న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు ఆగస్టులో అసలు వృద్ధిలేకపోగా 1.15 శాతం మేర క్షీణించాయి. విలువలో 33 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఎగుమతుల్లో క్షీణత నమోదుకావడం 20 నెలల్లో ఇదే తొలిసారి. ఇక దిగుమతులు 37 శాతం పెరిగి, 61.68 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
వెరసి ఎగుమతులు–దిగుమతుల విలువ మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు రెట్టింపునకు పైగా పెరిగి, 28.68 బిలియన్ డాలర్లుగా ఉంది. దిగుమతుల బిల్లు భారీగా పెరగడానికి క్రూడ్ ఆయిల్ దిగుమతులు ప్రధాన కారణం.
ఇక ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య ఎగుమతులు 17.12 శాతం పెరిగి 192.59 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 45.64 శాతం పెరిగి 317.81 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment