ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మారుతి సుజుకీ జిమ్నీ ఎట్టకేలకు వచ్చేసింది. భారత్‌లో రూ. 12.7 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధరతో అడుగుపెట్టింది. ఈ ఎస్‌యూవీ జీటా, ఆల్ఫా అనే రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన ఆల్ఫా వేరియంట్‌లో టాప్ ధర రూ. 15.05 లక్షలు (ఎక్స్ షోరూమ్).
మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ ఎస్‌యూవీని భారత్‌లో నెక్సా షోరూమ్‌ల ద్వారా కస్టమర్లు రూ. 11,000 చెల్లించి బుకింగ్ చేసుకున్నారు. కొత్త జిమ్నీ 103 హార్స్‌పవర్, 134 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. కస్టమర్లు తమకు కావాల్సిన విధంగా 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 4-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మధ్య ఎంచుకునే అవకాశాన్ని కంపెనీ కల్పించింది.
మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్ ఎస్‌యూవీకి పోటీగా మహీంద్రా 5-డోర్ థార్‌ను రంగంలోకి దించుతోన్న విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2023లో దీన్ని పరిచయం చేసింది.మారుతి సుజుకి కొత్త జిమ్నీ ఇప్పటికే 30,000 కంటే ఎక్కువ బుకింగ్‌లు సాధించింది. ఇప్పటి వరకు జిమ్నీ 3-డోర్ వెర్షన్‌ను ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో విక్రయించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3.2 మిలియన్ యూనిట్ల జిమ్నీని విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. కొత్త 5-డోర్ వెర్షన్‌తో మారుతి సుజుకి భారతీయ ఎస్‌యూవీ మార్కెట్లో అగ్రస్థానాన్ని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
చవకైన 4X4 కారు
మారుతి సుజుకి జిమ్నీ భారత్‌లో చవకైన 4X4 కారుగా అవతరించింది. లుక్స్ పరంగా మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్.. 3-డోర్ జిమ్నీని పోలి ఉంటుంది. రౌండ్ హెడ్‌ల్యాంప్‌లు, బ్లాక్ అవుట్ గ్రిల్స్ దానిలాగే ఉంటాయి. కారు వెనుక భాగం కూడా అలాగే ఉంటుంది. పొడవైన వీల్‌బేస్ కారణంగా రెండు వైపులా గుర్తించదగిన మార్పు కన్పిస్తుంది. క్యాబిన్ విషయానికి వస్తే ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్లైమేట్ కంట్రోల్, USB-C పోర్ట్‌లు, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, సన్‌రూఫ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
భద్రత పరంగా మారుతి సుజుకి జిమ్నీ 5-డోర్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌పీ, హిల్-హోల్డ్ అసిస్ట్, వెనుక ప్రయాణికులకు మూడు పాయింట్ సీట్‌బెల్ట్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్‌లు, హిల్ డిసెంట్ కంట్రోల్ వంటివి ఉన్నాయి.
ఇదీ చదవండి: హోండా ఎలివేట్ వచ్చేసింది.. 2030కల్లా 5 ఎస్‌యూవీలు
Comments
Please login to add a commentAdd a comment