Hyundai Alcazar New Turbo Petrol Bookings Start - Sakshi
Sakshi News home page

Hyundai Alcazar: హ్యుందాయ్ అల్కజార్ ఇప్పుడు కొత్త ఇంజిన్‌తో.. బుకింగ్స్ స్టార్ట్

Feb 27 2023 4:44 PM | Updated on Feb 27 2023 4:56 PM

Hyundai alcazar new turbo petrol bookings start - Sakshi

ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న 'హ్యుందాయ్ అల్కజార్' ఇప్పుడు 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులో ఉంది. ఈ SUV కోసం కంపెనీ రూ. 25,000తో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి.

కంపెనీ అందించే హ్యుందాయ్ అల్కజార్ 1.5 లీటర్ టర్బో-పెట్రోల్ వెర్షన్ 158 బీహెచ్‌పి పవర్, 253 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్, 7 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ఆప్సన్స్ పొందుతుంది. మ్యాన్యువల్ వెర్షన్ 17.5 కిమీ/లీటర్ మైలజీని అందించగా, డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ వెర్షన్ 18 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది.

హ్యుందాయ్ కంపెనీ ఈ నెల ప్రారంభంలో 2023 అల్కజార్ SUV విడుదల చేసింది. ఇది మునుపటికంటే ఎక్కువ అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్, హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ వంటి వాటితో పాటు డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.

కొత్త హ్యుందాయ్ అల్కజార్ ఐడిల్ స్టార్ట్ అండ్ గో ఫంక్షన్‌తో కూడా వస్తుంది. కావున ఎక్కువ ట్రాఫిక్ ఉన్న సమయంలో కొంత ఇంధనాన్ని అదా చేయడానికి ఉపయోగపడుతుంది. అప్డేటెడ్ అల్కజార్ మోడల్ దాని మునుపటి మోడల్ కంటే ఎక్కువ ధర వద్ద అందుబాటులో ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement