రూ.2000 నోటు చివరన నల్లటి గీతలు ఎందుకు ఉంటాయి..? | Why there is black line printed mark in 2000 INR Currency Note | Sakshi
Sakshi News home page

రూ.2000 నోటు చివరన నల్లటి గీతలు ఎందుకు ఉంటాయి..?

Published Mon, Oct 25 2021 6:24 PM | Last Updated on Mon, Oct 25 2021 6:29 PM

Why there is black line printed mark in 2000 INR Currency Note - Sakshi

మన దేశంలోని అన్నీ రకాల నోట్లను ఆర్బీఐ ముద్రిస్తుంది. భారతీయ కరెన్సీలో చాలా రకాల నోట్లు ఉన్నాయి. ప్రతి నోటుకి అనేక రకాల కీలక భద్రతా లక్షణాలు ఉంటాయి. ఈ సెక్యూరిటీ ఫీచర్ల ద్వారానే ఆ నోట్ నిజమైనదా లేదా నకిలీదా గుర్తించవచ్చు. అయితే, ఈ నోట్లను తయారు చేయడానికి ప్రత్యేకమైన పేపర్‌లను ఉపయోగిస్తారు. అయితే, మీరు ఎప్పుడైనా రూ.2000 నోటు తీసుకునేటప్పుడు దాని మీద చివర ఉండే నల్లటి గీతలను గమనించారా?. వాటిని ఎందుకు ముదరిస్తారో తెలుసా?. 

ఇప్పుడు ముద్రించే రూ.1,00 నుంచి రూ.2,000 కరెన్సీ నోట్లపై ఈ గీతలు ఉంటాయి. వీటిని ప్రత్యేకంగా రూపొందిస్తారు. వాస్తవానికి ఈ గీతలను అంధులను దృష్టిలో ఉంచుకుని ముద్రించారు. మీరు 2000 నోట్ తీసుకొని నల్లటి గీతలను తాకినప్పుడు స్పర్శ కలుగుతుంది. ఈ స్పర్శ ద్వారా అంధుడు ఆ కరెన్సీ నోట్ గురించి తెలుసుకోవచ్చు. ఇప్పుడు ముద్రించే 100 నోటు మీద నాలుగు గీతలు (|| ||) ఉంటాయి. అదే 200 నోటు మీద నాలుగు గీతలు, రెండు చుక్కలు (|| o o ||) ఉంటాయి. ఇక 500 నోటు మీద 5 గీతలు (|| | ||) ఉంటే, 2000 నోటు మీద 7 గీతలు (| || | || |) ఉంటాయి. ఈ నల్లటి గీతలను చేతితో తాకి అది ఎన్ని రూపాయల నోటో గుర్తించవచ్చు.

(చదవండి: లాటరీలో డబ్బులు గెలిస్తే? ట్యాక్స్ ఎంత కట్టాలో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement