న్యూఢిల్లీ: అమెరికన్ డాలరు బలపడుతున్న కొద్దీ రూపాయి రోజురోజుకూ మరింతగా క్షీణిస్తోంది. సోమవారం మరో 58 పైసలు తగ్గి కొత్త ఆల్–టైమ్ కనిష్ట స్థాయి 81.67కి పతనమైంది. దీంతో దేశీ కరెన్సీ వరుసగా నాలుగు సెషన్లలో పతనమైనట్లయింది. ఈ వ్యవధిలో రూపాయి మారకం విలువ ఏకంగా 193 పైసలు పడిపోయింది.
డాలరు బలపడుతుండటం, ఇన్వెస్టర్లు రిస్కులకు ఇష్టపడకపోతుండటం, దేశీ స్టాక్ మార్కెట్లో ప్రతికూల ధోరణి, విదేశీ నిధులు తరలిపోతుండటం, ఉక్రెయిన్–రష్యా మధ్య ఉద్రిక్తతల వల్ల భౌగోళికరాజకీయ రిస్కుల భయాలు నెలకొనడం తదితర అంశాలు దేశీ కరెన్సీ పతనానికి కారణాలుగా ఉంటున్నాయని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు.
82 నిరోధం..: ఈ పరిస్థితుల్లో స్పాట్ మార్కెట్లో రూపాయి 81.20–81.80 శ్రేణిలో కదలవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనలిస్ట్ గౌరంగ్ సోమయ్య చెప్పారు. 82 వద్ద నిరోధం, 81.05 వద్ద నిరోధం ఉండగలదని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ తెలిపారు.
చదవండి: Ration Card New Rules: కేంద్రం కొత్త నిబంధనలు.. ఇకపై వాళ్ల రేషన్ కార్డు కట్!
Comments
Please login to add a commentAdd a comment