సాక్షి, న్యూఢిల్లీ: స్కోడా మిడ్ రేంజ్ సెడాన్‌ను బుధవారం లాంచ్ చేసింది. ర్యాపిడ్ స్కోడాలో కొత్త వేరియంట్‌ను భారత మార్కెట్‌లో తీసుకొచ్చామని స్కోడా ఆటో ఇండియా ప్రకటించింది. స్కోడా రాపిడ్ రైడర్ ప్లస్ పేరుతో లాంచ్ చేసిన ఈ కారు ధరను 7.99 లక్షల రూపాయలుగా (ఎక్స్-షోరూమ్ ఇండియా) నిర్ణయించింది. (వ్యాగన్ ఆర్, బాలెనో కార్లు రీకాల్)
బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా దీన్ని రూపొందించింది. ఇందులోని వన్-లీటర్ పెట్రోల్ ఇంజిన్, 10 పీఎస్ పవర్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఫ్లోటింగ్ కోడ్ సిస్టమ్‌తో ఇంజిన్ ఇమ్మొబిలైజర్, రఫ్ రోడ్ ప్యాకేజీ, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి సేఫ్టీ ఫీచర్లు ప్రధానంగా ఉన్నాయి. 16.51 సెంటీమీటర్ల కలర్ టచ్‌స్క్రీన్ సెంట్రల్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, డస్ట్ అండ్ పొల్యూషన్ ఫిల్టర్ లాంటివి ఇతర ఫీచర్లుగా ఉన్నాయి.
1.0 టీఎస్‌ఐ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే కొత్త రాపిడ్ టిఎస్‌ఐ శ్రేణి ఉత్పత్తులను కంపెనీ ఇటీవల ప్రవేశపెట్టిందని, తమ కొత్త రైడర్ ప్లస్ పోటీ ధర వద్ద మోటివ్ డిజైన్, చక‍్కటి ఇంటీరియర్స్ క్లాస్ లీడింగ్ సేఫ్టీ ఫీచర్ల కలయికను అందిస్తుందని స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్ ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment