ప్రపంచంలోని ప్రతీదేశానికి సొంత కరెన్సీ ఉంది. దానికి విలువ ఉండటంతో పాటు, ఇతర దేశాలలోనూ తగినంత గుర్తింపు ఉంటుంది. అయితే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కరెన్సీగా డాలర్‌ను పరిగణిస్తారు.
ప్రపంచవ్యాప్తంగా విదేశీ చెల్లింపులు అత్యధికంగా డాలర్లలోనే జరుగుతుంటాయి. ఇక భారత కరెన్సీ విషయానికొస్తే దీని విలువ కొన్ని దేశాల్లో తక్కువగానూ, కొన్ని దేశాల్లో చాలా ఎక్కువగానూ ఉంటుంది. భారత కరెన్సీ విలువ స్థానిక కరెన్సీ కంటే చాలా రెట్లు అధికంగా ఉన్న దేశాలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. దీనితో ప్రయోజనం ఏమిటంటే, భారతీయులు ఆయా దేశాలను సందర్శించడానికి వెళితే తక్కువ డబ్బుతో ఎంజాయ్ చేయవచ్చు.
భారతదేశ కరెన్సీ ప్రపంచంలో 38వ స్థానంలో ఉంది. ప్రజాదరణపరంగా ఇది నాల్గవ స్థానంలో ఉంది. వియత్నాం చాలా అందమైన దేశంగా పేరొందింది. భారతీయులు వియత్నాం సందర్శించాలనుకుంటే, తక్కువ డబ్బుతోనే ఎంజాయ్ చేయవచ్చు.
వియత్నాంలో భారతీయ కరెన్సీ రూ.100 విలువ 31,765 వియత్నామీస్ డాంగ్. నేపాల్‌లోనూ భారత కరెన్సీ విలువ ఎక్కువే. నేపాల్‌లో భారత రూ. 100.. 159 నేపాల్ రూపాయలకు సమానం. శ్రీలంకలో మన 100 రూపాయల విలువ 277 రూపాయలు. దీని ప్రకారం చూస్తే శ్రీలంక, నేపాల్‌లను సందర్శించడం భారతీయులకు అత్యంత చౌకైనది.
ఇండోనేషియా స్థానిక సాంస్కృతిక వారసత్వం, అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. ఇండోనేషియాను సందర్శించాలనుకునే భారతీయులు తమ జేబుపై అధిక భారం పడకుండా ఆ దేశాన్ని సందర్శించవచ్చు. పాకిస్తాన్‌లో కూడా భారత కరెన్సీ విలువ అధికంగానే ఉంది. పాకిస్తాన్‌లో భారత రూ.100 విలువ రూ.210గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment