
ముంబై: మూడు రోజుల రూపాయి లాభాలకు గురువారం బ్రేక్ పడింది. కీలక రేట్లను పావు శాతం మేర తగ్గించినప్పటికీ, తటస్థ ద్రవ్య విధానాన్నే కొనసాగించాలని ఆర్‌బీఐ నిర్ణయించడంతో రూపాయి పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 76 పైసలు క్షీణించి 69.17కు పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, ఇతర ప్రధాన కరెన్సీలతో పోల్చితే డాలర్ బలపడటం.. రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపాయి. వరుసగా రెండో పాలసీలో కీలక రేట్లలో ఆర్‌బీఐ కోత విధించింది. దీంతో రూపాయి, బాండ్ల ధరలు పడిపోయాయి. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 15 పైసల నష్టంతో 68.56 వద్ద ఆరంభమైంది. ఇంట్రాడేలో 80 పైసలు నష్టపోయి 69.21 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. చివరకు 76 పైసల నష్టంతో 69.17 వద్ద ముగిసింది. బుధవారం రూపాయి 33 పైసలు లాభపడిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment