రెండు ఇంధనాలతో మహీంద్రా వాహనాలు | Mahindra launches Supro CNG Duo as its first Dual-Fuel SCV | Sakshi
Sakshi News home page

రెండు ఇంధనాలతో మహీంద్రా వాహనాలు

Published Fri, Jun 9 2023 4:26 AM | Last Updated on Fri, Jun 9 2023 4:26 AM

Mahindra launches Supro CNG Duo as its first Dual-Fuel SCV - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా రెండు రకాల ఇంధనాలతో నడిచే వాహన విభాగంలోకి ప్రవేశించింది. సుప్రో సీఎన్‌జీ డువో పేరుతో మోడల్‌ను విడుదల చేసింది. ధర ఢిల్లీ ఎక్స్‌షోరూంలో రూ.6.32 లక్షలు. ఈ తేలికపాటి వాణిజ్య వాహనం సీఎన్‌జీ, పెట్రోల్‌తో నడుస్తుంది. 750 కిలోల బరువు మోయగలదు. 75 లీటర్ల సీఎన్‌జీ ట్యాంక్, 5 లీటర్ల పెట్రోల్‌ ట్యాంక్‌ ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయి సామర్థ్యంతో 325 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

మైలేజీ కిలోకు 23.35 కిలోమీటర్లు ఇస్తుందని కంపెనీ తెలిపింది. ‘సీఎన్‌జీ వాహనాల డిమాండ్‌ నాలుగేళ్లలో నాలుగురెట్లు పెరిగింది. సీఎన్‌జీ అవసరాన్ని ఇది సూచిస్తుంది. దేశవ్యాప్తంగా 2 టన్నులలోపు సామర్థ్యం గల తేలికపాటి వాణిజ్య వాహనాల అమ్మకాలు నెలకు 16,000 యూనిట్లు. ఇందులో సీఎన్‌జీ వాటా సుమారు 5,000 యూనిట్లు’ అని మహీంద్రా వైస్‌ ప్రెసిడెంట్‌ బానేశ్వర్‌ బెనర్జీ ఈ సందర్భంగా తెలిపారు. సుప్రో సీఎన్‌జీ డువో రాకతో నెలవారీ అమ్మకాలు రెండింతలు అవుతాయని సంస్థ భావిస్తోంది. 1.5తోపాటు 2 టన్నుల విభాగంలోనూ రెండు రకాల ఇంధనాలతో నడిచే మోడళ్లను తేనున్నట్టు వెల్లడించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement