Dinar
-
కరెన్సీ కింగ్.. కువైట్ దీనార్
ప్రపంచంలో అత్యధిక విలువైన కరెన్సీ అంటే అంతా అమెరికన్ డాలర్ అనుకుంటారు. అది కొంతవరకూ నిజమే. ప్రపంచంలో అత్యధిక లావాదేవీలు డాలర్‌తోనే జరుగుతాయి. అక్టోబరు 7 నాటికి.. ఒక డాలర్ విలువ మన కరెన్సీలో సుమారు రూ.84.కానీ, కొన్ని కరెన్సీలు ఒక్కో యూనిట్ కొనాలంటే ఒకటి కంటే ఎక్కువ అమెరికన్ డాలర్లు ఖర్చు చేయాలి. అలా చూసినప్పుడు ప్రపంచంలో అత్యధిక విలువ ఉన్న కరెన్సీ కువైట్ దీనార్. ఇది ఒక యూనిట్ సుమారు రూ.274. ఒక దీనార్ కొనాలంటే 3.26 డాలర్లు ఖర్చు పెట్టాలి.ప్రపంచంలోనే అత్యంత విలువైన లేదా ఖరీదైన కరెన్సీ టైటిల్‌ను కలిగి ఉందో లేదో తెలుసుకోవడానికి వివిధ స్థానిక, అంతర్జాతీయ అంశాల సమగ్ర విశ్లేషణ అవసరం. ఈ కారకాలలో విదేశీ మారకపు మార్కెట్లలో సరఫరా, డిమాండ్ డైనమిక్స్, ద్రవ్యోల్బణం రేట్లు, దేశీయ ఆర్థిక వృద్ధి, సంబంధిత సెంట్రల్ బ్యాంక్ అమలు చేసే విధానాలు, దేశం మొత్తం ఆర్థిక స్థిరత్వం ఉన్నాయి. -
ప్రపంచంలోనే అత్యంత విలువైన టాప్10 కరెన్సీలు ఇవే..
కరెన్సీ విలువ దేశ ఆర్థిక శక్తిని ప్రతిబింబిస్తోంది. దాని విలువ పెరుగుతున్న కొద్దీ దేశం బలమైన ఆర్థికశక్తిగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. విలువతోపాటు వాణిజ్యానికి అనువైన కరెన్సీ చలామణిలో ఉంటే ఆ దేశపురోగతే మారుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఐక్యరాజ్యసమితి ప్రపంచంలోని 180 కరెన్సీలను అధికారికంగా గుర్తించింది. ఆయా దేశాల ఎగుమతులు, దిగుమతులు, ఫారెక్స్ రిజర్వ్‌లు, బంగారు నిల్వలు, రోజువారీ వాణిజ్యం ఆధారంగా నిత్యం కరెన్సీ విలువ మారుతోంది. తాజాగా ప్రపంచంలోనే అధిక విలువైన కరెన్సీ జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. అత్యంత విలువైన కరెన్సీ అనగానే యూఎస్ డాలర్, బ్రిటిష్ పౌండ్, యూరో వంటివి మన మదిలో మెదులుతాయి. కానీ ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీగా కువైట్ దినార్ నిలిచింది. మన రూపాయితో పోల్చుకుంటే దినార్ విలువ రూ.270.23కు చేరింది. స్థిరమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండటం వల్లే కువైట్ దినార్ అత్యంత విలువైన కరెన్సీగా కొనసాగుతోందని తెలిసింది. విలువైన కరెన్సీలు.. రూపాయిల్లో.. 1. కువైట్ దినార్: రూ.270.23 2. బహ్రెయిన్ దినార్ రూ.220.4 3. ఒమానీ రియాల్ రూ.215.84 4. జోర్డానియన్ దినార్ రూ.117.10 5. జిబ్రాల్టర్ పౌండ్ రూ.105.52 6. బ్రిటిష్ పౌండ్ రూ.105.54 7. కేమ్యాన్ ఐలాండ్ పౌండ్ రూ.99.76 8. స్విస్ ఫ్రాంక్ రూ.97.54 9. యూరో రూ.90.80 10. యూఎస్ డాలర్ రూ.83.10 ఇదీ చదవండి: చైనాను బీట్ చేసే భారత్ ప్లాన్ ఇదేనా! అమెరికా డాలర్ ఈ జాబితాలో చివరి స్థానంలో నిలిచింది. అయితే ప్రపంచవ్యాప్తంగా యూఎస్ డాలర్లలో అత్యంత విస్తృతంగా వాణిజ్యం జరుగుతోంది. -
ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీ ఏంటో తెలుసా..?
అత్యంత విలువైన కరెన్సీ అనగానే యూఎస్ డాలర్, బ్రిటిష్ పౌండ్, యూరో వంటివి మన మదిలో మెదులుతాయి. కానీ ఇవేవీ కాకుండా 2023 సంవత్సరంలో అత్యంత విలువైన కరెన్సీగా కువైట్ దినార్ నిలిచింది. మన రూపాయితో పోల్చుకుంటే దినార్ విలువ రూ.266.64కు చేరింది. స్థిరమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉండటం వల్లే కువైట్ దినార్ అత్యంత విలువైన కరెన్సీగా కొనసాగుతోంది. ప్రపంచంతో ఎక్కువగా ట్రేడింగ్ జరిగేది యూఎస్ డాలర్లలోనే కాబట్టి అదే అత్యంత విలువైన కరెన్సీ అనుకుంటుంటాం. అయితే వాస్తవం ఏంటంటే.. మనకు తెలిసిన యూఎస్ డాలర్ యూరో, బ్రిటిష్ పౌండ్లతో పాటు ప్రపంచంలో అనేక కరెన్సీలు ఉన్నాయి. వాటిలో కొన్ని చవకైనవి కాగా మరికొన్ని చాలా విలువైనవి. యూఎస్ డాలర్ కంటే విలువైన కరెన్సీలు ఉన్నాయి. అందులో కొన్ని ప్రస్తుతం మన రూపాయితో పోల్చుకుని చూస్తే.. కువైట్ దినార్ రూ.266.64, బెహ్రెయిన్ దినార్ రూ.215.90, ఒమన్ రియాల్ రూ.211.39, జోర్డాన్ దినార్ రూ.114.77, బ్రిటిష్ పౌండ్ రూ.99.68, గిబ్రాల్టర్ పౌండ్ రూ.99.40, కేమన్ డాలర్ రూ.98.02, యూరో రూ.88.34, స్విస్ ఫ్రాంక్ రూ.88.04, యూఎస్ డాలర్ రూ.81.36గా కొనసాగుతోంది. చదవండి: భారీగా పన్ను భారం తగ్గించే ఈ 7 అలెవెన్సుల గురించి మీకు తెలుసా? -
డాలర్ కన్నా తోపు కరెన్సీలెన్నో.. అక్కడ మారకం అంత తక్కువా?
కొద్దిరోజులుగా డాలర్‌తో రూపాయి మారకం విలువ తగ్గిపోతూ వస్తోంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తే సరికి.. ‘రూపాయి తగ్గడం కాదు. డాలర్ పెరుగుతోంది’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించడం మరింత చర్చకు దారితీసింది. సాధారణంగా ఏ దేశ కరెన్సీని అయినా అమెరికన్ డాలర్‌తోనే పోల్చుతుంటారు. అందువల్ల డాలర్ అంటే బాగా విలువైన కరెన్సీ అనే భావన ఉండిపోయింది. నిజానికి అమెరికన్ డాలర్ ప్రపంచంలోనే బలమైన కరెన్సీ. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్నిదేశాలు దాన్ని ఆమోదిస్తాయి. డాలర్లలోనే ప్రపంచ వాణిజ్యం జరుగుతుంటుంది కూడా. అందుకు ప్రతి కరెన్సీని, వాణిజ్యాన్ని డాలర్లతో పోల్చుతూ, లెక్కవేస్తూ ఉంటారు. అయితే, డాలర్ కన్నా విలువైన కరెన్సీలు కూడా ఉన్నాయి. దేశాల ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులు, జీడీపీ, అభివృద్ధి రేటు వంటి అంశాల ఆధారంగా వాటి కరెన్సీ విలువ ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో కొన్నిదేశాల కరెన్సీ విలువ డాలర్ కన్నా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఒక్క కువైట్ దినార్‌కు 3.26 అమెరికన్ డాలర్లు వస్తాయి. అంటే రూ.270 అన్నమాట. ఈ జాబితాలో టాప్‌లో ఉన్న దేశాలన్నీ చమురు ఉత్పత్తితో సంపన్నంగా మారినవి, పారిశ్రామిక విప్లవంతో అభివృద్ధి చెందినవే కావడం గమనార్హం. కువైట్ దినార్ కంటే కూడా విలువైన కరెన్సీ ఒకటి ఉంది. ఇటలీ, ఫ్రాన్స్ దేశాల మధ్య ఉండే గుర్తింపులేని ఓ చిన్నదేశం (మైక్రోనేషన్) ‘ప్రిన్సిపాలిటీ ఆఫ్ సెబోర్గా’కు చెందిన సెబోర్గన్ ల్యూగినో కరెన్సీ అది. ఈ కరెన్సీని స్థానికంగా లావాదేవీలకు, బ్యాంకుల్లో వినియోగిస్తారు. బయట ఎక్కడా చెల్లదు. ఇక్కడి బ్యాంకుల్లో కరెన్సీ మార్పిడి విలువ ప్రకారం.. ఒక్కో సెబోర్గన్ ల్యూగినోకు ఆరు డాలర్లు ఇస్తారు. అంటే మన కరెన్సీలో రూ.498 అన్నమాట. ఒక డాలర్‌కు 42,350 ఇరాన్ రియాల్లు ప్రపంచంలో అత్యంత తక్కువ విలువైన కరెన్సీ ఇరాన్ రియాల్. ఒక డాలర్‌కు ఏకంగా 42,350 ఇరాన్ రియాల్స్ వస్తాయి. మన కరెన్సీతో పోల్చితే.. ఒక్క రూపాయికి 510 ఇరాన్ రియాల్స్ వస్తాయి. నిజానికి భారీగా చమురు ఉత్పత్తి చేసే ఇరాన్.. ఇతర దేశాల్లా సంపన్నంగా మారి ఉండేది. కానీ ఆ దేశంలో రాజకీయ అనిశి్చతి, అణు ప్రయోగాల వల్ల ఆర్థిక ఆంక్షల వల్ల పరిస్థితి దారుణంగా మారింది. -
ఒకప్పటి రూపాయే.. ఇప్పుడు కువైట్ దీనార్
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీ ఏదో తెలుసా.. తెలియకపోతే తెలుసుకోండి. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విలువైన కరెన్సీ కువైట్ దీనార్. ఈ రోజు ఒక కువైట్ దీనార్ భారత కరెన్సీలో సుమారు రూ. 215లకు సమానం. కానీ ఒకప్పడు కువైట్ ఏ కరెన్సీ ఉపయోగించేదో తెలుసా.. ఇండియా కరెన్సీనే వాడేది. 1959 వరకూ భారతీయ రూపాయినే కువైట్ కరెన్సీగా చలామణి అయ్యేది. కానీ 1960లొ తొలిసారి రూపాయి స్థానంలో గల్ఫ్ రూపీని ప్రవేశ పెట్టింది. తరువాత కాలక్రమేణా ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీగా రూపాంతం చెందింది. 1990 ఇరాక్ చెర నుంచి కువైట్ విముక్తి పొందింది. అప్పటినుంచి ఫిబ్రవరి 25, 26 లను లిబరేషన్ డే (విముక్తి దినోత్సవంగా) జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తన దేశ కరెన్సీ ఏవిధంగా మార్పు చెందుతూ వచ్చిందో తెలియచేస్తూ దేశ రాజధానిలో వాటి నమూనాలను ఏర్పాటు చేసింది. ఈసందర్భంగా 1959లో ఉపయోగించిన రూపాయిని సైతం జాబితాలో చేర్చింది. ఆ వీడియో మీకోసం. -
ఒకప్పటి రూపాయే.. ఇప్పుడు కువైట్ దీనార్
-
సొంత కరెన్సీ ముద్రించనున్న ఐఎస్ఐఎస్
ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్(ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) సొంత కరెన్సీని ముద్రించుకోవాలని నిర్ణయించుకుంది. మళ్లీ బంగారం, వెండి నాణేలతో మారకం చేసే ఆలోచనలో ఐఎస్ఐఎస్ ఉంది. పాతకాలంలో దినార్లో నాలుగు గ్రాముల బంగారం, దిర్హమ్లో మూడు గ్రాముల వెండి ఉండేది. ఇరాన్, సిరియాలలోని కీలక ప్రాంతాలను ఇప్పటికే ఐఎస్ఐఎస్ ఆక్రమించిన విషయం తెలిసిందే. **