పట్టుబడిన నిందితులతో పోలీసులు
పార్వతీపురం : పార్వతీపురం ఏజెన్సీ ప్రాంతంలో పార్వతీపురం ఎక్సైజ్ అధికారులు శనివారం జరిపిన దాడుల్లో తొమ్మిది రబ్బరు ట్యూబుల్లో 180 లీటర్ల నాటుసారాతో పాటు మూడు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని సీఐ ఎస్. విజయ్‌కుమార్ తెలిపారు. దీనికి సంబంధించి ఆయన అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. జియ్యమ్మవలస మండలంలోని రావాడ గ్రామ జంక్షన్ వద్ద కడ్రక మల్లేసు (కర్లగూడ), జీలకర్ర సందురు (చింతపాడు) కిల్లక వసంత్ (చింతలపాడు) నుంచి 180 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నామన్నారు. నాటుసారా గురించి పట్టుబడిన వారిని ప్రశ్నించగా నిమ్మక శిరయ్య, నిమ్మక సూరి, కిల్లక సంతోష్, బొమ్మాళి అనిల్, మీసాల చినబాబు, తదితరుల పాత్ర ఉన్నట్లు తెలిపారన్నారు. వీరిని కూడా తొందరలోనే పట్టుకొని అరెస్ట్ చేస్తామన్నారు. ఈ దాడుల్లో ఎస్సై జె. రాజశేఖర్ సిబ్బంది పాల్గొన్నారన్నారు.