హ్యుందాయ్‌ ఎన్‌–లైన్‌ మెటావర్స్‌ కమింగ్‌ సూన్‌, బుకింగ్స్‌ షురూ! | Hyundai expands N Line range opens bookings | Sakshi
Sakshi News home page

Hyundai Venue N-Line: కమింగ్‌ సూన్‌.. బుకింగ్స్‌ షురూ!

Published Fri, Aug 26 2022 12:10 PM | Last Updated on Fri, Aug 26 2022 12:11 PM

Hyundai expands N Line range opens bookings - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా వెన్యూ ఎన్‌–లైన్‌ బుకింగ్స్‌ను ప్రారంభించింది. సెప్టెంబర్‌ 6న ఈ కొత్త మోడల్‌ భారత్‌లో రంగ ప్రవేశం చేయనుంది. అప్‌డేటెడ్‌ ఫీచర్లతో హ్యుందాయ్ ఇండియా కొత్త వెర్షన్ ధరను కంపెనీ సెప్టెంబర్ 6వ తేదీన ప్రకటించనుంది.  అయితే బుకింగ్స్‌  ఓపెన్‌ చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో రూ.21,000 చెల్లించి ఆన్‌లైన్‌ద్వారా   బుక్‌ చేసుకోవచ్చు. 

హ్యుందాయ్ ఇండియా కొత్త వెన్యూ ఎన్-లైన్ మెటావర్స్‌ శ్రేణిలో ఐ20 ఎన్‌-లైన్‌ తర్వాత రెండో  మోడల్‌. స్పోర్టీ లుక్స్, మెరుగైన పనితీరు ఈ శ్రేణి ప్రత్యేకత. కారు లోపల, వెలుపల పలు మార్పులు చేశారు. 1.0 లీటర్‌ టర్బోచార్జ్‌డ్‌ పెట్రోల్‌ ఇంజన్‌ పొందుపరిచారు. 7 స్పీడ్‌ డ్యూయల్‌ క్లచ్‌ ఆటోమేటిక్‌ గేర్‌ బాక్స్, డిస్క్‌ బ్రేక్స్‌ ఏర్పాటు ఉంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement