మద్యపాన నిషేధం విధించాలి
రాష్ర్టంలో మద్యపానం నిషేధం విధించాలి. ఒకవైపు బలహీనవర్గాల కోసం పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామంటూనే చీప్ లిక్కర్‌తో బడుగుల జీవితాలను కొల్లగొట్టి, వారి ఆరోగ్యాలను గుల్ల చేస్తున్నారు. ఇతర రూపాల్లో ఆదాయం కోసం ప్రయత్నించాలి. యాదగిరిగుట్ట, వేములవాడ గుళ్లకు బడ్జెట్ కేటాయించి, చదువుల తల్లి సరస్వతి దేవాలయం బాసర పట్ల చిన్నచూపు సరికాదు. సొంత వనరులు లేకుండా అభివృద్ధి ఎలా సాధ్యం..?
- ఆకుల లలిత, కాంగ్రెస్ ఎమ్మెల్సీ