దేశంలో బంగారానికి రూపాయి మెరుపు | Rupee value fall with dollar exchange | Sakshi
Sakshi News home page

దేశంలో బంగారానికి రూపాయి మెరుపు

Published Mon, May 14 2018 12:47 AM | Last Updated on Mon, May 14 2018 8:15 AM

Rupee value fall with dollar exchange - Sakshi

ముంబై/న్యూయార్క్‌: అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర దాదాపు అక్కడక్కడే ఉన్నా, దేశంలోమాత్రం ఉరుకులు పెట్టింది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ వారంలో దాదాపు 60 పైసలు పతనం కావడమే దీనికి కారణం. న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్సే్చంజ్‌లో బంగారం ఔన్స్‌ (31.1గ్రా) ధర 11వ తేదీతో ముగిసిన వారంలో 1,316 డాలర్ల నుంచి 1,318 డాలర్లకు పెరిగింది (వారం మధ్యలో ఒక దశలో 1,328 స్థాయిని చూసింది).

అయితే ఇదే కాలంలో భారత్‌ ఫ్యూచర్స్‌ మార్కెట్స్‌– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌ (ఎంసీఎక్స్‌)లో 10 గ్రాముల బంగారం ధర రూ.404 పెరిగి రూ. 31,518కి ఎగసింది. ఇక ముంబై ప్రధాన స్పాట్‌ మార్కెట్‌లో 99.9, 99.5 స్వచ్ఛత ధరలు రూ.455 ఎగసి వరుసగా రూ. 31,615, రూ.31,465 వద్ద ముగిశాయి. కాగా వెండి కేజీ ధర రూ.1,110 పెరిగి రూ. 40,290కి చేరింది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఈ వారంలో దాదాపు 60 పైసలు బలహీనపడి 67.40ని చూడ్డం ఆయా అంశాలకు నేపథ్యం.  

ఫెడ్‌ రేటు పెంపు ప్రభావం...
అంతర్జాతీయంగా బంగారం ధర మరింత పెరిగి, రూపాయి బలహీనత కొనసాగితే దేశంలో యల్లో మెటల్‌కు రెక్కలు వచ్చే అవకాశం ఉంది. రూపాయికి 67.50 వద్ద గట్టి నిరోధం ఉండగా, గడచిన ఐదు నెలలుగా అంతర్జాతీయంగా పసిడి 1,365 డాలర్ల వద్ద నిరోధం – 1,300 డాలర్ల వద్ద మద్దతు మధ్య నిర్దిష్ట శ్రేణిలో తిరుగుతోంది.

అయితే డాలర్‌ ర్యాలీ కొనసాగి, బంగారం ధర అంతర్జాతీయంగా పడిపోతే, దేశీయంగా పసిడి ధర సమీప కాలంలో రూ.32,500 దాటకపోవచ్చు. జూన్‌లో అమెరికా ఫెడ్‌ వడ్డీరేటు పెంపుపై తీసుకునే నిర్ణయ ప్రభావాలు డాలర్, బంగారం కదలికలపై ప్రభావం చూపుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement