
బజాజ్ ఆటో నుంచి నూతన వెర్షన్ ప్లాటినా 110 సీసీ బైక్ సోమవారం మార్కెట్‌లో విడుదలైంది. యాంటీ–స్కిడ్ బ్రేకింగ్ వ్యవస్థ, ట్యూబ్‌లెస్ టైర్లు వంటి అధునాత ఫీచర్లను కలిగిన ఈ బైక్ ధర రూ.49,197 (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించినట్లు కంపెనీ వెల్లడించింది. రోడ్లపై గతుకుల ఇబ్బంది అంతగా తెలియకుండా ఉండేలా అత్యాధునిక షాక్ అబ్జార్బర్స్‌ను ఏర్పాటుచేసినట్లు తెలిపింది.
బైక్ విడుదల సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్ (మోటార్ సైకిల్ బిజినెస్) ఎరిక్ వాస్ మాట్లాడుతూ.. ‘విజయవంతంగా ప్రయాణిస్తున్న ప్లాటినా 100 ఈఎస్ ప్రయాణానికి తాజాగా మరో బైక్ తోడయింది. 100 సీసీ విభాగంలో ప్రీమియం మోడల్‌ను కొరుకునే వినియోగదారులకు ఈ బైక్ ఒక మంచి ఆప్షన్‌గా నిలవనుంది.’ అని వ్యాఖ్యానించారు.