సెమీకండక్టర్ల రంగంలో.. భారత్‌ అవకాశాల గని | Piyush Goyal Meets Micron Ceo, Discusses India Semiconductor Ecosystem | Sakshi
Sakshi News home page

సెమీకండక్టర్ల రంగంలో.. భారత్‌ అవకాశాల గని

Published Fri, Nov 17 2023 7:41 AM | Last Updated on Fri, Nov 17 2023 9:13 AM

Piyush Goyal Meets Micron Ceo, Discusses India Semiconductor Ecosystem - Sakshi

శాన్‌ ఫ్రాన్సిస్కో: దేశీయంగా సెమీకండక్టర్ల రంగం గణనీయంగా వృద్ధి చెందుతోందని, ఈ విభాగంలో పుష్కలంగా వ్యాపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు.

అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కోలో మైక్రాన్‌ టెక్నాలజీ సీఈవో సంజయ్‌ మెహ్రోత్రాతో సమావేశమైన సందర్భంగా ఆయన ఈ విషయం తెలిపారు. ‘మైక్రాన్‌టెక్‌ సీఈవో మెహ్రోత్రాతో భేటీ అయ్యాను. భారత్‌లో సెమీకండక్టర్ల రంగం వృద్ధి చెందుతున్న తీరు, కంపెనీకి గల వ్యాపార అవకాశాలు మొదలైన అంశాలను చర్చించాము‘ అని సోషల్‌ నెట్‌వర్కింగ్‌ ప్లాట్‌ఫాం ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. అటు యూట్యూబ్‌ సీఈవో నీల్‌ మోహన్‌తో కూడా గోయల్‌ సమావేశమయ్యారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement