అత్యంత విలువైన కరెన్సీ అనగానే యూఎస్ డాలర్, బ్రిటిష్ పౌండ్, యూరో వంటివి మన మదిలో మెదులుతాయి. కానీ ఇవేవీ కాకుండా 2023 సంవత్సరంలో అత్యంత విలువైన కరెన్సీగా కువైట్ దినార్ నిలిచింది. మన రూపాయితో పోల్చుకుంటే దినార్ విలువ రూ.266.64కు చేరింది. స్థిరమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండటం వల్లే కువైట్ దినార్ అత్యంత విలువైన కరెన్సీగా కొనసాగుతోంది.
ప్రపంచంతో ఎక్కువగా ట్రేడింగ్ జరిగేది యూఎస్ డాలర్లలోనే కాబట్టి అదే అత్యంత విలువైన కరెన్సీ అనుకుంటుంటాం. అయితే వాస్తవం ఏంటంటే.. మనకు తెలిసిన యూఎస్ డాలర్ యూరో, బ్రిటిష్ పౌండ్‌లతో పాటు ప్రపంచంలో అనేక కరెన్సీలు ఉన్నాయి. వాటిలో కొన్ని చవకైనవి కాగా మరికొన్ని చాలా విలువైనవి. యూఎస్ డాలర్ కంటే విలువైన కరెన్సీలు ఉన్నాయి. అందులో కొన్ని ప్రస్తుతం మన రూపాయితో పోల్చుకుని చూస్తే.. కువైట్ దినార్ రూ.266.64, బెహ్రెయిన్ దినార్ రూ.215.90, ఒమన్ రియాల్ రూ.211.39, జోర్డాన్ దినార్ రూ.114.77, బ్రిటిష్ పౌండ్ రూ.99.68, గిబ్రాల్టర్ పౌండ్ రూ.99.40, కేమన్ డాలర్ రూ.98.02, యూరో రూ.88.34, స్విస్ ఫ్రాంక్ రూ.88.04, యూఎస్ డాలర్ రూ.81.36గా కొనసాగుతోంది.
చదవండి: భారీగా పన్ను భారం తగ్గించే ఈ 7 అలెవెన్సుల గురించి మీకు తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment