RBI policy rate the repo
-
మరోసారి వడ్డీరేట్లు పెంచిన RBI
-
పాలసీని స్వాగతించని మార్కెట్!
అంచనాలకు తగ్గట్లుగానే ఆర్బీఐ రేట్ల కోత ఉన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను ఆర్బీఐ తగ్గించింది. అంతేకాకుండా తటస్థ ద్రవ్య విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో గురువారం స్టాక్ మార్కెట్ నష్టపోయింది. స్టాక్ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 38,700 పాయింట్లు, నిఫ్టీ 11,600 పాయింట్ల దిగువకు పడిపోయాయి. సేవల రంగం గణాంకాలు అంతంతమాత్రంగానే ఉండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనం కావడం, అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటం... ఈ అంశాలన్నీ ప్రతికూల ప్రభావం చూపించాయి. ప్రధాన స్టాక్ సూచీలు ఆద్యంతం ఒడిడుదుకుల్లోనే ట్రేడయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 192 పాయింట్లు పతనమై 38,685 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 46 పాయింట్లు తగ్గి 11,598 పాయింట్ల వద్ద ముగిశాయి. అంచనాలకు తగ్గట్లే రేట్ల కోత అంచనాలకు అనుగుణంగానే ఆర్బీఐ రెపో రేటును పావు శాతం తగ్గించింది. అంతంతమాత్రం వృద్ధితో మందగమనంగా ఉన్న ఆర్థిక వ్యవస్థకు జోష్‌నివ్వడానికి ఆర్బీఐ రెపో రేటును పావు శాతం తగ్గింది. దీంతో రెపో రేటు ఏడాది కనిష్ట స్థాయి 6 శాతానికి చేరింది. ఈ రేట్ల కోత కారణంగా గృహ, వాహన, ఇతర రుణాలు చౌకగా లభిస్తాయి. నెలవారీ వాయిదాలు చౌక అవుతాయి. అయితే అంతర్జాతీయంగా కొన్ని సమస్యలు నెలకొన్నాయని, అందుకే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను 7.2 శాతానికి తగ్గిస్తున్నామని ఆర్బీఐ పేర్కొంది. ముడి చమురు ధరలు పుంజుకుంటుండటంవల్ల తటస్థ ద్రవ్య విధానాన్నే కొనసాగిస్తామని వివరించింది. కొత్త వర్క్ ఆర్డర్లు మందగమనంగా ఉండటంతో మార్చిలో భారత సేవల రంగం ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 52.5 శాతంగా ఉన్న నికాయ్ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ ఈ మార్చిలో 52కు పడిపోయింది. మూడు రోజులుగా లాభపడుతున్న రూపాయి గురువారం భారీగా పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం ఇంట్రాడేలో 80 పైసలు నష్టపోయి 69.21ను తాకింది. చివరకు 76 పైసల నష్టంతో 69.17 వద్ద ముగిసింది. హాంగ్‌కాంగ్ హాంగ్‌సెంగ్ మినహా మిగిలిన ఆసియా సూచీలు లాభపడ్డాయి. కొనసాగిన లాభాల స్వీకరణ... ప్రధాన స్టాక్ సూచీలు బుధవారం జీవిత కాల గరిష్ట స్థాయిలకు చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం కూడా లాభాల స్వీకరణ కొనసాగింది. సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లోనే ఆరంభమయ్యాయి. ఆర్బీఐ పాలసీ ప్రకటన వెలువడే వరకూ పరిమిత శ్రేణి లాభ, నష్టాల్లోనే సూచీలు ట్రేడయ్యాయి. మధ్యాహ్నం ఒంటిగంట వరకూ లాభ, నష్టాల మధ్య దోబూచులాడాయి. ఆ తర్వాత అమ్మకాల జోరు పెరిగి నష్టాలు కూడా పెరిగాయి. సెన్సెక్స్ ఒక దశలో 62 పాయింట్లు లాభపడగా, మరో దశలో 296 పాయింట్లు నష్టపోయింది. రోజంతా 358 పాయింట్ల రేంజ్లో కదిలింది. మిశ్రమంగా ‘వడ్డీ’ ప్రభావిత షేర్లు... వడ్డీరేట్ల ప్రభావిత బ్యాంక్, వాహన, రియల్టీ షేర్లు మిశ్రమంగా ముగిశాయి. టాటా మోటార్స్, హీరో మోటొకార్ప్, ఐషర్ మోటార్స్, టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, మారుతీ సుజుకీ షేర్లు 3–1 శాతం రేంజ్లో లాభపడ్డాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, అశోక్ లేలాండ్ షేర్లు చెరో అరశాతం మేర నష్టపోయాయి. బ్యాంక్ షేర్లలో సిటీ యూనియన్ బ్యాంక్ 2.2 శాతం, ఎస్బీఐ 0.3 శాతం మేర లాభపడగా, యస్ బ్యాంక్ 2 శాతం, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.8 శాతం, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1 శాతం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్0.4 శాతం చొప్పున నష్టపోయాయి. ► టీసీఎస్ సెన్సెక్స్‌లో భారీగా 3.1 శాతం నష్టంతో రూ.2,014 వద్ద ముగిసింది. ► రెండు రోజుల స్టాక్ మార్కెట్ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.1.46 లక్షల కోట్లు ఆవిరైంది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.46 లక్షల కోట్లు తగ్గి రూ.1,51,04,506 కోట్లకు పడిపోయింది. ► షేర్ల విక్రయం ద్వారా రూ.3,000 కోట్లు సమీకరించనున్నదన్న వార్తలతో యస్ బ్యాంక్ షేర్ 2 శాతం క్షీణించి రూ.268 వద్ద ముగిసింది. -
రూపాయి 76పైసలు డౌన్
ముంబై: మూడు రోజుల రూపాయి లాభాలకు గురువారం బ్రేక్ పడింది. కీలక రేట్లను పావు శాతం మేర తగ్గించినప్పటికీ, తటస్థ ద్రవ్య విధానాన్నే కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించడంతో రూపాయి పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 76 పైసలు క్షీణించి 69.17కు పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, ఇతర ప్రధాన కరెన్సీలతో పోల్చితే డాలర్ బలపడటం.. రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపాయి. వరుసగా రెండో పాలసీలో కీలక రేట్లలో ఆర్బీఐ కోత విధించింది. దీంతో రూపాయి, బాండ్ల ధరలు పడిపోయాయి. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 15 పైసల నష్టంతో 68.56 వద్ద ఆరంభమైంది. ఇంట్రాడేలో 80 పైసలు నష్టపోయి 69.21 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. చివరకు 76 పైసల నష్టంతో 69.17 వద్ద ముగిసింది. బుధవారం రూపాయి 33 పైసలు లాభపడిన విషయం తెలిసిందే. -
మరో విడత వడ్డింపు!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అక్టోబర్ 3,4,5వ తేదీల్లో జరపనున్న ద్రవ్య, పరపతి విధాన సమీక్ష సందర్భంగా రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) నిర్ణయం వైపే మొగ్గుచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అరశాతం వరకూ పెంచే అవకాశాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదే జరిగితే ఈ రేటు 6.5 శాతం నుంచి 7 శాతానికి పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది మూడవసారి రేటు పెంపు నిర్ణయం తీసుకున్నట్లు అవుతుంది. నిర్దేశిత లక్ష్యాల మేరకు ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్నప్పటికీ, క్రూడ్ ఆయిల్ తీవ్రత, రూపాయి బలహీనత, అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఫండ్ రేటు పెంపు అంశాల నేపథ్యంలో రేటు పెంపు వైపే ఆర్బీఐ మొగ్గుచూపే అవకాశం ఉందని ఒక వార్తా సంస్థ సెప్టెంబర్ 19 నుంచి 25 మధ్య నిర్వహించిన సర్వేలో ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇక డాలర్ మారకంలో ఈ ఏడాది ఇప్పటి వరకూ దాదాపు 15 శాతం బలహీనపడ్డ రూపాయి విధాన నిర్ణేతలకు ఆందోళన కలిగించే అంశమేనన్నది వారి విశ్లేషణ. అమెరికాలో వడ్డీరేటు పెరుగుతున్న పరిస్థితుల్లో, దేశీయంగా ఈ తరహా నిర్ణయం లేకపోతే దేశంలో పెట్టుబడులు పెట్టే విదేశీ ఇన్వెస్టర్‌కు తగిన రిటర్న్ లభించని పరిస్థితి ఉంటుంది. దీనితో దేశానికి విదేశీ నిధులు తగ్గిపోతాయి. ఈ పరిస్థితి కరెంట్ అకౌంట్ లోటుకు, రూపాయి మరింత పతనానికి దారితీస్తుంది. 3వ తేదీ నుంచీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఆర్బీఐ పరపతి విధాన కమిటీ సమావేశం జరగనుంది. 5వ తేదీన కీలక రేట్లపై తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఈ అంశంపై కొందరి అభిప్రాయాలు చూస్తే... ఎస్బీఐ: రూపాయి బలహీనతను అరికట్టడానికి కనీసం పావుశాతం రేటు పెంపు తప్పదని ఎస్బీఐ తన పరిశోధనా పత్రంలో పేర్కొంది. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తన ‘తటస్థ వైఖరి’ని కూడా ఆర్బీఐ మార్చే అవకాశం ఉందని భావిస్తున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. ఐఎన్జీ: అమెరికా సెంట్రల్ బ్యాంక్.. ఫెడ్ వడ్డీరేట్ల (ప్రస్తుతం 2.25%) పెంపు నేపథ్యంలో దేశీయంగానూ రేట్ల పెంపు తప్పని పరిస్థితి నెలకొందని ఐఎన్‌జీలో ఆసియా ఆర్థిక వ్యవహారాల నిపుణులు ప్రకాశ్ శక్పాల్ పేర్కొన్నారు. ఆర్బీఐ అక్టోబర్ 4వ తేదీన పావుశాతం రేటు పెంచినా, ఫెడ్ రేటుకు సంబంధించి పోల్చిచూస్తే, ఆ మేర రేటు పెంపు (పావుశాతం) తక్కువగానే భావించాల్సి వస్తుందని ఆయన విశ్లేషించారు. రాబోబ్యాంక్: భారత్ రెండవ త్రైమాసికంలో అధిక వృద్ధి రేటును సాధించినప్పటికీ, దానికి ప్రధానంగా బేస్ ఎఫెక్ట్ కారణమవుతుందని రబోబ్యాంక్‌లో సీనియర్ ఎకనమిస్ట్ హుగో ఎర్కిన్ పేర్కొన్నారు. చమురు ధరల పెరుగుదల ప్రస్తుతం భారత్ ముందున్న తీవ్ర సవాలని అన్నారు. ఇది కరెంట్ అకౌంట్‌పై ప్రతికూలత చూపే అంశంగా పేర్కొన్నారు. డీబీఎస్: రూపాయి క్షీణతతో పాలసీ రేటు పెంపు ఆర్బీఐకి తప్పనిసరేనని, అయితే ఎప్పుడు పెంచుతారన్నదే కీలకమని సింగపూర్‌లో డీబీఎస్ ఎకనమిస్ట్ రాధికారావు పేర్కొన్నారు. బ్రెంట్ క్రూడ్ ధర తీవ్రత, దేశంలో ఇది ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారితీసే అవకాశాలు రేటు పెంపు నిర్ణయం పట్ల ఆర్బీఐ మొగ్గుచూపేలా చేస్తాయని రాధికారావు పేర్కొన్నారు. మోర్గాన్ స్టాన్లీ: ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు ఖాయమని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడుతోంది. రూపాయి బలహీనత ఇక్కడ కీలకాంశమని పేర్కొంది. కరెన్సీ విలువ స్థిరీకరణకు తీసుకుంటున్న చర్యలూ ఫలితమివ్వడం లేదన్న విషయాన్ని మోర్గాన్ స్టాన్లీ ప్రస్తావించింది. చమురు ధరల పెరుగుదల, ద్రవ్యలోటు సమస్య, ద్రవ్యోల్బణం ఎగసే అవకాశాలను ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. పెట్రో ధరల మంట... దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ద్రవ్యోల్బణం ము న్ముందు పెరుగుతుందనడానికి ఇది ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ఆర్బీఐ ముందస్తు చర్య తీసుకునే అవకాశం ఉంది. రెపో రేటు పావుశాతం పెరుగుతుందని భావిస్తున్నా. – రాజ్‌కిరణ్ రాయ్ జీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఎండీ రూపీ బలహీనత కారణంగా... కరెన్సీ విలువ డాలర్ మారకంలో భారీగా పడిపోతోంది. ఆయా పరిణామాలను ఎదుర్కొనడానికి పావుశాతం రేటు పెంపు తక్షణ అవసరం. – కేకి మిస్త్రీ, హెచ్డీఎఫ్సీ వైస్ చైర్మన్ రయ్‌మంటున్న క్రూడ్... అంతర్జాతీయంగా క్రూడ్ ధర నాలుగున్నరేళ్ల గరిష్టస్థాయికి చేరింది. మంగళవారం నైమెక్స్ క్రూడ్ బ్యారల్ ధర 75.91 డాలర్లను తాకింది. ఈ వార్త రాసే 9 గంటల సమయానికి 75.30 వద్ద ట్రేడవుతోంది. భారత్ ప్రధానం గా వినియోగించే బ్రెంట్ ధర 85.36 స్థాయిని తాకి, అదే స్థాయిలో ట్రేడవుతోంది. సరఫరా పరమైన ఆందోళనలు అంతర్జాతీయంగా క్రూడ్ ధరల పెరుగుదలకు కారణం. 100 డాలర్లకు బ్రెంట్ చేరుతుందన్న అంచనాలు భారత్ వంటి వర్థమాన దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. జారిపోతున్న రూపాయి... ఇక అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ పడిపోతోంది. మంగళవారం నైమెక్స్‌లో రూపాయి విలువ డాలర్ మారకంలో 73.77కు పడిపోయింది. ఈ వార్త రాసే 9 గంటల సమయానికి 73.30 వద్ద ట్రేడవుతోంది. ఇక ఆరు దేశాల కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ మళ్లీ 95 పటిష్ట స్థాయిని దాటింది. దేశీయ ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఇప్పటికి రూపాయి ఇంట్రాడే రికార్డు 72.99 అయితే, ముగింపులో రికార్డు 72.98. అంతర్జాతీయ ట్రేడింగ్ ధోరణిని చూస్తుంటే, బుధవారం దేశీయంగా 73ను రూపాయి దాటిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
తగ్గిన టోకు ద్రవ్యోల్బణం
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 5.2 శాతంగా నమోదయ్యింది. అంటే వార్షిక ప్రాతిపదికన 2013 ఏప్రిల్‌తో పోల్చితే ఈ రేటు 2014 ఏప్రిల్‌లో 5.2 శాతం పెరిగిందన్నమాట. 2014 మార్చిలో ఈ పరిమాణం 5.7 శాతం. నెలలో అరశాతం తగ్గింది. ఆహార ధరలు తగ్గడం మొత్తం టోకు ద్రవ్యోల్బణంపై సానుకూల ప్రభావం చూపింది. డబ్ల్యూపీఐలో ఒక భాగంగా ఉన్న ఆహార ధరల రేటు వార్షికంగా మార్చిలో 9.9% వద్ద ఉంటే, ఏప్రిల్‌లో ఇది 8.64%. పప్పు దినుసులు, ఉల్లిపాయల రేట్లు వార్షికంగా తగ్గాయి. ధరల తీరిది...: వార్షిక ప్రాతిపదికన 2013 ఏప్రిల్‌తో చూస్తే, 2014 ఏప్రిల్‌లో పప్పు దినుసులు (మైనస్ 0.77 శాతం) ఉల్లిపాయల (మైనస్ 9.76%) రేట్లు తగ్గాయి. మిగిలిన రేట్ల విషయానికివస్తే తృణధాన్యాల ధరలు 8.31 శాతం, బియ్యం ధరలు 12.76 శాతం, కూరగాయల ధరలు 1.34 శాతం, ఆలూ ధరలు భారీగా 31.56 శాతం, పండ్ల ధరలు 16.46 శాతం, పాల ధరలు 9.19 శాతం, గుడ్లు, మాంసం, చేపల ధరలు 9.97 శాతం పెరిగాయి. రేటు తగ్గింపుపై ఊహాగానాలు! కాగా టోకు ద్రవ్యోల్బణం తగ్గిన దృష్ట్యా ప్రత్యేకించి టోకున ఆహార పదార్థాల ధరల రేటు నెలవారీగా తగ్గినందున, రానున్న ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష సందర్భంగా ఆర్బీఐ పాలసీ రేటు రెపోను తగ్గించే అవకాశం ఉందని కొన్ని వర్గాలు అంచనా వేస్తున్నాయి. జూన్ 3న ఆర్బీఐ పాలసీ సమీక్ష జరపనుంది. ధరలకు సంబంధించి తాజా ధోరణి ఇకముందూ కొనసాగే అవకాశం ఉందని ఫైనాన్స్ సెక్రటరీ అరవింద్ మయారామ్ అభిప్రాయపడ్డారు. ఏప్రిల్ రిటైల్ ద్రవ్యోల్బణం 8.59%గా నమోదైంది.