
ముంబై: డాలర్‌కు అమ్మకాల ఒత్తిడి ఎదురు కావడంతో రూపాయి పుంజుకుంది. ఫారెక్స్ మార్కెట్లో బుధవారం 30 పైసలు బలపడి 68.08 వద్ద క్లోజయింది. బ్యాంకులు, ఎగుమతిదారులు డాలర్ల విక్రయాలకు మొగ్గుచూపారు. అదే సమయంలో దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ తగ్గడంతో రూపాయి కోలుకోవడానికి దోహదపడింది.
యూరో, పౌండ్, యెన్‌లతోనూ రూపాయి బలపడడం గమనార్హం. మంగళవారం నెల రోజుల కనిష్ట స్థాయి 68.38వద్ద క్లోజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఆసియా కరెన్సీలు చాలా వరకు రికవరీ అయ్యాయి.