స్కోడా ఆటో ఇండియా మాజీ బ్రాండ్ డైరెక్టర్ 'జాక్ హోలిస్' (Zac Hollis) వియత్నామీస్ ఈవీ మేజర్ విన్‌ఫాస్ట్‌లో ఆసియా హెడ్‌గా చేరారు. స్కోడా కోసం ఇండియా 2.0 వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించిన హోలిస్, ఇప్పుడు విన్‌ఫాస్ట్ ఇండియా రోల్ అవుట్ ప్లాన్‌ని నిర్వచించడంలో కీలక పాత్ర పోషించనున్నారు.
ఇప్పటికే వియత్నామీస్ ఈవీ నిపుణులు దేశంలో సుమారు 2 బిలియన్ డాలర్లు (రూ. 16,600 కోట్లకు పైగా) పెట్టుబడి పెట్టడానికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ సమయంలోనే హోలిస్ దీని బాధ్యతలు స్వీకరించారు.
జరిగిన ఒప్పందం ప్రకారం తమిళనాడులోని తూత్తుకుడిలో విన్‌ఫాస్ట్ ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడం వల్ల దాదాపు 3,000 నుంచి 3,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలుస్తోంది. ఈ సదుపాయంలో వార్షిక తయారీ సామర్థ్యం 1,50,000 యూనిట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: మూడో రోజు ముందుకు కదలని బంగారం - రూ.500 తగ్గిన వెండి
స్కోడా ఇండియాలో జాక్ హోలిస్
2018లో స్కోడా ఆటోకు సేల్స్, సర్వీస్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్‌గా నియమితులైన హోలిస్.. భారతదేశంలో కంపెనీ వృద్ధికి నాలుగు సంవత్సరాలు కృషి చేశారు. ఆ తరువాత స్కోడా నుంచి హోలిస్ వెళ్లిపోవడంతో స్కోడా మార్కెట్ వాటా గణనీయంగా తగ్గిపోయింది. 2018 కంటే ముందు ఈయన చైనాలో స్కోడా చైనా విక్రయాలను వృద్ధి చేయడంలో ఒకరుగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment