గోవర్ధనగిరి అలంకారంలో శ్రీవారు
విజయవాడ(గుణదల):
పవిత్ర కృష్ణా పుష్కరాల్లో భాగంగా శనివారం గోవర్థనగిరి అలంకారంలో శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. నగరంలోని స్వరాజ్యమైదానంలో ఏర్పాటు చేసిన శ్రీవారి ఆలయ నమూనా నుంచి సమ్మోహితమైన మేళతాళాలతో ఊరేగింపుగా బయలుదేరి పద్మావతి ఘాట్ లో పుష్కర హారతి అందుకున్నారు. శ్రీవారి ఉత్సవ ఊరేగింపు జరుగుతున్న ప్రాంతాల్లో టీటీడీకి చెందిన చెక్కభజన, కోలాట కళాకారులు సమ్మోహనేతంగా ప్రదర్శించారు. అనంతరం కృష్ణమ్మ సాక్షిగా స్వామివారికి కుంభ హారతి, నక్షత్ర హారతి, కర్పూరహారతి సమర్పించారు. టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన హారతిని టీటీyీ రిటైర్డ్ ఓఎస్‌డీ డాలర్ శేషాద్రి హారతి సమర్పించారు. టీటీడీ పాలకమండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి, మంత్రి కామినేని శ్రీనివాస్ తదితరులు దేవాలయాన్ని దర్శించుకున్నారు.