ఐఎంఎఫ్‌ని ఆశ్రయించం: మాంటెక్ | Montek Singh Ahluwalia rules out approaching IMF over economic woes | Sakshi
Sakshi News home page

ఐఎంఎఫ్‌ని ఆశ్రయించం: మాంటెక్

Published Sun, Sep 1 2013 1:34 AM | Last Updated on Fri, Sep 1 2017 10:19 PM

ఐఎంఎఫ్‌ని ఆశ్రయించం: మాంటెక్

ఐఎంఎఫ్‌ని ఆశ్రయించం: మాంటెక్

న్యూఢిల్లీ: దేశీయ క్లిష్ట ఆర్థిక పరిస్థితుల్లో సాయం కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధిని (ఐఎంఎఫ్) ఆశ్రయించే ఆలోచన లేదని ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా శనివారం స్పష్టం చేశారు. దేశం వెలుపలి వర్గాల నుంచి సాయం తీసుకోవాల్సినంతగా పరిస్థితులేమీ దిగజారలేదని, భవిష్యత్తులోనూ అవసరం పడకపోవచ్చని జీ20పై జరిగిన ఒక కార్యక్రమంలో అన్నారు.
 
 విదేశీ బ్యాంకులతో మాయారాం భేటీ
 ముంబై: రూపాయిపై ప్రధాన విదేశీ బ్యాం కుల ట్రెజరీ విభాగాల అధిపతులతో కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అరవింద్ మాయారాం శనివారం చర్చించారు.
 
 ఎగుమతులు ఆశాజనకం: ఆనంద్‌శర్మ
 ఎగుమతుల్లో ఆశాజనక పరిస్థితులు నెలకొన్నాయని ముంబైలో జరిగిన ఎగుమతుల సంఘాల సమాఖ్య సమావేశంలో మంత్రి ఆనంద్‌శర్మ  పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement