Skoda India
-
విన్‌ఫాస్ట్ ఆసియా హెడ్‌గా జాక్ హోలిస్
స్కోడా ఆటో ఇండియా మాజీ బ్రాండ్ డైరెక్టర్ 'జాక్ హోలిస్' (Zac Hollis) వియత్నామీస్ ఈవీ మేజర్ విన్ఫాస్ట్లో ఆసియా హెడ్‌గా చేరారు. స్కోడా కోసం ఇండియా 2.0 వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన హోలిస్, ఇప్పుడు విన్‌ఫాస్ట్ ఇండియా రోల్ అవుట్ ప్లాన్‌ని నిర్వచించడంలో కీలక పాత్ర పోషించనున్నారు. ఇప్పటికే వియత్నామీస్ ఈవీ నిపుణులు దేశంలో సుమారు 2 బిలియన్ డాలర్లు (రూ. 16,600 కోట్లకు పైగా) పెట్టుబడి పెట్టడానికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ సమయంలోనే హోలిస్ దీని బాధ్యతలు స్వీకరించారు. జరిగిన ఒప్పందం ప్రకారం తమిళనాడులోని తూత్తుకుడిలో విన్‌ఫాస్ట్ ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడం వల్ల దాదాపు 3,000 నుంచి 3,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలుస్తోంది. ఈ సదుపాయంలో వార్షిక తయారీ సామర్థ్యం 1,50,000 యూనిట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: మూడో రోజు ముందుకు కదలని బంగారం - రూ.500 తగ్గిన వెండి స్కోడా ఇండియాలో జాక్ హోలిస్ 2018లో స్కోడా ఆటోకు సేల్స్, సర్వీస్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్‌గా నియమితులైన హోలిస్.. భారతదేశంలో కంపెనీ వృద్ధికి నాలుగు సంవత్సరాలు కృషి చేశారు. ఆ తరువాత స్కోడా నుంచి హోలిస్ వెళ్లిపోవడంతో స్కోడా మార్కెట్ వాటా గణనీయంగా తగ్గిపోయింది. 2018 కంటే ముందు ఈయన చైనాలో స్కోడా చైనా విక్రయాలను వృద్ధి చేయడంలో ఒకరుగా ఉన్నారు. -
లక్ష మార్క్ చేరేందుకు ఇరవై ఏళ్లు పట్టింది.. అయినా ఈ కారు ఇప్పటికీ తోపే
స్లో అండ్ స్టడీ విన్ ది రేస్ అనే నానుడికి అచ్చంగా సరిపోయేలా సాగింది ఇండియాలో స్కోడా ఓక్టావియా కారు ప్రస్థానం. ఇండియన్ మార్కెట్లోకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చింది. అయితే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ కాలేదు. అలాగని దీనితో పాటు రిలీజైన మోడల్‌ల మాదిరి కనుమరుగైపోలేదు. అలా.. అలా.. మార్కెట్లో తన మార్క్ చూపిస్తూనే ఉంది. ఇక ఈ మోడల్ డిస్కంటిన్యూ అనుకునే టైమ్‌లో ఏదో మ్యాజిక్ చోటు చేసుకుని మళ్లీ మార్కెట్లో నిలదొక్కుకుంది. ఇలా ఎట్టకేలకు ఇండియాలో లక్ష యూనిట్ల అమ్మకాల రికార్డును స్కోడా ఓక్టావియా క్రాస్ చేసింది. ఇండియన్ మార్కెట్లో స్కోడాకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇటు ఎంట్రీ లెవల్ అటు హై ఎండ్ మోడళ్లు కాకుండా లగ్జరీ ఫీచర్లను మిడ్ రేంజ్ ధరల్లో అందివ్వడం స్కోడా ప్రత్యేకత. ఎవరైనా స్కోడా కస్టమర్‌గా మారితే మళ్లీ ఆ బ్రాండ్ వదిలేందుకు ఇష్టపడరు అని చెప్పుకునేంత నమ్మకం ఉంది స్కోడాకి. అయితే బ్రాండ్ నుంచి వచ్చిన ఏ మోడల్ కూడా అమ్మకాల్లో అద్భుతాలు సాధించలేదనే చెప్పాలి. ఆలస్యంగానైనా ఓక్టావియా ఆ ఫీట్‌ను చేరుకుంది. లగ్జరీ ఫీచర్లు, సరికొత్త డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అందుబాటులో ధరల్లో అందించే మోడల్‌గా ఇండియన్ మార్కెట్లోకి స్కోడా ఓక్టావియా 2001లో ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి అమ్మకాలు సోసోగానే ఉన్నాయి. దీంతో 2010లో ఓక్టావియాను ఇండియన్ మార్కెట్లో డిస్ కంటిన్యూ చేస్తున్నట్టుగా స్కోడా ప్రకటించింది. ఓక్టావియా స్థానంలో లారాను మార్కెట్లోకి తెచ్చింది. కానీ మూడేళ్లు తిరిగే సరికి సరికొత్త జనరేషన్ పేరుతో ఓక్టావియా మళ్లీ ఇండియన్ మార్కెట్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఓక్టావియా ఫోర్త్ జనరేషన్ కారు మార్కెట్లో ఉంది. ఓక్టావియా 2021లో లానెన్ అండ్ క్లెమెంట్ మోడళ్లను మార్కెట్ రిలీజ్ చేసింది. ప్రారంభ ధర రూ.25.99 లక్షలుగా ఉంది. బ్లూ, బ్లాక్, వైట్ రంగుల్లో లభిస్తోంది. సెవన్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, 320 ఎన్ఎం టార్క్, 190 బీపీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కాగా ఇరవై ఏళ్ల తర్వాత ఇండియాలో ఓక్టావియా అమ్మకాలు లక్ష యూనిట్లు దాటాయి. క్వాలిటీలో కాంప్రమైజ్ కాకపోతే లైఫ్ టైం ఎక్కువగా ఉంటుంది అనడానికి ఒక్టావియా ఓ ఉదాహారణగా నిలిచింది. లక్ష యూనిట్ల అమ్మకాల మార్క్‌ను ఓక్టావియా అధిగమించడం పట్ల స్కోడా ఇండియా హెడ్ జాక్ హోలిస్ ఆనందం వ్యక్తం చేశాడు. చదవండి: అమ్మకాల్లో బీభత్సం సృష్టిస్తున్న కారు.. కేవలం రెండేళ్లలోనే.. -
ఆ కారులో ఏముందబ్బా, విరగబడి కొంటున్నారట!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా..జూలై నెలలో మెరుగైన ప్రతిభ కనబరిచింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాల్లో 234 శాతం వృద్ధి నమోదు చేసింది. 2021 జూన్‌తో పోలిస్తే 320 శాతం వృద్ధి సాధించింది. గత నెలలో కంపెనీ దేశవ్యాప్తంగా 3,080 కార్లను విక్రయించింది. 2020 జూలైలో ఈ సంఖ్య 922 మాత్రమే. ఈ ఏడాది జూన్‌లో కొత్తగా 734 కార్లు మాత్రమే రోడ్డెక్కాయి. జూలై అమ్మకాల జోరుకు కుషాక్ మోడల్ కీలకమని కంపెనీ బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్ తెలిపారు. ఆవిష్కరించిన నెలరోజుల్లోనే సుమారు 6,000 బుకింగ్స్‌ను కుషాక్ సొంతం చేసుకుందని చెప్పారు. కొత్తగా డీలర్షిప్ కేంద్రాల ఏర్పాటుకు 200 పైచిలుకు దరఖాస్తులు వచ్చాయని వివరించారు. గత నెలలో నెట్వర్క్ 15 శాతం విస్తరించినట్టు పేర్కొన్నారు. కుషాక్ ఫీచర్స్ స్కోడా తన కొత్త మోడల్ కుషాక్ ఎస్‌యూవీని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఇండియా 2.0 ప్రాజెక్ట్‌లో భాగంగా తయారయ్యే తొలి ఉత్పత్తిగా కుషాక్ విడుదలై ఎస్యూవీ విభాగంలోని హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ మోడళ్లకు సరికొత్త కుషాక్ పోటీ ఇచ్చింది. అందుకు కారణం ఆ కారు ఫీచర్లేనని మార్కెట్ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు మనం ఆ కారు ఫీచర్లు ఎలా ఉన్నయో తెలుసుకుందాం. రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్‌లో ఇది లభ్యం. బేస్ వేరియంట్లో 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను జత చేసింది. ఇక టాప్-ఆఫ్-లైన్ మోడల్ ఎస్‌యూవీలో 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చింది.1.5-లీటర్ వేరియంట్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 147.5 బిహెచ్పి మరియు 3,500 ఆర్‌పిఎమ్ వద్ద 250 ఎన్ఎమ్ను టార్క్ అందిస్తుంది. 1.0-లీటర్ ఇంజన్ వేరియంట్ 5,500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 114 బిహెచ్పి పవర్, 1,750 ఆర్‌పిఎమ్ వద్ద 175 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. హనీ ఆరెంజ్, టోర్నడో రెడ్, కాండీ వైట్, రిఫ్లెక్స్ సిల్వర్, కార్బన్ స్టీల్ అనే ఐదు కలర్ వేరియంట్లలో లభ్యం. నాలుగు సంవత్సరాల / 1,00,000కిలోమీటర్ల వారంటీతో పూర్తి “పీస్ ఆఫ్ మైండ్” మీ సొంతం అంటోంది. దీన్ని ఆరు సంవత్సరాల వరకు లేదా, 1,50,000 కిమీ వరకు పొడిగించుకోవచ్చు. అంతేకాదు 2 సంవత్సరాల పార్ట్స్ వారంటీ, 2 సంవత్సరాల బ్యాటరీ వారంటీ, 3 సంవత్సరాల పెయింట్ వారంటీ, 6 సంవత్సరాల తుప్పు వారంటీ 9 సంవత్సరాల వరకు విస్తరించిన రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ప్రోగ్రాం కూడా అందిస్తుంది. -
స్కోడా తొలి ఇ-వాహనం ఎన్యాక్
సాక్షి, న్యూఢిల్లీ: స్కోడా ఆటో తన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని త్వరలో లాంచ్ చేయనుంది. మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ద్వారా స్కోడా బ్రాండ్ తన 125 సంవత్సరాల చరిత్రలో కొత్త అధ్యాయానికి తెర తీయనుంది. వాహనం పేరు చివరలో క్యూ(ఇంగ్లీషు లెటర్) చేర్చే తన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ‘ఎన్యాక్’ అని కొత్త వాహనానికి పేరు పెట్టింది. ఈ పేరు ఎలా వచ్చిందంటే..ఎన్యాక్ అనే పేరును ఐరిష్ భాషలోని ఎన్యా నుంచి తీసుకున్నట్టు స్కోడా వెల్లడించింది. ఎన్యా అర్థం 'జీవన మూలం’, (సోర్స్ ఆఫ్ లైఫ్). ఎన్యాక్ అంటే చైతన్యం, సామర్థ్యం మేళవింపుగా దీన్ని తీసుకురాబోతున్నట్టు స్కోడా ప్రకటించింది. తన కొత్త ఈ వాహనం పేరు విషయంలో క్యూ అక్షరంతో ముగిసే స్కోడా ఎస్‌యూవీలు (కామిక్, కోడియాక్, కరోక్) తరహానే అనుసరించింది. దీంతోబాటు ఇ-మొబిలిటీ ఎరాలో తన ఉనికిని చాటుకునేందుకు గుర్తుగా కూడా ఎన్యాక్ ఎలక్ట్రిక్ కారు పేరు అతికినట్టు సరిపోతుంది. స్కోడా ఆల్-ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఖచ్చితంగా విస్తృతంగా ఆకర్షిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఎన్యాక్ ఎపుడు ఏయే మార్కెట్లలో లాంచ్ చేసేది, ఫీచర్లు,డిజైన్ తదితర వివరాలపై ఇంకా స్పష్టత లేదు. స్కోడా ఎన్యాక్ డిజైన్‌పై అంచనా -
రూ. 100 కోట్లతో స్కోడా షోరూంలకు హంగులు
కస్టమర్లను ఆకర్షించేందుకు, మెరుగైన సేవలనూ అందించేందుకు స్కోడా ఆటో ఇండియా తన షోరూమ్‌లకు సరికొత్త హంగులను అద్దుతోంది. రూ.100 కోట్ల పెట్టుబడులతో దేశంలోని 40 ఎంపిక చేసిన డీలర్షిప్స్లకు ఆధునీకరిస్తున్నామని సంస్థ సేల్స్ అండ్ మార్కెటింగ్ డెరైక్టర్ అశుతోష్ దీక్షిత్ చెప్పారు. శుక్రవారమిక్కడ మహావీర్ ఆటో ప్రై.లి. డీలర్ ప్రిన్సిపల్ ప్రస్వ కుమార్‌తో కలిసి 5,500 చ.అ. స్కోడా ఎక్స్‌క్లూజివ్ షోరూంను ప్రారంభించారు. ‘‘షోరూంల ఆధునీకరణతో కస్టమర్లకు లగ్జరీ అప్పీరియన్స్‌తో పాటూ కొత్త మోడళ్ల ప్రదర్శన చేయటం సులువవుతుందని అశుతోష్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 70 షోరూమ్‌లుండగా.. వచ్చే ఏడాదికి వీటన్నింటికీ న్యూలుక్‌ను తీసుకొస్తామన్నారు. ‘‘ప్రస్తుతం మార్కెట్లో సూపర్బ్, ఆక్టివా, యెటి, ర్యాపిడ్ నాలుగు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. 2017 ముగింపు నాటికి మరో నాలుగు బ్రాండ్లను విడుదల చేస్తామని’’ వివరించారాయన. రూ.8.5 లక్షల నుంచి 30 లక్షల మధ్య ఉండే స్కోడా కార్ల అమ్మకాలు ఏటా 15 వేలుండగా.. ఈ ఏడాది ముగింపు నాటికి 20 వేలకు చేరుకుంటామని ధీమావ్యక్తం చేశారు. -
మళ్లీ ఆక్టేవియా
న్యూఢిల్లీ: స్కోడా ఆటో ఇండియా కంపెనీ తన ప్రీమియం సెడాన్, ఆక్టేవియాను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. మూడేళ్ల తర్వాత ఈ మోడల్‌ను మళ్లీ ఈ కంపెనీ అందిస్తోంది. ఈ ఆక్టేవియా కారు నాలుగు వేరియంట్ల( 2 లీటర్ డీజిల్(ఒకటి ఆటోమాటిక్, ఇంకొకటి మాన్యువల్), 1.4 లీటర్ పెట్రోల్, 1.8 లీటర్ పెట్రోల్)లలో లభిస్తుందని స్కోడా ఆటో ఇండియా ఎండీ, సుధీర్ రావు చెప్పారు. పెట్రోల్ వేరియంట్ ధరలు రూ.13.95 లక్షల నుంచి రూ.18.25 లక్షల రేంజ్లో, డీజిల్ వేరియంట్ ధరలు రూ.15.55 లక్షల నుచి రూ.19.45 లక్షల రేంజ్లో ఉన్నాయని వివరించారు. ఇప్పటివరకూ ఈ కొత్త ఆక్టేవియా కోసం 500 బుకింగ్స్ వచ్చాయని చెప్పారు. కొత్త ఆక్టేవియా రాకతో ప్రస్తుతమున్న ప్రీమియం సెడాన్ లౌరాను క్రమంగా మార్కెట్ నుంచి ఉపసంహరిస్తామని, అయితే ఆర్డర్లపై ఈ కార్లను అందించే అవకాశముందని వివరించారు. త్వరలోనే చిన్న కారును కూడా భారత మార్కెట్లోకి తెస్తామని పేర్కొన్నారు. ఆక్టేవియా కారును స్కోడా కంపెనీ 2001లో మార్కెట్లోకి తెచ్చింది. 2010 వరకూ 45 వేల కార్లను విక్రయించింది. ఆ తర్వాత అమ్మకాలు ఆపేసింది.