
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీ ఏదో తెలుసా.. తెలియకపోతే తెలుసుకోండి. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విలువైన కరెన్సీ కువైట్ దీనార్. ఈ రోజు ఒక కువైట్ దీనార్ భారత కరెన్సీలో సుమారు రూ. 215లకు సమానం. కానీ ఒకప్పడు కువైట్ ఏ కరెన్సీ ఉపయోగించేదో తెలుసా.. ఇండియా కరెన్సీనే వాడేది. 1959 వరకూ భారతీయ రూపాయినే కువైట్ కరెన్సీగా చలామణి అయ్యేది. కానీ 1960లొ తొలిసారి రూపాయి స్థానంలో గల్ఫ్ రూపీని ప్రవేశ పెట్టింది. తరువాత కాలక్రమేణా ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీగా రూపాంతం చెందింది.
1990 ఇరాక్ చెర నుంచి కువైట్ విముక్తి పొందింది. అప్పటినుంచి ఫిబ్రవరి 25, 26 లను లిబరేషన్ డే (విముక్తి దినోత్సవంగా) జరుపుకుంటుంది. ఈ సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ తన దేశ కరెన్సీ ఏవిధంగా మార్పు చెందుతూ వచ్చిందో తెలియచేస్తూ దేశ రాజధానిలో వాటి నమూనాలను ఏర్పాటు చేసింది. ఈసందర్భంగా 1959లో ఉపయోగించిన రూపాయిని సైతం జాబితాలో చేర్చింది. ఆ వీడియో మీకోసం.