Indian rupee
-
రూపాయి భారీ పతనానికి కారణాలు
రూపాయి రికార్డు కనిష్ఠ స్థాయికి పడిపోతుంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ప్రస్తుతం రూపాయి మారక విలువ 84.07 వద్ద ట్రేడవుతుంది. అందుకు అనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకోనుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా డాలర్లను విక్రయించే అవకాశం ఉందని సమాచారం.ఎకానమీలోని అస్థిరతను నిరోధించడానికి సెంట్రల్ బ్యాంకులు ఎప్పటికప్పుడు కరెన్సీ మార్కెట్లో జోక్యం చేసుకుంటాయని పలుమార్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఉద్ఘాటించారు. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ కనిష్ఠ స్థాయులను చేరుతుంది. దాంతో దేశీయంగా ఉన్న డాలర్ రిజర్వ్‌లను విక్రయించి రూపాయి విలువను స్థిరపరిచేలా చర్యలు తీసుకుంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్బీఐ వద్ద భారీ స్థాయిలో డాలరు నిల్వలుండడం ఊరటనిచ్చే అంశమే. కానీ చైనా మార్కెట్లపై ఆసక్తి పెరగడంతో విదేశీ ఇన్వెస్టర్లు భారత్ నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకుని అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి.పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు పెరగడంతో ఇటీవల 70 డాలర్లకు చేరిన బ్రెంట్ ముడి చమురు ధర క్రమంగా పెరిగింది. ప్రస్తుతం అది 80 డాలర్లకు దగ్గర్లో ఉంది. నవంబర్‌లో అమెరికా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తర్వాత వచ్చే ప్రభుత్వ వైఖరి ఎలా ఉంటుందోననే అనుమానంతో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు అధికమవుతున్నట్లు కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో చమురు ధరలు ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.ప్రభావం ఇలా..రూపాయి బలహీనతల వల్ల దేశ దిగుమతి బిల్లులు (ముఖ్యంగా చమురు) పెరుగుతాయి. దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగేందుకూ ఇది కారణంగా నిలవవచ్చు. అయితే ఆర్బీఐ జోక్యం వల్ల రూపాయి ట్రేడింగ్‌లో ఊగిసలాటలు తగ్గే అవకాశం ఉంది. అంతే తప్ప రూపాయి విలువను నిర్ణయించలేరని అభిప్రాయం ఉంది.కారణాలివే..1. మన రూపాయితో పోలిస్తే అంతర్జాతీయ లావాదేవీల్లో అమెరికా డాలరుకు డిమాండ్ అధికం. భారత ‘కరెంట్ ఖాతా లోటు(సీఏడీ)’ పెరగడం, ఎగుమతి, దిగుమతుల్లో తీవ్ర అంతరం రూపాయి పతనానికి ప్రధాన కారణాలు.2. ముడిచమురు ధర 79 డాలర్లకు చేరింది. ఇందువల్ల దిగుమతుల బిల్లూ ఎగబాకుతూ సీఏడీని పెంచుతోంది.3. ఇటీవలి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో వృద్ధిపై భిన్న అభిప్రాయాలు ఉంటుండడంతో విదేశీ పెట్టుబడులు దేశం నుంచి వెళ్లిపోతున్నాయి. దానికితోడు చైనా మార్కెట్లు ఆకర్షణీయంగా కనిపిస్తుండడం కూడా ప్రధాన కారణంగా ఉంది.4. అమెరికా, ఇతర ఐరోపా దేశాల్లో అధిక ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఇప్పటి వరకు వడ్డీరేట్లను పెంచిన సెంట్రల్ బ్యాంకులు ఇటీవల వాటిని తగ్గించాయి. భారత్‌లో మాత్రం ఆర్బీఐ అలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇది కొంత కలొసొచ్చే అంశమే అయినా జపాన్, చైనా మార్కెట్లు విదేశీ ఇన్వెస్టర్లకు ఆకర్షణగా తోస్తున్నాయి. దాంతో విదేశీ పెట్టుబడిదారులు భారత్‌లోని మదుపులను ఉపసంహరించి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫలితంగా భారత రూపాయి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.ఇదీ చదవండి: ఇంట్లో ఎంత బంగారం ఉండాలంటే..ఏం చేయాలంటే..దేశీయంగా ఉత్పాదకతను పెంచి భారీగా ఎగుమతి చేసే దశకు చేరితే తప్ప ఈ పరిస్థితులు మారవని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. తాత్కాలికంగా అంతర్జాతీయ పరిస్థితులు అనుకూలిస్తే రూపాయి విలువ కొంత పెరిగే అవకాశం ఉంది. కానీ దీర్ఘకాలికంగా రూపాయికి ప్రపంచంలో ప్రత్యేక స్థానం కలిగించాలంటే మాత్రం దిగుమతులు తగ్గి ఎగుమతులు పెరిగేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మరింత పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. -
రూపాయి కంటే తక్కువ విలువైన కరెన్సీలు ఇవే..
సాధారణంగా అంతర్జాతీయ వాణిజ్యంలో ఏ దేశపు కరెన్సీనైనా అమెరికా డాలర్ విలువలో చెల్లిస్తుంటారు. చాలా దేశాల్లోని కరెన్సీ కంటే యూఎస్ డాలరు విలువ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే మన రూపాయి మారకం విలువ సుమారు రూ.83 వద్ద ఉంది. అమెరికాతోపాటు మరికొన్ని దేశాల కరెన్సీ కూడా రూపాయి కంటే ఎక్కువే. అందుకే ఆయా దేశాల్లో పర్యటించాలన్నా.. అక్కడే స్థిరపడాలన్నా బోలెడంత డబ్బు ఖర్చవుతుంది. కానీ, కొన్ని దేశాల్లో అక్కడి కరెన్సీ కంటే మన రూపాయి విలువ అధికంగా ఉంది. వాటి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. వియత్నాం-డాంగ్ దక్షిణాసియాలో ఉండే వియత్నాం దేశానికి ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మంచి పేరుంది. ఇక్కడ అందమైన బీచ్‌లు, ఆకట్టుకునే సంస్కృతి, నోరూరించే వంటలు సందర్శకులను కట్టిపడేస్తాయి. కాగా మన ఒక్క రూపాయి ఇక్కడ 295.4 వియత్నాం డాంగ్‌గా ఉంది. అంటే రూ.100 వియత్నాం కరెన్సీలో 29,540 డాంగ్‌లతో సమానం. లావోస్-లావోటియన్ కిప్ థాయ్‌లాండ్, వియత్నాం, మయన్మార్ దేశాలకు పొరుగున ఉండే లావోస్‌లో చాలావరకు అంతర్జాతీయ సదస్సులు జరుగుతుంటాయి. ఈ దేశంలో ఉన్న అత్యంత అందమైన గ్రామాలు, జలపాతాలను చూడటానికి సందర్శకులు వస్తుంటారు. లావోస్ కరెన్సీ లావోటియన్ కిప్. మన ఒక్క రూపాయి.. 248.16లావోటియన్ కిప్తో సమానం. అంటే భారతీయ కరెన్సీ రూ.100కి లావోస్ కరెన్సీలో విలువ 24,816.34. ఇండోనేషియా-రుపియా ఇండోనేషియా కూడా ఆసియా ఖండంలో భాగమే. అగ్ని పర్వతాలు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇదొకటి. పురాతన హిందూ, బౌద్ధ దేవాలయాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఈ దేశపు కరెన్సీ ఇండోనేషియన్ రుపియా. మన ఒక్క రూపాయి విలువ ఇక్కడ 187.95 రూపియాలు. అంటే మన దగ్గర రూ.100 ఉంటే, ఇండోనేషియాలో 18,795 రుపియాలతో సమానం. ఉజ్బెకిస్థాన్-సోమ్ మధ్య ఆసియాలో.. ఇస్లామిక్ దేశాల సరసన ఉన్న ఉజ్బెకిస్థాన్‌లో ఆధునిక భవనాలతోపాటు 17వ శతాబ్దం నాటి నిర్మాణాలు, సాంస్కృతిక అవశేషాలు కనిపిస్తుంటాయి. ఎటు చూసినా ఇస్లామిక్ శైలి కట్టడాలు, మసీదులు దర్శనమిస్తాయి. ఈ దేశపు కరెన్సీ ఉజ్బెకిస్థానీ సోమ్. మన రూపాయి విలువ అక్కడ 148.23సోమ్స్గా ఉంది. అంటే రూ.100 ఉంటే, ఉజ్బెకిస్థాన్‌లో 14,823 సోమ్స్ ఉన్నట్లే. కాంబోడియా-కాంబోడియన్ రియల్స్ చారిత్రక కట్టడాలను కాపాడుకుంటూ వస్తోన్న ఆసియా దేశం కాంబోడియా. అక్కడి చారిత్రక నిర్మాణాలు, మ్యూజియాలను చూసేందుకు ఏటా లక్షల మంది సందర్శకులు వెళ్తుంటారు. ఆ దేశ కరెన్సీ కాంబోడియన్ రియల్స్ కాగా.. మన రూపాయితో పోలిస్తే ఆ దేశ కరెన్సీ మారకం విలువ 49.03గా ఉంది. అంటే భారత కరెన్సీ రూ.100 ఉంటే, కాంబోడియా కరెన్సీలో 4903.70 రియల్స్‌తో సమానం. కొలంబియా-పెసో దక్షిణ అమెరికాలోని కొలంబియా దేశం.. కరేబియన్, పసిఫిక్ సముద్రాల తీరంలో ఉంటుంది. పర్యాటకంగా ఈ దేశం అంతగా అనువైనది కాదనే చెప్పాలి. ఎందుకంటే ఈ దేశంలో నేరాలు ఎక్కువగా జరుగుతుంటాయట. ముఖ్యంగా మనుషుల్ని అపహరిస్తుంటారు. అందుకే ఈ దేశంలో పర్యటించేవారిని సంబంధిత అధికారులు హెచ్చరిస్తుంటారు. కాగా.. ఈ దేశ కరెన్సీని కొలంబియన్ పెసోగా పిలుస్తారు. ఒక రూపాయి విలువ అక్కడ 47.60 పెసోలుగా ఉంది. అంటే రూ.100 ఉంటే, అది 4760.15 పెసోలతో సమానం. దక్షిణ కొరియా-కొరియన్ వాన్ తూర్పు ఆసియా దేశాల్లో ఒకటైన దక్షిణ కొరియా అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తూ ప్రపంచంతో పోటీ పడుతోంది. ఈ దేశంలో సినిమాలు, కె-పాప్ సంగీతం, ఫ్యాషన్, టెక్నాలజీ రంగం, కాస్మోటిక్ సర్జరీలు చాలా పాపులర్. ఈ దేశపు కరెన్సీ సౌత్ కొరియన్ వాన్. ఇక్కడి ఒక్క సౌత్ కొరియన్ వాన్తో రూపాయి మారకం విలువ చూస్తే.. ఒక రూపాయి 16.11వాన్లతో సమానం. అంటే రూ.100 ఉంటే దక్షిణ కొరియా కరెన్సీలో 1610.82 వాన్ ఉన్నట్లు. గమనిక: ఈ కరెన్సీ విలువలు జనవరి 18, 2024వ తేదీ ప్రకారం ఇవ్వబడ్డాయి. నిత్యం వీటి విలువ మారుతోంది. గమనించగలరు. -
మన రూ.100కు ఏ దేశంలో ఎంత విలువ?
ప్రపంచంలోని ప్రతీదేశానికి సొంత కరెన్సీ ఉంది. దానికి విలువ ఉండటంతో పాటు, ఇతర దేశాలలోనూ తగినంత గుర్తింపు ఉంటుంది. అయితే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కరెన్సీగా డాలర్‌ను పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా విదేశీ చెల్లింపులు అత్యధికంగా డాలర్లలోనే జరుగుతుంటాయి. ఇక భారత కరెన్సీ విషయానికొస్తే దీని విలువ కొన్ని దేశాల్లో తక్కువగానూ, కొన్ని దేశాల్లో చాలా ఎక్కువగానూ ఉంటుంది. భారత కరెన్సీ విలువ స్థానిక కరెన్సీ కంటే చాలా రెట్లు అధికంగా ఉన్న దేశాలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. దీనితో ప్రయోజనం ఏమిటంటే, భారతీయులు ఆయా దేశాలను సందర్శించడానికి వెళితే తక్కువ డబ్బుతో ఎంజాయ్ చేయవచ్చు. భారతదేశ కరెన్సీ ప్రపంచంలో 38వ స్థానంలో ఉంది. ప్రజాదరణపరంగా ఇది నాల్గవ స్థానంలో ఉంది. వియత్నాం చాలా అందమైన దేశంగా పేరొందింది. భారతీయులు వియత్నాం సందర్శించాలనుకుంటే, తక్కువ డబ్బుతోనే ఎంజాయ్ చేయవచ్చు. వియత్నాంలో భారతీయ కరెన్సీ రూ.100 విలువ 31,765 వియత్నామీస్ డాంగ్. నేపాల్లోనూ భారత కరెన్సీ విలువ ఎక్కువే. నేపాల్‌లో భారత రూ. 100.. 159 నేపాల్ రూపాయలకు సమానం. శ్రీలంకలో మన 100 రూపాయల విలువ 277 రూపాయలు. దీని ప్రకారం చూస్తే శ్రీలంక, నేపాల్‌లను సందర్శించడం భారతీయులకు అత్యంత చౌకైనది. ఇండోనేషియా స్థానిక సాంస్కృతిక వారసత్వం, అందమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. ఇండోనేషియాను సందర్శించాలనుకునే భారతీయులు తమ జేబుపై అధిక భారం పడకుండా ఆ దేశాన్ని సందర్శించవచ్చు. పాకిస్తాన్లో కూడా భారత కరెన్సీ విలువ అధికంగానే ఉంది. పాకిస్తాన్లో భారత రూ.100 విలువ రూ.210గా ఉంది. -
లంకతో రూపీలో వాణిజ్యం
కొలంబో: శ్రీలంక రూపీ–భారత్ రూపీ మధ్య వాణిజ్యాన్ని ప్రారంభించినందుకు ఎస్బీఐని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభినందించారు. శ్రీలంక నుంచి లంకన్ రూపీ–భారత్ రూపీలో నేరుగా వాణిజ్యం ప్రారంభించిన తొలి విదేశీ బ్యాంక్‌గా ఎస్బీఐ నిలిచినట్టు చెప్పారు. ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న శ్రీలంకలో మంత్రి సీతారామన్ పర్యటిస్తుండడం తెలిసిందే. నార్తర్న్ ప్రావిన్స్ గవర్నర్ పీఎస్ఎం చార్లెస్‌తో కలసి జాఫ్నా ప్రాంతంలో ఎస్బీఐ రెండో శాఖను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖరా, భారత హై కమిషనర్ (శ్రీలంక) గోపాల్ బాగ్లే కూడా పాల్గొన్నారు. ఎస్బీఐ ప్రారంభించిన ఈ నూతన సేవ వల్ల శ్రీలంక దిగుమతిదారులు అమెరికా డాలర్లపై ఆధారపడాల్సిన ఇబ్బంది తప్పుతుందని మంత్రి చెప్పారు. ఇది శ్రీలంక ఆర్థిక వ్యవస్థకు సాయంగా ఉంటుందన్నారు. జాఫ్నా బ్రాంచ్ ద్వారా నార్తర్న్ ప్రావిన్స్‌లో వ్యాపారాలకు ఎస్ బీఐ మద్దతుగా నిలుస్తుందని చెప్పనారు. మంత్రి సీతారామన్ గురువారం ట్రింకోమలేలోనూ ఎస్బీఐ శాఖను ప్రారంభించడం గమనార్హం. తన పర్యటనలో భాగంగా శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, ప్రధాని దినేష్ గుణవర్ధనేతో మంత్రి సీతారామన్ సమావేశమయ్యారు. -
ఒక్క రూపాయి అక్కడ వందలతో సమానం.. చీపెస్ట్ కరెన్సీ కలిగిన దేశాలు!
ఇప్పటి వరకు 'దినార్, రియాల్, ఫౌండ్, యూరో, డాలర్' వంటి ప్రపంచంలో అత్యంత ఖరీదైన కరెన్సీలను గురించి తెలుసుకుని ఉంటారు. అయితే ఈ కథనంలో ప్రపంచంలో టాప్ చీపెస్ట్ కరెన్సీలు ఏవి? ఇండియన్ కరెన్సీతో వాటికున్న వ్యత్యాసం ఎంత అనే మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. చీపెస్ట్ కరెన్సీ కలిగిన టాప్ 5 దేశాలు.. 👉ఇరానియన్ రియాల్ (IRR) 👉వియత్నామీస్ డాంగ్ (VND) 👉సియెర్రా లియోనియన్ లియోన్ (SLL) 👉లావో/లావోషియన్ కిప్ (LAK) 👉ఇండోనేషియా రుపియా (IDR) ఇరానియన్ రియాల్ (IRR) ఇరాన్ కరెన్సీ ఇరానియల్ రియాల్ అనేది ప్రపంచంలో చీపెస్ట్ కరెన్సీలలో ఒకటి. అయితే ఇదే పేరుతో ఉన్న ఒమాని రియాల్ అనేది ప్రపంచంలో ఖరీదైన కరెన్సీలలో ఒకటిగా ఉంది. ఇండియన్ ఒక్క రూపాయి 511 ఇరానియల్ రియాల్స్‌కి సమానం. కాగా ఒక అమెరికన్ డాలర్ 42,275 ఇరానియల్ రియాల్స్‌కి సమానం అని తెలుస్తోంది. ఈ దేశంలో రాజకీయ అశాంతి, వ్యాపారం, తలసరి జీడీపీ కారణంగా ఈ దేశ కరెన్సీ విలువ చాలా తక్కువగా ఉంది. వియత్నామీస్ డాంగ్ (VND) వియత్నాం చారిత్రాత్మకంగా కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ కింద పనిచేస్తోంది, అయితే ఆర్థిక వ్యవస్థను స్థాపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. కాగా ప్రస్తుతం తక్కువ విలువ గల కరెన్సీ కలిగిన దేశాల్లో ఇది కూడా ఒకటి. 291 వియత్నామీస్ డాంగ్స్ భారతీయ కరెన్సీ రూపాయికి సమానం. ఒక అమెరికన్ డాలర్ 24,085 వియత్నామీస్ డాంగ్స్కి సమానం. వియాత్నం ఆర్ధిక వ్యవస్థ 2024కి వృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. సియెర్రా లియోనియన్ లియోన్ (SLL) ఆఫ్రికా దేశమైన సియెర్రా లియోన్ తీవ్ర పేదరికాన్ని ఎదుర్కొంటోంది. వినాశకరమైన అంతర్యుద్ధంతో సహా పశ్చిమ ఆఫ్రికాలో కుంభకోణాలు, అవినీతి కారణంగానే ఆ దేశ కరెన్సీకి విలువ తగ్గినట్లు సమాచారం. భారత రూపాయి 238 సియెర్రా లియోనియన్ లియోన్లకి సమానం, కాగా అమెరికన్ డాలర్ 19,750 సియెర్రా లియోనియన్ లియోన్లకి సమానం. ఇదీ చదవండి: అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన టాప్ 10 దేశాల్లో 'భారత్' ఎక్కడుందంటే? లావో/లావోషియన్ కిప్ (LAK) 1952 నుంచి కూడా లావోషియన్ కిప్ కరెన్సీకి విలువ చాలా తక్కువగానే ఉంది. ప్రస్తుతం ఒక ఇండియన్ రూపీ 239 లావోషియన్ క్లిప్‌లలో సమానం, ఒక అమెరికన్ డాలర్ 19,773 లావోషియన్ క్లిప్లకి సమానం కావడం విశేషం. కాగా ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థలలో ఇది ఒకటిగా ఉంది. ఇదీ చదవండి: ఆర్బీఐ ఊరుకున్నా.. ఈ రెండు బ్యాంకులు తగ్గలే.. వడ్డీ రేట్లు ఇలా! ఇండోనేషియా రుపియా (IDR) గత ఏడు సంవత్సరాలుగా ఇండోనేషియా రూపాయి విలువలో ఎలాంటి మెరుగుదల లేదు. విదేశీ మారక నిల్వలు క్షీణించడం, కరెన్సీని కాపాడుకోవడంలో సెంట్రల్ బ్యాంక్ వైఫల్యం కారణమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ దేశం ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది. అయితే భారతీయ కరెన్సీ రూపాయికి 184 ఇండోనేషియా రూపాయలకు సమానం. అదే విధంగా ఒక అమెరికన్ డాలర్ 15,225 ఇండోనేషియా రూపాయలకు సమానం. ప్రస్తుతం పారిశ్రామిక కార్యకలాపాలలో ఇండోనేషియా కొంత వృద్ధి చెందుతున్నట్లు తెలుస్తోంది. -
రూపాయి సింబల్ ₹, డాలర్ $, పౌండ్ £...వీటి వెనుక కథ ఏమిటంటే...
ప్రతీ దేశానికీ ఆ దేశపు ప్రత్యేక కరెన్సీ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. మన దేశంలో మారకంలో ఉన్నది రూపాయి. దీని సింబల్ హిందీలోని 'र' అక్షరాన్ని పోలివుంటుంది. రూపాయిలోని ‘ర’ ను ఆధారంగా చేసుకుని ఈ సింబల్ రూపొందించారు. ఇక డాలర్ విషయానికొస్తే 'D' అక్షరంతో మొదలవుతుంది. అయితే దీనిని 'S'అక్షరం మాదిరిగా ఎందుకు రాస్తారు? పౌండ్ విషయంలోనూ ఇటువంటి సందేహమే వస్తుంది. ఇది 'L' అక్షరం మాదిరిగా కనిపిస్తుంది. ఇలా ఉండటం వెనుక కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా డాలర్, బ్రిటన్ పౌండ్ విషయానికొస్తే డాలర్ గుర్తు $, పౌండ్ గుర్తు £ గా కనిపిస్తుంది. మనదేశ కరెన్సీ రూపాయిలోని తొలి అక్షరం 'R'. దీనికి దేవనాగరిలోని 'र'కలిపి ₹గా రూపొందించారు. దీనిని ఉదయ్ కుమార్ అనే కళాకారుడు రూపొందించారు. ఈ సింబల్ రూపకల్పనకు ప్రభుత్వం ఒక పోటీని నిర్వహించి, చివరికి ₹ చిహ్నాన్ని ఎంపిక చేసింది. డాలర్‌కు $ సింబల్ ఎలా వచ్చిందంటే.. హిస్టరీ వెబ్సైట్ రిపోర్టు ప్రకారం సౌత్ అమెరికాలో స్పానిష్ ఎక్స్ప్లోరర్స్కు భారీ మొత్తంలో వెండి లభ్యమయ్యింది.దీంతో స్పానిష్ ప్రజలు ఆ వెండితో నాణాలు తయారుచేయించుకోవడం ప్రారంభించారు. వీటిని peso de ocho అని అనేవారు. దీనికి షార్ట్ పదంగా 'pesos'అని పిలిచేవారు. అలాగే రాసేటప్పుడు దానిని ps అని రాసేవారు. మొదట్లో ఎస్ అక్షరంపై పి ఉంచారు. ఆ తరువాత పి అక్షరంలోని నిలువు గీతను మాత్రమే ఉంచి దానిని $ సింబల్‌గా మార్చారు. పౌండ్ సైన్ అలా ఎందుకుంటుందంటే... ఇప్పుడు పౌండ్ సైన్ £ ఎలా వచ్చిందో తెలుసుకుందాం. లాటిన్ భాషల్ 1 పౌండ్‌ను Libra అని అంటారు. ఈ లిబ్రాలో L నుంచి స్టర్లింగ్ సింబల్ £ రూపొందింది. -
ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీ ఏంటో తెలుసా..?
అత్యంత విలువైన కరెన్సీ అనగానే యూఎస్ డాలర్, బ్రిటిష్ పౌండ్, యూరో వంటివి మన మదిలో మెదులుతాయి. కానీ ఇవేవీ కాకుండా 2023 సంవత్సరంలో అత్యంత విలువైన కరెన్సీగా కువైట్ దినార్ నిలిచింది. మన రూపాయితో పోల్చుకుంటే దినార్ విలువ రూ.266.64కు చేరింది. స్థిరమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండటం వల్లే కువైట్ దినార్ అత్యంత విలువైన కరెన్సీగా కొనసాగుతోంది. ప్రపంచంతో ఎక్కువగా ట్రేడింగ్ జరిగేది యూఎస్ డాలర్లలోనే కాబట్టి అదే అత్యంత విలువైన కరెన్సీ అనుకుంటుంటాం. అయితే వాస్తవం ఏంటంటే.. మనకు తెలిసిన యూఎస్ డాలర్ యూరో, బ్రిటిష్ పౌండ్లతో పాటు ప్రపంచంలో అనేక కరెన్సీలు ఉన్నాయి. వాటిలో కొన్ని చవకైనవి కాగా మరికొన్ని చాలా విలువైనవి. యూఎస్ డాలర్ కంటే విలువైన కరెన్సీలు ఉన్నాయి. అందులో కొన్ని ప్రస్తుతం మన రూపాయితో పోల్చుకుని చూస్తే.. కువైట్ దినార్ రూ.266.64, బెహ్రెయిన్ దినార్ రూ.215.90, ఒమన్ రియాల్ రూ.211.39, జోర్డాన్ దినార్ రూ.114.77, బ్రిటిష్ పౌండ్ రూ.99.68, గిబ్రాల్టర్ పౌండ్ రూ.99.40, కేమన్ డాలర్ రూ.98.02, యూరో రూ.88.34, స్విస్ ఫ్రాంక్ రూ.88.04, యూఎస్ డాలర్ రూ.81.36గా కొనసాగుతోంది. చదవండి: భారీగా పన్ను భారం తగ్గించే ఈ 7 అలెవెన్సుల గురించి మీకు తెలుసా? -
‘రూపీ ట్రేడింగ్’ కోసం రష్యన్ బ్యాంకుల వోస్ట్రో ఖాతాలు
న్యూఢిల్లీ: రూపాయి మారకంలో సీమాంతర వ్యాపార లావాదేవీల నిర్వహణకు సంబంధించి తొమ్మిది రష్యన్ బ్యాంకులు భారత్‌లో ప్రత్యేక వోస్ట్రో ఖాతాలు తెరిచినట్లు కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునిల్ బర్త్వల్ తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయా బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకున్నట్లు వివరించారు. సెబెర్బ్యాంక్, వీటీబీ బ్యాంక్, గాజ్ప్రోమ్ మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. చదవండి: కేంద్రం భారీ షాక్: పది లక్షల రేషన్ కార్డులు రద్దు, కారణం ఏంటంటే.. -
రూపీ 50 పైసలు డౌన్.. కారణాలు ఇవే!
ముంబై: రూపాయి విలువ సోమవారం 50 పైసలు క్షీణించి 81.28 స్థాయి వద్ద నిలిచింది. మెరుగైన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు అండతో ఉదయం ఫారెక్స్ మార్కెట్లో 80.53 స్థాయి వద్ద మొదలైంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి అమ్మకాల ఒత్తిడికి లోనైన రూపాయి ఏ దశలోనూ కోలుకోలేక ఇంట్రాడే కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. ‘‘దేశీయ కార్పొరేట్, ఆయిల్ కంపెనీల నుంచి డాలర్‌కు డిమాండ్ పెరిగింది. ఈక్విటీ మార్కెట్ స్తబ్ధుగా ట్రేడైంది. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల ఆందోళనలు తగ్గుముఖం పట్టడంతో ఆరు ప్రధాన కరెన్సీ విలువల్లో డాలర్ ఇండెక్స్ బలపడింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగింది. ఈ అంశాలు మన కరెన్సీపై ఒత్తిడిని పెంచాయి’’ అని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. చదవండి: ఫోన్‌పే యూజర్లకు అలర్ట్: అందుబాటులోకి వచ్చిన ఈ సరికొత్త సేవలు తెలుసా! -
రూపాయిలో వాణిజ్యానికీ ప్రోత్సాహకాలు అందుతాయ్!
న్యూఢిల్లీ: రూపాయిలో లావాదేవీలను పరిష్కరించుకున్నప్పటికీ, విదేశీ వాణిజ్య విధానం (ఎఫ్‌టీఏ) కింద ఎగుమతిదారులు ప్రోత్సాహకాలను పొందేందుకు ఇకపై ఎటువంటి ఇబ్బందీ ఉండబోదు. వాణిజ్య మంత్రిత్వశాఖ పరిధిలో కార్యకలాపాలు నిర్వహించే విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ (జీడీఎఫ్‌టీ) ఈ మేరకు నిబంధనావళిని విడుదల చేసింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంసహా భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో రూపాయిలో అంతర్జాతీయ వాణిజ్యం నిర్వహించేందుకు భారత్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన అడ్డంకులను కేంద్రం క్రమంగా తొలగిస్తోంది. తాజా నిర్ణయంతో రూపాయిలో ఎగుమతులకు సంబంధించి వాణిజ్య లావాదేవీల పరిష్కారానికి మార్గం మరింత సుగమం అయ్యింది. ఇప్పటికే దేశీయ కరెన్సీలో వాణిజ్యాన్ని సులభతరం చేసే లక్ష్యంతో భారత్ రూపాయిలో ఎగుమతులు– దిగుమతుల ఇన్వాయిస్, చెల్లింపు, సెటిల్మెంట్కు జీడీఎఫ్‌టీ అనుమతించింది. చదవండి: ఆ బ్యాంక్ కస్టమర్లకు ఒకేసారి రెండు శుభవార్తలు! -
రూపాయి పతనంపై.. ఆందోళన అక్కర్లేదా?
‘‘భారత్ రూపాయి క్షీణించలేదు.కానీ వాస్తవానికి, అమెరికా డాలర్ బలపడింది’’ అంటూ వాషింగ్టన్ పర్యటన సందర్భంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఈ అంశంపై తీవ్ర చర్చకు దారితీశాయి. ‘ఈ ప్రకటనలో తప్పేముంది’ అని కొందరు ఆర్థిక వేత్తలు, విశ్లేషకులు అభిప్రాయపడితే, ‘ఈ ప్రకటన హాస్యాస్పదంగా ఉంది’ అంటూ కొందరు తమకు నచ్చిన విధంగా ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఇక ప్రతిపక్ష నాయకుల విమర్శలు సరేసరి. అయితే రూపాయి పతనంపై తక్షణం తీవ్ర ఆందోళన అక్కర్లేదన్న ధోరణితో సైతం ఆర్థికశాఖ వ్యవహరిస్తోంది. ప్రభుత్వం వైపు నుంచి ప్రకటనలూ సీతారామన్ వ్యాఖ్యలకు అనుగుణంగానే ఉన్నాయి. ఆయా అంశాలపై ఒక్కసారి దృష్టి సారిస్తే.. 20 ఏళ్ల గరిష్ట స్థాయిలో డాలర్ ఇండెక్స్ అక్టోబర్ 10వ తేదీన ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ పది పైసలు క్షీణించి జీవితకాల కనిష్టం 82.40 స్థాయి వద్ద స్థిరపడింది. ఆ రోజు 82.68 స్థాయి వద్ద ట్రేడింగ్ ప్రారంభంకాగా, ఒక దశలో 82.69 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. ఇంట్రాడే, ముగింపు రెండూ రూపాయికి చరిత్రాత్మక కనిష్ట స్థాయిలు. నిజానికి డాలర్‌తో పాటు ఫారెక్స్ మార్కెట్లో వివిధ కరెన్సీలతో రూపాయి ట్రేడింగ్ జరుగుతుంది. అయితే అంతర్జాతీయ వాణిజ్య రంగంలో (రెండు ప్రపంచ యుద్ధాల విధ్వంసం, బ్రిటన్ తన బంగారం నిల్వల నుంచి భారీ వ్యయాల నేపథ్యంలో 1944 బ్రెట్టన్ వుడ్స్ ఒప్పందం ద్వారా ప్రపంచంలోనే అగ్రగామి రిజర్వ్ కరెన్సీగా హోదాను స్టెర్లింగ్ నుంచి అమెరికా డాలర్ పొందింది) డాలర్‌కు ఉన్న ప్రాభల్యం దృష్ట్యా ప్రధానంగా అగ్రరాజ్య కరెన్సీతో రూపాయి మారకపు ట్రేడింగ్ విలువపై ప్రస్తుతం చర్చ జరుగుతుంది. మరి న్యూయార్క్ ఫ్యూచర్స్ మార్కెట్లో ఆరు కరెన్సీల విలువలతో కూడా డాలర్ ఇండెక్స్ కదలికలు ఉంటాయి. డాలర్ విలువను ఈ ఇండెక్స్ ప్రధానంగా నిర్దేశిస్తుంది. యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనాలు వీటిలో ఉన్నాయి. వీటి ప్రాతిపదికన డాలర్ ఇండెక్స్ అక్టోబర్ 10వ తేదీన (మన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయిని చూసిన రోజు) 20 సంవత్సరాల గరిష స్థాయిలో 113పైకి ఎగసింది. రెండు పాయింట్లు తగ్గినా ఇప్పుడూ దాదాపు అదే స్థాయిలో పటిష్టంగా ఉంది. డాలర్ ఇండెక్స్ పెరిగిందెంతో.. రూపాయి అంతే పడింది... దేశ 14వ ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన 2014 మే నెలలో రూపాయి విలువ దాదాపు 58 వద్ద ఉంది. ఈ లెక్కన 2022 అక్టోబర్ 10వ తేదీనాటికి చూస్తే, రూపాయి విలువ దాదాపు 42 శాతం పతనమైంది. ఇక అంతర్జాతీయంగా ఇదే సమయంలో డాలర్ ఇండెక్స్‌ను పరిశీలిస్తే, ఇది 79 నుంచి ఏకంగా 113 స్థాయికి చేరింది. అంటే డాలర్ ఇండెక్స్ కూడా దాదాపు 43 శాతం ఎగసింది. భారత్ ఆర్థిక వ్యవస్థ బలహీనపడ్డమే రూపాయి చరిత్రాత్మక పతనానికి కారణమని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని, డాలర్ బలపడ్డమే ఆ కరెన్సీతో రూపాయి పతనానికి కారణమని కేంద్ర ఆర్థికశాఖ అధికారులు చేస్తున్న వాదన బహుశా ఇందుకే కావచ్చు. కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, దేశంపై క్రూడ్ బిల్లు భారం, ద్రవ్యోల్బణం, ఫెడ్ ఫండ్ రేటు పెంపు, డాలర్ ఇండెక్స్ బలోపేతం వంటి అంశాలు ప్రస్తుతం డాలర్ మారకంలో రూపాయి విలువకు చెక్ పెడుతున్నాయి. చర్యలూ కొనసాగుతున్నాయ్... డాలర్ మారకంలో రూపాయి తీవ్ర ఒడిదుడుకులను అడ్డుకోడానికి మరోవైపు ఆర్బీఐ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫైనాన్షియల్ మార్కెట్ల స్థిరత్వమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్న ఆర్బీఐ, ఇందుకు ఫారెక్స్ నిల్వలను దాదాపు 100 బిలియన్ డాలర్లకు పైగా వినియోగించడం గమనార్హం. గత ఏడాది 642 బిలియన్ డాలర్లు ఉన్న విదేశీ మారకద్రవ్య నిల్వలు ప్రస్తుతం దాదాపు 545 బిలియన్ డాలర్లకు తగ్గిన విషయం గమనార్హం. ఇక ద్రవ్యోల్బణం కట్టడితోపాటు ఫెడ్ ఫెండ్ రేటు పెంపు నేపథ్యంలో వెనుదిరుగుతున్న విదేశీ పెట్టుబడులను నిలువరించడానికీ రెపో రేటు పెంపు దోహదపడనుంది. మే నుంచి 4 దఫాల్లో రెపో రేటును ఆర్బీఐ 190 బేసిస్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. దీనితో ఈ రేటు 5.9 శాతానికి ఎగసింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడి, ఈ నేపథ్యంలో రష్యాపై అగ్రరాజ్యం ఆంక్షల నేపథ్యంలో ప్రపంచ వాణిజ్యలో రూపాయిని వినియోగించే చర్యలకూ కేంద్రం శ్రీకారం చుట్టింది. దీనిపై స్పందన బాగున్నట్లు కూడా ఆర్థికశాఖ ప్రకటనలు వెలువడుతున్నాయి. ఆయా చర్యల నేపథ్యంలో ప్రస్తుతానికి రూపాయి పతనంపై తీవ్ర ఆందోళన అనవసరమని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదా? 2022లో రూపాయి 8 శాతం బలహీనపడితే, అందులో ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా ప్రారంభించిన తర్వాత పతనమే అధికం. డాలర్ మారకంలో ప్రస్తుత రూపాయి విలువ పతనంపై పెద్దగా ఆందోళన చెందాల్సిన పనేమీ లేదని ఆర్థికశాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వర్గాలు భరోసాను ఇస్తున్నాయి. ఇందుకు రెండు ప్రధాన కారణాలను ఆయా వర్గాలు పేర్కొంటున్నాయి. యూరోసహా పలు ఇతర కరెన్సీలతో రూపాయి బలోపేతం కావడం ఇందులో ఒకటి. డాలర్ ఇండెక్స్‌లో పలు దేశాల కరెన్సీలు భారీ పతనాన్ని చూడ్డం రెండవది. ఈ రెండు అంశాలూ రూపాయి పతన నష్టాన్ని భర్తీ చేస్తాయన్నది నిపుణుల వాదన. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే, కమోడిటీ ఎకానమీ అయిన ఇండోనేసియా, బ్రెజిల్ కరెన్సీలు మాత్రమే భారత్ కరెన్సీకన్నా కొంచెం బాగుండడం గమనార్హం. డాలర్ ఎగువబాటకు కారణం.. ఇందుకు సంబంధించిన అంశాలను 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం నాటి నుంచి పరిశీలించాల్సి ఉంటుంది. అప్పటి ఆర్థిక సంక్షోభం, ఈజీ మనీ అందుబాటులో భాగంగా జీరో స్థాయికి ఫెడ్ వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయం నేపథ్యంలో 2008లో డాలర్ ఇండెక్స్70 స్థాయికి పడిపోయింది. అటు తర్వాత అంతర్జాతీయ, అమెరికా ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న సానుకూల పరిస్థితులు, ఫెడ్ ఫండ్ రేటు పెంపునకు సన్నాహాల నేపథ్యంలో 2010 నాటికి 90 స్థాయికి ఇండెక్స్ ఎగసింది. అనుకున్నమేరకు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో పురోగతి లేకపోవడంతో 2011 మేనాటికి తిరిగి డాలర్ ఇండెక్స్ తిరిగి 72 స్థాయిని చూసినా, అటు తర్వాత ముందుకే సాగింది. ట్రంప్ పాలనా కాలంలో ప్రపంచ వాణిజ్య యుద్ధం, కరోనా వంటి సమయాల్లో ఒడిదుడుకులను ఎదుర్కొన్నా, అమెరికా ఆర్థిక వ్యవస్థ పురోగతి, కఠిన ద్రవ్య విధానానికి ఫెడ్ మొగ్గుచూపడం వంటి అంశాలు డాలర్ ఇండెక్స్‌ను బలోపేతం చేస్తూ వచ్చాయి. దీనికితోడు ప్రపంచంలో తీవ్ర సంక్షోభ సమయాల్లో వరల్డ్ రిజర్వ్ కరెన్సీగా, సురక్షిత పెట్టుబడిగా డాలర్లోకి పెట్టుబడులూ డాలర్ ఇండెక్స్ ఎల్లప్పుడూ లాభపడే అంశం. భౌగోళిక ఉద్రిక్తతలకుతోడు, ఫెడ్ రేటు పెంపు ప్రస్తుతం డాలర్ బలానికి కలిసి వస్తున్న అంశాలు. – సాక్షి బిజినెస్ విభాగం -
కొత్త కనిష్టానికి రూపాయి
న్యూఢిల్లీ: అమెరికన్ డాలరు బలపడుతున్న కొద్దీ రూపాయి రోజురోజుకూ మరింతగా క్షీణిస్తోంది. సోమవారం మరో 58 పైసలు తగ్గి కొత్త ఆల్–టైమ్ కనిష్ట స్థాయి 81.67కి పతనమైంది. దీంతో దేశీ కరెన్సీ వరుసగా నాలుగు సెషన్లలో పతనమైనట్లయింది. ఈ వ్యవధిలో రూపాయి మారకం విలువ ఏకంగా 193 పైసలు పడిపోయింది. డాలరు బలపడుతుండటం, ఇన్వెస్టర్లు రిస్కులకు ఇష్టపడకపోతుండటం, దేశీ స్టాక్ మార్కెట్లో ప్రతికూల ధోరణి, విదేశీ నిధులు తరలిపోతుండటం, ఉక్రెయిన్–రష్యా మధ్య ఉద్రిక్తతల వల్ల భౌగోళికరాజకీయ రిస్కుల భయాలు నెలకొనడం తదితర అంశాలు దేశీ కరెన్సీ పతనానికి కారణాలుగా ఉంటున్నాయని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. 82 నిరోధం..: ఈ పరిస్థితుల్లో స్పాట్ మార్కెట్లో రూపాయి 81.20–81.80 శ్రేణిలో కదలవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనలిస్ట్ గౌరంగ్ సోమయ్య చెప్పారు. 82 వద్ద నిరోధం, 81.05 వద్ద నిరోధం ఉండగలదని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ తెలిపారు. చదవండి: Ration Card New Rules: కేంద్రం కొత్త నిబంధనలు.. ఇకపై వాళ్ల రేషన్ కార్డు కట్! -
రూపీ వర్తకానికి మొగ్గు చూపండి
న్యూఢిల్లీ: విదేశీ వాణిజ్యంలో రూపాయి పాత్రను పెంచడంపై కేంద్ర ఆర్థిక శాఖ దృష్టి పెట్టింది. ఎగుమతులు, దిగుమతుల లావాదేవీలను రూపీ మారకంలోనే నిర్వహించడానికి మొగ్గు చూపాలని వాణిజ్య మండళ్ల ప్రతినిధులు, బ్యాంకులను కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. సీమాంతర చెల్లింపులు రూపీలో జరిగేలా చూసేందుకు విదేశాల్లోని భాగస్వామ్య బ్యాంకులతో కలసి ప్రత్యేక రూపీ వాస్ట్రో ఖాతాలు ఆఫర్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని బ్యాంకులకు సూచించింది. ప్రస్తుతం విదేశీ వాణిజ్యం అంతా డాలర్ మారకంలో కొనసాగుతుండడం గమనార్హం. దీని కారణంగా ఎక్కువ అస్థిరతలు నెలకొనడంతో తాజా సూచన చేయడం గమనార్హం. వాణిజ్య సంఘాలు, వాటి విదేశీ భాగస్వామ్య సంస్థలు రూపీ మారకంలో లావాదేవీలకు వీలుగా కార్యాచరణను రూపొందించుకోవాలని ఆర్థిక శాఖ కోరింది. వాణిజ్య మండళ్లు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ప్రతినిధులు, విదేశాంగ శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రూపీ మారకంలో వాణిజ్యానికి శ్రీలంక, అర్జెంటీనా, జింబాబ్వే సానుకూలంగా ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా వాణిజ్య సంస్థలు రూపీలో మారకానికి ఆసక్తితో ఉన్నందున.. రూపీ మారకంలో ఎగుమతులు, దిగుమతులకు వీలు కల్పించేందుకు బ్యాంకులు అదనపు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశిస్తూ ఆర్బీఐ ఈ ఏడాది జూలైలోనే ఒక సర్క్యులర్ జారీ చేసింది. ప్రస్తుతం రష్యా నుంచి మన దేశం చమురును పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షలతో రూపాయి మారకంలోనే ఆ దేశం నుంచి అధిక శాతం దిగుమతులు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. చదవండి: Mahindra Xuv 400 Electric Suv: మహీంద్రా ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ చార్జ్‌తో 400 కి.మీ ప్రయాణం! -
రూపాయి క్షీణతను నివారించాలంటే..
ఇటీవల కాలంలో రూపాయి విలువ బాగా క్షీణిస్తోంది. ఇందువల్ల ఐటీ, ఫార్మా రంగాల్లో ఉన్న ఎగుమతిదార్లు విపరీతమైన లాభాలు గడిస్తున్నారు. అదేసమయంలో పెట్రోల్, వంటనూనెలు వంటి నిత్యావసరాలను దిగుమతి చేసుకోవడం వల్ల సామాన్య, మధ్య తరగతి జనాలు నానా యాతనా పడుతున్నారు. ద్రవ్యం విలువ పడిపోవడం దేశ కరెంట్ ఖాతా లోటు పెరిగిపోవడానికి దారితీస్తుంది. ద్రవ్యోల్బణం పెరిగి అధిక శాతం జనాభా కనీసావసరాలను తీర్చుకోలేక ఇబ్బందుల పాలవుతారు. ఇంత ఇబ్బందికరమైన రూపాయి విలువలో వచ్చే హెచ్చు తగ్గులకు అనేక అంతర్గత, బాహ్య పరిస్థితులు కారణాలుగా ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని భారతీయ కరెన్సీ క్షీణతను ఆర్బీఐ అదుపు చేయడానికి చర్యలు తీసుకోవాలి. గత కొన్ని నెలలుగా రూపాయి విలువ హెచ్చుతగ్గులకు లోనవుతోంది. ఇది 2022 జూలై 20 నాటికి డాలర్‌తో పోలిస్తే 80.05 రూపాయల కనిష్ఠానికి చేరుకుంది. 2022 ఆగస్టు 2కు 78.72 రూపాయలకు బలపడింది. ఇలా ఎందుకు జరుగుతోంది? రూపాయి విలువ పడిపోవడాన్ని రెండు రకాలుగా చెప్పు కోవచ్చు. రూపాయి విలువ తగ్గింపు వల్ల... అంటే ఇతర కరెన్సీలతో అధికారిక మారకపు రేటులో ఉద్దేశ పూర్వకంగా మన రూపాయిని తగ్గించడం (మూల్య హీనీకరణ) ఒకటి. ఇది 1949, 1966, 1991 సంవత్సరాలలో జరిగింది. డాలర్‌తో రూపాయి విలువ తగ్గడాన్ని సూచించే రూపాయి విలువ క్షీణత మరొ కటి. ఇది ఆర్థిక ఒడిదుడుకులవల్ల డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బలహీనంగా మారిందని సూచిస్తుంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, ఈక్విటీ అమ్మకాలు, డాలర్ తిరుగు ప్రవాహం, ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయడానికి ఆర్బీఐ తీసు కున్న చర్యలు, ప్రపంచ ఆర్థిక పరిస్థితుల కఠినతరం వంటి కారకాలు ఇప్పుడు రూపాయి విలువ పడిపోవడానికి ప్రధాన కారణాలు. బలహీన రూపాయి వల్ల సైద్ధాంతికంగా భారతదేశ ఎగుమతు లకు ప్రోత్సాహం లభిస్తుంది. భారతదేశానికి ప్రయాణం చౌకగా ఉంటుంది. స్థానిక పరిశ్రమ లాభపడవచ్చు, విదేశాలలో పని చేసే వారు తమ స్వదేశానికి డబ్బు పంపడం ద్వారా ఎక్కువ లాభం పొంద వచ్చు. కరెంట్ ఖాతా లోటు తగ్గే అవకాశం ఉంది. ఇక నష్టాల సంగతి కొస్తే... ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను రికార్డు స్థాయిలో ఎక్కువ కాలం కొనసాగించడాన్ని కష్టతరం చేస్తుంది. భారత్ తన దేశీయ చమురు అవసరాలలో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ దిగుమతుల ద్వారా తీర్చుకుంటుంది. బలహీనమైన కరెన్సీ వల్ల దిగుమతి చేసుకున్న వంట నూనెల ధరలు మరింతగా పెరుగుతాయి. ఫలితంగా ఆహార ద్రవ్యోల్బణం పెరుగు తుంది. రూపాయి కొనుగోలు శక్తి పడిపోవడం వల్ల దేశం కరెంట్ ఖాతా లోటు విస్తరిస్తుంది. విదేశీ ప్రయాణాలకూ, విదేశీ విద్యార్జనకూ ఎక్కువ ఖర్చు అవుతుంది. విదేశీ రుణంపై వడ్డీ భారం పెరుగుతుంది. ఇప్పటి వరకు సంవత్సరానికి అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి దాదాపు 7 శాతం పడిపోయింది. ఓవర్–ది–కౌంటర్, డెరి వేటివ్స్ మార్కెట్లలో రూ. 80 మార్క్‌ను దాటింది. ఈ క్యాలెండర్ సంవత్సరం మూడో త్రైమాసికంలో డాలర్‌తో పోలిస్తే రూ. 82కి తగ్గుతుందని నోమురా సంస్థ అంచనా వేస్తోంది. ముడి చమురు ధరలు పుంజుకోవడం, డాలర్ తక్షణ కాలంలో సాపేక్షంగా బలంగా ఉంటుందనే అంచనాల మధ్య, 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూపాయి 81కి బలహీనపడవచ్చని భావిస్తున్నారు. సమీప కాలంలో రూపాయి ఒత్తిడికి లోనవుతుందని క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీ సెస్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (క్రిసిల్) అంచనా వేసింది. అంతే కాకుండా వాణిజ్య లోటు, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు వెనక్కి పోవడం, అమెరికా డాలర్ ఇండెక్స్ బలపడటం వంటి కారణాల వల్ల సమీప కాలంలో రూపాయి–డాలర్ మారకం అస్థిరంగా ఉంటుందని అంచనా వేసింది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ రేట్ల పెంపుదల, భౌగోళిక రాజకీయ అస్థిరతల మధ్య డాలర్‌కు డిమాండ్ పెరిగి రూపాయి బలహీనపడవచ్చని అంచనా వేసింది. ప్రస్తుతం రూపాయి విలువ బాగా పడిపోవడం ఆర్థిక వ్యవస్థలో కొన్ని పరిణామాలకు దారితీసింది. భారతదేశ ఫార్మసీ రంగం 2022 సంవత్సరంలో 22.5 బిలియన్ డాలర్ల విలువైన ఔషధాలను ఎగుమతి చేసింది. ఈ కంపెనీలు అమెరికా నుండి అత్యధిక ఆదాయాన్ని పొందుతున్నాయి. నికర ఎగుమతిదారు అయిన వస్త్ర (టెక్స్ టైల్) పరిశ్రమ బలహీనమైన రూపాయి నుండి ప్రయోజనం పొందుతోంది. రత్నాలు, ఆభరణాల రంగం విషయానికొస్తే రూపాయి క్షీణత దాని యూనిట్లకు వ్యయ ప్రయోజనాన్ని ఇస్తోంది. ఐటీ సేవలు, సాంకేతిక పరిశ్రమ అమెరికా ఆదాయాలలో 50 శాతం వాటా కలిగి ఉన్నాయి కాబట్టి... క్షీణిస్తున్న రూపాయి అతిపెద్ద లాభాల్లో ఒకటిగా ఉంటుంది. రూపాయిలో ప్రతి 1 శాతం పతనానికీ వస్త్ర ఎగుమతులకు 0.25–0.5 శాతం లాభం పెరుగుతుంది. భారతదేశం తేయాకు(టీ) లాభాల ఎగుమతులు 5–10 శాతం పెరుగుతాయని అంచనా. సరఫరా కొరత కారణంగా పెరుగుతున్న వస్తువుల ధరలతో, ఎగుమతిదారులకు ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఇది వారి లాభాన్ని ప్రభావితం చేస్తుంది. ఇదిలావుండగా, విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పటివరకు భారతీయ మార్కెట్ల నుండి 19 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకున్నారు. ముడి చమురు ఫ్యూచర్స్ ధరలో ఒక డాలర్ పెరుగుదలతో... భారత్ ముడి చమురు దిగుమతులు 1.703 మిలియన్ టన్నులు పెరిగాయని అంచనా. ప్రతి ఒక మిలియన్ టన్ను ముడి చమురు దిగుమతి... డాలర్‌ను మన రూపాయితో పోలిస్తే 0.266 బలపరుస్తుంది. జూలై 15తో ముగిసిన వారంలో భారతదేశ విదేశీ మారక నిల్వలు 7.5 బిలియన్లు తగ్గి 572.71 బిలియన్లకు పడిపోయాయి. ఇది 20 నెలల కనిష్ఠ స్థాయి. భారతదేశ కరెంట్ ఖాతా లోటు 2022లో జీడీపీలో 1.5 శాతం నుండి 3 శాతం వరకు పెరుగు తుందని అంచనా. అమెరికా డాలర్‌తో పోలిస్తే అనేక కరెన్సీలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఫలితంగా, భారతదేశంతో సహా వివిధ వర్ధమాన ఆర్థిక వ్యవస్థల నుండి విదేశీ మూలధన ప్రవాహం జరుగుతోంది. వారి దేశీయ కరెన్సీలపై ఒత్తిడి పెరిగింది. అమెరికా డాలర్‌తో రూపాయి విలువ క్షీణించడం.. ఇతర ప్రధాన ప్రపంచ కరెన్సీలైన యూరో, బ్రిటిష్ పౌండ్, జపనీస్ ఎన్ల కంటే తక్కువగా ఉందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ (సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ అన్నారు. ప్రధాన కరెన్సీలకు వ్యతిరేకంగా అమెరికా యూనిట్ ఈ ఏడాది 11 శాతం ర్యాలీ చేసి రెండు దశాబ్దాల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కరెన్సీల స్థిరమైన తరుగుదలకి కారణమైంది. ఫలితంగా, భారత రూపాయి డాలర్‌తో పోలిస్తే 80 మార్క్‌ను దాటి రికార్డు కనిష్ఠ స్థాయికి చేరుకుంది. 2022లో రూపాయి దాదాపు 7 శాతం నష్టపోయినప్పటికీ, కొన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల కరెన్సీలు మన రూపాయి కన్నా చాలా దారుణంగా క్షీణించాయి. యూరో 13 శాతం, బ్రిటిష్ పౌండ్ 11 శాతం, జపనీస్ ఎన్ 16 శాతం తగ్గాయి. ఫలితంగా ఈ కరెన్సీలతో రూపాయి విలువ పెరిగింది. దక్షిణ కొరియా వాన్, ఫిలిప్పైన్ పెసో, థాయ్‌లాండ్ బాట్, తైవాన్ డాలర్లు... అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి కంటే ఎక్కువగా పడిపోయాయి. అందువల్ల ఆయా దేశాల నుంచి మనం చేసుకునే దిగుమతులు మనకు లాభదాయకంగా ఉంటాయి. ఇప్పుడు భారతీయ కరెన్సీ క్షీణతను ఆర్బీఐ ఎలా అదుపు చేయగలదో చూద్దాం. ఫారెక్స్ మార్కెట్లో జోక్యం చేసుకోవాలి. నాన్ రెసిడెంట్ ఇండియన్ బాండ్లను విక్రయించాలి. సావరిన్ బాండ్ల జారీని నిర్వహించాలి. భారతదేశం తన మొత్తం కరెంట్ ఖాతా లోటును తగ్గించుకోవడంపై దృష్టి సారించి, రష్యా వంటి స్నేహ పూర్వక దేశాలతో రూపాయి చెల్లింపు విధానాన్ని లాంఛనప్రాయంగా పరిగణించాలి. ఇది అమెరికా డాలర్‌పై రూపాయి ఆధారపడటాన్ని తగ్గించడానికి మార్గం సుగమం చేస్తుంది. పారిశ్రామిక వృద్ధికి ప్రాధా న్యత ఇవ్వాలి. తద్వారా వస్తువుల విక్రయానికి రూపాయి మార్పిడి అవసరం అవుతుంది. ఇది చివరికి అంతర్జాతీయ మార్కెట్లలో సంస్థా గతీకరణకు దారి తీస్తుంది. రూపాయిలో నల్లధనం లావాదేవీలను అరికట్టడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను లాంఛనప్రాయంగా మార్చడం కూడా చాలా అవసరం. రూపాయి బహు పాక్షిక స్వభావాన్ని పునరుద్ధరించడానికి, అంతర్జాతీయ మార్కెట్లలో రూపాయి వినియోగాన్ని పెంచాలి. ఎలా చూసినా కరెన్సీ విలువ పడి పోకుండా రక్షించేది ఆర్థికాభివృద్ధి మాత్రమే. కాబట్టి ప్రభుత్వం ఆ దిశలో మరిన్ని చర్యలు తీసుకోవాలి. (క్లిక్: వారి విడుదల దేనికి సంకేతం?) - డాక్టర్ పీఎస్ చారి మేనేజ్మెంట్ స్టడీస్ నిపుణులు -
రూపాయి మళ్లీ పతన బాట
రూపాయి మళ్లీ పతన బాట -
అనగనగా ఒక రుపాయి..
రూపాయ్! రూపాయ్! ఎందుకు పడ్డావ్ అంటే.. దిగుమతులు గుదిబండగా మారాయని చెప్పింది. దిగుమతులూ! దిగుమతులూ! గుదిబండగా ఎందుకు మారారంటే... డాలర్ అంతకంతకూ బలపడుతోందని అంటాయి.lడాలర్! డాలర్! ఎందుకు బలపడుతున్నావంటే... అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతున్నాయని అంటుంది. వడ్డీ రేటు! వడ్డీ రేటు! ఎందుకు పెరుగుతున్నావంటే.. ధరలు భారీగా పెరగడం వల్లంటుంది. ధరా! ధరా! ఎందుకు పెరిగావనడిగితే.. క్రూడాయిల్ రేట్లు మండిపోతున్నాయంటుంది. క్రూడాయిల్! క్రూడాయిల్! ఎందుకు మండుతున్నావంటే.. రష్యా ఉక్రెయిన్‌పై దండెత్తిందని చెబుతుంది. రష్యా! రష్యా! ఎందుకు దండెత్తావంటే... అమెరికా నా బంగారు దేశానికి ముప్పు తలపెడితే ఊరుకుంటానా అంటుంది. ఇదీ... ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంగా తయారైంది మన రూపాయి పరిస్థితి! ఎక్కడో ఉక్రెయిన్‌లో జరుగుతున్న వార్.. కరెన్సీలనే కాదు ఎకానమీలనూ కకావికలం చేస్తోంది. 1947లో దాదాపు 3 రూపాయలిస్తే ఒక డాలరు వచ్చేది. మరిప్పుడో... 80 రూపాయలు వదిలించుకోవాల్సిందే. అంతకంతకూ చిక్కి శల్యమవుతున్న రూపాయి తాజాగా చరిత్రాత్మక కనిష్ఠ స్థాయికి (80.05) జారిపోయింది. అంటే, బ్రిటిష్ వాళ్లను తరిమికొట్టిన తర్వాత 75 ఏళ్లలో ఏకంగా 75 రెట్లకు పైగా విలువ కోల్పోయిందన్నమాట! అసలు రూపాయికి డాలరుతో ఉన్న లింకేంటి? మన దేశ కరెన్సీ విలువ ఇలా బక్కచిక్కడానికి కారణాలేంటి? రూపాయి పతనం వల్ల ఎవరిపై ఎలాంటి ప్రభావం పడుతుంది? రూపాయి విలువ ఎందుకు పెరుగుతుంది.. ఎందుకు తగ్గుతుంది? ఇలాంటి సందేహాలన్నీ తీరాలంటే... ఈ కథ చదివేయండి మరి!! - శివరామకృష్ణ మిర్తిపాటి మనకు స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశీ కరెన్సీ బ్రిటిష్ పౌండ్తో ముడిపడి ఉండేది. విదేశీ లావాదేవీలన్నింటికీ పౌండ్లలో చెల్లింపులు జరిగేవి. అప్పట్లో ఒక బ్రిటిష్ పౌండ్ విలువను 13.33 రూపాయలుగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. అప్పుడు పౌండ్ విలువ 4 డాలర్లు. దీని ప్రకారం డాలరుతో మన రూపాయి మారకం విలువ దాదాపు 3.3 కింద లెక్క. 1951లో మొదలుపెట్టిన పంచవర్ష ప్రణాళికల అమలు కోసం విదేశీ రుణాలను భారీగా సమీకరించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, ప్రభుత్వం స్థిర కరెన్సీ మారకం విలువను అమలు చేయడం వల్ల 1947 నుంచి 1966 మధ్య డాలరుతో రూపాయి విలువ 4–5 స్థాయిలోనే కొనసాగింది. ఇక 1962లో చైనాతో యుద్ధం, పాకిస్థాన్‌తో 1965లో జరిగిన పోరుతో భారత బడ్జెట్లో భారీ లోటు ఏర్పడింది. 1965–66లో వచ్చిన కరువుతో దేశంలో ధరలు ఆకాశాన్నంటాయి. దీనికితోడు ఇతర దేశాలనుంచి దిగుమతులు పోటెత్తడంతో వాణిజ్యలోటు దూసుకెళ్లింది. ఆ సమయంలో డాలరుకు రూపాయి మారకం రేటును 7.57గా నిర్ణయించారు. పెద్దన్న కబంధ హస్తాల్లో... 1971లో బ్రిటిష్ పౌండ్తో భారత్ కరెన్సీకి పూర్తిగా బంధం తెగిపోయింది. అగ్రరాజ్యం అమెరికా కరెన్సీ కబంధ హస్తాల్లో రూపాయి చిక్కుకుంది. ఇక అప్పటినుంచి మన విదేశీ రుణ చెల్లింపులు, ఎగుమతులు– దిగుమతులు ఇతరత్రా లావాదేవీలన్నీ నేరుగా అమెరికా డాలరుతోనే ముడిపడ్డాయి. 1975లో డాలరుతో రూపాయి మారకం విలువ 8.39 డాలర్లకు తగ్గింది. 1985 నాటికి 12కు పడిపోయింది. ప్రధానంగా వాణిజ్యలోటు (ఎగుమతులు తగ్గిపోయి.. దిగుమతులు భారీగా ఎగబాకడం) పెరిగిపోవడంతో డాలరుతో రూపాయి మారకం విలువ 1990 నాటికి 17.5కు క్షీణించింది. చెల్లింపుల సంక్షోభంతో నియంత్రణకు చెల్లు... 1991లో భారత ఆర్థిక పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. దేశంలో విదేశీ కరెన్సీ(ఫారెక్స్) నిల్వలు దాదాపు అడుగంటిపోయాయి. దీంతో ఇతర దేశాలనుంచి చేసుకున్న దిగుమతులకు చెల్లింపులు జరపలేని స్థితి వచ్చేసింది. కేవలం మూడు వారాలకు సరిపడా చెల్లింపులకు మాత్రమే ఫారెక్స్ నిల్వలు (డాలర్లు) భారత్‌వద్ద మిగలాయి. తీవ్రమైన చెల్లింపుల సంక్షోభం తలెత్తడంతో బంగారాన్ని తాకట్టు పెట్టి డాలర్లను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనం ధరల మంటతో అల్లాడుతున్నారు. ఈ సమయంలోనే భారత్‌లో ఆర్థిక సంస్కరణలు, దేశంలోకి విదేశీ పెట్టుబడులు తరలి వచ్చేలా కీలకమైన సరళీకరణలకు ప్రభుత్వం తెరతీసింది. అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ గనుక సంస్కరణలతో చికిత్స చేసి ఉండకపోతే మన దేశం పరిస్థితి కూడా ఇప్పటి శ్రీలంకలా మారిపోయేదన్న మాట! ఇక 1993లో దేశ కరెన్సీ చరిత్రలో కీలక సంఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వం కరెన్సీపై నియంత్రణను పూర్తిగా ఎత్తివేసింది. ఆర్బీఐ కనుసన్నల్లో మార్కెట్ వర్గాలు (ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్ ఆధారంగా) రూపాయి మారకం విలువను నిర్దేశించేలా సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాలతో 1995 నాటికి డాలరుతో రూపాయి మారకం విలువ 32.42కు పడిపోయింది. 2000 సంవత్సరం నాటికి ఒక అమెరికా డాలరు కోసం 44.94 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. 2008 ఆర్థిక సంక్షోభంతో కుదేలు... మన్మోహన్ సింగ్.. 2004లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఆర్థిక వ్యవస్థ వృద్ధి పతాక స్థాయికి చేరింది. విదేశీ పెట్టుబడులు భారీగా తరలి రావడం, ప్రైవేటు రంగం పుంజుకోవడం, సరళీకరణల ఫలాలతో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఏకంగా 9 శాతాన్ని తాకింది. అయితే, 2008లో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక సంక్షోభం మన దేశాన్ని కూడా కకావికలం చేసింది. దీనికితోడు ధరల మంట కరెన్సీని కుదేలు చేసింది. 2009లో తొలిసారిగా రూపాయి 50ని దాటి పడిపోయింది. ఇక అప్పటి నుంచీ అంతకంతకూ బక్కచిక్కుతూనే ఉంది. 2016 నవంబర్‌లో 68.86 కనిష్ఠానికి దిగజారింది. 2018 వరకూ 66–68 స్థాయిలో కదలాడిన రూపాయి మళ్లీ అంతర్జాతీయ ఆర్థిక ప్రతికూలతలతో కట్టలు తెంచుకుంది. ట్రంప్ ముంపు... కరోనా పంజా! ట్రంప్ అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కిన తర్వాత ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేశారు. ఇతర దేశాల నుంచి అమెరికా దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై సుంకాలను ఎడాపెడా పెంచి వాణిజ్య యుద్ధానికి తెరతీయడంతో అంతర్జాతీయ వాణిజ్య రంగం అతలాకుతలమైంది. దీంతో వర్ధమాన దేశాల కరెన్సీలు మరింతగా కుప్పకూలాయి. ఇవన్నీ ఒకెత్తయితే, 2020 సంవత్సరంలో ప్రపంచం నెత్తిన ‘కరోనా’ పిడుగు పడింది. వ్యాపార వాణిజ్యాలు స్తంభించడంతో ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. ఈ దెబ్బకు డాలరుతో రూపాయి విలువ 76.70 స్థాయికి క్షీణించింది. ఇప్పుడు నెలకొన్న భౌగోళిక రాజకీయ ప్రభావాలకు తోడు ఇతరత్రా అంతర్జాతీయ ప్రతికూలతలతో తాజాగా రూపాయి 80.05ను తాకి చరిత్రాత్మక కనిష్టానికి జారిపోయింది. తాజా పతనానికి కారణాలేంటి...కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు... రూపాయి తాజా పతనానికీ అనేక అంశాలు ఆజ్యం పోస్తున్నాయి. వడ్డీరేట్ల పెంపు గుబులు..: 2020లో వచ్చిన కరోనా దెబ్బకు ఎకానమీ కకావికలం కావడంతో అమెరికా మళ్లీ డాలర్లను ఎడపెడా ముద్రించి, వడ్డీరేట్లను సున్నా స్థాయికి తెచ్చింది. అయితే, ధరల మంట కారణంగా (2022 జూన్‌లో ద్రవ్యోల్బణం 9.1%.. 4 దశాబ్దాల గరిష్ఠం) తాజాగా ఈ ప్యాకేజీల ఉపసంహరణను స్టార్ట్ చేయడంతో పాటు వడ్డీరేట్లను శరవేగంగా పెంచుతూ పోతోంది. అధిక ద్రవ్యోల్బణం ప్రపంచ దేశాలన్నింటినీ కుదిపేస్తుండటంతో ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు సైతం వడ్డీరేట్లను తీవ్రంగా పెంచుతున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్ల నుంచి ఇన్వెస్టర్లు నిధులను వెనక్కి తీసుకుంటూ... కష్టకాలంలో సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావించే డాలరు వైపు దృష్టిసారిస్తున్నారు. దీనివల్ల కూడా ఇతర దేశాల కరెన్సీలు దిగజారుతున్నాయి. ఆరు ప్రధాన కరెన్సీలతో ముడిపడిన డాలరు ఇండెక్స్ విలువ ఏకంగా 20 ఏళ్ల గరిష్ఠానికి ఎగసి 109 స్థాయికి దూసుకెళ్లింది అందుకే. అయితే, మిగతా చాలా కరెన్సీలతో పోలిస్తే ఈ ఏడాది రూపాయి కాస్త తక్కువగానే పతనం కావడం విశేషం. రష్యా–ఉక్రెయిన్ వార్.. క్రూడ్ సెగలు: మూలిగేనక్కపై తాటిపండు పడ్డట్లు...ప్రపంచ ఎకానమీకి ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ఊహించని షాకిచ్చింది. రష్యా క్రూడ్, గ్యాస్ ఇతరత్రా కమోడిటీల ఎగుమతులపై అమెరికా, యూరప్ దేశాలు విధించిన ఆంక్షల దెబ్బకు ముడి చమురు ధర భగ్గుమంది. ఫిబ్రవరిలో యుద్ధం మొదలవడానికి ముందు బ్యారెల్‌కు 90 స్థాయిలో ఉన్న క్రూడ్ ఒక్కసారిగా 140 డాలర్లకు ఎగబాకింది. ప్రస్తుతం 100–105 డాలర్ల వద్ద కదలాడుతోంది. ఈ ప్రభావంతో అనేక దేశాల్లో ధరలు ఆకాశాన్నంటడంతో.. వడ్డీరేట్లను భారీగా పెంచాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది రూపాయితో సహా అనేక దేశాల కరెన్సీ విలువలకు చిల్లు పెడుతోంది. దిగుమతుల బండ: అత్యధికంగా దిగుమతులపై ఆధారపడిన దేశం మనది. క్రూడ్ ధర పెరిగిపోయిన కారణంగా ముడిచమురు దిగుమతుల బిల్లు అంతకంతకూ తడిసిమోపెడవుతోంది. ఎందుకంటే మన క్రూడ్ అవసరాల్లో 85% వాటా దిగుమతులదే. గతేడాది (2021–22)లో దేశ ఎగుమతులు రికార్డు స్థాయిలో 418 బిలియన్ డాలర్లను (28% వృద్ధి) తాకాయి. అయితే, దిగుమతులు ఏకంగా 55% ఎగబాకి... 610 బిలియన్ డాలర్లకు దూసుకెళ్లాయి. ఇందులో ప్రధానంగా క్రూడ్, బంగారం దిగుమతులదే ప్రధాన వాటా కావడం గమనార్హం. దీంతో వాణిజ్య లోటు 88% ఎగసి 192 బిలియన్ డాలర్లుగా నమోదైంది. రిఫైనర్ల నుంచి డాలర్లకు డిమాండ్ పెరిగిపోతుండటంతో రూపాయిని బక్కచిక్కిపోయేలా చేస్తోంది. మరోపక్క, భారీ వాణిజ్య లోటు కారణంగా కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్ – మూలధన పెట్టుబడులు మినహా.. దేశంలోకి వచ్చి, పోయే విదేశీ మారక ద్రవ్యం మధ్య వ్యత్యాసం) తీవ్రమవుతోంది. గత ఆర్థిక సంవత్సరం 50 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న క్యాడ్ (జీడీపీతో పోలిస్తే 1.8%)... ఈ ఏడాది ఏకంగా 105 బిలియన్ డాలర్లకు (జీడీపీలో 3%) పెరిగిపోవచ్చనేది బ్యాంక్ ఆఫ్ అమెరికా తాజా అంచనా. విదేశీ పెట్టుబడులు రివర్స్‌గేర్: అమెరికా వడ్డీరేట్ల భారీ పెంపునకు తోడు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మాంద్యం భయాలు వెంటాడుతుండటంతో... విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) అమ్మకాలకు తెగబడుతున్నారు. దీంతో స్టాక్ మార్కెట్లు కూడా భారీగా పడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు భారతీయ స్టాక్, బాండ్ మార్కెట్ నుంచి 39 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకోవడం గమనార్హం. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం నాటితో పోలిస్తే, ఇది ఏకంగా 3 రెట్లు అధికం కావడం ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళనలకు నిదర్శనం. ఆర్థిక వ్యవస్థ బలహీనతలు..: 2021–22లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 8.7 శాతంగా నమోదైంది (అయితే, కరోనా కారణంగా 2020–21లో జీడీపీ 6.6% క్షీణించిన నేపథ్యంలో దీంతో పోల్చడానికి లేదు). ఈ ఏడాది (2022–23) వృద్ధి రేటు 7 శాతం లోపే ఉండొచ్చని అంచనా. రూపాయికి ఆర్థిక బలహీనత సెగ కూడా తగులుతోంది. మనలాంటి వర్ధమాన దేశాల్లో, ముఖ్యంగా భారత్ వంటి దిగుమతులపై అధికంగా ఆధారపడిన దేశంలో కరెన్సీ బలహీనత అనేది సహజమేనని కూడా కొంతమంది ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నంత వరకూ పెద్దగా ఆందోళనlచెందక్కర్లేదనేది వారి అభిప్రాయం. అయితే, ప్రస్తుత కరెన్సీ కల్లోలానికి దేశీ అంశాలకంటే అంతర్జాతీయ ప్రతికూలతలే ప్రధాన కారణం కావడంతో రూపాయి పతనానికి ఎక్కడ అడ్డుకట్టపడుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే!! రూపాయి బలహీనత వల్ల ఏం జరుగుతుంది... కంపెనీల లాభాలు ఆవిరి: మనదేశంలో చాలా కంపెనీలు దిగుమతులపైనే ఆధారపడటంతో అధిక మొత్తంలో ఖర్చుచేయాల్సి వస్తుంది. అంటే 100 డాలర్ల విలువైన కమోడిటీ లేదా విడిభాగాన్ని దిగుమతి చేసుకోవడానికి గతంలో రూ.7,400 వెచ్చించాల్సివస్తే... ఇప్పుడు రూపాయి క్షీణతతో రూ.8,000 ఖర్చుపెట్టాల్సి వస్తుందన్నమాట. దీంతో లాభాలు కూడా కరిగిపోతాయి. విదేశీ రుణాలు తడిసిమోపెడు: రూపాయి క్షీణతతో విదేశీ రుణాలు కూడా భారంగా మారతాయి. గతంలో కంపెనీలు, ప్రభుత్వం డాలరు రూపంలో తీసుకున్న రుణాలకు ఇప్పుడు చెల్లింపులు, వడ్డీ తడిసిమోపడవుతుంది. పెట్రో మంట.. ధరల మోత: అధిక కమోడిటీ రేట్లకు తోడు రూపాయి పడిపోవటం వల్ల దిగుమతి చేసుకునే వస్తువులకు అధికంగా చెల్లించాల్సి వస్తుంది. పెట్రోలు నుంచి వంటనూనెల వరకూ అన్నీ ఆకాశాన్నంటి వంటింటి సంక్షోభానికి కారణమవుతోంది. బొగ్గు దిగుమతి భారం కూడా పెరిగి, కరెంటు చార్జీలు షాకిస్తున్నాయి. సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, గృహోపకరణాలు మొదలైన ఉత్పత్తుల తయారీ సంస్థలు ముడి వస్తువుల ధరల సెగతో రేట్లను పెంచేస్తున్నాయి. దీంతో రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పటికే 7 శాతానికి ఎగబాకడం తెలిసిందే. విదేశీ ప్రయాణాలకూ సెగ..: రూపాయి దెబ్బకు విదేశీ ప్రయాణాల వ్యయం కూడా పెరిగిపోతోంది. విమాన టికెట్లకు, హోటల్స్ అద్దెకు, షాపింగ్‌కు మరింత వెచ్చించాల్సి వస్తోంది. ఉదాహరణకు 100 డాలర్ల అద్దె ఉన్న హోటల్ రూమ్‌కు ఆర్నెల్ల క్రితం రూపాయి మారకంలో రూ. 7,400 కడితే.. ఇప్పుడు.. రూ. 8,000 కట్టాల్సి వస్తుంది. ఉద్యోగాల్లో కోత..: రూపాయి పతన ంతో దిగుమతులకు కంపెనీలు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఫలితంగా రేట్లు పెంచాలి. రేట్లు భారీగా పెరిగితే కొనేవాళ్లుండరు. కొనేవాళ్లు లేక ఉత్పత్తి తగ్గించుకోవాల్సి వస్తుంది. దానికి తగ్గట్లే ఉద్యోగాల్లోనూ కోతలు తప్పవు. విదేశీ విద్య భారం: రూపాయి పతనం వల్ల విదేశాల్లో చదివే భారతీయ విద్యార్థులు ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం మరింత సొమ్ము వదిలించుకోవాల్సిన పరిస్థితి. ఉదాహరణకు, ఆర్నెల్ల క్రితం సెమిస్టర్లో 2000 డాలర్ల ఫీజుకు అప్పటి రూపాయి విలువ ప్రకారం రూ.1.48 లక్షలు ఖర్చయిందనుకుందాం. అదే ఇప్పుడు మళ్లీ సెమిస్టర్ ఫీజు 2,000 డాలర్లే ఉన్నప్పటికీ రూ.1.60 లక్షలు చెల్లించాల్సి వస్తుందన్నమాట. కొందరికే ఊరట! రూపాయి పడటం వల్ల కొన్ని వర్గాలకు మాత్రం ఊరట లభిస్తుంది. డాలర్లలో ఆదాయం ఆర్జిస్తూ ఇక్కyì తమ కుటుంబాలకు సొమ్ము పంపేవారికి మరిన్ని ఎక్కువ రూపాయలు లభిస్తాయి. అలాగే, ఎన్ఆర్ఐ డిపాజిట్లపై బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడమూ వారికి ప్రయోజనకరమే. ఇక సాధారణంగా రూపాయి బలహీనపడితే ఎగుమతి రంగ కంపెనీలకు పండగే. ఉదాహరణకు ఎగుమతుల ద్వారా ఆర్నెల్ల క్రితం రూ. కోటి ఆదాయం వచ్చుంటే.. రూపాయి క్షీణత వల్ల ప్రస్తుతం అదనంగా దాదాపు రూ. 6 లక్షలు ఆర్జించగలుగుతారు. మరోవైపు, డాలర్లలో ఆదాయం పొందే మన ఐటీ కంపెనీలకు కూడా రూపాయి పతనం సానుకూలంశమే. ఆర్బీఐ ఏం చేస్తోంది... చిక్కిపోతున్న రూపాయికి చికిత్స చేసేందుకు ఆర్బీఐ పరోక్షంగా పలు చర్యలు తీసుకుంటోంది. దేశంలోకి డాలర్ నిధులను పెంచేలా మరిన్ని ఎన్ఆర్ఐ డిపాజిట్లకు ఓకే చెప్పింది. వడ్డీరేట్లను పెంచుకునే వెసులుబాటునూ బ్యాంకులకు ఇచ్చింది. ఇక విదేశీ వాణిజ్య లావాదేవీలను రూపాయల్లో సెటిల్ చేసేందుకు (డాలర్లకు డిమాండ్ తగ్గించడం) తాజాగా అనుమతించింది. అలాగే, మన బ్యాంకులు, కార్పొరేట్ కంపెనీలు విదేశాల నుంచి మరింతగా రుణాలను సమీకరించుకునే అవకాశాన్ని, పరిమితులను కూడా ఆర్బీఐ పెంచింది. కాగా, రూపాయి పతనంతో మన విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో 632 బిలియన్ డాలర్లుగా ఉన్న ఫారెక్స్ నిల్వలు తాజాగా 580 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇవి 9 నెలల పాటు దిగుమతులకు సరిపోతాయని అంచనా. రూపాయి పైకి.. కిందికి ఎందుకు? వివిధ దేశాల మధ్య ఆర్థిక లావాదేవీలు, రాజకీయ స్థితిగతులు కరెన్సీపై ప్రభావం చూపుతుంటాయి. ఉదాహరణకు, అమెరికా వెళ్లినప్పుడు అక్కడ మన రూపాయలు చెల్లవు కాబట్టి.. వాటిని ఇచ్చి డాలర్లు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, వాళ్లు మన దగ్గరకొస్తే డాలర్లు ఇచ్చి రూపాయలు తీసుకోవాల్సి వస్తుంది. ఇలా మార్కెట్లో సంబంధిత కరెన్సీ లభ్యత, డిమాండును బట్టి ఇతర కరెన్సీలతో పోలిస్తే దాని విలువ మారుతూ ఉంటుంది. డాలర్‌కు డిమాండ్ పెరిగినప్పుడు రూపాయి బలహీనపడుతుంది. అలాగే రూపాయలకు డిమాండ్ పెరిగినప్పుడు బలపడుతుంది. రూపాయి హెచ్చుతగ్గులకు లోనవడానికి అనేక ఆర్థికాంశాలు కారణమవుతుంటాయి. ఉదాహరణకు ఎగుమతులు పెరిగినప్పుడు ఆయా కంపెనీలకు ఆదాయం కింద ఎక్కువ డాలర్లు వస్తాయి. సహజంగానే వీటిని దేశీయంగా రూపాయల్లోకి మార్చుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో డాలర్ల లభ్యత ఎక్కువై.. రూపాయల కొరత ఏర్పడుతుంది. ఫలితంగా రూపాయికి డిమాండ్ పెరిగి బలపడుతుంది. మరోవైపు, దేశీ కంపెనీలు దిగుమతి చేసుకున్నప్పుడు వాటికి డాలర్లలో చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. కనుక దిగుమతులు ఎక్కువైనప్పుడు డాలర్లకు ఆటోమేటిక్‌గా డిమాండ్ పెరిగి అది బలపడుతుంది. అలాగే, విదేశీ పెట్టుబడుల అంశం కూడా. విదేశీ కంపెనీలు ఇండియాలో పెట్టుబడులు పెట్టినప్పుడు రూపాయలు కావాల్సి ఉంటుంది కనుక.. డాలర్ల విలువ తగ్గి రూపాయికి డిమాండ్ పెరుగుతుంది. అదే.. ఆ కంపెనీలు ఇండియాలో తమ పెట్టుబడులు అమ్మేసినప్పుడు వాటికి డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది కనుక డాలర్లకు డిమాండ్ పెరుగుతుంది. ఇలా తరచు డాలర్లు, రూపాయల డిమాండ్‌లో మార్పుల వల్ల ఒకదానితో పోలిస్తే మరొక దాని విలువ కూడా మారుతుంటుంది. ద్రవ్యోల్బణం, జీడీపీ వృద్ధి, వడ్డీ రేట్లూ కూడా కరెన్సీపై ప్రభావం చూపుతాయి. -
రికార్డు స్థాయిలో పతనమైన రూపాయి విలువ
-
ప్రపంచానికి మాంద్యం గుబులు, పడిపోతున్న రూపాయి విలువ!
ముంబై: ప్రపంచ దేశాలను మళ్లీ మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం ఆందోళనలు, పలు దేశాల రుణ రేట్ల పెంపుతో ప్రపంచ వృద్ధిబాటలోంచి క్షీణతలోకి మారే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషణలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడులకు తక్షణ మార్గంగా డాలర్ కనబడుతోంది. దీనితోపాటు ఫెడ్ కఠిన ద్రవ్య విధానంతో ప్రపంచవ్యాప్తంగా నిధులు డాలర్లలోకి వస్తున్నాయి. ఈ వార్త రాసే 11 గంటల సమయంలో ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ పటిష్టంగా 106.50 డాలర్లపైన గరిష్ట స్థాయిలో ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో భారత్ ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ చరిత్రాత్మక పతనం కొనసాగుతోంది. మంగళవారం 38 పైసలు పతనమై 79.33 వద్ద ముగిసింది. ఒక దశలో రూపాయి 79.38 స్థాయిని కూడా చూసింది. దేశం నుంచి విదేశీ పెట్టుబడులు భారీగా వెనక్కు మళ్లడం రూపాయి భారీ పతనానికి కారణమవుతోంది. ఈ రెండు స్థాయిలు రూపాయికి ముగింపు, ఇంట్రాడే కనిష్ట స్థాయిలు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ లాభాల బాటన పయనిస్తుండగా, నైమెక్స్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర 35 డాలర్లు పతనమై (2 శాతం) 1,767కు చేరింది. క్రూడ్ 10 శాతం వరకూ పడిపోయి 100 డాలర్ల దిగువకు చేరింది. -
స్వతంత్ర భారతి: నయా పైసలొచ్చాయి!
అణా బ్రిటిష్ పాలనలోని మారక ద్రవ్య ప్రమాణం. ఒక రూపాయికి 16 అణాలు. ఒక అణాకు 6 పైసలు. అర్దణా అంటే మూడు పైసలు. ఈ విధానం ఇండియాకు స్వాతంత్య్రం వచ్చాక కూడా కొనసాగింది. 1957లో నెహ్రూ ప్రభుత్వం దశాంక విధానం అమలులోకి తెచ్చింది. రూపాయికి 100 నయా పైసలుగా నిర్ణయించింది. 1964లో ’నయాపైస’ను ’పైస’గా పేరు మార్చారు. ఇప్పటికీ 25 పైసలను ’నాలుగు అణాలు’ అనీ, 50 పైసలను ’ఎనిమిది అణాలు’ అనీ వాడటం అనేక ప్రాంతల్లో కనబడుతుంది. 1/12 అణా (అణాలో 12వ భాగం లేదా దమ్మిడీ); 1/4 అణా (అణాలో 4వ భాగం, కానీ లేదా పావు అణా); 1/2 అణా (అణాలో సగభాగం లేదా పరక); అణా (6 పైసలు లేదా 1/16 రూపాయలు); 2 అణాలు (12 పైసలు లేదా బేడ); 1/4 రూపాయి (4 అణాలు లేదా పావలా); 1/2 రూపాయి (8 అణాలు లేదా అర్ధ రూపాయి). -
రూపాయి.. క్రాష్!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ మళ్లీ భారీగా చరిత్రాత్మక కనిష్ట స్థాయిలకు పడిపోయింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ సోమవారం 54 పైసలు పతనమై 77.44కు పడిపోయింది. క్రితం ట్రేడింగ్ సెషన్లో (శుక్రవారం) రూపాయి 55 పైసలు పతనమై 76.90కి చేరింది. అదే వరవడిని కొనసాగిస్తూ, సోమవారం ట్రేడింగ్‌లో బలహీనంగా 77.17 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్ ఒక దశలో 77.55 కనిష్టాన్ని చూసింది. చివరికి స్వల్పంగా 11పైసలు కోలుకుని 77.44 వద్ద ముగిసింది. క్రితం కన్నా ఇది 54 పైసలు పతనం. క్రితం రెండు ట్రేడింగ్ సెషన్లలో రూపాయి 109 పైసలు నష్టపోవడం గమనార్హం. రూపాయి కదలికలకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ఈక్విటీ మార్కెట్ల పతనం నేపథ్యంలో ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి మారకం విలువ మార్చి 8వ తేదీన రూపాయి ఇంట్రాడే కనిష్టం 77.05 స్థాయిని చూస్తే, ముగింపులో 77గా ఉంది. రూపాయికి సోమవారం వరకూ ఇవి చరిత్రాత్మక కనిష్ట స్థాయిలు. అటు తర్వాత రూపాయి స్వల్ప ఒడిదుడుకులతో 76 వరకూ బలపడినా, ఆ స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది. కేవలం రెండు నెలలు తిరిగేసరికే రూపాయి మరింత కిందకు జారిపోవడం కరెన్సీ బలహీనతలను తెలియజేస్తోంది. ► అంతక్రితం కరోనా సవాళ్ల నేపథ్యంలో 2020 ఏప్రిల్ 22వ తేదీన రూపాయి ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92ని చూసింది. ముగింపులో 2020 ఏప్రిల్ 16వ తేదీన రికార్డు పతనం 76.87. ఆ తర్వాత కొంత బలపడినా, తిరిగి ఆ స్థాయిని కోల్పోడానికి దాదాపు రెండేళ్ల సమయం పట్టింది. ► అమెరికా వడ్డీరేట్ల పెంపు, దీనితో ఆ దేశానికి తిరిగి డాలర్ల రాక డాలర్ ఇండెక్స్ బలోపేతానికి కారణమవుతోంది. ఈ వార్త రాస్తున్న రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ అరశాతంపైగా నష్టంతో 77.55 వద్ద ట్రేడవుతోంది. ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదికన లెక్కించే డాలర్ ఇండెక్స్ పటిష్టంగా 103.64 వద్ద ట్రేడవుతోంది. మరింత క్షీణత..! రూపాయి సమీప కాలంలోనే 77.80 స్థాయికి పతనం కావచ్చన్నది మా అంచనా. బలమైన డాలర్ ఇండెక్స్, అమెరికాలో ట్రెజరీ ఈల్డ్‌లు పెరుగుదల, ఆసియా సహచర కరెన్సీల బలహీనతల నేపథ్యంలో భారత్ రూపాయి విలువ తాజాగా రికార్డు స్థాయికి పడిపోయింది. అమెరికా వడ్డీరేట్ల పెంపు ఈక్విటీ మార్కెట్లను కూడా తీవ్ర అనిశ్చితికి, బలహీనతకు గురిచేస్తోంది. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు అధిక రేట్ల పెంపు అవసరాన్ని అంచనా వేస్తున్న పెట్టుబడిదారులు, ప్రస్తుతం మార్కెట్లో రిస్క్ చేయడానికి విముఖతను వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న స్థాయిని మించి (2–6%) ద్రవ్యోల్బణం పెరుగుదల, క్రూడ్ ధరల పెరుగుదల వంటి అంశాలు కూడా దేశీయ ఈక్విటీల నుంచి ఎఫ్ఐఐలు వెనక్కు మళ్లడానికి కారణం అవుతున్నాయి. ఆర్బీఐ ఎంపీసీ మే 4 మధ్యంతర పరపతి సమీక్ష రూపాయికి తక్షణం మద్దతును అందించలేకపోయింది. – రాయిస్ వర్గీస్ జోసెఫ్ కరెన్సీ అండ్ ఎనర్జీ రీసెర్చ్ అనలిస్ట్, ఆనంద్ రాఠి -
రూపాయి ‘రికార్డు’ పతనం! కారణం ఏంటంటే..
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ చరిత్రాత్మక కనిష్ట పతనం దిశగా కదులుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ బుధవారం 44 పైసలు పతనమై, 76.32 వద్ద ముగిసింది. గడచిన 20 నెలల్లో (2020 ఏప్రిల్ తరువాత) రూపాయి ఈ స్థాయి పతనం ఇదే తొలిసారి. అలాగే ఒకేరోజు రూపాయి ఈ స్థాయి పతనం కూడా గడచిన ఎనిమిది నెలల్లో ఇదే తొలిసారి. భారత్ కరెన్సీ మంగళవారం ముగింపు 75.88. డిసెంబర్లో గడచిన 11 ట్రేడింగ్ సెషన్లలో తొమ్మిది రోజుల్లో రూపాయి 119 పైసలు (1.58 శాతం) నష్టపోయింది. రూపాయికి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). కారణాలు ఏమిటి? ►అమెరికాసహా పలు దేశాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం తీవ్ర రూపంలో ఉంది. అమెరికాలో అక్టోబర్, నవంబర్ నెలల్లో 31 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత రిటైల్ ద్రవ్యోల్బణం (వరుసగా 6.2 శాతం, 6.8 శాతం) నమోదయ్యింది. ఈ పరిస్థితుల్లో అమెరికా సెంట్రల్ బ్యాంక్ సరళతర విధానానికి త్వరలో ముగింపు పలకనున్నదన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనికి అనుగుణంగా ఫెడ్ ఫండ్ రేటు (ప్రస్తుతం 0–0.25 శాతం) పెంచే అవకాశం ఉందని అంచనా ఉంది. ►ఈ పరిస్థితుల్లో సరళతర ఆర్థిక విధానాలతో విదేశీ మార్కెట్లను ముంచెత్తిన డాలర్లు వెనక్కు మళ్లడం ప్రారంభమైంది. ఫలితంగా ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ గడచిన నెల రోజులుగా భారీగా బలపడుతోంది. తీవ్ర అనిశ్చితి నేపథ్యంలో పెట్టుబడులకు డాలర్ సురక్షిత ఇన్స్ట్రమెంట్గా కూడా కనబడుతోంది. ►దీనితో దేశీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర అనిశ్చితికి గురవుతున్నాయి. మార్కెట్ల నుంచి విదేశీ నిధులు వెనక్కు మళ్లుతున్నాయి. ఈ ప్రభావం రూపాయి సెంటిమెంట్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. ►ఇక అంతర్జాతీయంగా క్రూడ్ ధర భయాలు, దేశంలో ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు భయాలూ రూపాయిని వెంటాడుతున్నాయి. ►దీనికితోడు కరోనా కొత్తవేరియంట్ ఒమిక్రాన్ భయాలు, ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ►ఈ వార్తా రాస్తున్న రాత్రి 8 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో రూపాయి విలువ నష్టాల్లో 76.31 వద్ద ట్రేడవుతుండగా, డాలర్ ఇండెక్స్ పటిష్టంగా 96.50 వద్ద ట్రేడవుతోంది. -
రూ.2000 నోటు చివరన నల్లటి గీతలు ఎందుకు ఉంటాయి..?
మన దేశంలోని అన్నీ రకాల నోట్లను ఆర్బీఐ ముద్రిస్తుంది. భారతీయ కరెన్సీలో చాలా రకాల నోట్లు ఉన్నాయి. ప్రతి నోటుకి అనేక రకాల కీలక భద్రతా లక్షణాలు ఉంటాయి. ఈ సెక్యూరిటీ ఫీచర్ల ద్వారానే ఆ నోట్ నిజమైనదా లేదా నకిలీదా గుర్తించవచ్చు. అయితే, ఈ నోట్లను తయారు చేయడానికి ప్రత్యేకమైన పేపర్లను ఉపయోగిస్తారు. అయితే, మీరు ఎప్పుడైనా రూ.2000 నోటు తీసుకునేటప్పుడు దాని మీద చివర ఉండే నల్లటి గీతలను గమనించారా?. వాటిని ఎందుకు ముదరిస్తారో తెలుసా?. ఇప్పుడు ముద్రించే రూ.1,00 నుంచి రూ.2,000 కరెన్సీ నోట్లపై ఈ గీతలు ఉంటాయి. వీటిని ప్రత్యేకంగా రూపొందిస్తారు. వాస్తవానికి ఈ గీతలను అంధులను దృష్టిలో ఉంచుకుని ముద్రించారు. మీరు 2000 నోట్ తీసుకొని నల్లటి గీతలను తాకినప్పుడు స్పర్శ కలుగుతుంది. ఈ స్పర్శ ద్వారా అంధుడు ఆ కరెన్సీ నోట్ గురించి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ముద్రించే 100 నోటు మీద నాలుగు గీతలు (|| ||) ఉంటాయి. అదే 200 నోటు మీద నాలుగు గీతలు, రెండు చుక్కలు (|| o o ||) ఉంటాయి. ఇక 500 నోటు మీద 5 గీతలు (|| | ||) ఉంటే, 2000 నోటు మీద 7 గీతలు (| || | || |) ఉంటాయి. ఈ నల్లటి గీతలను చేతితో తాకి అది ఎన్ని రూపాయల నోటో గుర్తించవచ్చు. (చదవండి: లాటరీలో డబ్బులు గెలిస్తే? ట్యాక్స్ ఎంత కట్టాలో తెలుసా?) -
రూపాయి... రెండు వారాల గరిష్టం @ 71.50
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ మంగళవారం రెండు వారాల గరిష్టం 71.50 స్థాయికి చేరింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 24 పైసలు బలపడింది. అక్టోబర్ 17 తరువాత రూపాయి ఒకేరోజు 24 పైసలు బలపడ్డం ఇదే తొలిసారి. దేశీయ ఈక్విటీ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం, అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం సమసిపోతుందన్న అంచనాలు ఫారెక్స్ మార్కెట్లో రూపాయి సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయి. ట్రేడింగ్‌లో 71.49–71.68 శ్రేణిలో తిరిగింది. గత ఏడాది అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అటు తర్వాత పలు సానుకూల అంశాలతో రూపాయి క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు బలపడింది. రూపాయి మరింత బలోపేతం కావడానికి ఈ నిరోధం కీలకం. అయితే ఇక్కడ నుంచి రూపాయి ఏ దశలోనూ ముందుకు వెళ్లలేకపోయింది. చమురు ధర పెరుగుదల భయాలు కొనసాగుతున్న నేపథ్యంలో దీర్ఘకాలంలో రూపాయిది బలహీన ధోరణేనన్నది నిపుణుల అభిప్రాయం. -
ఒకప్పటి రూపాయే.. ఇప్పుడు కువైట్ దీనార్
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీ ఏదో తెలుసా.. తెలియకపోతే తెలుసుకోండి. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విలువైన కరెన్సీ కువైట్ దీనార్. ఈ రోజు ఒక కువైట్ దీనార్ భారత కరెన్సీలో సుమారు రూ. 215లకు సమానం. కానీ ఒకప్పడు కువైట్ ఏ కరెన్సీ ఉపయోగించేదో తెలుసా.. ఇండియా కరెన్సీనే వాడేది. 1959 వరకూ భారతీయ రూపాయినే కువైట్ కరెన్సీగా చలామణి అయ్యేది. కానీ 1960లొ తొలిసారి రూపాయి స్థానంలో గల్ఫ్ రూపీని ప్రవేశ పెట్టింది. తరువాత కాలక్రమేణా ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీగా రూపాంతం చెందింది. 1990 ఇరాక్ చెర నుంచి కువైట్ విముక్తి పొందింది. అప్పటినుంచి ఫిబ్రవరి 25, 26 లను లిబరేషన్ డే (విముక్తి దినోత్సవంగా) జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తన దేశ కరెన్సీ ఏవిధంగా మార్పు చెందుతూ వచ్చిందో తెలియచేస్తూ దేశ రాజధానిలో వాటి నమూనాలను ఏర్పాటు చేసింది. ఈసందర్భంగా 1959లో ఉపయోగించిన రూపాయిని సైతం జాబితాలో చేర్చింది. ఆ వీడియో మీకోసం. -
ఒకప్పటి రూపాయే.. ఇప్పుడు కువైట్ దీనార్