మళ్లీ ఆక్టేవియా
మళ్లీ ఆక్టేవియా
Published Fri, Oct 4 2013 3:40 AM | Last Updated on Fri, Sep 1 2017 11:18 PM
న్యూఢిల్లీ: స్కోడా ఆటో ఇండియా కంపెనీ తన ప్రీమియం సెడాన్, ఆక్టేవియాను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. మూడేళ్ల తర్వాత ఈ మోడల్‌ను మళ్లీ ఈ కంపెనీ అందిస్తోంది. ఈ ఆక్టేవియా కారు నాలుగు వేరియంట్ల( 2 లీటర్ డీజిల్(ఒకటి ఆటోమాటిక్, ఇంకొకటి మాన్యువల్), 1.4 లీటర్ పెట్రోల్, 1.8 లీటర్ పెట్రోల్)లలో లభిస్తుందని స్కోడా ఆటో ఇండియా ఎండీ, సుధీర్ రావు చెప్పారు. పెట్రోల్ వేరియంట్ ధరలు రూ.13.95 లక్షల నుంచి రూ.18.25 లక్షల రేంజ్‌లో, డీజిల్ వేరియంట్ ధరలు రూ.15.55 లక్షల నుచి రూ.19.45 లక్షల రేంజ్‌లో ఉన్నాయని వివరించారు.
ఇప్పటివరకూ ఈ కొత్త ఆక్టేవియా కోసం 500 బుకింగ్స్ వచ్చాయని చెప్పారు. కొత్త ఆక్టేవియా రాకతో ప్రస్తుతమున్న ప్రీమియం సెడాన్ లౌరాను క్రమంగా మార్కెట్ నుంచి ఉపసంహరిస్తామని, అయితే ఆర్డర్లపై ఈ కార్లను అందించే అవకాశముందని వివరించారు. త్వరలోనే చిన్న కారును కూడా భారత మార్కెట్లోకి తెస్తామని పేర్కొన్నారు. ఆక్టేవియా కారును స్కోడా కంపెనీ 2001లో మార్కెట్లోకి తెచ్చింది. 2010 వరకూ 45 వేల కార్లను విక్రయించింది. ఆ తర్వాత అమ్మకాలు ఆపేసింది.
Advertisement