
'మంత్రి ఆ మాట చెప్పడం సిగ్గుచేటు'
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చీప్ లిక్కర్ అమ్మకాల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.
గాంధీ జయంతిలోగా చంద్రశేఖర్ రావు ప్రభుత్వం చీప్ లిక్కర్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని, లేకుంటే బంద్ చేస్తామని ఎర్రబెల్లి హెచ్చరించారు. గుడుంబాను అరికట్టకపోతే దిగిపోవాలని, చీప్ లిక్కర్తో గీతకార్మికులకు అన్యాయం చేయవద్దని అన్నారు. సచివాలయంలో ఓ మంత్రి.. చీప్ లిక్కర్ను ఆయుష్షు పెంచే సంజీవనిగా పేర్కొనడం సిగ్గుచేటని ఎర్రబెల్లి విమర్శించారు.