India Markets
-
బెంజ్ కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ వచ్చేసింది: త్వరపడకపోతే..!
సాక్షి, ముంబై: లగ్జరీ కార్ మేకర్ మెర్సిడెస్ బెంజ్ మరో కొత్త 'ఈక్యూబి' ఎలక్ట్రిక్ కారుని తీసుకొచ్చింది. ఈక్యూబి పేరుతో భారతీయ మార్కెట్లలో లాంచ్ చేసిన ఈ కారు ధరను రూ. 74.50 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా నిర్ణయించింది. బెంజ్ ఈక్యూబి ఎలక్ట్రిక్ కారు కోసం బుకింగ్‌లను కూడా షురూ చేసింది. ఆసక్తి ఉన్న కస్టమర్లు కేవలం రూ. 1.5 లక్షలు చెల్లించి ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.మెర్సిడెస్ బెంజ్ ఈక్యూబి 300, మెర్సిడెస్ బెంజ్ ఈక్యూబి 350 అనే రెండు వేరియంట్లలో స్మోస్ బ్లాక్, రోజ్ గోల్డ్, డిజిటల్ వైట్, మౌంటైన్ గ్రే , ఇరిడియం సిల్వర్ అనే 5 కలర్ ఆప్సన్స్ లో లభ్యం. దీంతోపాటు జీఎల్బీ త్రి-రో ఎస్‌యూవీని కూడా తీసుకొచ్చింది. దీని ధర రూ. 63.8 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూబి, బ్యాటరీ బెంజ్ ఈక్యూబి ఎలక్ట్రిక్ ఎస్‌యువిలో 66.5kWh బ్యాటరీని జోడించింది.ఈ బ్యాటరీ ప్యాక్ 225bhp ,390Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. AC , DC ఛార్జింగ్ రెండింటినీ సపోర్ట్ చేసే మోడల్, WLTP-సర్టిఫైడ్ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 423 కిమీ రేంజ్ అందిస్తుంది.100 కిలో వాట్ DC ఫాస్ట్ ఛార్జర్ ద్వారా కేవలం 32 నిముషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు. ఈ బ్యాటరీ మీద 8 సంవత్సరాల వారంటీని అందిస్తుంది. 11 కిలోవాట్ AC ఛార్జర్ ఉపయోగించి 10 నుంచి 100 శాతం ఛార్జ్ చేసుకోవడానికి 6 గంటల 25 నిముషాల సమయం పడుతుందని కంపెనీ తెలిపింది . డిజైన్, ఫీచర్లు స్వెప్ట్‌బ్యాక్ LED హెడ్‌ల్యాంప్‌లు, బ్లాంక్డ్ ఆఫ్ గ్రిల్, స్పిట్ LED టెయిల్ లైట్లు, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, పవర్డ్ టెయిల్‌గేట్, వైర్లెస్ ఛార్జింగ్ USB టైప్-C పోర్ట్‌లు, పనోరమిక్ సన్‌రూఫ్, రీప్రొఫైల్డ్ ఫ్రంట్ , రియర్ బంపర్ యాంబియంట్ లైటింగ్‌తో పాటు 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్,ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్ లాంటి ఫీచర్లు ఇందులో జోడించింది. -
టీవీఎస్ జూపిటర్ క్లాసిక్ లాంచ్.. ధర ఎంతంటే?
సాక్షి, ముంబై: ప్రముఖ టూవీలర్ సంస్థ టీవీఎస్ కొత్తగా అప్డేట్ చేసిన జూపిటర్ వెహికల్నులాంచ్ చేసింది. దేశంలో 50 లక్షల స్కూటర్ల మైలు రాయిని చేరుకున్న సందర్భానికి గుర్తుగా స్పెషల్ ఎడిషన్‌గా ‘‘ ఫాస్టెస్ట్ ఫైవ్ మిలియన్ వెహికిల్స్ ఆన్ రోడ్’’ అంటూ టీవీఎస్ జూపిటర్ క్లాసిక్ స్కూటర్‌ను తెచ్చింది. ఈ స్కూటర్లు మిస్టిక్ గ్రే, రీగల్ పర్పుల్ రంగుల్లో లభ్యం. క్లాసిక్ టాప్-స్పెక్ ట్రిమ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీని ధరను రూ. 85,866 (ఎక్స్ షోరూం) గా కంపెనీ నిర్ణయించింది. కాస్మెటిక్ మార్పులు, ఇంజీన్ జూపిటర్ క్లాసిక్ ఇతర వేరియంట్లతో పోల్చినప్పుడు అది ప్రత్యేకంగా కనిపించేలా పలు బ్యూటీ అప్డేట్స్ ఇచ్చింది. ముందు ,బ్రౌన్ బాడీ ప్యానెల్ల వద్ద లేతరంగు గల విజర్‌ను పొందుతుంది (ఇతర వేరియంట్లు బ్లాక్ ప్యానెల్). మిర్రర్లు ఇతర వేరియంట్లలో క్రోమ్‌తో పోలిస్తే బ్లాక్ ఫినిషింగ్‌ను ఇచ్చింది. ఫ్రంట్ ఆప్రాన్ న్యూ గ్రాఫిక్స్, పైనుంచి కిందికి జుపిటర్ బ్యాడ్జింగ్ లాంటివి యాడ్ చేసింది. జూపిటర్ క్లాసిక్ నెక్స్ట్ జెన్ అల్యూమినియం, 109.7 సిసి, సింగిల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇంజన్ 7.47 పిఎస్ పవర్, 8.4 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మోటార్ పేటెంట్ ఎకోనోమీటర్తో కూడా వస్తుంది, ఇది 'ఎకో మోడ్' ,'పవర్ మోడ్' రెండింటిలోనూ రైడర్లను గైడ్ చేస్తుంది. ఎలక్ట్రిక్ స్టార్టర్,కిక్ స్టార్టర్ రెండింటితోపాటు, బ్రేకింగ్ హార్డ్‌వేర్, ముందు డిస్క్, రియర్ డ్రమ్ బ్రేక్‌ను కలిగి ఉంటుంది. టెలిస్కోపిక్ఫోర్క్, త్రిస్టెప్ ఎడ్జస్టబుల్ ట్విన్ షాక్ అబ్జార్బర్ ఇందులో ఉన్నాయి. -
హ్యుందాయ్ ఎన్–లైన్ మెటావర్స్ కమింగ్ సూన్, బుకింగ్స్ షురూ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హ్యుందాయ్ మోటార్ ఇండియా వెన్యూ ఎన్–లైన్ బుకింగ్స్‌ను ప్రారంభించింది. సెప్టెంబర్ 6న ఈ కొత్త మోడల్ భారత్‌లో రంగ ప్రవేశం చేయనుంది. అప్డేటెడ్ ఫీచర్లతో హ్యుందాయ్ ఇండియా కొత్త వెర్షన్ ధరను కంపెనీ సెప్టెంబర్ 6వ తేదీన ప్రకటించనుంది. అయితే బుకింగ్స్ ఓపెన్ చేసింది. అధికారిక వెబ్సైట్లో రూ.21,000 చెల్లించి ఆన్‌లైన్‌ద్వారా బుక్ చేసుకోవచ్చు. హ్యుందాయ్ ఇండియా కొత్త వెన్యూ ఎన్-లైన్ మెటావర్స్ శ్రేణిలో ఐ20 ఎన్-లైన్ తర్వాత రెండో మోడల్. స్పోర్టీ లుక్స్, మెరుగైన పనితీరు ఈ శ్రేణి ప్రత్యేకత. కారు లోపల, వెలుపల పలు మార్పులు చేశారు. 1.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ పొందుపరిచారు. 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్, డిస్క్ బ్రేక్స్ ఏర్పాటు ఉంది. -
యాపిల్ ఇండియా ఆదాయం రెట్టింపు
న్యూయార్క్: ఈ ఏడాది జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో టెక్ దిగ్గజం యాపిల్ ఆదాయం సుమారు 2 శాతం వృద్ధి చెంది రికార్డు స్థాయిలో 83 బిలియన్ డాలర్లకు చేరింది. భారత మార్కెట్లో ఆదాయం దాదాపు రెట్టింపైనట్లు సంస్థ వెల్లడించింది. ‘అమెరికా, యూరప్, ఆసియా పసిఫిక్‌లోని ఇతర మార్కెట్లలో జూన్ త్రైమాసికంలో ఆదాయం రికార్డు స్థాయిలో పెరిగింది. సంపన్న, వర్ధమాన మార్కెట్లలో గణనీయంగా వృద్ధి చెందింది. బ్రెజిల్, ఇండొనేషియా, వియత్నాలలో రెండంకెల స్థాయిలోనూ, భారత్‌లో రెట్టింపు స్థాయిలోనూ పెరిగింది‘ అని ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. రష్యా వ్యాపారం, స్థూల ఆర్థిక అంశాలపరంగా కొంత ప్రతికూల ప్రభావాలు పడినప్పటికీ సర్వీసుల విభాగం ఆదాయం 12 శాతం పెరిగి 19.6 బిలియన్ డాలర్లకు చేరినట్లు వివరించారు. ప్రతిభావంతులైన ఉద్యోగులను అట్టే పెట్టుకునేందుకు, కొత్త వారిని ఆకర్షించేందుకు కస్టమర్లు యాపిల్ ఉత్పత్తుల్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు కుక్ తెలిపారు. భారత ఐటీ దిగ్గజం విప్రో ఇందుకు ఉదాహరణగా ఆయన చెప్పారు. అంతర్జాతీయంగా కొత్త గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకోవడంలో ఇతర సంస్థలతో పోటీపడే క్రమంలో మాక్‌బుక్ ఎయిర్ వంటి అత్యుత్తమ పనితీరు కనపర్చే యాపిల్ ఉత్పత్తులపై విప్రో ఇన్వెస్ట్ చేస్తోందని కుక్ వివరించారు. -
వైర్ నుంచి వైర్లెస్కు...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చేతికి స్మార్ట్‌వాచ్, చెవిలో వైర్లెస్ డివైస్.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిదే ట్రెండ్. స్మార్ట్‌ఫోన్స్‌తోపాటు వేరబుల్స్‌కు డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. భారత్ విషయానికి వస్తే వేరబుల్స్ మార్కెట్ 2019తో పోలిస్తే 2020లో 144.3 శాతం వృద్ధి సాధించిందని పరిశోధనా సంస్థ ఐడీసీ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా టాప్–20 మార్కెట్లలో మూడంకెల వృద్ధి నమోదు చేసి భారత్ కొత్త రికార్డును సొంతం చేసుకుంది. గతేడాది దేశవ్యాప్తంగా 3.64 కోట్ల యూనిట్ల వేరబుల్స్ అమ్ముడయ్యాయి. అంతర్జాతీయంగా అమ్మకాల పరంగా మూడవ స్థానాన్ని కొనసాగిస్తూ కంపెనీలను భారత్ ఊరిస్తోంది. అమ్మకాలు ఎందుకంటే... ఇయర్‌వేర్ డివైస్ వినియోగం పెరగడం, రిస్ట్ బ్యాండ్స్ నుంచి స్మార్ట్‌వాచ్‌ల వైపు కస్టమర్లు మళ్లడం ఈ స్థాయి విక్రయాలకు కారణం. ఈ రెండు విభాగాలు దేశంలో తొలిసారిగా 2020లో రికార్డు స్థాయి అమ్మకాలను సాధించాయి. అక్టోబరు–డిసెంబరు త్రైమాసికంలో ఇప్పటి వరకు అత్యధికంగా 1.52 కోట్ల యూనిట్ల వేరబుల్స్ సేల్స్ జరిగాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 198.2 శాతం అధికం. ఇక 2020లో స్పష్టమైన మార్పు ఏమంటే ఆడియో విభాగంలో వైర్డ్ నుంచి వైర్లెస్ వైపు మార్కెట్ దూసుకెళ్లడమే. 2021లో ఈ విభాగంలో మెరుగైన అనుభూతినిచ్చే అధునాతన పరికరాలు కస్టమర్ల ముందుకు రానున్నాయి. వేరబుల్స్ రంగంలో ఇయర్‌వేర్ వాటా అత్యధికంగా 83.6 శాతం ఉంది. రిస్ట్ బ్యాండ్స్ నుంచి.. గతేడాది దేశంలో 26 లక్షల యూనిట్ల స్మార్ట్‌వాచ్‌లు అమ్ముడయ్యాయి. 2019తో పోలిస్తే ఇది 139.3 శాతం అధికం. సగం విక్రయాలు అక్టోబరు–డిసెంబరు పీరియడ్‌లో నమోదు కావడం విశేషం. ఒక త్రైమాసికంలో 10 లక్షల యూనిట్లు దాటడం ఇదే తొలిసారి. తక్కువ ధరలోనూ స్మార్ట్‌వాచ్‌లు లభ్యం కావడంతో రిస్ట్ బ్యాండ్స్‌కు క్రమంగా ఆదరణ తగ్గుతోంది. 2019లో రిస్ట్ బ్యాండ్స్ 33 లక్షల యూనిట్లు అమ్ముడైతే, గతేడాది 34.3 శాతం తగ్గాయి. తొలినాళ్లలో స్మార్ట్‌వాచ్‌ల ధర రూ.20,000 ఉండేది. ఇప్పుడు రూ.5 వేల లోపు ధరలోనే లభిస్తున్నాయని హ్యాపీ మొబైల్స్ సీఎండీ కృష్ణ పవన్ తెలిపారు. కొత్త ఫీచర్లు తోడవడం కూడా వీటికి ఆదరణ పెంచుతోందని చెప్పారు. తగ్గుతున్న ధరలు.. ఇయర్‌వేర్ అమ్మకాలు మూడింతలు పెరిగి గతేడాది 3.04 కోట్ల యూనిట్లు నమోదయ్యాయి. డిసెంబరు త్రైమాసికంలో 300 శాతం వృద్ధి చెంది 1.29 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. అందుబాటు ధరలో లభించడం, ఎంటర్టైన్మెంట్తోపాటు వర్చువల్ మీటింగ్స్, ఆన్లైన్ తరగతులు వెరశి ఈ విభాగం దూసుకెళ్తోందని బి–న్యూ మొబైల్స్ సీఎండీ వై.డి.బాలాజీ చౌదరి తెలిపారు. ట్రూలీ వైర్లెస్ స్టీరియో డివైసెస్ ఏకంగా పదింతలై 1.13 కోట్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. పోటీ తీవ్రం కావడంతో చాలా కంపెనీలు అందుబాటు ధరలో ప్రవేశపెడుతున్నాయి. వీటి సగటు ధర 2019లో రూ.8,000 ఉంటే, గతేడాది ఇది రూ.3,200లకు వచ్చి చేరింది. -
స్కోడా ర్యాపిడ్ రైడర్ ప్లస్ : ధర ఎంతంటే..
సాక్షి, న్యూఢిల్లీ: స్కోడా మిడ్ రేంజ్ సెడాన్‌ను బుధవారం లాంచ్ చేసింది. ర్యాపిడ్ స్కోడాలో కొత్త వేరియంట్‌ను భారత మార్కెట్లో తీసుకొచ్చామని స్కోడా ఆటో ఇండియా ప్రకటించింది. స్కోడా రాపిడ్ రైడర్ ప్లస్ పేరుతో లాంచ్ చేసిన ఈ కారు ధరను 7.99 లక్షల రూపాయలుగా (ఎక్స్-షోరూమ్ ఇండియా) నిర్ణయించింది. (వ్యాగన్ ఆర్, బాలెనో కార్లు రీకాల్) బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా దీన్ని రూపొందించింది. ఇందులోని వన్-లీటర్ పెట్రోల్ ఇంజిన్, 10 పీఎస్ పవర్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఫ్లోటింగ్ కోడ్ సిస్టమ్‌తో ఇంజిన్ ఇమ్మొబిలైజర్, రఫ్ రోడ్ ప్యాకేజీ, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి సేఫ్టీ ఫీచర్లు ప్రధానంగా ఉన్నాయి. 16.51 సెంటీమీటర్ల కలర్ టచ్‌స్క్రీన్ సెంట్రల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, డస్ట్ అండ్ పొల్యూషన్ ఫిల్టర్ లాంటివి ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. 1.0 టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే కొత్త రాపిడ్ టిఎస్ఐ శ్రేణి ఉత్పత్తులను కంపెనీ ఇటీవల ప్రవేశపెట్టిందని, తమ కొత్త రైడర్ ప్లస్ పోటీ ధర వద్ద మోటివ్ డిజైన్, చక్కటి ఇంటీరియర్స్ క్లాస్ లీడింగ్ సేఫ్టీ ఫీచర్ల కలయికను అందిస్తుందని స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్ ఒక ప్రకటనలో తెలిపారు. -
సెన్సెక్స్ కీలకశ్రేణి 31,160–32,365
ఒకవైపు కరోనా సంక్షోభంతో అల్లాడుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...తిరిగి చైనాతో ట్రేడ్‌వార్‌ను తెరపైకి తేవడంతో మే నెల తొలిరోజుల్లో ప్రపంచ మార్కెట్లన్నీ పతనానికి గురైనప్పటికీ, వెనువెంటనే నష్టాల నుంచి కోలుకున్నాయి. కానీ ఇండియా మార్కెట్ మాత్రం గతవారం 6.5 శాతం వరకూ నష్టపోయింది. లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించడం, గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సడలింపులు ఇచ్చినప్పటికీ, దేశంలో పారిశ్రామికోత్పత్తి, ఆర్థిక రంగ కార్యకలాపాలకు ప్రధానమైన పెద్ద నగరాలన్నీ రెడ్జోన్లు అయినందున ఆర్థిక వ్యవస్థ నిస్తేజంకావడం. రెండో ఉద్దీపన ప్యాకేజీ ప్రకటనలో జాప్యం వంటి స్థానిక అంశాలు ఇక్కడి మార్కెట్లను కోలుకోనీయలేదు. ఇక శుక్రవారం మార్కెట్ ముగిసిన తర్వాత భారీ ద్రవ్యలోటుకు దారితీసే అతిపెద్ద ప్రభుత్వ రుణ సమీకరణ ప్రకటన వెలువడింది. ఇది సమీప భవిష్యత్తులో మార్కెట్‌కు ప్రతికూలాంశమే. ఇక మన సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా వున్నాయి. సెన్సెక్స్ సాంకేతికాంశాలు మే 8తో ముగిసినవారంలో గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైన బీఎస్ఈ సెన్సెక్స్ 31,160 పాయింట్ల స్థాయికి పడిపోయింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 2,075 పాయింట్ల భారీ నష్టంతో 31,643 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం సెన్సెక్స్‌కు 31,160–32,365 పాయింట్ల శ్రేణి కీలకం. ఈ శ్రేణిని ఎటువైపు ఛేదిస్తే...అటు ప్రయాణించే అవకాశం వుంటుంది. 32,365 పాయింట్ల తొలి అవరోధస్థాయిని దాటితే వేగంగా 32,750 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపైన 33,350 పాయింట్ల వరకూ ర్యాలీ జరపవచ్చు. ఈ వారం 31,160 పాయింట్ల మద్దతుస్థాయిని కోల్పోతే ఏప్రిల్ నెలలో జరిగిన ర్యాలీకి 38.2 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి అయిన 30,750 వరకూ క్షీణించవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే 30,350 వరకూ పడిపోవొచ్చు. నిఫ్టీ కీలకశ్రేణి 9,115–9,450 పాయింట్లు గత సోమవారం భారీ గ్యాప్‌డౌన్‌తో మొదలైన ఎన్ఎస్ఈ నిఫ్టీ, ఏ దశలోనూ రికవరీకాలేక, 9,116 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 608 పాయింట్ల నష్టంతో 9,252 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం 9,115–9,450 పాయింట్ల శ్రేణి నిఫ్టీకి కీలకం. ఈ శ్రేణిని ఎటు అధిగమిస్తే, అటువైపు నిఫ్టీ కదలవచ్చు. ఈ వారం 9,450 పాయింట్ల నిరోధాన్ని నిఫ్టీ దాటితే 9,530 పాయింట్ల స్థాయిని వెనువెంటనే అందుకోవొచ్చు. ఈ స్థాయిని కూడా ఛేదిస్తే 9,730 పాయింట్ల వద్దకు చేరవచ్చు. ఈ వారం 9,115 పాయింట్ల మద్దతును కోల్పోతే, వేగంగా 8,960 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున క్రమేపీ 8,810 పాయింట్ల వరకూ క్షీణత కొనసాగవచ్చు. – పి. సత్యప్రసాద్ -
సెన్సెక్స్ కీలకస్థాయి 31,990 పాయింట్లు
కరోనా వైరస్ ఉధృతి పలు దేశాల్లో తగ్గుముఖం పడుతున్నదన్న వార్తలతో పాటు అమెరికా ఆర్థిక వ్యవస్థను ఈ వారం నుంచి దశలవారీగా తెరిచే ప్రణాళికను ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ప్రపంచ ప్రధాన ఈక్విటీ మార్కెట్లన్నీ వరుసగా రెండోవారం లాభపడ్డాయి. అయితే మార్చినెలలో నమోదైన కనిష్టస్థాయిల నుంచి ఇప్పటివరకూ వివిధ దేశాలు సాధించిన ర్యాలీల్లో ఇండియా, బ్రెజిల్‌లు బాగా వెనుకపడివున్నాయి. అమెరికా సూచీలు వాటి మొత్తం నష్టాల్లో 50 శాతం రికవరీ చేసుకోగా, యూరప్ మార్కెట్లన్నీ కీలకమైన 38.2 శాతం ఫిబోనకి రిట్రేస్‌మెంట్ స్థాయిల్ని దాటాయి. కానీ ఇండియా మార్కెట్ మాత్రం మొత్తం నష్టాల్లో 35 శాతం మాత్రమే పూడ్చుకోగలిగింది. భారత్ సూచీల రికవరీ తక్కువగా వుండటానికి అధిక వెయిటేజి కలిగిన బ్యాంకింగ్ షేర్లే ప్రధాన కారణం. బ్యాంక్ నిఫ్టీ రికవరీ 28 శాతంగా ఉంది. వచ్చే కొద్దివారాల్లో బ్యాంకింగ్ షేర్లు కోలుకోవడం లేదా కొత్త లీడర్లు ఆవిర్భవిస్తేనే మార్కెట్ గణనీయంగా పుంజుకునే అవకాశం వుంటుంది. ఇక మన సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా ఉన్నాయి... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... ఏప్రిల్ 17తో ముగిసిన నాలుగు రోజుల ట్రేడింగ్‌వారంలో 4 శాతం హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 429 పాయింట్ల లాభంతో 31,589 పాయింట్ల వద్ద ముగిసింది. లాభాలతో ముగియడం ఇది వరుసగా రెండోవారం. ఈ క్రమంలో సూచి మధ్యకాలిక ట్రెండ్‌ను నిర్దేశించే అతిముఖ్యమైన స్థాయిని సమీపిస్తున్నది. సెన్సెక్స్ జనవరిలో సాధించిన 42,273 పాయింట్ల నుంచి మార్చిలో నమోదుచేసిన 25,639 పాయింట్ల వరకూ జరిగిన పతనానికి 38.2 శాతం ఫిబోనకి రిట్రేస్‌మెంట్ స్థాయి అయిన 31,990 పాయింట్లు సెన్సెక్స్ కీలకస్థాయి. ఈ వారం అప్‌ట్రెండ్ కొనసాగితే తొలి అవరోధం ఈ స్థాయి వద్ద ఎదురవుతున్నది. ఈ స్థాయిపైన స్థిరపడితే 32,490 పాయింట్ల వద్దకు చేరవచ్చు. అటుపై క్రమేపీ 33,100 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. ఈ వారం పైన ప్రస్తావించిన తొలి అవరోధస్థాయిని దాటలేకపోతే 30,960–30,800 పాయింట్ల శ్రేణి వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే 30,020 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ లోపున 29,520 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. నిఫ్టీ ప్రధానస్థాయి 9,390... క్రితంవారం ఎన్ఎస్ఈ నిఫ్టీ 155 పాయింట్ల లాభంతో 9,267 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ ఏడాది జనవరి– మార్చి నెలల మధ్య 12,430 పాయింట్ల నుంచి 7,511 పాయింట్ల వరకూ జరిగిన పతనంలో 38.2 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి అయిన 9,390 పాయింట్ల స్థాయి ఈ వారం నిఫ్టీకి కీలకం. ఈ స్థాయిపైన స్థిరపడితే 9,500 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. అటుపై క్రమేపీ 9,610 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఈ వారం 9,390 పాయింట్ల స్థాయిని అధిగమించలేకపోతే 9,090–9,050 పాయింట్ల శ్రేణి వద్ద నిఫ్టీకి తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే 8,820 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఈ లోపున 8,670 పాయింట్ల స్థాయి వరకూ తగ్గవచ్చు. – పి. సత్యప్రసాద్ -
సెన్సెక్స్ మద్దతు శ్రేణి 40,000–40,600
అమెరికా–చైనాల ట్రేడ్‌డీల్‌పై పరస్పర విరుద్ధ సంకేతాలు వెలువడటంతో గతవారం అమెరికాతో సహా అన్ని ప్రపంచ ప్రధాన స్టాక్ సూచీలు స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ, భారత్ మార్కెట్లో రికార్డుల హోరు కొనసాగింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మన మార్కెట్ ముగిసిన తర్వాత వెలువడిన జీడీపీ డేటా తీవ్ర నిరుత్సాహాన్ని కల్గించింది. అయినా, ఈ అంశాన్ని ఇప్పటికే మార్కెట్ చాలావరకూ డిస్కౌంట్ చేసుకున్నందున, సమీప భవిష్యత్‌లో అంతర్జాతీయ పరిణామాలే ఈక్విటీలను నడిపించవచ్చని అధికశాతం విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా ఉన్నాయి..... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... నవంబర్ 29తో ముగిసినవారంలో బీఎస్ఈ సెన్సెక్స్ 41,163 పాయింట్ల వద్ద కొత్త రికార్డును నెలకొల్పిన తర్వాత వారాంతంలో చిన్నపాటి కరెక్షన్కు లోనయ్యింది. చివరకు అంతక్రితం వారం ముగింపుతో పోలిస్తే 435 పాయింట్ల లాభంతో 40,794 పాయింట్ల వద్ద ముగిసింది. అక్టోబర్ తొలి మూడు వారాల్లోనూ గట్టిగా నిరోధించిన 40,000–40,600 పాయింట్ల శ్రేణి రానున్న రోజుల్లో మద్దతును అందించే అవకాశం వుంటుంది. ఈ వారంలో సెన్సెక్స్‌కు తొలుత 40,600 పాయింట్ల సమీపంలో మద్దతు లభిస్తున్నది. ఈ దిగువన 40,390 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే 40,000 పాయింట్ల స్థాయికి దిగజారవచ్చు. ఈ వారం సెన్సెక్స్ రెండో మద్దతుస్థాయిని పరిరక్షించుకుంటే వేగంగా 40,990 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. అటుపైన మరోదఫా 41,160 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఆపైన ముగిస్తే క్రమేపీ 41,450–41,500 పాయింట్ల శ్రేణిని అందుకునే ఛాన్సుంటుంది. నిఫ్టీ తక్షణ మద్దతు 12,005 కొత్త రికార్డును నెలకొల్పడంలో సెన్సెక్స్‌కంటే వెనుకబడి వున్న ఎన్ఎస్ఈ నిఫ్టీ చిట్టచివరకు గతవారం ఈ ఫీట్ సాధించింది. 12,158 పాయింట్ల వద్ద రికార్డుగరిష్టస్థాయిని నమోదుచేసి, చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 142 పాయింట్ల లాభంతో 12,056 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సోమవారం మార్కెట్ గ్యాప్‌డౌన్‌తో మొదలైతే నిఫ్టీ 12,005 పాయింట్ల సమీపంలో తొలి మద్దతును పొందవచ్చు. ఈ మద్దతును కోల్పోతే 11,920 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ లోపున 12,800 పాయింట్ల వద్ద గట్టి మద్దతు లభిస్తున్నది. ఈ వారం రెండో మద్దతుస్థాయిని నిఫ్టీ పరిరక్షించుకుంటే 12,100 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. అటుపైన ముగిస్తే తిరిగి 12,160 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఆపైన క్రమేపీ 12,250 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగే అవకాశాలుంటాయి. -
అద్భుత ఫీచర్లతో రెడ్మి 8 లాంచ్
సాక్షి, ముంబై : చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమిసరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌నులాంచ్ చేసింది. ‘రెడ్మి 8’ పేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం లాంచ్ చేసింది. రెడ్మి 7కి అప్డేట్ వెర్షన్‌గా దీన్ని తీసుకొచ్చింది. ఏఐ డ్యూయల్ కెమెరాలతో 3జీబీ ర్యామ్/32జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఇది లభించనుంది. దీనికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, "ఇండస్ట్రీ-లీడింగ్" ఎడ్జ్ డిటెక్షన్, సోనీ ఐఎంఎక్స్ 363 సెన్సర్, స్కిన్ టోన్ మ్యాపింగ్ వంటి లక్షణాలకు మద్దతునిస్తుంది. అలాగే స్పీడ్ చార్జింగ్ కోసం యూఎస్బీ టైప్ సీ చార్జర్ , కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, వాటర్‌డ్రాప్ తరహా నాచ్ డిజైన్ పెద్ద డిస్ప్లే , ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అమర్చింది. "అల్టిమేట్ స్క్రీన్ ప్రొటెక్షన్"తో రెడ్ , బ్లూ, బ్లాక్ కలర్ ఆప్షన్లో "ఆరా మిర్రర్ డిజైన్" తో దీన్ని ఆవిష్కరించింది. ఎంఐ .కామ్, ఎంఐ సోర్స్,ఫ్లిప్‌కార్ట్ ద్వారా అక్టోబర్ 12నుంచి కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. రెడ్మి 8 ఫీచర్లు 6.22 అంగుళాల డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 439 సాక్ ఎంఐయుఐ 10.0.1.3 ఆధారిత ఆండ్రాయిడ్ పై 9 720x1520 పిక్సెల్స్‌రిజల్యూషన్ 4జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజ్ 512జీబీ వరకు విస్తరించుకునే అవకాశం 12+2 ఎంపీ ఏఐ రియల్ డ్యుయల్ కెమెరా 8 ఎంపీ ఏఐ సెల్పీకెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు 3జీబీ ర్యామ్/32జీబీ స్టోరేజ్ ధర రూ. 7,999 4జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజ్ రూ. 8,999 -
బ్యాంకింగ్ బేర్!
ఆర్థిక రంగ ప్రతికూల వార్తలకు వాహన అమ్మకాల గణాంకాలు నిరుత్సాహకరంగా ఉండటం కూడా తోడవడంతో స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాల్లో ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీలు వరుసగా మూడో రోజూ నష్టపోయాయి. బ్యాంక్ షేర్లు తీవ్రమైన ఒడిదుడుకులకు గురవడంతో ఇంట్రాడేలో బీఎస్ఈ సెన్సెక్స్ 38,000 పాయింట్లు, నిఫ్టీ 11,300 పాయింట్ల దిగువకు పడిపోయాయి. నిఫ్టీ బ్యాంక్ సూచీ ఇంట్రాడేలో వెయ్యి పాయింట్లు పతనమైంది. ట్రేడింగ్ చివర్లో ఒకింత కొనుగోళ్లు పుంజుకోవడంతో సూచీల నష్టాలు దాదాపు సగం వరకూ తగ్గాయి. ఇంట్రాడేలో 737 పాయింట్ల వరకూ పతనమైన సెన్సెక్స్ చివరకు 362 పాయింట్ల నష్టంతో 38,305 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 115 పాయింట్లు క్షీణించి 11,360 పాయింట్ల వద్ద ముగిశాయి. గత మూడు రోజుల్లో సెన్సెక్స్ 684 పాయింట్లు, నిఫ్టీ 211 పాయింట్ల మేర పతనమయ్యాయి. పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎమ్‌సీ)బ్యాంక్ సంక్షోభం మరింత ముదరడం, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వంటి కంపెనీల్లో అవకతవకలు వెలుగులోకి వస్తుండటంతో మార్కెట్లో అప్రమత్త వాతావరణం నెలకొందని నిపుణులంటున్నారు. లాభాల స్వీకరణకే మొగ్గు... ఆగస్టులో 8 కీలక రంగాల్లో వృద్ది కుంటుపడటం, పన్నును భారీగా తగ్గించినప్పటికీ 3.3% ద్రవ్యలోటుకే ప్రభుత్వం కట్టుబడి ఉండటంతో ప్రభుత్వ వ్యయం తగ్గుతుందనే అంచనాలు ప్రతికూల ప్రభావం చూపించాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ చెప్పారు. పండగ సీజన్లో కూడా వాహన విక్రయాలు పుంజుకునేలా లేవని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. బ్యాంక్ షేర్లు ఒడిదుడుకులకు గురవ్వడం, రూపాయి పతనం.. ఈ రెండు అంశాలు లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లను పురికొల్పాయని వివరించారు. బ్యాంక్ షేర్లు బేజార్ పంజాబ్ అండ్ మహారాష్ట్ర బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ల్లో అవకతవకలు.. కుదైలన ఎన్‌బీఎఫ్‌సీలకు, సంక్షోభంలో ఉన్న రియల్టీ రంగానికి బ్యాంక్‌లు భారీగా రుణాలిచ్చాయన్న అంచనాలతో బ్యాంక్ షేర్లలో జోరుగా అమ్మకాలు జరిగాయి. మొండి బాకీలు మరింతగా పెరగగలవని అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ హెచ్చరించడం మరింత ఆజ్యం పోసింది. ఇప్పటికే ఆర్థిక మందగమనంతో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థపై బ్యాంకింగ్‌లో చోటు చేసుకుంటున్న ప్రతికూల పరిణామాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి. ఆర్బీఎల్ బ్యాంక్ 9% నష్టంతో రూ.300 వద్ద ముగిసింది. ఎస్బీఐ బ్యాంక్ 5%, బ్యాంక్ ఆఫ్ బరోడా 4% పడ్డాయి. నష్టాలు ఎందుకంటే.. ఆగస్టులో కీలక రంగాల వృద్ధి 0.5% డౌన్ సెప్టెంబర్‌లో తయారీ రంగం వృద్ధి సూచీ 51.4గా నమోదైంది. ఆగస్టుతో పోల్చితే ఎలాంటి మార్పు లేదు వాహన విక్రయాలు సెప్టెంబర్‌లోనూ నిరుత్సాహకరంగానే ఉన్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 22 పైసలు పతనమై 71.09కు చేరింది. -
షావోమి దూకుడు: 3 స్మార్ట్ఫోన్లు వచ్చేశాయ్
