Mercedes-Benz EQB launched for Rs 74.50 lakh in India - Sakshi
Sakshi News home page

బెంజ్ కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వచ్చేసింది: త్వరపడకపోతే..!

Published Fri, Dec 2 2022 2:57 PM | Last Updated on Fri, Dec 2 2022 6:38 PM

Mercedes Benz EQB introduced in India at Rs 74 lakh - Sakshi

సాక్షి, ముంబై: లగ్జరీ కార్‌ మేకర్‌ మెర్సిడెస్ బెంజ్ మరో కొత్త 'ఈక్యూబి' ఎలక్ట్రిక్ కారుని తీసుకొచ్చింది. ఈక్యూబి పేరుతో భారతీయ మార్కెట్లలో లాంచ్‌ చేసిన  ఈ కారు  ధరను రూ. 74.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా నిర్ణయించింది.

 బెంజ్‌ ఈక్యూబి  ఎలక్ట్రిక్ కారు కోసం బుకింగ్‌లను కూడా షురూ చేసింది.  ఆసక్తి ఉన్న కస్టమర్లు  కేవలం రూ. 1.5 లక్షలు చెల్లించి ముందస్తుగా  బుక్ చేసుకోవచ్చు.మెర్సిడెస్ బెంజ్ ఈక్యూబి 300, మెర్సిడెస్ బెంజ్ ఈక్యూబి 350 అనే రెండు వేరియంట్లలో స్మోస్ బ్లాక్, రోజ్ గోల్డ్, డిజిటల్ వైట్, మౌంటైన్ గ్రే , ఇరిడియం సిల్వర్ అనే 5 కలర్ ఆప్సన్స్ లో  లభ్యం. దీంతోపాటు జీఎల్‌బీ  త్రి-రో ఎస్‌యూవీని కూడా తీసుకొచ్చింది.  దీని ధర రూ. 63.8 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం. 

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూబి,  బ్యాటరీ
బెంజ్ ఈక్యూబి ఎలక్ట్రిక్ ఎస్‌యువిలో 66.5kWh బ్యాటరీని జోడించింది.ఈ బ్యాటరీ ప్యాక్ 225bhp ,390Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. AC , DC ఛార్జింగ్ రెండింటినీ సపోర్ట్ చేసే మోడల్, WLTP-సర్టిఫైడ్  బ్యాటరీ ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 423 కిమీ రేంజ్ అందిస్తుంది.100 కిలో వాట్ DC ఫాస్ట్ ఛార్జర్‌ ద్వారా కేవలం 32 నిముషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు. ఈ బ్యాటరీ మీద 8 సంవత్సరాల వారంటీని అందిస్తుంది. 11 కిలోవాట్ AC ఛార్జర్ ఉపయోగించి 10 నుంచి 100 శాతం ఛార్జ్ చేసుకోవడానికి 6 గంటల 25 నిముషాల సమయం పడుతుందని కంపెనీ తెలిపింది .

డిజైన్‌, ఫీచర్లు
స్వెప్ట్‌బ్యాక్ LED హెడ్‌ల్యాంప్‌లు, బ్లాంక్డ్ ఆఫ్ గ్రిల్, స్పిట్ LED టెయిల్ లైట్లు, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, పవర్డ్ టెయిల్‌గేట్, వైర్‌లెస్ ఛార్జింగ్ USB టైప్-C పోర్ట్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్,  రీప్రొఫైల్డ్ ఫ్రంట్ , రియర్ బంపర్‌ యాంబియంట్ లైటింగ్‌తో పాటు  10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌,ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్‌ లాంటి ఫీచర్లు  ఇందులో జోడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement