Skoda sedan
-
వచ్చేస్తోంది.. స్కోడా ఒక్టావియా
వెబ్‌డెస్క్: క్వాలిటీ, లగ్జరీ, డ్యూరబులిటీలకు మరో పేరైన స్కోడా నుంచి మరో కొత్త కారు మార్కెట్లోకి వస్తుంది. ఎంట్రీ లెవల్ లగ్జరీ సెడాన్‌గా విజయవంతమైన ఒక్టావియా ఫోర్త్ జనరేషన్ కారు లాంఛింగ్‌కి రెడీ అయ్యింది స్కోడా జూన్ 10న కరోనా వైరస్ సృష్టించిన కల్లోలంతో వ్యక్తిగత వాహనాలకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం కార్ల అమ్మకాల్లో జోరు తగ్గినప్పటికీ... కార్లు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సక్సెస్ ఫుల్ మోడల్ ఒక్టావియాలో ఫోర్త్ జనరేషన్ కారును మార్కెట్లోకి తెస్తోంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారమైతే మేలోనే ఈ కారు మార్కెట్లోకి రావాల్సింది. కానీ లాక్డౌన్ కారణంగా జూన్ 10కి వాయిదా పడింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఉన్న స్కోడా యూనిట్లో ఈ కార్లు తయారవుతున్నాయి. ఓన్లీ పెట్రోల్ వెర్షన్ స్కోడా ఒక్టావియా ఫోర్త్ జనరేషన్ ఓన్లీ పెట్రోల్ వెర్షన్లోనే లభిస్తోంది. ఈ కారులో అమర్చిన 2 లీటర్ యూనిట్ పెట్రోల్ ఇంజన్ 188 బీహెచ్పీ శక్తిని అందిస్తుంది. పాత కారుతో పోల్చితే సైజ్‌లో కొంచెం పెద్దదిగా డిజైన్ చేశారు. పొడవులో 19 మిల్లీమీటర్లు, వెడల్పులో 15 మిల్లీమీటర్లు పెద్దదిగా ఉంటుంది. కారు ముందు భాగంలో ఆప్షనల్ మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, హారిజంటల్ ఫాగ్‌ల్యాంప్స్ ఇవ్వగా వెనుక వైపు టైల్‌ల్యాంప్ డిజైన్లోనూ మార్పులు చేశారు. స్కోడా మార్క్‌ని మరింత ఆకర్షణీయంగా తీర్చి దిద్దారు. ఒక్టావియా మోడల్ మార్కెట్‌కి వచ్చి 20 ఏళ్లు దాటగా ఇప్పటి వరకు లక్షకు పైగా కార్లు దేశవ్యాప్తంగా అమ్ముడయ్యాయి. -
స్కోడా ర్యాపిడ్ రైడర్ ప్లస్ : ధర ఎంతంటే..
సాక్షి, న్యూఢిల్లీ: స్కోడా మిడ్ రేంజ్ సెడాన్‌ను బుధవారం లాంచ్ చేసింది. ర్యాపిడ్ స్కోడాలో కొత్త వేరియంట్‌ను భారత మార్కెట్లో తీసుకొచ్చామని స్కోడా ఆటో ఇండియా ప్రకటించింది. స్కోడా రాపిడ్ రైడర్ ప్లస్ పేరుతో లాంచ్ చేసిన ఈ కారు ధరను 7.99 లక్షల రూపాయలుగా (ఎక్స్-షోరూమ్ ఇండియా) నిర్ణయించింది. (వ్యాగన్ ఆర్, బాలెనో కార్లు రీకాల్) బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా దీన్ని రూపొందించింది. ఇందులోని వన్-లీటర్ పెట్రోల్ ఇంజిన్, 10 పీఎస్ పవర్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఫ్లోటింగ్ కోడ్ సిస్టమ్‌తో ఇంజిన్ ఇమ్మొబిలైజర్, రఫ్ రోడ్ ప్యాకేజీ, రియర్ పార్కింగ్ సెన్సార్లు వంటి సేఫ్టీ ఫీచర్లు ప్రధానంగా ఉన్నాయి. 16.51 సెంటీమీటర్ల కలర్ టచ్‌స్క్రీన్ సెంట్రల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, డస్ట్ అండ్ పొల్యూషన్ ఫిల్టర్ లాంటివి ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. 1.0 టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే కొత్త రాపిడ్ టిఎస్ఐ శ్రేణి ఉత్పత్తులను కంపెనీ ఇటీవల ప్రవేశపెట్టిందని, తమ కొత్త రైడర్ ప్లస్ పోటీ ధర వద్ద మోటివ్ డిజైన్, చక్కటి ఇంటీరియర్స్ క్లాస్ లీడింగ్ సేఫ్టీ ఫీచర్ల కలయికను అందిస్తుందని స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్ ఒక ప్రకటనలో తెలిపారు. -
మళ్లీ ఆక్టేవియా
న్యూఢిల్లీ: స్కోడా ఆటో ఇండియా కంపెనీ తన ప్రీమియం సెడాన్, ఆక్టేవియాను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. మూడేళ్ల తర్వాత ఈ మోడల్‌ను మళ్లీ ఈ కంపెనీ అందిస్తోంది. ఈ ఆక్టేవియా కారు నాలుగు వేరియంట్ల( 2 లీటర్ డీజిల్(ఒకటి ఆటోమాటిక్, ఇంకొకటి మాన్యువల్), 1.4 లీటర్ పెట్రోల్, 1.8 లీటర్ పెట్రోల్)లలో లభిస్తుందని స్కోడా ఆటో ఇండియా ఎండీ, సుధీర్ రావు చెప్పారు. పెట్రోల్ వేరియంట్ ధరలు రూ.13.95 లక్షల నుంచి రూ.18.25 లక్షల రేంజ్లో, డీజిల్ వేరియంట్ ధరలు రూ.15.55 లక్షల నుచి రూ.19.45 లక్షల రేంజ్లో ఉన్నాయని వివరించారు. ఇప్పటివరకూ ఈ కొత్త ఆక్టేవియా కోసం 500 బుకింగ్స్ వచ్చాయని చెప్పారు. కొత్త ఆక్టేవియా రాకతో ప్రస్తుతమున్న ప్రీమియం సెడాన్ లౌరాను క్రమంగా మార్కెట్ నుంచి ఉపసంహరిస్తామని, అయితే ఆర్డర్లపై ఈ కార్లను అందించే అవకాశముందని వివరించారు. త్వరలోనే చిన్న కారును కూడా భారత మార్కెట్లోకి తెస్తామని పేర్కొన్నారు. ఆక్టేవియా కారును స్కోడా కంపెనీ 2001లో మార్కెట్లోకి తెచ్చింది. 2010 వరకూ 45 వేల కార్లను విక్రయించింది. ఆ తర్వాత అమ్మకాలు ఆపేసింది.