నష్టాల నుంచి లాభాల్లోకి సెన్సెక్స్!
బుధవారం ఉదయం నష్టాలతో ఆరంభమైన భారత స్టాక్ మార్కెట్ సూచీలు ట్రేడింగ్ చివరి గంటలో భారీగా లాభాల్ని నమోదు చేసుకున్నాయి. సెన్సెక్స్ 264 పాయింట్ల లాభంతో 20248 పాయింట్ల వద్ద, నిఫ్టీ 77 పాయింట్ల లాభంతో 6006 పాయింట్ల వద్ద ముగిసాయి. ఆరంభంలో నష్టపోయిన రూపాయి సాయంత్రానికి కోలుకుంది. ఓ దశలో రూపాయి 51 పైసలు కోల్పోయి 62.30 చేరుకుంది. అయితే ప్రస్తుతం 11 పైసల నష్టంతో 61.90 వద్ద ట్రేడ్ అవుతోంది.
ప్రధాన సూచీలు లాభాల బాట పట్టడానికి రిలయెన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ కంపెనీల షేర్లు దోహదపడ్డాయి.
ఇండెక్స్ షేర్లలో డిఎల్ఎఫ్, సన్ ఫార్మా, జయప్రకాశ్ అసోసియేట్స్, కొటాక్ మహింద్ర, ఎన్ ఎమ్ డీసీ కంపెనీల షేర్లు లాభాల్ని నమోదు చేసుకున్నాయి. ఎం అండ్ ఎం, ఏసీసీ, విప్రో, సెసా స్టెర్ లైట్, సిప్లా కంపెనీల షేర్లు నష్టాల్ని నమోదు చేసుకున్నాయి.