హైదరాబాద్ : చీప్ లిక్కరును ప్రభుత్వమే అమ్ముతూ తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా మార్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి డి.కె.అరుణ విమర్శించారు. మాజీమంత్రి వి.సునీతా లక్ష్మారెడ్డితో కలిసి అసెంబ్లీ ఆవరణలో సోమవారం ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో గుడుంబా అమ్మకాలను అరికట్టలేకపోవడం ప్రభుత్వ చేతకానితనమేనని విమర్శించారు. చీప్ లిక్కరును అమ్ముతూ యువతను, ప్రజలను తాగుబోతులుగా చేస్తారా అని ఆమె ప్రశ్నించారు.
తాగుబోతుల తెలంగాణ చేస్తారా? : డీకే అరుణ
Published Mon, Aug 24 2015 7:49 PM | Last Updated on Wed, Oct 3 2018 7:31 PM
Advertisement