
న్యూఢిల్లీ: రూపాయిలో లావాదేవీలను పరిష్కరించుకున్నప్పటికీ, విదేశీ వాణిజ్య విధానం (ఎఫ్‌టీఏ) కింద ఎగుమతిదారులు ప్రోత్సాహకాలను పొందేందుకు ఇకపై ఎటువంటి ఇబ్బందీ ఉండబోదు. వాణిజ్య మంత్రిత్వశాఖ పరిధిలో కార్యకలాపాలు నిర్వహించే విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ (జీడీఎఫ్‌టీ) ఈ మేరకు నిబంధనావళిని విడుదల చేసింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధంసహా భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో రూపాయిలో అంతర్జాతీయ వాణిజ్యం నిర్వహించేందుకు భారత్ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
ఇందుకు సంబంధించిన అడ్డంకులను కేంద్రం క్రమంగా తొలగిస్తోంది. తాజా నిర్ణయంతో రూపాయిలో ఎగుమతులకు సంబంధించి వాణిజ్య లావాదేవీల పరిష్కారానికి మార్గం మరింత సుగమం అయ్యింది. ఇప్పటికే దేశీయ కరెన్సీలో వాణిజ్యాన్ని సులభతరం చేసే లక్ష్యంతో భారత్ రూపాయిలో ఎగుమతులు– దిగుమతుల ఇన్‌వాయిస్, చెల్లింపు, సెటిల్‌మెంట్‌కు జీడీఎఫ్‌టీ అనుమతించింది.
Comments
Please login to add a commentAdd a comment