
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి ఎగుమతులు రూ.61.7 లక్షల కోట్లు దాటతాయని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్‌లో ఎగుమతుల్లో 17 శాతం వృద్ధి నమోదైందని చెప్పారు. 2021–22లో భారత్ నుంచి విదేశాలకు చేరిన వస్తు, సేవల విలువ రూ.55.5 లక్షల కోట్లు అని పేర్కొన్నారు. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా శుక్రవారం ఆయన ఈ విషయాలు వెల్లడించారు.
చదవండి: Elon Musk: ఎలాన్ మస్క్‌కు షాకిచ్చిన ప్రత్యర్థి సంస్థ.. ట్విట్టర్‌లో యాడ్స్ బంద్!
Comments
Please login to add a commentAdd a comment