అద్భుత ఫీచర్లతో రెడ్‌మి 8 లాంచ్‌ | Redmi 8 with dual cameras to launched | Sakshi
Sakshi News home page

అద్భుత ఫీచర్లతో రెడ్‌మి 8 లాంచ్‌

Published Wed, Oct 9 2019 11:29 AM | Last Updated on Thu, Oct 10 2019 7:50 AM

Redmi 8 with dual cameras to launched - Sakshi

సాక్షి, ముంబై : చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమిసరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌నులాంచ్‌ చేసింది. ‘రెడ్‌మి 8’ పేరుతో మరో స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం లాంచ్‌ చేసింది. రెడ్‌మి 7కి అప్డేట్ వెర్షన్గా దీన్ని తీసుకొచ్చింది.  ఏఐ డ్యూయల్‌ కెమెరాలతో 3జీబీ  ర్యామ్‌/32జీబీ స్టోరేజ్‌, 4జీబీ  ర్యామ్‌/64జీబీ స్టోరేజ్‌ వేరియంట్లలో ఇది లభించనుంది. దీనికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌, "ఇండస్ట్రీ-లీడింగ్" ఎడ్జ్ డిటెక్షన్, సోనీ ఐఎంఎక్స్‌ 363  సెన్సర్‌, స్కిన్ టోన్ మ్యాపింగ్ వంటి లక్షణాలకు మద్దతునిస్తుంది. అలాగే  స్పీడ్‌ చార్జింగ్‌ కోసం యూఎస్‌బీ టైప్‌ సీ చార్జర్‌ , కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ ప్రొటెక్షన్‌, వాటర్‌డ్రాప్ తరహా నాచ్‌ డిజైన్‌ పెద్ద డిస్‌ప్లే , ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అమర్చింది. "అల్టిమేట్ స్క్రీన్ ప్రొటెక్షన్"తో  రెడ్ , బ్లూ, బ్లాక్‌ కలర్ ఆప్షన్‌లో  "ఆరా మిర్రర్ డిజైన్" తో  దీన్ని ఆవిష్కరించింది.  ఎంఐ .కామ్‌, ఎంఐ సోర్స్‌,ఫ్లిప్‌కార్ట్‌  ద్వారా అక్టోబర్‌ 12నుంచి కస‍్టమర్లకు అందుబాటులోకి రానుంది. 

రెడ్‌మి 8 ఫీచర్లు
6.22  అంగుళాల డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగన్‌ 439 సాక్‌
ఎంఐయుఐ 10.0.1.3 ఆధారిత ఆండ్రాయిడ్ పై 9
720x1520 పిక్సెల్స్‌రిజల్యూషన్‌
4జీబీ ర్యామ్‌/64జీబీ స్టోరేజ్‌
512జీబీ వరకు విస్తరించుకునే అవకాశం 
12+2 ఎంపీ ఏఐ రియల్‌ డ్యుయల్‌ కెమెరా
8 ఎంపీ  ఏఐ సెల్పీకెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ


ధరలు

3జీబీ  ర్యామ్‌/32జీబీ స్టోరేజ్‌ ధర రూ. 7,999
4జీబీ  ర్యామ్‌/64జీబీ స్టోరేజ్‌  రూ. 8,999

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement