సాక్షి, న్యూఢిల్లీ: స్కోడా ఆటో తన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని త్వరలో లాంచ్ చేయనుంది. మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు ద్వారా స్కోడా బ్రాండ్ తన 125 సంవత్సరాల చరిత్రలో కొత్త అధ్యాయానికి తెర తీయనుంది. వాహనం పేరు చివరలో క్యూ(ఇంగ్లీషు లెటర్) చేర్చే తన సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ‘ఎన్యాక్’ అని కొత్త వాహనానికి పేరు పెట్టింది. ఈ పేరు ఎలా వచ్చిందంటే..ఎన్యాక్ అనే పేరును ఐరిష్ భాషలోని ఎన్యా నుంచి తీసుకున్నట్టు స్కోడా వెల్లడించింది. ఎన్యా అర్థం 'జీవన మూలం’, (సోర్స్ ఆఫ్ లైఫ్). ఎన్యాక్ అంటే చైతన్యం, సామర్థ్యం మేళవింపుగా దీన్ని తీసుకురాబోతున్నట్టు స్కోడా ప్రకటించింది.
తన కొత్త ఈ వాహనం పేరు విషయంలో క్యూ అక్షరంతో ముగిసే స్కోడా ఎస్‌యూవీలు (కామిక్, కోడియాక్, కరోక్) తరహానే అనుసరించింది. దీంతోబాటు ఇ-మొబిలిటీ ఎరాలో తన ఉనికిని చాటుకునేందుకు గుర్తుగా కూడా ఎన్యాక్ ఎలక్ట్రిక్ కారు పేరు అతికినట్టు సరిపోతుంది. స్కోడా ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఖచ్చితంగా విస్తృతంగా ఆకర్షిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఎన్యాక్ ఎపుడు ఏయే మార్కెట్లలో లాంచ్ చేసేది, ఫీచర్లు,డిజైన్ తదితర వివరాలపై ఇంకా స్పష్టత లేదు.
స్కోడా ఎన్యాక్ డిజైన్‌పై అంచనా
Comments
Please login to add a commentAdd a comment