షావోమి రెడ్మి సిరీస్ నుంచి మూడు సరికొత్త స్మార్ట్ఫోన్లు ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. నేడు (సెప్టంబర్ 5, బుధవారం) నిర్వహించిన స్పెషల్ లాంచ్ ఈవెంట్లో భాగంగా రెడ్మి 6 సిరీస్ స్మార్ట్ఫోన్లను కంపెనీ ఆవిష్కరించింది. రెడ్మి 6, రెడ్మి 6 ప్రో, రెడ్మి 6ఏ మోడల్స్‌లో ఈ ఫోన్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా ఈ మూడు స్మార్ట్ఫోన్లు ఇప్పటికే చైనా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. రెడ్మి 6 ఫీచర్లు 5.45 అంగుళాల హైడెఫినిషన్ ప్లస్ డిస్ప్లే 720x1440 పిక్సల్స్ రిజల్యూషన్ ఆక్టాకోర్ 12ఎన్ఎమ్ మీడియాటెక్ హీలియో పీ22 సాక్ 32జీబి, 64జీబీ స్టోరేజ్ 256జీబి వరకు పెంచుకునే అవకాశం 12+ 5 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఏఐ ఫేస్ అన్‌లాక్ బ్లాక్, రోజ్ గోల్డ్, గోల్డ్, బ్లూ కలర్స్‌లో లభ్యం. ధరలు 3జీబీ + 32జీబీ వేరియంట్ ధర రూ. 7,999 3జీబీ + 64జీబీ వేరియంట్ ధర రూ. 9,499 సెప్టెంబర్ 10న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా విక్రయానికి లభ్యం. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డు వినియోగదారులకు 500 రూపాయలు పత్ర్యేక తగ్గింపు. ఫస్ట్ సేల్‌కే ఈ ఆఫర్ పరిమితం రెడ్మి 6ఏ ఫీచర్లు 5.45 అంగుళాల హైడెఫినిషన్ ప్లస్ డిస్ప్లే 720x1440 పిక్సల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం క్వాడ్-కోర్ 12 ఎన్ఎమ్ మీడియాటెక్ హీలియో ఏ22 సాక్ 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్ 256జీబి వరకు పెంచుకునే అవకాశం 13 ఎంపీ రియర్ ఫేసింగ్ కెమెరా 5ఎంపీ సెల్పీకెమెరా 3,000ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు 2జీబీ+16జీబీ వేరియంట్ ధర రూ. 5,999 2జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ. 6,999 సెప్టెంబరు 19న మధ్యాహ్నం 12 గంటలకు సేల్ రెడ్మి 6ప్రో ఫీచర్లు 5.84 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్ప్లే 1080x2280 పిక్సల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 సాక్ 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం 12+5 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 4,000ఎంఏహెచ్ బ్యాటరీ బ్లాక్, రెడ్, గోల్డ్, బ్లూ కలర్స్‌లో లభ్యం ధరలు 3జీబీ + 32జీబీ : ధర రూ.10,999 4జీబీ+ 64జీబీ : ధర రూ.12,999 సెప్టెంబర్ 11మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్ ప్రత్యేకంగా విక్రయానికి లభ్యం -
రేటు కోత ద్వారానే రికవరీ: బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్
న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు తగ్గింపు ద్వారానే తక్షణ భారత్ ఆర్థిక రికవరీ సాధ్యమవుతుందని గ్లోబల్ ఫైనాన్షియల్ దిగ్గజం- బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్ (బీఓఎఫ్ఏ-ఎంఎల్) తన తాజా నివేదికలో పేర్కొంది. వస్తువులు సేవల పన్ను (జీఎస్టీ), భూ సేకరణ సంస్కరణలు అమలయితే భారత్ ఆర్థికాభివృద్ధి జోరందుకుంటుందని ఇండియా మార్కెట్లు భావిస్తున్నాయని, అయితే వీటన్నింటికన్నా ముందు రెపో రేటు మరింత తగ్గింపు కీలకమని తాజా నివేదికలో విశ్లేషించింది. ఆగస్టు 4వ తేదీ ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా ఆర్బీఐ మరోదఫా పావుశాతం రేటు కోత నిర్ణయం తీసుకుంటుందన్న అభిప్రాయాన్ని బీఓఎఫ్ఏ-ఎంఎల్ వెల్లడించింది. 2016 ప్రారంభంలో మరోదఫా పావుశాతం కోత ఉండవచ్చని కూడా అభిప్రాయపడింది.