RBI Forex Reserves
-
రూపాయి 76పైసలు డౌన్
ముంబై: మూడు రోజుల రూపాయి లాభాలకు గురువారం బ్రేక్ పడింది. కీలక రేట్లను పావు శాతం మేర తగ్గించినప్పటికీ, తటస్థ ద్రవ్య విధానాన్నే కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయించడంతో రూపాయి పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 76 పైసలు క్షీణించి 69.17కు పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, ఇతర ప్రధాన కరెన్సీలతో పోల్చితే డాలర్ బలపడటం.. రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపాయి. వరుసగా రెండో పాలసీలో కీలక రేట్లలో ఆర్బీఐ కోత విధించింది. దీంతో రూపాయి, బాండ్ల ధరలు పడిపోయాయి. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 15 పైసల నష్టంతో 68.56 వద్ద ఆరంభమైంది. ఇంట్రాడేలో 80 పైసలు నష్టపోయి 69.21 వద్ద కనిష్ట స్థాయిని తాకింది. చివరకు 76 పైసల నష్టంతో 69.17 వద్ద ముగిసింది. బుధవారం రూపాయి 33 పైసలు లాభపడిన విషయం తెలిసిందే. -
ఐఎంఎఫ్‌ని ఆశ్రయించం: మాంటెక్
న్యూఢిల్లీ: దేశీయ క్లిష్ట ఆర్థిక పరిస్థితుల్లో సాయం కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధిని (ఐఎంఎఫ్) ఆశ్రయించే ఆలోచన లేదని ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా శనివారం స్పష్టం చేశారు. దేశం వెలుపలి వర్గాల నుంచి సాయం తీసుకోవాల్సినంతగా పరిస్థితులేమీ దిగజారలేదని, భవిష్యత్తులోనూ అవసరం పడకపోవచ్చని జీ20పై జరిగిన ఒక కార్యక్రమంలో అన్నారు. విదేశీ బ్యాంకులతో మాయారాం భేటీ ముంబై: రూపాయిపై ప్రధాన విదేశీ బ్యాం కుల ట్రెజరీ విభాగాల అధిపతులతో కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అరవింద్ మాయారాం శనివారం చర్చించారు. ఎగుమతులు ఆశాజనకం: ఆనంద్‌శర్మ ఎగుమతుల్లో ఆశాజనక పరిస్థితులు నెలకొన్నాయని ముంబైలో జరిగిన ఎగుమతుల సంఘాల సమాఖ్య సమావేశంలో మంత్రి ఆనంద్‌శర్మ పేర్కొన్నారు.