సింగిల్ చార్జితో 949 కిలోమీటర్ల ప్రయాణం. ఇంకేముంది గతంలో ఉన్న రికార్డును తిరగరాసి గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది మెర్సిడెస్ బెంజ్ ఇండియా. ఆటోకార్ ఇండియా సహకారంతో మెర్సిడెస్ బెంజ్ బ్యాటరీ ఎలక్ట్రిక్ లగ్జరీ సెడాన్ వెహికిల్ అయిన ఈక్యూఎస్ 580 4మేటిక్ బెంగళూరు నుంచి నవీ ముంబై వరకు ప్రయాణించి ఈ ఘనతను సాధించింది.
ఒక వైపు భారీ వర్షాలు, రోడ్డు విస్తరణ పనులు.. మరోవైపు నగరాలు, పట్టణాల ట్రాఫిక్‌ను చేధించుకుంటూ ఏకధాటిగా ప్రయాణం సాగిందని మెర్సిడెస్ బెంజ్ తెలిపింది. ఈ ప్రయాణినికి ఉపయోగించిన కారు మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 580 4మ్యాటిక్. ఇది 107.8 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది.
ఇదీ చదవండి: వైకల్యాన్ని జయించి.. బిలియనీర్‌గా నిలిచి: జీవితాన్ని మార్చే స్టోరీ
సింగిల్ చార్జితో 916.74 కిమీ ప్రయాణించిన యూకేలో ‘ఫోర్డ్ మస్టాంగ్ మ్యాక్ ఈ’ కారు పేరిట ఈ గిన్నిస్ రికార్డు ఉంది. ఇప్పుడు ఈ రికార్డ్ మెర్సిడెస్ బెంజ్ సొంతం చేసుకుంది. ఈ రికార్డ్ పొందిన సందర్భంగా మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ సంతోష్ అయ్యర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. దీనికి కారణమైన ఆటోకార్ ఇండియా బృందానికి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment