ముంబై: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ రూ.1 కోటి కంటే అధిక ధర కలిగిన టాప్ ఎండ్ మోడళ్లను భారత్‌కు తీసుకురానుంది. మెట్రోయేతర నగరాల నుండి కూడా డిమాండ్ వేగంగా పెరుగుతుండడం ఇందుకు కారణమని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు.
టాప్ ఎండ్ వెహికల్స్ (టీఈవీ) వాటా సంస్థ మొత్తం విక్రయాల్లో 25 శాతం ఉందన్నారు. ఏఎంజీ ఎస్‌ఎల్55 4మేటిక్ ప్లస్ రోడ్‌స్టర్ విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దీని ధర ఎక్స్‌షోరూంలో రూ.2.35 కోట్లు.
Comments
Please login to add a commentAdd a comment