వమూ చౌకమద్యాన్ని అమల్లోకి తేనున్నందున ఆంధ్రప్రదేశ్‌లోనూ చౌకమద్యం తేవాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పాయి. టెట్రా ప్యాకెట్లలో చౌకమద్యాన్ని అమల్లోకి తెస్తే కల్తీ మద్యం, నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం విక్రయాలను నిరోధించవచ్చనేది అధికారుల భావనగా ఉంది. ఇదిలాఉండగా ఒక్కో మద్యం దుకాణం తీసుకునే సరుకులో 25 శాతం మేరకు టెట్రా ప్యాకెట్లు ఉండాలనే నిబంధనను ప్రభుత్వం విధించింది. టెట్రా ప్యాకెట్లలో కల్తీకి అవకాశం లేనందున.. వాటిని తీసుకునేందుకు మద్యం దుకాణదారులు విముఖత వ్యక్తం చేస్తారనే భావనతోనే తప్పనిసరిగా 25 శాతం మేరకు తీసుకోవాలనే నిబంధన విధించినట్లు అధికారులు తెలిపారు. కాగా రాష్ట్రప్రభుత్వమే స్వయంగా మద్యం దుకాణాలను ఏర్పాటుచేసి.. ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా విక్రయాలు జరపనున్నందున ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. బేవరెజెస్ కార్పొరేషన్‌ద్వారా 436 మద్యం దుకాణాలు ఏర్పాటు చేయనున్న విషయం తెలి సిందే. వీటిద్వారా వచ్చే ఆదాయంపై ఆదాయపు పన్ను భారం పడకుండా చర్యలకు ప్రభుత్వం నిర్ణయించింది. కాగా మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఆబ్కారీ కార్యాలయాలముందు దరఖాస్తుదారులు బారులు తీరారు. దరఖాస్తుల స్వీకరణ శనివారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. అయితే భారీసంఖ్యలో దరఖాస్తుదారులు క్యూలో ఉండటంతో రాత్రి పొద్దుపోయే వరకు దరఖాస్తులు స్వీకరించారు. -
సర్కారీ...చౌక మద్యం!
♦ చీప్ లిక్కర్ధర తగ్గించి అమ్మేందుకు సన్నాహాలు ♦ కొత్త పాలసీ రూపకల్పనలో భాగంగా ముందస్తు ప్రయోగం ♦ మూడు మాసాలు పొడిగించనున్న మద్యం దుకాణాల లెసైన్స్ ♦ సెప్టెంబర్ నెలాఖరు వరకు పాత పాలసీ విధానం అమలు సారా మహమ్మారి నుంచి మద్యం ప్రియులను రక్షించేందుకు ప్రభుత్వం నడుంబిగిస్తోంది..పేదల ఇళ్లలో విషాదాన్ని నింపుతున్న గుడుంబాను తరిమికొట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే చౌక మద్యాన్ని ప్రవేశపెట్టాలని యోచి స్తోంది. కొత్త మద్యం పాలసీని సమగ్రంగా రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసి, పాత లెసైన్స్‌ల గడవును మరో మూడు మాసాలు పొడిగించింది. -నల్లగొండ జిల్లాలో పేద, మధ్య తరగతి ప్రజలే సారాకు బానిసలుగా మారుతున్నారు. మూడు పదుల వయసులోనే యువకులు గుడుంబాకు బానిసలై మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి వారి కోసమే గుడుంబా అమ్మకాలను అరికట్టాలంటే దాని స్థానంలో చీప్ లిక్కర్‌ను చౌక ధరకు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం మద్యం దుకాణాల్లో చీప్ లిక్కర్ క్వార్టర్ ఎమ్మార్పీ ధర రూ.60లు ఉంది. అయితే రాబోయే కొత్త పాలసీలో చీప్ లిక్కర్ క్వార్టర్ ధర రూ.30లకే విక్రయించాలనే ప్రతిపాదన ఉంది. దీంతో పాటు పాలసీలో నాలుగైదు కొత్త అంశాలను కూడా చేర్చడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో ఎక్సైజ్ శాఖ రూపొందించిన కొత్త పాలసీ విధానాల పై సంతృప్తి చెందని సీఎం కేసీఆర్ గుడుంబాను నిర్మూలించేందుకు పకడ్బందీ ప్రణాళికను తయారు చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో జిల్లా ఎక్సైజ్ శాఖ నుంచి కూడా అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించారు.దీనిలో భాగంగానే లెసైన్స్ గడువును పొడిగించడంతో పాటు, ఈ మూడు మాసాల కాలంలో చీప్ లిక్కర్ ధర తగ్గించి అమ్మకాలు చేయాలనే ప్రతిపాదన కూడా తీసుకొచ్చారు. ధర తగ్గించి అమ్మడం వల్ల గుడుంబా అమ్మకాలకు అడ్డుకట్టవేయోచ్చన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ విధానాన్ని మూడు మాసాల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయడం ద్వారా ఎలాంటి ఫలితాలు వస్తాయో అంచనా వేసి దాని ప్రకారంగా కొత్త పాలసీ రూపొం దించాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. పాత నిబంధనలే కొనసాగింపు... ఇప్పుడున్న మద్యం పాలసీనే మూడు నెలల వరకు అంటే సెప్టెంబర్ నెలాఖరు వరకు కొన సాగించాలని నిర్ణయించారు. పాత పాలసీలో ఉన్న విధానాలనే మూడు నెలల పాటు అమలు చేయడం జరుగుతుంది. ఉదాహరణకు పట్టణాల్లో మద్యం దుకాణాల లెసైన్స్ ఫీజు రూ .42 లక్షలు ఉంది. దీనిని మూడు స్లాబుల్లో వసూలు చేస్తున్నారు. లెసైన్స్ ఫీజుకు సరిపడా ఏడు రెట్ల మద్యాన్ని 20 శాతం మార్జిన్‌తో ఇస్తున్నారు. ఏడు రెట్లు స్టాకు పూర్తయిన తర్వాత 13.65 శాతాన్ని అడిషనల్ ప్రివిలైజ్ ట్యాక్స్ రూపంలో ప్రభుత్వం మినహాయిస్తుంది. ఇదే విధానాన్ని ఈ మూడు నెలలకు విభజించి అమలు చేయడం జరుగుతుంది. అదెలాగంటే రూ.42 లక్షల లెసైన్స్ ఫీజు మూడు మాసాలకు లెక్కించినట్లయితే రూ.10.50 లక్షలు అవుతుంది. దానికి ఏడు రెట్లు అంటే రూ.73.50 లక్షల మద్యాన్ని లెసైన్స్‌దారులకు ఇస్తారు. ఈ ఏడు రెట్ల మద్యం అమ్మకాలు దాటినట్లయితే అప్పుడు 13.65 శాతం ప్రివిలైజ్ టాక్స్ ప్రభు త్వ ఖజానాల్లోకి వెళ్తుంది. మద్యం దుకాణాల్లో పర్మిట్ రూమ్ లెసైన్స్ ఫీజు రూ.2 లక్షలు కాకుండా మూడు మాసాలకు మాత్రమే వసూలు చేస్తారు. ఈ నెలాఖరు నాటికి వ్యాపారులు ముందుకు వచ్చి లెసైన్స్ రెన్యువల్ చేసుకుంటే అట్టి దుకాణాలకు కొత్తగా టెండర్లు పిలుస్తారు. -
....ఏరులు పారించారు
ఊరూ వాడా బెల్టు షాపులు పెట్టింది బాబు హయాంలోనే మద్యం వూఫియూకు పాలనలో చోటిచ్చిన ఘనుడు - వి. సంధ్య, రాష్ట్ర అధ్యక్షురాలు, ప్రగతిశీల వుహిళా సంఘం ‘వారుణివాహిని.. ఖజానాకు బంగారు బాతు..’ అని సాక్షాతు అసెంబ్లీలో తెలుగుదేశం ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకుంది. సీసాల్లో ఉండే వుద్యం చిన్నపాటి ప్యాకెట్ల ద్వారా ఇంటింటికీ అందేలా చేసిందీ ఆ ప్రభుత్వమే. వుద్యం అవ్ముకాలపై టార్గెట్స్ నిర్ణరుుంచిందీ.. ఊరూవాడల్లో బెల్టు షాపులు పెట్టిందీ.. ఐఎంఎఫ్ఎల్ చీప్ లిక్కర్‌ను వూర్కెట్లోకి తెచ్చింది నాటి వుుఖ్యవుంత్రి చంద్రబాబునాయుుడి సర్కారే. చివరికి వుద్యం వూఫియూ నేరుగా ప్రభుత్వ విధానాల్లో జోక్యం చేసుకునే స్థారుుకి తీసుకొచ్చిన అపకీర్తిని వుూటగట్టుకున్నది చంద్రబాబే! అసెంబ్లీలోనే ఒప్పుకున్న బాబు అసెంబ్లీలో మద్యం వూఫియూ ఆగడాలపై చర్చ జరిగి నప్పుడు ప్రభుత్వం ప్రకటించిన బూట్‌లెగ్గర్స్ (అక్ర వు వుద్యం వ్యాపారి) జాబితాలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారని కూడా చంద్రబాబు ఒప్పుకున్నారు. చంద్రబాబునాయుుడి తవుు్మడు, నాడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న నారా రావుూ్మర్తినాయుుడికి కూడా వుద్యం వూఫియూతో సంబంధాలున్నారుు. అలాంటి వాళ్లపై చంద్రబాబు చర్యలు తీసుకోకపోగా వాళ్లు ఎగిరెగిరిపడకుం డా లొంగదీసుకునేందుకు రాజకీయుంగా వాడుకున్నా రు. పాతిక సంవత్సరాలుగా వుద ్యం వూఫియూ రాజకీయూల్ని శాసిస్తోంది. మద్యం మాఫియా ఇది వరకు సినివూ, రియుల్ ఎస్టేట్, విద్యా వ్యాపారాలకు ఆర్థిక సాయుం చేసే స్థారుులో ఉండేది. రాజకీయుపార్టీల్ని ప్రభావితం చేసే స్థారుులో ఉండేది. క్రవుంగా చంద్రబాబునాయుుడి పాలనలో ఏకంగా విధాన నిర్ణయూల్లో జోక్యం చేసుకునే స్థారుుకి చేరింది. అంతకు వుుందే వుద్యం వుహవ్మూరికి ఎంతో వుంది బాని సలు కావడంతో గ్రామీణ వుహిళలు ఉద్యమించారు. కారం, చీపుళ్లు పట్టుకుని సారా దుకాణాల్ని ధ్వంసం చేశారు. దూబగుంటలోనే కాదు అనేక గ్రావూల్లో వుహిళలు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేశారు. అప్పుడు వుద్య వ్యతిరేక పోరాట కమిటీలో టీడీపీ లేదు. వావుపక్షాలు, పీవోడబ్ల్యూ వంటి సంస్థలతో కమిటీ పనిచేసింది. ఉద్యవూన్ని సొవుు్మ చేసుకున్న టీడీపీ 1993 అక్టోబర్ 2న హైదరాబాద్‌లో గాంధీ విగ్రహానికి పూల వూలలు వేసేందుకు ప్రతిపక్ష నాయుకుడి హోదాలో ఎన్టీ రా వూరావు, ఆయున వెంట నారా చంద్రబాబునాయుుడు వస్తే అడ్డుకున్నాం. టీడీపీకి కూడా వుద్యం వూఫియూతో సంబంధాలు ఉన్నారుు. రేపు వుళ్లీ అధికారంలోకి వచ్చినా టీడీపీలో వూర్పేమీ ఉండదనే ఉద్దేశంతో అడ్డుకున్నాం. ప్రతిపక్ష నాయుకుడ్ని కూడా ఉద్యవుం లోకి రానీయురా.. గాంధీ విగ్రహానికి దండ వేయునీయురా.. అని చంద్రబాబు ప్రశ్నించారు. వారుణివాహిని పేరుతో సారాను ప్యాకెట్ల ద్వారా విచ్చలవిడిగా వుద్యం వినియోగంలోకి తేవడమే కాకుండా వారుణివాహిని ప్రభుత్వ ఖజానాకు బంగారు బాతు.. అని అసెంబ్లీలో చెప్పుకున్నారు. మీరు గాంధీ విగ్రహానికి దండ వేయుడానికి వీల్లేదు.. అని బదులిచ్చాం. ఎన్టీ రావూరావుకు బాగా కోపం వచ్చింది. మీకు ఏం కావాలో చెప్పండి.. అని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే సంపూర్ణ వుద్య నిషేధం అవులు చేయూలన్న డివూండ్ ఆయున వుుందు పెట్టగానే అందుకు ఎన్టీఆర్ అంగీకరించాకే గాంధీ విగ్రహానికి దండ వేశారు. ప్రతిపక్ష నేత ఎన్టీఆర్ దండ వేశాక సీఎం కోట్ల విజయుభాస్కరరెడ్డి గాంధీ విగ్రహానికి దండ వేయుకపోతే ప్రతిష్ట దెబ్బతింటుందని పోలీసులు భావించి పెద్ద ఎత్తున లాఠీచార్జి చేశారు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ వుద్యం వ్యతిరేక ఉద్యవూన్ని రాజకీయుంగా అందివచ్చిన ప్రతి వేదికపైనా వాడుకుంది. పన్ను పోటు పొడిచి.. ఆపై వుద్యం ఏరులైపారించి.. అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ హెల్త్ పర్మిట్లు మినహా సం పూర్ణ వుద్య నిషేధం ఫైలుపై తొలి సంతకం చేశారు. వెన్నుపోటుదారుడు చంద్రబాబునాయుుడు అడ్డదారిలో సీఎం పగ్గాలు అందుకున్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయున కంటే తనకే వుద్యనిషేధంపై ఎక్కువ చిత్తశుద్ధి ఉందని చెప్పుకుని నాటకాలు ఆడారు. వుద్యం హెల్త్ పర్మిట్లను సైతం రద్దు చేశారు. సంపూర్ణ వుద్య నిషేధం వల్ల రోడ్డు ప్రవూదాలు తగ్గారుు. జనం కొనుగోలు శక్తి పెరిగింది. ప్రజల ఆరోగ్యం మెరుగుపడింది. జనం జీవన ప్రవూణాలు మెరుగుపడ్డారుు.. అని తెలుగుదేశం ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకుంది. హెల్త్ పర్మిట్లు రద్దు చేసిన కొద్ది రోజులకే దశలవారీగా వుద్యానికి ద్వారాలు తెరిచేందుకు చంద్రబాబు చకచకా పావులు కదిపారు. దశలవారీగా వుద్య నిషేధాన్ని సడలించుకుపోయూరు. అప్పటికే వుద్యనిషేధం కారణంగా రాష్ట్ర ఆదాయుం పడిపోరుుందని చెప్పి జనంపై వేల కోట్ల రూపాయుల మేరకు మోపిన పన్నుల భారాన్ని వూత్రం యుథాతథంగా వసూలు చేరుుంచారు. బార్లకు తలుపులు బార్లా తీశారు. బ్రూవరీస్‌కు కూడా అనువుతులు ఇచ్చేశారు. ఇక్కడ వుద్యం ఉత్పత్తులు ఉన్నా ఇతర రాష్ట్రాల నుంచి అధిక ధరలకు కొనుగోళ్లు చేసి ఆ మేరకు వుద్యంబాబుల నుంచి వసూళ్లు చేశారు. ఇలా చేసిన వాళ్లల్లో కిరణ్‌కువూర్‌రెడ్డి కూడా ఉన్నారు. మద్యం అవ్ముకాలకు టార్గెట్లు: వుద్యం అవ్ముకాలకు టార్గెట్లు నిర్ణరుుంచిన చంద్రబాబు అందుకోసం పల్లెలకు, వాడలకు కూడా వుద్యం అందుబాటులో ఉండేలా బెల్ట్ షా పులు పెట్టడంతో జనంలో వుళ్లీ వ్యతిరేకత వచ్చింది. వుద్యం వుహవ్మూరికి ఎంతోవుంది యుువకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నారుు. గ్రావూల్లో 35-50 వుధ్య వయుస్కుల చావులు పెరిగారుు. బతికి ఉన్నా వుద్యం తాగడం తప్ప ఏ పనీ చేయులేని నిస్సహాయుతతో కాలం వెళ్లదీస్తున్నారు. గ్రావూల్లో యుువ వితంతువుల సంఖ్య పెరుగుతోంది. వారితోబాటు తాగుబోతులతో బతుకువెళ్లదీయులేక ఒంటరి జీవితం గడుపుతున్నవారి సంఖ్య కూడా పెరుగుతోంది. విం తువుల్లో 36 శాతం వుంది ఇలాంటి వారే ఉన్నారంటే వుద్యం ఎంతగా ప్రతికూల ఫలితాలిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఒక పక్క ప్రభుత్వం వుద్యం ఏరుల్లా పారించి భర్త ప్రాణాలు పోయేలా చేసి వురో పక్క వితంతువులకు పింఛన్లు ఇవ్వడవుంటే ఎంత దుర్మార్గమో చెప్పడానికి వూటలు రావడం లేదు. ఒకప్పుడు ఆదివాసీలు కల్లు, విప్పసారా తాగేవారు. ఇప్పుడు సర్కార్ పుణ్యవూని అక్కడ కూడా బెల్టు షాపులు ప్రత్యక్షం అయ్యూరుు. వ్యభిచారకూపంలో కూరుకుపోరుున 38 వుందికి వివుుక్తి కలిగినప్పుడు వారిని విచారిస్తే అందులో పన్నెండు వుంది భర్తలు తాగి హింసకు గురిచేయుడం వల్లే ఆ వూర్గంలో ఉన్నారని తేలింది. వురోసారి 125 వుందికి వివుుక్తి లభిస్తే, భర్త తాగడం వల్ల తవు కుటుంబం, పిల్లల పోషణ కోసం గత్యంతరం లేకే ఈ దారికి వచ్చావుని చెప్పా రు. చంద్రబాబు పాలనలో వుద్యం ఏరులై పారడంతో వుళ్లీ జనంలో తీవ్ర వ్యతిరేకత వస్తే, ఈసారి కాంగ్రెస్ సొవుు్మ చేసుకునే ప్రయుత్నం చేసింది. దశలవారీగా వుద్యనియుంత్రణ చేస్తావుని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అందుకు విరుద్ధంగా చేసిం ది. ఉపాధి కూలీల సొవ్ముంతా వుద్యం కొనుగోళ్ల ద్వారా తిరిగి ప్రభుత్వ ఖజానాకే చేరింది. జేబులో పెట్టుకునేంత చిన్న సైజు సీసాల్లో వుద్యం వాడుకలోకి వచ్చింది. ప్రభుత్వ బలహీనతల్ని సొవుు్మ చేసుకుని ఖజానాను నింపుకునే నేతల్ని, రాజకీయుపార్టీల్నీ వుహిళలు నిలదీయూలి.