1/14
ఐఫోన్ 16 సిరీస్‌లో ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రొ, ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్ మోడళ్లను విడుదల చేసిన యాపిల్ సంస్థ
2/14
డిస్‌ప్లే: 6.1-అంగుళాల (iPhone 16), 6.7-అంగుళాల (iPhone 16 Plus) ఉండగా..గరిష్టంగా 2,000 బ్రైట్‌నెస్‌తో సూపర్ రెటినా ఎక్స్‌ట్రీమ్ డైనమిక్ రేంజ్ డిస్‌ప్లేని అందించింది యాపిల్ సంస్థ
3/14
కెమెరా: ఈ లేటెస్ట్ ఐఫోన్ 16సిరీస్ ఫోన్‌లలో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాతో లేటెస్ట్ టెక్నాలజీతో డ్యూయల్ కెమెరా సిస్టమ్ సైతం ఉంది. ఫోన్‌లో మరోవైపు కెమెరాను కంట్రోల్ చేసే ఫీచర్ ఉంది
4/14
ప్రాసెసర్:ఐఫోన్ 16 సిరీస్‌లో ఏ18 చిప్‌తో వస్తున్నాయి. న్యూరల్ ఇంజిన్‌తో కూడిన ఈ చిప్ గత సిరీస్‌ల కంటే రెండు రెట్లు వేగవంతంగా పనిచేస్తుందని యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు
5/14
యాపిల్ ఇంటెలిజెన్స్:ఐఫోన్ 16 సిరీస్ వినియోగదారులు మెయిల్స్,నోట్స్,ఇతర టెక్ట్స్ సంబంధిత కార్యకలాపాల్ని చక్కబెట్టుకోవచ్చు. యాపిల్ ఇంటెలిజెన్స్ సాయంతో మీరు ఏదైనా చదువుకునే టెక్ట్స్ కావొచ్చు. లేదంటే న్యూస్ కావొచ్చు.
6/14
వచ్చే నెలలో ఈ టెక్నాలజీ బీటా వెర్షన్‌లో ఇంగ్లీష్‌లో రిలీజ్ చేయనుంది యాపిల్ సంస్థ. ఆ తర్వాత చైనీస్, ఫ్రెంచ్, జపనీస్, స్పానిష్ భాషల్లో ఇది విడుదల కానుంది.
7/14
యాక్షన్ బటన్: కెమెరా కంట్రోల్ బటన్, యాక్షన్ బటన్ అనే రెండు కొత్త బటన్లను జత చేశారు. కెమెరా కంట్రోల్ బటన్ ద్వారా ‘విజువల్ ఇంటెలిజెన్స్’తో మాక్రో ఫొటోలు, స్పేషియల్ ఫొటోలు/వీడియోలు తీసుకోవచ్చు.
8/14
డిజైన్: ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లను 50శాతం ఎయిరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియంతో రూపొందించారు.
9/14
బ్యాటరీ లైఫ్: యూఎస్‌బీ-సి ఛార్జింగ్ పోర్టుతో ఎయిర్‌పాడ్స్ 4 కేస్‌ను తీసుకొచ్చింది యాపిల్ సంస్థ.గత సిరీస్ ఫోన్‌లలోని బ్యాటరీతో పోలిస్తే బ్యాటరీ సైజ్ 9శాతం ఎక్కువ
10/14
రంగులు: అల్ట్రామెరైన్, టీల్, పింక్, వైట్, బ్లాక్ రంగుల్లో లభిస్తాయి
11/14
వీటి అమ్మకాలు ఈ నెల 20 నుంచి మొదలవుతాయి
12/14
13/14
14/14