న్యూఢిల్లీ, సాక్షి: కొత్త ఏడాది(2021)లో లగ్జరీ కార్ల విభాగం మరింత వేడెక్కనుంది. ఈ విభాగంలో ఆడి A4 సెడాన్ మార్కెట్లో విడుదల కానుంది. ఇప్పటికే రూ. 2 లక్షల టోకెన్ అడ్వాన్స్‌తో దేశీయంగా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆడి డీలర్లు, అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. జనవరి 5న ఆడి కొత్త A4 సెడాన్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తో్ంది. 2 లీటర్ల పెట్రోల్ టీఎఫ్‌ఎస్‌ఐ ఇంజిన్‌తో రూపొందిన ఈ కారు వేరియంట్స్ రూ. 42-48 లక్షల ఎక్స్‌షోరూమ్ ధరలలో లభించనున్నట్లు ఆటో వర్గాలు తెలియజేశాయి. నిజానికి ఈ ఏడాది(2020)లో ఆడి పలు మోడళ్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. A8 L, Q2, Q8, Q8 సెలబ్రేషన్, ఆర్‌ఎస్ Q8, ఆర్‌ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ మోడల్ కార్లతో సందడి చేసింది. చదవండి: (కార్ల మార్కెట్లో ఆ 5 కంపెనీలదే హవా)
ఎడ్జస్టబుల్ సీట్స్
కొత్త ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ డిజైన్లలో A4 రూపొందింది. లెడ్ హెడ్‌ల్యాంప్స్, లెడ్ టెయిల్ ల్యాంప్స్‌తోపాటు బంపర్‌ను సైతం అప్‌డేట్ చేసింది. కేబిన్‌లో 10.1 అంగుళాల ఇన్ఫోటెయిన్‌మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేసుకునేందుకు వీలయ్యే సీట్లు, 3 జోన్ క్లయిమేట్ కంట్రోల్, వర్చువల్ కాక్‌పిట్, యాంబియెంట్ లైటింగ్, వైర్‌లెస్ చార్జింగ్, సన్‌రూఫ్‌తోపాటు 8 ఎయిర్‌బ్యాగ్స్‌తో A4 సెడాన్ వెలువడనున్నట్లు ఆటో రంగ నిపుణులు భావిస్తున్నారు. గరిష్టంగా 190 బీహెచ్‌పీ పవర్‌ను అందుకోగల, 7స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమాటిక్ ఫీచర్స్‌తో వెలువడనుంది. 7.3 సెకన్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్నిఅందుకోగలదని అంచనా. కాగా.. లగ్జరీ సెడాన్ విభాగంలో మెర్సిడీస్ బెంజ్ C-క్లాస్, బీఎండబ్ల్యూ 3 సిరీస్, జాగ్వార్ ఎక్స్‌ఈలతో A4 పోటీ పడగలదని ఆటో నిపుణులు పేర్కొన్నారు. కొత్తగా విడుదలకానున్న వోల్వో S60కు సైతం పోటీగా నిలిచే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment