హోండా ‘సిటీ’.. కొత్త అప్‌డేటెడ్‌ వెర్షన్‌ | 2017 Honda City launched in carmaker's push for more premium models in India | Sakshi
Sakshi News home page

హోండా ‘సిటీ’.. కొత్త అప్‌డేటెడ్‌ వెర్షన్‌

Published Wed, Feb 15 2017 1:01 AM | Last Updated on Tue, Sep 5 2017 3:43 AM

హోండా ‘సిటీ’.. కొత్త అప్‌డేటెడ్‌ వెర్షన్‌

హోండా ‘సిటీ’.. కొత్త అప్‌డేటెడ్‌ వెర్షన్‌

ప్రారంభ ధర రూ.8.5 లక్షలు
న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘హోండా’ తాజాగా తన సెడాన్‌ కారు ‘సిటీ’లో కొత్త అప్‌డేటెడ్‌ వెర్షన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.8.5 లక్షలు– రూ.13.58 లక్షల (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ) శ్రేణిలో ఉంది. ‘కస్టమర్ల అంచనాలను పరిగణనలో ఉంచుకొని, అందుబాటులో ధరల్లో ఈ కారును రూపొందించాం. ఈ కారుతో తిరిగి మేం సెడాన్‌ విభాగంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటాం’ అని హోండా కార్స్‌ ఇండియా ప్రెసిడెంట్, సీఈవో యోచిరో యునో తెలిపారు. ఈ కొత్త అప్‌డేటెడ్‌ సిటీ కారు పెట్రోల్, డీజిల్‌ ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

1.5 లీటర్‌ ఇంజిన్‌ను కలిగిన పెట్రోల్‌ వేరియంట్‌ ధర రూ. 8.5 లక్షలు–రూ.13.52 లక్షల శ్రేణిలో ఉంటుందని తెలిపారు. అలాగే 1.5 లీటర్‌ ఇంజిన్‌ కలిగిన డీజిల్‌ వేరియంట్‌ ధర రూ.10.76 లక్షలు–రూ.13.58 లక్షల శ్రేణిలో ఉంటుందని పేర్కొన్నారు. ఈ ధరలన్నీ ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీవి. కొత్త వెర్షన్‌ సిటీలో డ్యూయెల్‌ ఎయిర్‌బ్యాగ్స్, యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ వంటి ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. కాగా ఇది మారుతీ సియాజ్‌కు గట్టిపోటీనిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement